సాక్షి, విశాఖపట్నం: ఇళ్ల స్థలాల పట్టాల్లో అవినీతి జరిగిందంటూ టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవాస్తవాలను.. నిజాలుగా ఎల్లో మీడియా ద్వారా గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. (చదవండి: ‘ఆయనైతే చేతులెత్తేసే వారు..’)
‘‘టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చరిత్ర అంతా నేరమయం. దొంగ ఓట్లతో ఆయన గెలిచారు. వెలగపూడికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. మీ రొయ్య మీసాలతో భయపెట్ట లేరని’’ ధ్వజమెత్తారు. చంద్రబాబుకు విశాఖ ప్రజలు ఓట్లు, సీట్లు కావాలి కానీ, పరిపాలన రాజధాని మాత్రం ఆయనకు అవసరం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ భూముల్లోనే విశాఖ పరిపాలన రాజధాని నిర్మాణం జరుగుతుందని.. పరిపాలన రాజధానిగా మరింత అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. పేదలకిచ్చే ఇళ్ల పట్టాలను కోర్టుల్లో కేసులు ద్వారా అడ్డుకోవద్దని చంద్రబాబుకు హితవు పలికారు.(చదవండి: ఉందిలే మంచి కాలం..)
విశాఖ నగర ప్రజలకు గజం 30 వేలు ధర పలుకుతున్న ధరతో 15 లక్షలు విలువైన భూమి ఒక్కో లబ్ధిదారులకు సీఎం వైఎస్ జగన్ అందిస్తున్నారని తెలిపారు. రూ. 900 కోట్లతో విశాఖ తూర్పు నియోజకవర్గంలో సీఎం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఓటమి చెందినా.. పార్టీలకతీతంగా ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. 43 వేల బెల్టు షాపులు రద్దు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment