velagapudi ramakrishna babu
-
పలాయనవాదమే లక్ష్యం
సాక్షి, అమరావతి : అసెంబ్లీలో ఏం మాట్లాడాలో దిక్కుతోచక, ఏం మాట్లాడితే ఏమవుతుందోననే భయంతో టీడీపీ పలాయనవాదాన్ని నమ్ముకుని, ఆచరిస్తోంది. ఇందులో భాగంగానే చట్టసభల ఖ్యాతిని దిగజారుస్తూ చిల్లర వ్యాఖ్యలతో స్పీకర్, అధికార పక్ష సభ్యులను చిరాకుపరుస్తోంది. తద్వారా సస్పెన్షన్ వేటు వేయించుకుని బయటకు జారుకోవచ్చనే వ్యూహంతో ముందుకు వెళుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అడ్డంగా బుక్కై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండటంతో టీడీపీ సభ్యుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. దీంతో సభలో ‘స్కిల్’ స్కామ్‌పై మాట్లాడే అవకాశం ఇచ్చినప్పటికీ, జైల్లో సౌకర్యాల గురించి అడ్డగోలుగా తప్పులు పట్టడం మినహా.. ఆయన నేరం చేయలేదని చెప్పేందుకు అవకాశం, ఆధారం లేక సభలో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుంది. గురు, శుక్రవారాల్లో శాసనసభ సమావేశాల్లో టీడీపీ సభ్యుల ప్రవర్తనే ఇందుకు సాక్షంగా నిలుస్తోంది. రెండవ రోజు శుక్రవారం కూడా టీడీపీ ఎమ్మెల్యేలు తమ స్థాయిని మరిచి వ్యవహరించారు. ఆకతాయిల మాదిరిగా స్పీకర్‌ను చుట్టుముట్టి ఆయనపై కాగితాలు చింపి విసిరేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. నినాదాలు చేస్తూ, బయటి నుంచి తెచ్చుకున్న విజిల్స్ ఊదుతూ అధికార పార్టీ సభ్యులను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. కుర్చీలు, బల్లలపై ఎక్కి తీవ్ర గందరగోళాన్ని సృష్టించారు. చంద్రబాబు అరెస్ట్ అంశంపై సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దమ్ముంటే చర్చలో పాల్గొనాలని మంత్రులు సవాల్ విసిరినా పట్టించుకోలేదు. çసభా సమయాన్ని వృధా చేయడమే లక్ష్యంగా గొడవ సృష్టించేందుకు యత్నించారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్ఫోన్లలో చిత్రీకరిస్తున్న ఇద్దరు సభ్యులను స్పీకర్ సెషన్ మొత్తం సస్పెన్షన్ వేటు వేయగా, మరో ముగ్గురిని ఒకరోజు సస్పెన్షన్ చేశారు. దీంతో మిగిలిన టీడీపీ సభ్యులు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్–చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై చేపట్టిన స్వల్ప కాలిక చర్చలో పాల్గొనకుండా పలాయనం చిత్తగించారు. సభ ప్రారంభమైంది మొదలు.. రెండో రోజు శాసనసభ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు మొదలు పెట్టారు. సభ్యులడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు మంత్రి గుడివాడ అమర్నాథ్ సిద్ధమయ్యారు. టీడీపీ సభ్యులు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ సభలోకి వస్తూనే స్పీకర్ పోడియం వైపునకు దూసుకెళ్లారు. స్పీకర్ చైర్‌ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చలో పాల్గొని మీ వాదన వినిపించుకోవచ్చన్నారు. అయినా తక్షణమే చర్చకు పట్టుబడుతూ స్పీకర్‌పై కాగితాలు విరుసుతూ నినాదాలు చేయడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. రెండోసారి సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యుల చుట్టూ మార్షల్స్‌తో మూడంచెల భద్రత వలయాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ తీరుపై మండిపాటు టీడీపీ సభ్యుల తీరుపై మంత్రులతో సహా పలువురు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేల తీరు చూసి.. ఇలాంటి వారినా మనం ఎన్నుకున్నదని ప్రజలు సిగ్గు పడుతున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌పై చర్చలో పాల్గొనే దమ్ము లేకే టీడీపీ ఎమ్మెల్యేలు ఇలా దిగజారి వ్యవహరిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. అసెంబ్లీలో టీడీపీ రౌడీయిజానికి ఎవరూ భయపడరని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సైకో చంద్రబాబు పాలన ఎప్పుడో పోయిందని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఎన్టీఆర్‌ను పొట్టనపెట్టుకున్న చంద్రబాబే అసలైన సైకో అని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు అధ్వాన్నంగా ప్రవర్తిస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. ప్రజాధనాన్ని దోచుకుని దొరకిపోయిన దొంగ చంద్రబాబు అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మానసిక రోగి అని,ఆయనకు మెంటల్ సర్టిఫికెట్ ఉందని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆయన్ను ఆస్పత్రికి తరలించకపోతే గన్ను తెచ్చి సభలో ఎవరో ఒకరిని కాల్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. నిషేధం ఉన్నా సెల్ఫోన్లతో చిత్రీకరణ మూడంచెల భద్రతను ఏర్పాటుచేయడంతో టీడీపీ సభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌లు తమ సెల్ఫోన్ల ద్వారా సభలో దృశ్యాలను రికార్డింగ్ చేయడం మొదలుపెట్టారు. నిబంధనను తుంగలో తొక్కి వీడియో రికార్డు చేసిన టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు స్పీకర్‌ను కోరారు. వీడియో రికార్డింగ్ చేసిన ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, అశోక్‌లను సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తూ స్పీకర్ రూల్ పాస్ చేశారు. దీంతో వీరిని మార్షల్స్ బయటకు పంపారు. ఈ దశలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడుతో సహా సభ్యులందరూ తమ వెంట తీసుకొచ్చిన విజిల్స్ ఊదుతూ సభలో గందరగోళం సృష్టించే యత్నం చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ, గద్దె రామ్మోహన్ సహా టీడీపీ సభ్యులు కుర్చిలలో నిల్చొని విజిల్స్ ఊదుతూ హంగామా చేశారు. సభా సంప్రదాయాలను తుంగలోకి తొక్కి విలువలను దిగజారుస్తున్న సభ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరగా, ఎమ్మెల్యేలు గోరంట్ల, వెలగపూడి, నిమ్మలపై ఒకరోజు సస్పెన్షన్ వేటు వేస్తూ స్పీకర్ ఆదేశాలు జారీచేశారు. వారిని మార్షల్స్ బయటకు పంపగా, వారి వెంట మిగిలిన సభ్యులు కూడా వెళ్లిపోయారు. కనీసం మిగిలిన వాళ్లయినా చర్చలో పాల్గొనాలని మంత్రులు సహా పలువురు సభ్యులు కోరినా పట్టించుకోకుండా సభ నుంచి వెళ్లిపోయారు. -
అలా గెలిచావా వెలగపూడి రామకృష్ణబాబు..!
సాక్షి, విశాఖపట్నం: మరోసారి ఓటమి భయంతో ఏం చేయాలో పాలుపోక అధికారులపై అడ్డగోలు ఫిర్యాదులు.. ఎల్లో మీడియా అండతో పచ్చి అబద్ధాల రాతలతో రోత పుట్టిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. దొంగ ఓట్లకు ఆస్కారం లేకుండా.. ఏ ఒక్కటి డూప్లికేట్ ఓటు లేకుండా ప్రభుత్వంతో పాటు ఎన్నికల కమిషన్ చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలోనే వలస వెళ్లిపోయిన వారి ఓట్లు, మృతుల ఓట్లు, డూప్లికేట్ ఓట్లని తొలగిస్తున్నారు. అయితే దీనిపై వెలగపూడి రామకృష్ణబాబు విష ప్రచారానికి తెరతీశారు. తూర్పు నియోజకవర్గంలో 40 వేల మంది ఓట్లని తొలగించేశారంటూ పచ్చపత్రిక ఈనాడు సహకారంతో హడావిడి చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలంటూ ఎన్నికల కమిషన్ జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌ని ఆదేశించింది. తొలగించిన ఓట్లు వివరాలు.. ఎందుకు తొలగించారో సహేతుకంగా వివరిస్తూ.. ఎన్నికల కమిషన్‌కు నివేదిక సమర్పించారు. ఓట్లు తొలగింపు సక్రమంగానే సాగిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వంపై బురద జల్లేందుకు చేసిన ప్రయత్నం విఫలమవడంతో వెలగపూడి మరో కొత్త రాగం ఎత్తుకున్నారు. ఒకే చిరునామాతో 300 ఓట్లు నమోదు చేశారంటూ మరో ఫిర్యాదు చేశారు. దీనిపైనా విచారణ చేస్తే వెలగపూడి బాగోతం బయటపడింది. 73 రోజుల్లో 40 వేల ఓట్లు నమోదు చేసిన టీడీపీ నేతలు వెలగపూడి ఫిర్యాదు చేస్తూ.. హడావిడి చేస్తుండటంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. తప్పు ఎక్కడ జరిగింది.? దీనికి ఎవరు బాధ్యులు అనేది పూర్తిగా అధ్యయనం చేశారు. ఇవన్నీ కూడా 2019 ఎన్నికల ముందు గంపగుత్తగా వెలగపూడి బ్యాచ్ నమోదు చేసిన ఓట్లుగా తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు 2019 జనవరి 11న ఎన్నికల కమిషన్ ఓటరు జాబితాని ప్రచురించింది. ఆ తర్వాత ఓటరు నమోదు, చిరునామాల మార్పులకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో 25 మార్చి 2019న తుది ఎన్నికల ఓటరు జాబితాని ప్రచురించింది. ఈ 73 రోజుల కాల వ్యవధిలో తూర్పు నియోజకవర్గంలో ఏకంగా 40,300 మంది అదనపు ఓటర్లు చేరారు. ఆ తానులో లిస్టే ఇది.. ఇక టీడీపీ ఫిర్యాదు చేసినట్లుగా.. ఒకే ఇంటి నంబర్‌తో 300 ఓట్లు కూడా అప్పటి ఓటర్ల జాబితాలోని దేనని స్పష్టమైంది. 2019 డ్రాఫ్ట్‌రోల్‌లో డోర్ నంబర్ 13–733తో 282, 769తో 186, 790తో 166 ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇది కూడా అప్పట్లో టీడీపీ నేతలు నమోదు చేయించిన ఓట్లేనని స్పష్టమవుతోంది. ఇలా 2019 ఎన్నికలకు ముందు నమోదు చేసిన 40,300 అనుమానాస్పద ఓట్లను ఈ మధ్య కాలంలో నిర్వహించిన వెరిఫికేషన్‌లో గుర్తించిన ఎన్నికల సిబ్బంది వడపోత ప్రక్రియ చేపట్టారు. ఇందులో 13,085 డూప్లికేట్ ఓట్లు, మరణించిన వారి ఓట్లుగా ఉన్న 1226, శాశ్వతంగా విశాఖ తూర్పు నుంచి వలస వెళ్లినట్లుగా గుర్తించిన 17,769 మంది ఓట్లు.. మొత్తం 32,080 ఓట్లను తొలగించేశారు. ఇది ఓర్వలేకపోతున్న టీడీపీ నేతలు.. 2024 ఎన్నికల్లో ఓటమి ఖాయమని భయపడి.. ఆ ఓట్లు తిరిగి చేర్చేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఎన్నికల ముందే కథంతా.. 2019 ఎన్నికలు సమీపిస్తుండటంతో పూర్తి స్థాయిలో పరిశీలన చేయకుండా తుది జాబితా ముద్రణ అయ్యింది. అలా ఎన్నికల ముందు టీడీపీ బ్యాచ్ తూర్పు నియోజవర్గంలో ఏకంగా 40,300 దొంగ ఓట్లని నమోదు చేయించారు. 2019 ఎన్నికల్లో వెలగపూడికి 87,073 ఓట్లు రాగా.. వైఎస్సార్సీపీ అభ్యర్థి అక్కరమాని విజయనిర్మలకు 60,599 ఓట్లు వచ్చాయి. అంటే 26,474 ఓట్లు తేడాతో వెలగపూడి విజయం సాధించారు. ఈ విజయం కూడా సదరు టీడీపీ నేతలు నమోదు చేసిన 40,300 ఓట్ల కారణంగానే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అకారణంగా ఓటు తొలగించే ప్రసక్తే లేదు ఉద్దేశ పూర్వకంగా ఎన్నికల సిబ్బంది ఓట్లు తొలగించారని వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. పూర్తి పారదర్శకంగా ఓటరు నమోదు ప్రక్రియతో పాటు.. వెరిఫికేషన్ కూడా పక్కాగా నిర్వహిస్తున్నాం. ఎక్కడైనా చిన్న తప్పు దొర్లినా బీఎల్వోలపై చర్యలకు ఉపక్రమిస్తున్నాం. 24, 104, 236 పోలింగ్ కేంద్రాల పరిధిలో 222 మంది తాత్కాలిక వలసదారుల ఓట్లని విధుల్లో అలసత్వం కారణంగా తొలగించారు. తుది పరిశీలనలో వీటిని గుర్తించి తిరిగి చేర్చాం. సదరు బీఎల్వోలకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. గతంలో ఉన్న జాబితాలో మూడు కారణాలతో పలు దశల్లో క్షేత్ర స్థాయి పరిశీలనలు చేసిన అనంతరం తొలగించాం. ఎవరైనా ఓటు లేదని భావించినా, చిరునామా మారినా, కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకుంటున్నా ఎన్నికల అధికారులు సిద్ధంగా ఉన్నారు. అకారణంగా ఓటు తొలగించారని తెలిస్తే నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు. – డా.మల్లికార్జున, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దొంగ ఓట్లు సృష్టించారు 2019 ఎన్నికలకు ముందే తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తన అనుచరుల ద్వారా వేల కొద్దీ దొంగ ఓట్లు సృష్టించారు. ఇప్పుడు అవి తొలగిస్తుంటే భయం పట్టుకుని, అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఎన్నికల అధికారులు పారదర్శకంగా జాబితాని రూపొందిస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ దొంగ ఓట్లు బాగోతం బట్టబయలవుతోంది. నియోజకవర్గంలో నమోదైన దొంగ ఓట్లలో ఎక్కువగా గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఉన్నవారి పేర్లే ఉన్నాయి. ప్రతిసారీ దొంగ ఓట్లతోనే విజయం సాధిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. ఈ సారి ఆ పప్పులు ఉడకక పోవడంతో అబద్ధపు ఆరోపణలతో ఫిర్యాదులు చేస్తున్నారు. – అక్కరమాని విజయనిర్మల, వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త -
విశాఖ ఎయిర్ పోర్ట్ లో వెలగపూడికి చంద్రబాబు క్లాస్
-
ప్రతిదానికి పిల్ ఏమిటి?.. టీడీపీ ఎమ్మెల్యే పిటిషన్‌పై హైకోర్టు అభ్యంతరం
సాక్షి అమరావతి: విశాఖపట్నం మధురవాడలో రామానాయుడు స్టూడియో కోసం కేటాయించిన భూమిలో రెసిడెన్షియల్ లేఅవుట్ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ విశాఖ మునిసిపల్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌ను) గురువారం హైకోర్టు కొట్టేసింది. బాధ్యతాయుత ఎమ్మెల్యే పదవిలో ఉంటూ ఇలాంటి పిల్ వేయడం ఏమిటని హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. వివాదం ప్రైవేటు వ్యక్తుల మధ్య ఉంటే దానిపై పిల్ దాఖలు చేయడం ఏమిటని ప్రశ్నించింది. అది ఫిల్మ్ స్టూడియోకి ఇచ్చిన భూమి అని, ప్రైవేట్ భూ వివాదంలో ప్రభుత్వానికి ఏం సంబంధం ఉందని అడిగింది. ఇది ధనికుల మధ్య వివాదమని, ఇందులో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. చదవండి: తీవ్ర తుపానుగా ‘మోచా’ ప్రతి దాంట్లో ఉల్లంఘన ఉందంటూ పిల్ దాఖలు చేయడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యంలో ప్రజాప్రయోజనాలు ఎంతమాత్రం లేవని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. -
‘ఇవన్నీ విజయవాడ నుంచి కట్టుబట్టలతో వచ్చినపుడే తెచ్చావా వెలగపూడి?’
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ చౌదరికి కౌంటర్ ఇచ్చారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. కాగా, విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా..‘ అర్రె! 2019 ఎన్నికల అఫిడవిట్లో నీ ఆస్తుల విలువ 15 కోట్లుగా చూపావు. ఇవన్నీ విజయవాడ నుంచి కట్టుబట్టలతో వచ్చినపుడే తెచ్చావా వెలగపూడి రామకృష్ట చౌదరి? నువ్వు అఫిడవిట్లో చూపించింది ఉల్లిపాయ మీద పొట్టేనని అందరికీ తెలుసు. వందల కోట్లు ఎలా దోచుకున్నది ప్రజలకు తెలియదా ఏంటి!. అర్రె! 2019 ఎన్నికల అఫిడవిట్లో నీ ఆస్తుల విలువ 15 కోట్లుగా చూపావు. ఇవన్నీ విజయవాడ నుంచి కట్టుబట్టలతో వచ్చినపుడే తెచ్చావా వెలగపూడి రామకృష్ట చౌదరి? నువ్వు అఫిడవిట్లో చూపించింది ఉల్లిపాయ మీద పొట్టేనని అందరికీ తెలుసు. వందల కోట్లు ఎలా దోచుకున్నది ప్రజలకు తెలియదా ఏంటి! — Vijayasai Reddy V (@VSReddy_MP) November 11, 2022 వంగవీటి రంగా ఎవరో నాకు తెలియదు. ఆయన్ని కిరాతకంగా నరికి చంపిన కేసులో నేను ముద్దాయిని కాదు. నేను విజయవాడ నుంచి విశాఖ పారిపోయి రాలేదు...అని నువ్వు నమ్మిన షిర్డీ సాయి సాక్షిగా ప్రమాణం చేయి వెలగపూడి రాము చౌదురి. మద్యం సిండికేట్లు, కాంట్రాక్టు పనుల్లో కమీషన్లు, ఆక్రమణలు, కబ్జాలు చేయని అమాయకుడివా? జేబులో చిల్లర డబ్బుతో విశాఖకు వచ్చావు. ఇప్పుడు నీ ఆస్తులు వేల కోట్లు ఎలా అయ్యాయి?.’ అని ప్రశ్నించారు. వంగవీటి రంగా ఎవరో నాకు తెలియదు. ఆయన్ని కిరాతకంగా నరికి చంపిన కేసులో నేను ముద్దాయిని కాదు. నేను విజవాడ నుంచి విశాఖ పారిపోయి రాలేదు...అని నువ్వు నమ్మిన షిర్డీ సాయి సాక్షిగా ప్రమాణం చేయి వెలగపూడి రాము చౌదురి. 1/2 — Vijayasai Reddy V (@VSReddy_MP) November 10, 2022 -
విశాఖలోని సీఐడీ ఆఫీస్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి ఓవర్ యాక్షన్
-
సీఐడీ ఆఫీస్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి ఓవర్ యాక్షన్
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని సీఐడీ ఆఫీస్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఓవర్ యాక్షన్ చేశారు. పోలీసులతో వెలగపూడి వాగ్వాదానికి దిగి దురుసుగా ప్రవర్తించారు. అయ్యన్నను ఎందుకు అరెస్టు చేశారో సమాధానం చెప్పాలంటూ పోలీసులతో గొడవకు దిగారు. పోలీసులపైకి దూసుకెళ్లారు. దీంతో వెలగపూడి రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆయన కుమారుడు రాజేష్‌ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై రెండు సెంట్లు మేర స్థలంలో అక్రమంగా ప్రహరి నిర్మాణం చేపట్టారు. అక్రమంగా నిర్మించిన ప్రహరీని అధికారులు తొలగించే సమయంలో అధికారులకు అయ్యన్న కుటుంబ సభ్యులు తప్పుడు పత్రాలు సమర్పించారు. అయ్యన్న కుటుంబ సభ్యుల సమర్పించిన తప్పుడు పత్రాలపై ఇరిగేషన్ అధికారులు.. సీఐడీకి ఫిర్యాదు చేశారు. చదవండి: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అరెస్ట్ -
ప్రతీ దానికి పిల్ ఏంటి!?.. టీడీపీ ఎమ్మెల్యేకు ఏపీ హైకోర్టు చీవాట్లు
సాక్షి, అమరావతి: విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు హైకోర్టు చీవాట్లు పెట్టింది. ప్రతీ దానికీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడమేనా? అంటూ ప్రశ్నించింది. ప్రభుత్వ చర్యలు, ఉత్తర్వులపై అభ్యంతరముంటే బాధిత వ్యక్తులు కోర్టుకు వస్తారని.. వారికిలేని అభ్యంతరం మీకెందుకని రామకృష్ణ బాబును హైకోర్టు నిలదీసింది. బాధితులు కోర్టుకు రాకుండా మీరెందుకొచ్చారని అడిగింది. ప్రభుత్వ చర్యలు, ఉత్తర్వులపై అభ్యంతరముంటే వాటిని అసెంబ్లీలో ప్రస్తావించుకోవాలని ఆయనకు స్పష్టంచేసింది. చదవండి: ఏపీ వాసులకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్.. రెండు, మూడు రోజుల్లో.. ప్రతీ వ్యవహారంలో పిల్ దాఖలు చేస్తామంటే కుదరదని తేల్చిచెప్పింది. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ విషయంలో సర్కారు ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఆయన దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజుల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆక్రమణలో ఉన్న అభ్యంతరంలేని ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించేందుకు 2017లో జారీచేసిన జీఓ–388ని ప్రభుత్వం అమలుచేయడంలేదని, దీని ప్రకారం భూములను క్రమబద్ధీకరించేందుకు లక్షల మంది పెట్టుకున్న దరఖాస్తులను అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రామకృష్ణబాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్. ప్రణతి వాదనలు వినిపిస్తూ.. 2017లో జారీచేసిన జీఓ ప్రకారం ఎంతోమంది తమ స్వాధీనంలో ఉన్న భూములను క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారని.. ఇలాంటి వారు లక్షల్లో ఉన్నారని తెలిపారు. అయితే.. ఈ జీఓను అమలుచేయకుండా ప్రభుత్వం కొత్త జీఓ జారీచేసి భూములను క్రమబద్ధీకరిస్తోందని, దీనివల్ల గతంలో దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వ చర్యలు ఇబ్బందిగా ఉంటే బాధితులు ఎందుకు కోర్టును ఆశ్రయించలేదని ప్రశ్నించింది. బాధితులకు లేని ఇబ్బంది పిటిషనర్‌కు ఎందుకని నిలదీసింది. ప్రతీ దానికి ఇలా పిల్ దాఖలు చేయడమేనా? అంటూ అసహనం వ్యక్తం చేసింది. -
‘విశాఖ అభివృద్ధిని టీడీపీ అడ్డుకోవాలని చూస్తోంది’
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం అభివృద్ధిని టీడీపీ అడ్డుకోవాలని చూస్తోందని వీఎంఆర్డీఏ ఛైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వెలగపూడి రామకృష్ణ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. మాస్టర్‌ప్లాన్‌పై సూచనలు ప్రభుత్వానికి తెలపాలన్నారు. విశాఖపట్నంలో ఇళ్ల పట్టాల పంపిణీని కూడా టీడీపీ అడ్డుకుందని అక్కరమాని దుయ్యబట్టారు. -
అంతా మా ఇష్టం: అక్కడ అన్నీ ‘వెలగపూడి’ ఫుడ్‌కోర్టులే..
దొండపర్తి(విశాఖ దక్షిణ): టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దందాలకు కాదేదీ అనర్హం అన్నట్లు ఉంది. లిక్కర్ మాఫియా.. భూకబ్జాలు.. సెటిల్మెంట్లు.. దౌర్జన్యాలు.. ఇలా అనేక అనైతిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన తూర్పు నియోజకవర్గం.. తాజాగా వెలగపూడి ఫుడ్స్టాళ్లకు కేంద్రంగా మారిపోయింది. ఇక్కడ 90 శాతం స్టాళ్లు, ఫుడ్ ట్రక్కులు ఆయన వర్గానికి చెందిన స్థానికేతర వ్యాపారులవే. స్థానికులకు అవకాశం లేకుండా కృష్ణా, ఇతర జిల్లాల నుంచి అనుచరగణాన్ని జిల్లాలోకి దింపి తూర్పులో స్థానిక చిరువ్యాపారులపై పెత్తనం సాగిస్తున్నారు. ఎమ్మెల్యే పేరు చెప్పి ఎంవీపీ కాలనీ, చినవాల్తేరు, పార్కు హోటల్ ప్రాంతాల్లో కూడళ్లు, ఫుట్‌పాత్‌లు, రోడ్లు సైతం ఆక్రమించారు. ఆ స్థలాల్లో అనధికారంగా ఫుడ్‌ట్రక్కులు, తోపుడుబళ్లు ఏర్పాటు చేసుకున్నారు. వాటిని తరువాత చిరు వ్యాపారులకు అద్దెలకిచ్చి వేల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఇలా మొదలు పెట్టి.. అలా పాగా తూర్పు నియోజకవర్గంలో కొంత మంది టీడీపీ నేతలు వ్యాపారాల పేరుతో ఆక్రమణలకు పాల్పడుతున్నారు. పేదల స్వయం ఉపాధి, చిరు వ్యాపారాల పేరు చెప్పి ప్రధాన జంక్షన్లు, ఫుట్‌పాత్‌లు, రోడ్లను ఆక్రమించుకుంటున్నారు. ముందు చిన్న తోపుడు బండ్లను పెట్టించడం.. కొద్ది కాలానికి నెమ్మదిగా ఒక బడ్డీ ఏర్పాటు చేయించడం.. మరికొద్ది రోజులకు అక్కడ ఒక షెడ్డును నిర్మించడం.. ఇలా పరిపాటిగా మార్చుకున్నారు. అడుగడుగునా ఫుడ్‌ట్రక్కులు నియోజకవర్గంలో ఫుడ్‌ట్రక్కులు, టిఫిన్, ఫాస్ట్‌ఫుడ్ బళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఎంవీపీ కాలనీలో ఏఎస్‌రాజా కాలేజీ గ్రౌండ్ నుంచి మొదలుకొని సమతా కాలేజీ వరకు సుమారు 80 వరకు ఫుడ్ ట్రక్కులు, ఫాస్ట్‌ఫుడ్ బళ్లు ఉన్నాయి. ఎంవీపీ రైతుబజార్ రోడ్డు నుంచి లుంబినీ పార్కు వరకు కూడా ఇదే తరహాలో ఫుడ్‌స్టాల్స్ వచ్చేశాయి. చినవాల్తేరు జంక్షన్ నుంచి పార్కు హోటల్ వరకు, హోటల్ ఎదురుగా పెదవాల్తేరుకు వెళ్లే దారిలో కూడా పదుల సంఖ్యలో బడ్డీలు, ఫుడ్‌ట్రక్కులు పుట్టుకొచ్చాయి. అనధికార వ్యాపారాలే ఎక్కువ పేదల జీవనోపాధి కోసం చేసే వ్యాపారులకు జీవీఎంసీ అధికారులు అనుమతులు ఇస్తున్నారు. అధికారులకు దరఖాస్తు చేసుకుంటే తోపుడు బండ్లు, ఫుడ్ ట్రక్కులు పెట్టుకోవడానికి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేని స్థలాన్ని గుర్తించి అక్కడ వ్యాపారానికి అవకాశం కల్పిస్తున్నారు. చిరు వ్యాపారులను ఆదుకోవడానికి జీవీఎంసీ ఉదారంగా అనుమతులిస్తున్నప్పటికీ.. ఎమ్మెల్యే అనుచరులు కొంత మంది అనధికారంగా బడ్డీలు, ట్రక్కులను ఏర్పాటు చేయిస్తున్నారు. ఎంవీపీ కాలనీలో 25 మంది చిరు వ్యాపారులకు మాత్రమే జీవీఎంసీ అనుమతులు ఇచ్చింది. అయితే అక్కడ 150 వరకు బండ్లు, ట్రక్కుల్లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల వ్యాపారం జరుగుతోంది. రోడ్లపై, ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు కారణంగా పాదచారులు, వాహనదారులు ఇబ్బందులుపడుతున్నప్పటికీ.. వారు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ.. ఎమ్మెల్యే ఒత్తిడి కారణంగా అధికారులు వాటిపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే కొంత మంది వీధి వ్యాపారుల యూనియన్ పేరుతో చిరువ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తుండడం గమనార్హం. ఎమ్మెల్యే వెలగపూడి అనుచరులే ఈ దందా సాగిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వరుసగా ఆక్రమణల తొలగింపు జీవీఎంసీ అధికారులు ‘రైట్ టు వాక్’పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఫుట్‌పాత్‌లు, రోడ్లపై పెట్టిన బడ్డీలు, బళ్లను తొలగిస్తున్నారు. అనుమతులు ఉన్న ప్రాంతాల్లోనే వీటిని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆంధ్రా యూనివర్సిటీ స్థలాన్ని ఆక్రమించి వేసుకున్న షాపులను కూలి్చవేశారు. రెండు రోజులుగా ఎన్ఏడీ, గోపాలపట్నం ప్రాంతాలతో పాటు నగరంలో కొన్ని చోట్ల బడ్డీలను తొలగించారు. ఆదివారం రుషికొండ ప్రాంతంలో అక్రమంగా వేసిన షాపులను కూడా తీసేశారు. తూర్పు నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే అనుచరుల నుంచి షాపులను ఖాళీ చేయించి నిజమైన లబ్ధిదారులు, అనుమతులు పొందిన చిరువ్యాపారులకు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే ప్రధాన జంక్షన్లలో ఉన్న అనధికార ట్రక్కులు, ఫుట్‌స్టాల్స్‌ను తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయాలని ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక వ్యాపారులకు మొండిచెయ్యి నియోజకవర్గంలో వందల సంఖ్యలో ఫుడ్‌ట్రక్కులు, ఫాస్ట్‌ఫుడ్ బండ్లు ఉన్నప్పటికీ.. వాటిల్లో స్థానికులకు 10 శాతం కూడా లేకపోవడం గమనార్హం. కృష్ణా, ఇతర జిల్లాల నుంచి ఎమ్మెల్యే అనుచరులు వచ్చి ఇక్కడ దందా సాగిస్తుండడం గమనార్హం. స్థానిక చిరు వ్యాపారులకు అవకాశం ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. అక్రమంగా, అనధికారంగా స్థానికేతరులు చేస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక వ్యాపారులు అధికారులను కోరుతున్నారు. అలాగే స్థానికులకే ముందు అవకాశం కలి్పంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వేలాది రూపాయల అద్దెల వసూలు ప్రభుత్వ స్థలాలు, ఫుట్‌పాత్‌లపై అనధికారికంగా ఏర్పాటు చేస్తున్న స్టాళ్లు, బడ్డీలు, ఫుడ్‌ట్రక్కులను టీడీపీ నేతలు, ఎమ్మెల్యే అనుచరులు ఆదాయ మార్గాలుగా మార్చుకున్నారు. అనధికారికంగా చేస్తున్న వ్యాపార స్థలాలు, బళ్లను వేలాది రూపాయలకు అద్దెలకిస్తూ డబ్బులు చేసుకుంటున్నారు. ప్రాంతం, షాపును బట్టి రూ.5 వేలు నుంచి రూ.30 వేలు వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని చోట్ల రోజువారి అద్దెలు పిండుకుంటున్నారు. జీవీఎంసీకి ఒక పైసా కూడా కట్టకపోగా.. నిబంధనల ప్రకారం వ్యాపారానికి తీసుకోవాల్సిన ట్రేడ్ లైసెన్సులు కూడా పొందడం లేదు. రెండో రోజు 20 బడ్డీల తొలగింపు కొమ్మాది(భీమిలి): రుషికొండ బీచ్ రోడ్డులోని ఫుట్‌పాత్‌పై అనధికారికంగా ఏర్పాటు చేసిన బడ్డీల తొలగింపు రెండో రోజు సోమవారం కూడా జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు పెదరుషికొండ నుంచి ఐటీ జంక్షన్ వరకూ రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లపై ఉన్న 20 బడ్డీలను తొలగించారు. మొత్తం 90 బడ్డీలను తొలగించినట్టు అధికారులు తెలిపారు. విశాఖ నుంచి భీమిలి వరకు త్వరలో చేపట్టనున్న రోడ్డు విస్తరణ, సుందరీకరణ పనుల నేపథ్యంలో త్వరితగతిన ఆక్రమణలు తొలగిస్తున్నట్లు అధికారులు వివరించారు. బడ్డీల తొలగింపు విషయం ముందుగానే తెలుసుకున్న నిర్వాహకులు తమ సామాన్లను ఇంటికి తీసుకెళ్లడంతో అంతా ప్రశాంతంగా జరిగింది. పీఎంపాలెం సీఐ రవికుమార్, ఏసీపీ అరుణవళ్లీ, టీపీవోలు రఘునాథరావు, ప్రసాద్‌ల పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించారు. చదవండి: సాక్షి ఎఫెక్ట్: అక్రమాల కోటలు కూలుతున్నాయ్.. నేడే చూడండి.. గణబాబు ఆక్రమణ ‘చిత్రం’ -
సాక్షి ఎఫెక్ట్: అక్రమాల కోటలు కూలుతున్నాయ్..
సాక్షి, విశాఖపట్నం: ఆదివారం ఉదయం.. బుల్డోజర్లు కదులుతుంటే.. అక్రమార్కుల గుండెలదిరాయి. అనధికార నిర్మాణాలను జేసీబీలతో కూలగొడుతుంటే.. టీడీపీ నేతల వెన్నులో వణుకుపుట్టింది. అడ్డగోలుగా ఫుట్‌పాత్ ఆక్రమించేసి ఏర్పాటు చేసిన దుకాణాల్ని తొలగిస్తుంటే... కబ్జాదారులకు చెమటలు పట్టాయి. ఐదేళ్ల కాలంలో టీడీపీ ఎమ్మెల్యేలు అధికార దర్పం ప్రదర్శించారు. నిబంధనలు మీరి అక్రమాల పునాదులపై అడ్డగోలుగా నిర్మించినవి కొన్నైతే.. స్థలాలు కబ్జా చేసి దర్జాగా కట్టిన కోటలు ఇంకొన్ని.. వెరసి టీడీపీ నేతల దాష్టీకాలపై అధికారులు పంజా విసిరారు. ‘సాక్షి’ దినపత్రికలో వరుసగా ప్రచురితమవుతున్న తెలుగుదేశం పార్టీ నేతల అక్రమాల సిత్రాలు.. నగరంలో సంచలనంగా మారాయి. పల్లా ఆక్రమణలకు మాస్టర్‌ప్లాన్ రోడ్డు చిన్నబోయి అక్రమాల కంచెలో ఇరుక్కుపోయింది. ఇప్పుడా కబ్జా కంచెను కత్తిరించేశారు. ప్లాన్‌కు విరుద్ధంగా చేపడుతున్న అడ్డగోలు నిర్మాణాన్ని జీవీఎంసీ పెకలించేసింది. మరోవైపు వెలగపూడి బ్యాచ్ ఫుట్‌పాత్ ఆక్రమణలపైనా జీవీఎంసీ ఉక్కుపాదం మోపింది. రెండు కిలోమీటర్ల వ్యవధిలో ఏకంగా 70 దుకాణాలను ఫుట్‌పాత్‌లపైనే ఏర్పాటు చేసి దందా సాగించిన పచ్చ రాబందుల రెక్కలు విరిచేశారు. పల్లా అక్రమ నిర్మాణంపై జీవీఎంసీ కొరడా గాజువాక: మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన అక్రమ నిర్మాణంపై జీవీఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు. అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న భవనాన్ని కూలి్చవేశారు. దీనిపై తొలుత కొంత ఉద్రిక్తత చోటుచేసుకున్నప్పటికీ సంబంధిత, అధికారులు, పోలీసులు చొరవ తీసుకోవడంతో టౌన్‌ప్లానింగ్ సిబ్బంది తమ పని పూర్తిచేశారు. గాజువాకకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాతగాజువాక జంక్షన్‌లోని 1033 చదరపు గజాల (864.33 చదరపు మీటర్ల) స్థలంలో ఒక వాణిజ్య సముదాయ నిర్మాణాన్ని చేపట్టారు. 227.84 చదరపు మీటర్ల వరకు రోడ్డు విస్తరించి ఉంది. దీంతో ఆయనకు 636.49 చదరపు మీటర్లు మిగిలింది. ఇందులో నిబంధనల ప్రకారం మినహాయింపులు పోనూ 221.45 చదరపు మీటర్ల స్థలంలో ఈ సముదాయ నిర్మాణానికి జీవీఎంసీ నుంచి అనుమతులు పొందారు. సెల్లార్+జి+4 భవన నిర్మాణానికి అనుమతి పొందగా, ప్రస్తు తం సెల్లార్+జి+1 అంతస్తుల శ్లాబులు పూర్తిచేశారు. అయితే అనుమతులకు విరుద్ధంగా నిర్మా ణం సాగుతోందని జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదులు అందడంతో పరిశీలించిన అధికారులు నిజమేనని నిర్ధారించారు. ఈ నిర్మాణంలో మాస్టర్ ప్లాన్ రోడ్లో 25.46 చదరపు మీటర్ల ఏరియా కూడా ఆక్రమణకు గురవడంతోపాటు సెట్ బ్యాక్లను కూడా ఉంచలేదని గుర్తించారు. ఒక అంతస్తుకు 221.45 చదరపు మీటర్ల అనుమతి పొందగా 369.86 చదరపు మీటర్ల చొప్పున నిర్మాణం సాగిస్తున్నట్టు నిర్ధారించారు. ఒక్కో అంతస్తుకు 148.41 చదరపు మీటర్ల చొప్పున అదనపు భాగాన్ని నిర్మిస్తున్నట్టు గుర్తించిన అధికారులు అదనంగా చేపట్టిన నిర్మాణాన్ని ఆదివారం తొలగించారు. తెల్లవారుజామున భవనం వద్దకు చేరుకున్న టౌన్‌ప్లానింగ్ అధికారులు అదనపు నిర్మాణాన్ని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పల్లా శ్రీనివాసరావు, టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకొని తొలగింపును అడ్డుకోవడానికి ప్రయత్నించారు. తాను అనుమతులు తీసుకుని నిర్మాణం చేపట్టానంటూ టౌన్‌ప్లానింగ్ అధికారి నరేంద్రనాథ్‌రెడ్డి తదితరులతో వాదనకు దిగారు. దీంతో వారు మాస్టర్ ప్లాన్ రోడ్డు, సెట్ బ్యాక్‌లు లేకపోవడం, అనుమతి పొందినదానికంటే అదనంగా నిర్మించడం తదితర విషయాలను వివరించారు. గాజువాక పోలీసుల సూచన మేరకు అక్కడి నుంచి పల్లా శ్రీనివాసరావు వెళ్లిపోవడంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు అనధికార నిర్మాణాన్ని తొలగించారు. ఈ వ్యవహారం పల్లా మీడియాతో మాట్లాడారు. తనకు హైకోర్టులో ఊరట లభిస్తుందని భావిస్తున్నానని చెప్పారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా జీవీఎంసీ అధికారులు తన భవనాన్ని తొలగించడం అన్యాయమన్నారు. వెలగపూడి ‘దుకాణాలు’ క్లోజ్.. కొమ్మాది (భీమిలి): ప్రశాంత విశాఖ నగరంపై దందాల సంతకం చేసిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి..అధికారాన్ని అడ్డంపెట్టుకొని విషపు సంస్కృతిని వ్యాపింపజేశారు. తూర్పు నియోజకవర్గంలో మొదలుపెట్టి.. భీమిలి నియోజకవర్గంలోనూ పాగా వేశారు. ఆక్రమణల పర్వాన్ని అడ్డగోలుగా సాగించి ఫుట్‌పాత్‌లను సైతం మింగేశారు. అనుచరులకు నచ్చిన చోట ఎలాంటి అనుమతులు లేకుండా దుకాణాలు పెట్టించేసి దందా సాగించారు. దుకాణాలను తొలగిస్తున్న జేసీబీ.. అడ్డగోలుగా 70 దుకాణాలు.. జీవీఎంసీ 8వ వార్డు గీతం కాలేజీ డౌన్ నుంచి చిన్న రుషికొండ మీదుగా పెద్ద రుషికొండ వరకు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 70 దుకాణాలు అడ్డగోలుగా పెట్టించారు. సుమారు రెండు కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్న ఈ ఆక్రమణల్లో వెలసిన ఒక్కో దుకాణం నుంచి ఏడాదికి రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకూ వసూలు చేసేవారు. ‘సాక్షి’ కథనాలతో బ్రేక్! అధికారంలో లేకపోయినా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానన్న ధైర్యంతో ఆక్రమణల పర్వం కొనసాగించాలనుకున్న వెలగపూడి బ్యాచ్ ఆగడాలకు ‘సాక్షి’ వరుస కథనాలు బ్రేక్ వేశాయి. సాక్షిలో ప్రచురితమైన వరుస కథనాలకు జీవీఎంసీ అధికారులు స్పందిస్తూ వెలగపూడి దుకాణాలను బంద్ చేయించారు. మూడు రోజులుగా ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగిస్తున్న టౌన్‌ప్లానింగ్ అధికారులు వెలగపూడి అండ్ కో ఆక్రమించేసుకున్న బీచ్‌రోడ్డు ఫుట్‌పాత్‌లపై చర్యలకు ఉపక్రమించారు. రైట్ టు వాక్ పేరుతో ఆక్రమణల తొలగింపు బీచ్‌రోడ్ వెంబడి ఫుట్‌పాత్‌లపై వెలగపూడి, టీడీపీ అనుచరులు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న ఫుడ్‌స్టాళ్లు, దుకాణాలను పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఆదివారం తొలగించారు. తెల్లవారు జామున 5 గంటల నుంచి పోలీసు బందోబస్తు నడుమ 70 బడ్డీలను తొలగించారు. ఫుట్‌పాత్‌లను కేవలం పాదచారులకు మాత్రమే వినియోగించేలా జీవీఎంసీ నిర్ణయం తీసుకుందని, ఇందుకోసం ‘రైట్ టు వాక్’ పేరుతో ఆక్రమణలను తొలగిస్తున్నట్టు జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ డీసీపీ రాంబాబు వెల్లడించారు. దీనికితోడు ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ బీచ్ రోడ్డు విస్తరణ, సుందరీకరణ పనులు త్వరలోనే చేపట్టనున్న నేపథ్యంలో కమిషనర్ ఆదేశాల మేరకు తాత్కాలిక ఆక్రమణలను తొలగిస్తున్నామని ఆయన వివరించారు. ఆక్రమణదారుల ఆందోళన.. ఫుట్‌పాత్‌పై అక్రమంగా వెలసిన బడ్డీల తొలగింపునకు నిరసనగా ఫుట్‌పాత్ ఆక్రమణదారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా బడ్డీలను తొలగిస్తున్నారని, కనీసం బడ్డీల్లోని సామగ్రిని తీసుకునే సమయం ఇవ్వనదున తీవ్రంగా నష్టం పోతున్నామని వాపోయారు. వీరితో టీడీపీ కార్యకర్తలు కలిసిపోయి గందరగోళం సృష్టించేందుకు ప్రయతి్నంచారు. పీఎంపాలెం సీఐ రవికుమార్ ఆక్రమణదారులతో మాట్లాడి సామాన్లు తీసుకెళ్లేందుకు సమయం ఇచ్చారు. వారంతా దుకాణాల్లోని సామగ్రిని తీసుకెళ్లిపోయారు. అనంతరం షాపుల తొలగింపు ప్రక్రియను సాయంత్రం వరకూ నిర్వహించారు. టౌన్‌ప్లానింగ్ టీపీవోలు రఘునాథరావు, ప్రసాద్ పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటు చేసిన బడ్డీలను తొలగించారు. చదవండి: మాయా జలం: మంచి నీటి పేరిట మహా మోసం నేడే చూడండి.. గణబాబు ఆక్రమణ ‘చిత్రం’ -
వెలగపూడి వైరస్: పేదల ఫుడ్ కోర్టుపై ‘పడగ’
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు... ఈయన గారి నేర చరిత్ర ఎంత చెప్పుకున్నా తక్కువే. వంగవీటి మోహన రంగా హత్య కేసులో నిందితుడుగా పరారై ఇక్కడకు వలస వచ్చిన దరిమిలా విశాఖ నగరంలో విష సంస్కృతికి బీజం వేసిన ప్రబుద్ధుడీయన. కోడి పందేలు.. దౌర్జన్యాలు.. మద్యం మాఫియా ఆగడాలు, భూ దందాలు.. అక్రమార్జన.. ఇలా విశాఖకు మునుపెన్నడూ ఎరగని నయా మాఫియాకు తెరలేపిన ’పచ్చ’ నేత ఈయన. దాదాపు పదిహేనేళ్లుగా తూర్పు నియోజకవర్గాన్ని చెరబట్టిన ఈయన గారి నిర్వాకాలకు, దందాలకు గత రెండేళ్లుగా బ్రేక్ పడుతూ వస్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. వెలగపూడి బ్యాచ్ భూదందాలు, కోడిపందాలు, మద్యం మాఫియాకు దాదాపు అడ్డుకట్టపడిందనే చెప్పాలి. అయితే అక్రమార్జన అలవాటుపడిన సదరు వెలగపూడి బ్యాచ్ చివరికి చిరు వ్యాపారుల ఫుడ్ కోర్ట్‌పై కూడా పడిపోయారు. నగరమంతటా కోవిడ్ వైరస్ కలకలం సృష్టిస్తుంటే.. నైట్‌ఫుడ్ కోర్టులో మాత్రం వెలగపూడి వైరస్ ప్రబలింది. ఇంతకీ.. ఆ వైరస్ ఏంటి.. నైట్‌ఫుడ్ కోర్టులో అసలేం జరుగుతోందో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి రండి. మహా నగర పరిధిలోని స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కోసం జీవీఎంసీ 2019 ఫిబ్రవరిలో జైల్ రోడ్డులో 27 ఫుడ్ స్టాల్స్‌తో నైట్ ఫుడ్ కోర్టు ప్రారంభించింది. ఆ తర్వాత క్రాఫ్ట్ బజార్ కూడా ఇందులో ప్రారంభించాలని అధికారులు భావించారు. అయితే.. అదే ఏడాది మార్చి నుంచి కరోనా కలకలం మొదలవ్వడంతో లాక్‌డౌన్‌తో కొన్నాళ్లు వ్యాపారాలు మూతపడ్డాయి. పర్యవేక్షించాల్సిన జీవీఎంసీ అధికారులంతా కోవిడ్ నియంత్రణ చర్యల్లో 24‘‘7 బిజీగా అయిపోయారు. గతేడాది మే నుంచి నుంచి నెమ్మది నెమ్మదిగా కోలుకుంటున్నప్పటికీ.. వైరస్ వ్యాప్తి చెందకుండా నగర ప్రజల్ని కాపాడే బాధ్యతని జీవీఎంసీ భుజానికెత్తుకొని.. నైట్ ఫుడ్ కోర్టు విషయాన్ని పక్కన పెట్టేసింది. ఆ తర్వాత లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత అన్ని వ్యాపారాల మాదిరిగానే ఫుడ్ కోర్టు కూడా మొదలైంది. ఇదే అదనుగా ఎమ్మెల్యే వెలగపూడి అనుచరులు ఫుడ్‌కోర్టుని ఆక్రమించేశారు. పేదల కోసం ఏర్పాటు చేసిన ప్రాంతంలో పచ్చజెండా పాతేశారు. అనుమతి 27 స్టాల్స్‌కి.. ఉన్నవి 138 అప్పటివరకు ఎంవీపీ కాలనీ, బీచ్‌రోడ్డులో స్ట్రీట్‌ఫుడ్ దందా సాగిస్తున్న వెలగపూడి బ్యాచ్ జైల్‌రోడ్డులోని నైట్‌ఫుడ్ కోర్టుని ఆక్రమించేసింది. వెలగపూడి తన అనుచరుల ద్వారా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయించేశారు. అక్కడితో ఆగకుండా మహారాష్ట్ర, ఒడిశా, రాజస్తాన్, కర్ణాటక, తమిళనాడు ఇలా.. వివిధ రాష్ట్రాలకు చెందిన వారికీ స్టాల్స్ పెట్టుకోడానికి వాళ్లే సొంత అనుమతులిచ్చేశారు. వీరిని చూసి.. మిగిలిన మరికొందరు సైతం తమకు నచ్చినట్లుగా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారు. జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకురాకుండానే ఓ రకంగా. మొత్తం ఫుడ్ కోర్టుని తమ ఆధీనంలోకి తీసేసుకున్నారు. మొత్తం 27 స్టాల్స్‌కు మాత్రమే అనుమతులుండగా ప్రస్తుతం 138 వరకూ వచ్చేశాయి. ఇందులో సగానికి పైగా వెలగపూడి అనుచరులకు చెందిన ఫుడ్ స్టాల్స్ ఉన్నాయని అంటున్నారు. ఒక్కొక్కరూ తమ బంధువుల పేరుతోనే నాలుగైదు స్టాల్స్ ఏర్పాటు చేసుకొని చిరు వ్యాపారుల్ని మాత్రం వాటి దరి చేరకుండా తమ గుప్పిట్లోకి తీసేసుకున్నారు. జీవీఎంసీలో పెండింగ్‌లో 500 దరఖాస్తులు ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే మంచి స్పందన రావడంతో నగరంలోని వివిధ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 500కి పైగా దరఖాస్తులు వచ్చాయని యూసీడీ విభాగాధికారులు చెబుతున్నారు. గతంలో ఉన్న 27 మందికి మాత్రమే ఇప్పటివరకు ఫుడ్ కోర్టులో స్టాల్స్ పెట్టుకోవాలని తాత్కాలిక అనుమతి ఇచ్చామనీ.. ఇంకెవ్వరినీ అనుమతించలేదని స్పష్టం చేస్తున్నారు. కోవిడ్ పరిస్థితుల నుంచి బయటపడిన తర్వాతే ఫుడ్ కోర్టు విషయమై ఏం చేయాలో ఆలోచిస్తామని అధికారులు అంటున్నారు. స్టాల్ స్టాల్‌కీ.. వసూళ్ల పర్వం జీవీఎంసీ తమ ఆదాయ వనరుగా నైట్ ఫుడ్ కోర్టుని ఏర్పాటు చేస్తే.. వెలగపూడి బ్యాచ్ దాన్ని తమకు అనుకూలంగా మలచుకున్నారు. ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయాలంటే లక్ష నుంచి రెండు లక్షల రూపాయిల వరకూ వసూలు చేశారు. పోనీ.. జీవీఎంసీకి వీటి వల్ల ఆదాయం వస్తుందా అంటే.. ఇప్పటివరకూ నైట్ ఫుడ్ కోర్టు నుంచి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదని అధికారులే చెబుతున్నారు. మొదట అధికారికంగా ఏర్పాటు చేసిన 27 స్టాల్స్ నుంచి కూడా ఫీజు వసూలు చేయలేదనీ.. కరోనా కారణంగా మినహాయింపునిచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. చిరు వ్యాపారులను తొక్కేసి.. రోడ్లపై చిరుతిళ్లు అమ్ముతూ బతుకులీడ్చుతున్న నగరానికి చెందిన చిన్న వ్యాపారుల అభివృద్ధికి ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్ చివరికి బడా వ్యాపారస్తుల కేంద్రంగా మారిపోయింది. ఆ ఫుడ్‌కోర్టులోకి అడుగు పెడితే కొన్ని స్టాళ్లలో పెద్ద హోటల్స్‌తో పోటీగా ధరలుంటాయి. మొత్తంగా ఫుడ్ కోర్ట్ ఏర్పాటు సదుద్దేశ్యాన్ని పక్కదారి పట్టించి... చిరు వ్యాపారులను మింగేసిన పచ్చ రాబందులపై జీవీఎంసీ అధికారులు ఇప్పటికైనా దృష్టిసారిస్తారో లేదో చూడాలి. చదవండి: టీడీపీ నేతకు షాక్: అక్రమ నిర్మాణం కూల్చివేత.. నేడే చూడండి.. గణబాబు ఆక్రమణ ‘చిత్రం’ -
‘ఆ హత్యకేసులో టీడీపీ ఎమ్మెల్యే నిందితుడు’
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వంగవీటి రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడని.. రాగమాలిక సీడీషాప్‌ను అడ్డగా చేసుకుని రంగా హత్యకు ప్లాన్ చేశారని ఆరోపించారు. (చదవండి: ‘విగ్రహం ధ్వంసం వెనుక చంద్రబాబు పాత్ర’) ‘‘రంగాను కత్తితో పొడిచి హత్య చేసిన వాళ్లలో వెలగపూడి ఒకరు. వెలగపూడిని.. మొదట రాగమాలిక రామకృష్ణ అనే పిలిచేవారు. కాపీ కొట్టి ఇంటర్ పరీక్షలు రాసిన వ్యక్తి వెలగపూడి రామకృష్ణ. ఒక విశ్వవిద్యాలయం నుంచి పట్టా కొనుగోలు చేసిన వ్యక్తి వెలగపూడి అని’’ విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. త్వరలోనే వెలగపూడి విద్యార్హతపై కేసు పెడతామని ఆయన తెలిపారు. వెలగపూడికి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కమర్షియల్ కాంప్లెక్స్, ఇళ్లు ఉన్నాయని, విశాఖలో కూడా బినామీ పేర్లతో ఇళ్లు ఉన్నాయన్నారు. (చదవండి: ‘రొయ్య మీసాలతో భయపెట్ట లేరు’) ‘‘బైరెడ్డి పోతన్నరెడ్డి, కాళ్ల శంకర్, పట్టాభి, రాజేంద్రకుమార్, సతీష్.. వెలగపూడి బినామీలు. విశాఖలో వెలగపూడి లిక్కర్ సిండికేట్ అక్రమాలకు పాల్పడ్డారు. దేవినేని బాజీ పేరుతో కబడ్డీ పోటీలు నిర్వహించి కలెక్షన్లు చేసిన వ్యక్తి ఆయన. రజకులకు చెందిన భూమిని లాక్కున్నారు. ఏసీపీ రంగారావుకు లంచం ఇచ్చి.. రౌడీషీట్ తీయించుకున్నారు. వెలగపూడి యువజన పేరుతో ఆరిలోవలో అక్రమాలకు పాల్పడ్డారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐను గాయపరిచిన కేసులో వెలగపూడి నిందితుడని, రుషికొండ లే అవుట్లో రెండు ప్రభుత్వ ప్లాట్లు కొట్టేసిన వ్యక్తి అని’’ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి అవినీతి చిట్టాను ఎంపీ విజయసాయిరెడ్డి విప్పారు. -
‘రొయ్య మీసాలతో భయపెట్ట లేరు’
సాక్షి, విశాఖపట్నం: ఇళ్ల స్థలాల పట్టాల్లో అవినీతి జరిగిందంటూ టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవాస్తవాలను.. నిజాలుగా ఎల్లో మీడియా ద్వారా గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. (చదవండి: ‘ఆయనైతే చేతులెత్తేసే వారు..’) ‘‘టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చరిత్ర అంతా నేరమయం. దొంగ ఓట్లతో ఆయన గెలిచారు. వెలగపూడికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. మీ రొయ్య మీసాలతో భయపెట్ట లేరని’’ ధ్వజమెత్తారు. చంద్రబాబుకు విశాఖ ప్రజలు ఓట్లు, సీట్లు కావాలి కానీ, పరిపాలన రాజధాని మాత్రం ఆయనకు అవసరం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ భూముల్లోనే విశాఖ పరిపాలన రాజధాని నిర్మాణం జరుగుతుందని.. పరిపాలన రాజధానిగా మరింత అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. పేదలకిచ్చే ఇళ్ల పట్టాలను కోర్టుల్లో కేసులు ద్వారా అడ్డుకోవద్దని చంద్రబాబుకు హితవు పలికారు.(చదవండి: ఉందిలే మంచి కాలం..) విశాఖ నగర ప్రజలకు గజం 30 వేలు ధర పలుకుతున్న ధరతో 15 లక్షలు విలువైన భూమి ఒక్కో లబ్ధిదారులకు సీఎం వైఎస్ జగన్ అందిస్తున్నారని తెలిపారు. రూ. 900 కోట్లతో విశాఖ తూర్పు నియోజకవర్గంలో సీఎం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఓటమి చెందినా.. పార్టీలకతీతంగా ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. 43 వేల బెల్టు షాపులు రద్దు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. -
రెక్కలు విరిగి.. నకనకలాడిపోతున్న వెలగ కోడి
రెక్కలు తొడిగి రెపరెపలాడి రివ్వంటోంది.... ముప్పై ఏళ్ల కిందట తెలుగు సినీ అభిమానులను ఓ రేంజ్లో ఉర్రూత లూగించిన ఈ పాటను ఇప్పుడు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విషయానికి వచ్చే సరికి ఇదిగో ఇలా చదువుకోవాలి– రెక్కలు విరిగి నకనకలాడి అల్లాడిపోతున్న వెలగకోడి... ఎక్కడైనా వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు పేరు చెబితే వెంటనే ఆ ప్రాంత అభివృద్ధి గుర్తుకు రావాలి... ఆ ప్రాంతంలో ఆయన ఆధ్వర్యంలో చేసిన మంచి పనులు జ్ఞప్తికి రావాలి.. నియోజకవర్గ ప్రజలకు చేసిన ఎన్నో మేళ్ళు స్ఫురణకు రావాలి.. కానీ మూడు దఫాలుగా విశాఖ తూర్పున వెలగబెడుతున్న రామకృష్ణ పేరు చెప్పగానే... కోడి పందేలు.. దౌర్జన్యాలు.. మద్యం మాఫియా ఆగడాలు, భూ దందాలు. పంచాయితీలు.. ఇంతకుమించి ఆయన వెలగబెట్టిందేమన్నా ఉందా అంటే సొంత పార్టీ నేతలు కూడా నిజాయితీగా ఠక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి.. ప్రభుత్వం ఉన్నా.. దాదాపు పదేళ్లు అడ్డగోలుగా నియోజకవర్గంపై పడిపోయి అందినకాడికి దోచేసిన వెలగపూడికి సరిగ్గా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి తారుమారైంది. అసలేమయింది అనుకుంటున్నారా... అయితే పూర్తి వివరాల కోసం లోపలికి రండి.. సాక్షి, విశాఖపట్నం : అధికారం దన్నుతో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గతంలో ఇష్టారాజ్యంగా చేసిన దందాలు, వ్యవహారాలు, దౌర్జన్యాలకు దాదాపు 20 నెలలుగా అడ్డుకట్ట పడింది. విజయవాడ మాజీ శాసనసభ్యుడు, దివంగత వంగవీటి మోహన్‌రంగా హత్యకేసులో మూడో నిందితునిగా పరారై ఇక్కడకి వలసొచ్చి.. ఆనక ’పరిస్థితులు’ కలసి రావడంతో ఎమ్మెల్యే గిరీ వెలగబెడుతున్న వెలగపూడి.. విశాఖ సంస్కృతికిపై తనదైన విషాన్ని చిమ్ముతూ వచ్చారు. ► ముందుగా చెప్పాలంటే కోడి పందేలు... గోదావరి జిల్లాల్లో పెద్ద పండక్కి ఆనవాయితీగా జరిగే సంప్రదాయ కోడి పందేలకు వెలగపూడి ఇక్కడ జూదం ముసుగు వేసి తెరలేపారు. ఉత్తరాంధ్ర సంప్రదాయాలకు భిన్నంగా అడ్డగోలుగా కోడిపందేలను దగ్గరుండి నిర్వహించేవారు. ఈ వ్యవహారాలపై 2018లో సాక్షిలో వచ్చిన వరుస కథనాల నేపథ్యంలో అదే ఏడాది కోడి పందేల కేసులో వెలగపూడి అభిమానం సంఘం నేతను పోలీసులు అరెస్టు చేశారు. ఇక 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ జూదం మాటున జరిగే కోడిపందేలకు పూర్తి స్థాయిలో అడ్డు కట్ట పడింది. ఐదారేళ్ళుగా కోడి పందేల బరులుతో విష సంస్కృతితో అల్లాడిన తూర్పు నియోజకవర్గంలో గతేడాది ఒక్క బరి కూడా గీయలేదు. ఇలా వెలగ’కోడి’కి పూర్తిగా రెక్కలు విరిగాయనే చెప్పాలి. ► ఇక వెలగపూడి బ్యాచ్ చేసే దందాలకు ఏడాదిన్నరగా పూర్తిగా బ్రేక్ పడింది. తూర్పున అడ్డు అదుపు లేకుండా వెలగపూడి అనుచరులు.. షాపులు, వాణిజ్య వ్యాపార సంస్థలకు పెట్టే ’ఇండెంట్స్’ లేకుండా పోయాయి. ► ఇది మరో భారీ దెబ్బ... దశాబ్దాల మద్యం మాఫియాకు ముకుతాడు పడింది. ఏడాదిన్నర కిందట వరకు ఒక్క తూర్పు నియోజకవర్గంలోనే కాదు.. నగరం మొత్తంమీద మద్యం మాఫియాకు వెలగపూడే నాయకత్వం వహించే వారు. లెక్కకు మించిన బార్ అండ్ రెస్టారెంట్లలో వాటాలున్నా... బినామీల పేరిట సొంతంగా నాలుగు షాపులు, రెండు బార్ అండ్ రెస్టారెంట్లు నిర్వహించే వారు. ఆరిలోవ, పెదగదిలి, ఎంవీపీ కాలనీ, జగదాంబ సెంటర్లలో షాపులు, ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట, ఓల్డ్ టౌన్లో బార్లు ఉండేవి. జగదాంబ సెంటర్లో షాపు స్వయంగా వెలగపూడి కుటుంబసభ్యుల పేరిటే ఉండేది. ఆయా షాపుల్లో కల్తీ మద్యం ఏరులై పారినా దాదాపు పదేళ్లు ఎవ్వరూ పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే ఎక్సైజ్ అధికారులు కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపారు. ఆ క్రమంలోనే వెలగపూడి చిట్టాలోని షాపుల్లో వరుసగా కల్తీ మద్యం విక్రయిస్తున్న దాఖలాలు బయటపడ్డాయి. కేసులు నమోదు చేసి పాత్రధారులను అరెస్టు చేశారు. వెంటనే సూత్రధారి వెలగపూడి బయటకు వచ్చి నానాయాగీ చేశారు. వెంకోజిపాలెంలో అక్రమ మద్యం విక్రయిస్తున్న విషయం బయటపడి కేసులు రాస్తే వెలగపూడి సీరియస్‌గా చేసిన ’యాక్షన్’ నవ్వులు పూయించింది. స్టేషన్ వద్దనే నిద్ర చేసి హడావుడి చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దరిమిలా నూతన మద్యం పాలసీ నేపథ్యంలో వెలగపూడి పూర్తిగా బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వహణను నుంచి తప్పుకున్నట్టే చెప్పాలి. అంటే దాదాపు 20ఏళ్లుగా మద్యం మహమ్మారితోనే వ్యాపారం.. కాదు కాదు... ఆ ముసుగులో దందాలు చేసిన వెలగపూడికి సరిగ్గా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే చెక్ పడింది. ► ఇక తాజాగా వెలగపూడి భూదందాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. వెలగపూడి భార్య పేరిట రుషికొండలో బీచ్ రోడ్డు సర్వే నెంబరు 21లో గెడ్డ పక్కన ఆక్రమించిన ఆరు సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని ఇటీవల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో వేసిన రేకుల షెడ్‌ను.. చుట్టూ ఉన్న ప్రహరీని తొలగించారు. ► ఈ వరుస పరిణామాల నేపథ్యంలో విశాఖ తూర్పు ప్రజలు హాయిగా స్వేచ్ఛావాయువులు పీలుస్తుంటే... అన్ని అక్రమాల రెక్కలు తెగిన వెలగ’కోడి’ మాత్రం గిల గిలా కొట్టుకుంటోందని అంటున్నారు. అందుకే సదరు వెలగపూడి... విశాఖ సమగ్రాభివృద్ధిని కాంక్షించే రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డిపై లేనిపోని ఆయాసంతో అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని పచ్చ బ్యాచే ఆఫ్ ది రికార్డ్‌గా అంగీకరిస్తున్నారు. ఇంకెవరికైనా ఎనీ డౌట్స్.?. -
ఈగల సత్యానికి 14 రోజుల రిమాండ్
సాక్షి, విశాఖపట్నం: తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు ఈగల సత్యనారాయణ (సత్యం)ను ఎంవీపీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఎస్తేర్‌రాణి అనే మహిళపై దౌర్జన్యానికి దిగడంతోపాటు వేధింపులకు గురిచేసిన నేపథ్యంలో అతనిపై ఎంవీపీ పోలీసు స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. వేధింపులు తాళలేక ఆదివారం రాత్రి ఎస్తేర్‌రాణి శానిటైజర్ తాగి ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు కేజీహెచ్‌కు తరలించారు. దీంతో అక్కడికి వెళ్లిన ఎంవీపీ పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం తీసుకొని సోమవారం రాత్రి కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం బీచ్‌రోడ్డులో ఈగల సత్యంను అదుపులోకి తీసుకున్నట్లు ఎంవీపీ ఎస్ఐ భాస్కర్ తెలిపారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అక్కడి నుంచి సత్యంను సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఎస్తేర్‌రాణి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. శానిటైజర్ తాగడం వల్ల శరీరంలోని అవయవాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించినట్లు తెలిపారు. మహిళా సంఘాల ఆగ్రహం ఒంటరిగా ఉంటున్న మహిళ పట్ల ఈగల సత్యం వ్యవహరించిన తీరుపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మహిళలపై టీడీపీ నాయకులకు ఉన్న చిన్నచూపునకు ఈ ఘటన నిదర్శనమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకులు మంగళవారం కేజీహెచ్‌కు వెళ్లి ఎస్తేర్‌రాణిని పరామర్శించారు. వైఎస్సార్సీపీతోపాటు నగరంలోని మహిళా సంఘాలన్నీ అండగా ఉన్నాయంటూ భరోసా కల్పించారు. ఎస్తేర్‌రాణి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ మహిళ విభాగం అధ్యక్షురాలు కృపజ్యోతి మాట్లాడుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియోలు చూస్తుంటే ఎస్తేర్‌రాణిపై సత్యం ఏ స్థాయిలో దౌర్జన్యానికి దిగాడనేది అర్థమవుతుందన్నారు. నిత్యం ఆమె ఇంటికి వెళ్లి దుర్భాషలాడుతూ, వేధిస్తూ మానసికంగా హింసించాడన్నారు. ఎమ్మెల్యే వెలగపూడి అండతోనే సత్యం ఇంతగా బరితెగించాడంటూ దుయ్యబట్టారు. మానసికంగా, శారీరకంగా ఎస్తేర్‌రాణిని హింసించిన తీరుపై కుటుంబ సభ్యులు తెలిపిన విషయాలు బాధ కలిగించాయన్నారు. సత్యంను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విశాఖలో మరోసారి ఇలాంటి ఘటన వెలుగుచూడకుండా పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన దిశ వంటి చట్టాలను ఉపయోగించి సత్యంలాంటి వారికి తగిన గుణపాఠం నేర్పాలన్నారు. కార్యక్రమంలో శిరీష, షకీనా, వరలక్ష్మి, వెంకటలక్ష్మి, శశికళ పాల్గొన్నారు. చదవండి: మహిళపై టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి దౌర్జన్యం -
మహిళపై టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి దౌర్జన్యం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అనుచరుల అరాచకాలు ఆగడం లేదు. నడిరోడ్డుపై ఎమ్మెల్యే అనుచరుడు చేసిన దాష్టీకాన్ని తట్టుకోలేక ఓ మహిళ శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం విశాఖలో చోటు చేసుకుంది. బాధితురాలి కొడుకు నరేష్ ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు వైద్యులు తెలిపారు. వివరాలు.. విశాఖలోని పెదవాల్తేరు ప్రాంతంలో ఎస్తేరు రాణి అనే మహిళ రోడ్డు పక్కన హోటల్ నడుపుతుంది. ఈ క్రమంలో అదే ప్రాంతంలో నివసిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ బాబు అనుచరుడు ఈగల సత్యనారాయణ అనే వ్యక్తి తరచూ సదరు బాధిత మహిళ హోటల్ వెళ్లేడమే కాకుండా.. అక్కడ హోటల్ కొనసాగాలంటే తన ఆశీస్సులు ఉండాలని బెదిరించేవాడు. అంతేగాక తనతో సన్నిహితంగా ఉండకపోతే లక్ష రూపాయలు అప్పు తీసుకుని ఎగ్గొట్టినట్టు ఎస్తేరు రాణి పై తప్పుడు కేసు పెడతానని బెదిరించేవాడు. ఈ నేపథ్యంలో నిన్న(ఆదివారం) సాయంత్రం కూడా బాధితురాలిని తనతోనే ఉండాలని బెదిరించాడు. అంతేగాక నడి రోడ్డుపైనే ఆమెపై వచక్షణంగా దాడికి తెగబడ్డాడు. దీంతో జరిగిన ఈ అవమానం తట్టుకోలేక సదరు బాధితురాలు శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీంతో స్థానికులు ఆమెను వెంటనే కింగ్ జార్జీఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె భావనగర్ వార్డులో చికిత్స పొందుతోంది ప్రస్తుతం ఆమె పరిస్థితి విషయంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. జరిగిన ఘటనపై బాధితురాలి కొడుకు నరేష్ తన తల్లిపై జరిగిన దౌర్జన్యంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటనకు పాల్పడిన ఈగల సత్యనారాయణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నరేష్ ప్రభుత్వాన్ని కోరాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన విశాఖ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఓటేసిన జనమే టీడీపీ ఎమ్మెల్యేని ఛీ కొట్టారు..
సాక్షి, విశాఖపట్నం: ఓటేసిన జనమే మాటమార్చిన నాయకుడిని ఛీ కొట్టిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. మూడుసార్లు గెలిపించినా ఏ మాత్రం కృతజ్ఞత లేకుండా వ్యవహరించిన విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు చేదు అనుభవం ఎదురైంది. విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలోని రామకృష్ణపురంలో మంగళవారం రోజున అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి రామకృష్ణ బాబు వెళ్లారు. గతంలో మాదిరిగానే స్థానికులు వచ్చి పలకరిస్తారని ఎమ్మెల్యే భావించాడు. కానీ ఊహించని విధంగా స్థానికులతో పాటు సమీప కాలనీల ప్రజలు కూడా అక్కడకు చేరుకొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే అధికారం మీకు లేదంటూ నినాదాలు చేశారు. వారికి రామకృష్ణబాబు నచ్చచెప్పే ప్రయత్నం చేయగా జనం గొడవకు దిగారు. (ఉత్తరాంధ్ర ద్రోహులు చంద్రబాబు, రామోజీ) దీంతో మీరు కూడా నాతో పాటు వచ్చి కొబ్బరికాయ కొట్టండి అని చెప్పడానికి మరో మారు ఎమ్మెల్యే ప్రయత్నించగా ఆ పప్పులు ఉడకవంటూ జనం తిరగబడ్డారు. అతని వెంట ఉన్న అనుచరులపై కూడా ఎప్పుడూ లేని విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాగ్రహంపై ఆరా తీస్తే ఉత్తరాంధ్రలో విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలనే సీఎం నిర్ణయాన్ని వెలగపూడి వ్యతిరేకించడమే కారణమని తెలిసింది. కాగా ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రతిపాదన చేయడంతో ఉత్తరాంధ్రకు చెందిన అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. కానీ విశాఖ కేంద్రంగా గెలుపొందిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం తమ అధినేత చంద్రబాబు నాయుడు బాటలో నడిచి విశాఖ జనం విశ్వాసం కోల్పోయారు. స్థానికేతరుడు అయినప్పటికీ విశాఖ ఈస్ట్ నియోజకవర్గం నుంచి వెలగపూడిని మూడుసార్లు ఎమ్మెల్యేగా అక్కడి ప్రజలు గెలిపించారు. అయితే ఆయన మాత్రం విశాఖ ప్రజలు ప్రజానిర్ణయాన్ని కాదని అధినేత బాటలో నడవడంతో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. (పచ్చ తమ్ముళ్లూ.. గూగుల్‌లో వెతకండి) -
వెలగపూడి హంగామా
ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): తన లిక్కర్ మాఫియాను కాపాడుకునేందుకు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చేసిన హంగామాపై పోలీసు యంత్రాంగం సీరియస్ అయ్యింది. రెండు రోజులుగా మద్దిలపాలెం, ఎంవీపీ కాలనీల్లోని ఎక్సైజ్ పోలీసు స్టేషన్ల ఎదుట ఎమ్మెల్యే వెలగపూడితో పాటు ఆయన అనుచరులు హైడ్రామా చేసిన విషయం తెలిసిందే. తన బినామీ బార్లపై ఎక్సైజ్ అధికారులు బ్రాండ్ మిక్సింగ్ కేసు నమోదు చేయడాన్ని జీర్ణించుకోలేని వెలగపూడి అక్రమ కేసులు పెట్టారంటూ రెండు రోజుల పాటు హంగామా చేశారు. శనివారం రాత్రి ఎంవీపీ కాలనీలోని సర్కిల్–2 ఎక్సైజ్ పోలీసు స్టేషన్ ఆవరణలో రాత్రి నిద్ర చేసి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయితే తమ విధులకు ఆటంకం కల్పించారని సర్కిల్–2 స్టేషన్ సీఐ పాపునాయుడు ఆదివారం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై ఫిర్యాదు చేసినట్లు ఎంవీపీ పోలీసులు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే వెలగపూడిపై ఐపీసీ సెక్షన్ 353, 501 కింద ప్రభుత్వ ఉద్యోగులకు ఆటంకం కల్గించడంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎంవీపీ పోలీసులు చెప్పారు. -
వెలగపూడి టీమ్ రౌడీయిజం
ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలగపూడి అనుచరులు పెట్రేగిపోతున్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై రౌడీయిజం చెలాయిస్తున్నారు. గతంలో మద్యం మాఫియా వేదికగా సాగిన వీరి రౌడీయిజం ప్రస్తుతం వీధులకు సైతం పాకింది. ఎంవీపీకాలనీ పరిధి 7వ వార్డులో పారిశుద్ధ్య విధులు నిర్వర్తిస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్పై టీడీపీ నాయకుడు దాడికి దిగడంతో తెలుగు తమ్ముళ్ల రౌడీయిజం మరోసారి వెలుగుచూసింది. ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు, తన రౌడీ బ్యాచ్‌ను కాపాడేందుకు ఏకంగా ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. అటు శానిటరీ ఇన్స్పెక్టర్పైనా... ఇటు ఎంవీపీ పోలీసులపై ఒత్తిడి తెచ్చి తెలుగు తమ్ముళ్లను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. విచక్షణ లేకుండా దాడి ఎంవీపీకాలనీ పరిధిలోని 7వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్గా త్రినాథ్ వ్యవహరిస్తున్నారు. సౌమ్యుడిగా.. నిజాయితీ గల అధికారిగా ఆయనకు పేరుంది. ఇటీవల 7వ వార్డులో జీవీఎంసీ జోన్–2 కమిషనర్ శ్రీనివాస్ పర్యటించారు. పారిశుద్ధ్యం పనులను పరిశీలించారు. సెక్టార్–9లో రోడ్డుపై విచ్చలవిడిగా గేదెలు కట్టి ఉండటాన్ని గమనించిన ఆయన స్థానికులతో మాట్లాడారు. దీనిపై స్థానికులు సైతం అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆవులు, గేదెలను కట్టిన వారికి పెద్ద మొత్తంలో అపరాధ రుసుం విధించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ త్రినాథ్‌ను ఆదేశించారు. ఒక్కొక్కరికి రూ.10 వేల రుసుం విధించాలని, ఆ మొత్తం చెల్లించకుంటే ఆవులు, గేదెలను తరలించాలని సూచించారు. అయితే వారు గతంలో కూడా రుసుం చెల్లింపులో ఇబ్బందులకు గురి చేసిన నేపథ్యంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా వేశారు. అందులో ఒకరు ఈ మొత్తం చెల్లించగా.. టీడీపీ నాయకులు ఎంవీ రమణ, పోలారావులు కట్టేది లేదంటూ ఆయనతో వాదనకు దిగారు. రుసుం కట్టకపోతే ఆవులను వ్యాన్ ఎక్కిస్తామని చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఎంవీ రమణ శానిటరీ ఇన్స్పెక్టర్పై దాడి చేశాడు. దీంతో ఆ అధికారి ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఎంవీపీ పోలీసులు ఎంవీ రమణ, పోలారావులను అదుపులోకి తీసుకున్నారు. రంగంలోకి వెలగపూడి ఇదిలా ఉండగా ఈ ఘటనపై సెక్టార్–9లోని టీడీపీ నాయకులు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును ఆశ్రయించారు. ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే.. అనుచరుడు ఎంవీ రమణను వెనకేసుకొచ్చినట్లు సమాచారం. రమణపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఎంవీపీ పోలీసులపై ఎమ్మెల్యే ఉదయం నుంచి పలుమార్లు ఒత్తిళ్లు తెచ్చినట్లు తెలిసింది. పైగా ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటూ శానిటరీ ఇన్స్పెక్టర్పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా పోలీసులు గోప్యత వహించారు. ఉదయం నుంచి ఎంవీపీ సీఐ షణ్ముఖరావు స్టేషన్లో అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాత్రికి విషయం బయటకు పొక్కడంతో ఎమ్మెల్యే ఒత్తిళ్లను పక్కన పెట్టి ఎట్టకేలకు ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారిపై దాడి చేసినందుకు గానూ రాత్రి 9.30 తర్వాత ఎంవీ రమణ, పోలారావుపై కేసు నమోదు చేసినట్లు సీఐ షణ్ముఖరావు ధ్రువీకరించారు. -
టీడీపీ ఎమ్మెల్యే బార్ అండ్ రెస్టారెంట్ క్లోజ్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇన్నాళ్లకు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు లిక్కర్ మాఫియాకి అడ్డుకట్ట మొదలైంది. ఏడు నెలల క్రితం వరకు తెలుగుదేశం ప్రభుత్వం దన్నుతో ఆయన ‘లిక్కర్’ అక్రమాలకు అడ్డులేకుండా పోయింది. ఆయన జోలికి వెళ్లేందుకు సాహసించలేని ఎక్సైజ్ పోలీసులు ఈ మధ్యనే ఎట్టకేలకు దాడులు చేపట్టారు. సరిగ్గా అదే సమయంలో వెలగపూడి బినామీ బార్లో మద్యం కల్తీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశారు. కానీ సరైన చర్యలు లేకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. ఉన్నత స్థాయి ఆదేశాలతో ఎట్టకేలకు సదరు బార్ క్లోజ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ద్వారకాబస్టాండ్ ఎదుట ఉన్న దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ ఎవరిదనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. జీవీఎస్ఎన్ సత్యనారాయణ పేరిట ఉన్న ఈ బార్‌ను సతీష్ అనే టీడీపీ కార్యకర్త నిర్వహిస్తుంటాడు. వీరిద్దరూ వెలగపూడి బినావీులనేది లిక్కర్ సిండికేట్‌కే కాదు.. ఎక్సైజ్ అధికార వర్గాలందరికీ తెలిసిన వాస్తవం. కల్తీ, నాసిరకం మద్యం విక్రయాలకు సంబంధించి ఈ బార్ అండ్ రెస్టారెంట్‌పై ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. అధికారం దన్నుతో గత ఐదేళ్లుగా ఎవరూ దాడులు చేసే సాహసం చేయలేదు. ఈనెల 12వ తేదీన గురువారం పక్కాగా సమాచారం రావడంతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ సిహెచ్ దాస్ ఆదేశాల మేరకు విశాఖపట్నం ఎక్సైజ్ ఈఎస్ టాస్క్‌ఫోర్స్ సీఐ సూర్యకుమారి ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేపట్టారు. ఓసీ బ్రాండ్ మద్యంలో క్రేజీ డాల్ అనే చీప్ లిక్కర్‌ను, ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీని ఎంసీ బ్రాందీలో మిక్స్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అప్పటికే కల్తీ చేసిన 17 ఫుల్ బాటిళ్లను సీజ్ చేశారు. సిబ్బందిని అదుపులోకి తీసుకుని ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం బయటకు పొక్కకుండా కేసును నిర్వీర్యం చేయాలంటూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఘటన జరిగిన దరిమిలా ఎక్సైజ్ ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పటి నుంచి కేసు తాత్సారం చేస్తూ వచ్చిన ఎక్సైజ్ అధికారులు ఎట్టకేలకు ఆదివారం పొద్దుపోయాక బార్ అండ్ రెస్టారెంట్‌ను సీజ్ చేశారు. -
వెలగపూడి బార్లో కల్తీ మద్యం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలో లిక్కర్ మాఫియా.. కల్తీ లిక్కర్ డాన్ ఎవరంటే.. అందరూ ఠక్కున చెప్పే పేరు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. ఏడు నెలల కిందటి వరకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ దన్నుతో వెలగపూడి ‘లిక్కర్’ అక్రమాల జోలికి వెళ్ళేందుకు సాహసించలేని ఎక్సైజ్ పోలీసులకు ఇప్పుడు పగ్గాలొచ్చాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా వెలగపూడి సిండికేట్‌లో మార్పు వస్తుందని అధికారులు ఆశించారు. అయితే సదరు మాఫియా గతంలో మాదిరిగానే అడ్డగోలుగా వ్యవహరిస్తుండటంతో మెరుపు దాడులు చేశారు. మద్యం కల్తీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ద్వారకా బస్టాండ్ ఎదుట ఉన్న దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ ఎవరిదనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. జీవీఎస్ఎన్ సత్యనారాయణ పేరిట ఉన్న ఈ బార్‌ను సతీష్ అనే టీడీపీ కార్యకర్త నిర్వహిస్తుంటాడు. వీరిద్దరూ వెలగపూడి బినావీులనేది లిక్కర్ సిండికేట్‌కే కాదు.. ఎక్సైజ్ అధికార వర్గాలందరికీ తెలిసిన వాస్తవం. కల్తీ, నాసిరకం మద్యం విక్రయిస్తున్నారంటూ ఈ బార్ అండ్ రెస్టారెంట్‌పై ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. అయితే అధికారం దన్నుతో గత ఐదేళ్ళుగా ఎవ్వరూ దాడులు చేసే సాహసం చేయలేదు. గురువారం పక్కాగా సమాచారం రావడంతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ సీహెచ్ దాస్ ఆదేశాల మేరకు విశాఖపట్నం ఎక్సైజ్ ఈఎస్, టాస్క్‌ఫోర్స్ సీఐ సూర్యకుమారి ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేపట్టారు. ఓసీ బ్రాండ్ మద్యంలో క్రేజీ డాల్ అనే చీప్ లిక్కర్‌ను, ఎంసీ బ్రాందీలో ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీని కలిపి కల్తీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అప్పటికే కల్తీ చేసిన 17 ఫుల్ బాటిళ్ళను సీజ్ చేశారు. సిబ్బందిని అదుపులోకి తీసుకుని ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే వెలగపూడి.. విషయం బయటకు పొక్కకుండా కేసును నిర్వీర్యం చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు కల్తీ మద్యం కేసు మూలాల్లోకి వెళ్తారా.. లేదా కేవలం సిబ్బందికే పరిమితం చేస్తారా అనేది చూడాలి. -
ఇసుక మాఫియా డాన్ కవాతుకు ముఖ్య అతిథా ?
సాక్షి, విశాఖపట్నం: గత ఐదేళ్లలో ఇసుకను దోచుకుతిన్న టీడీపీతో కలిసి జనసేన లాంగ్‌మార్చ్ చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. లాంగ్‌మార్చ్‌తో పవన్‌కల్యాణ్, చంద్రబాబుల మధ్య బంధం బహిర్గతమైందన్నారు. శనివారం మద్దిలపాలెంలో గల పార్టీ నగర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన సుపుత్రుడు రాజకీయాలకు పనికిరాడని దత్తపుత్రుడైన పవన్‌కల్యాణ్‌తో ఫ్యాకేజీకి మాట్లాడి లాంగ్‌మార్చ్ చేయిస్తున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నుంచి వందల కోట్లు తీసుకుని గాజువాక, భీమవరాలలో పవన్‌కల్యాణ్ ఖర్చుపెట్టిన విషయం నిజం కాదా అని విమర్శించారు. కృష్ణానది పక్కన ఉన్న విజయవాడలో గానీ, గోదావరి పక్కన ఉన్న రాజమండ్రిలో గానీ పవన్‌కల్యాణ్ లాంగ్‌మార్చ్ పెట్టగలడా అని ప్రశ్నించారు.ఇది లాంగ్ మార్చ్‌కాదు, రాంగ్‌మార్చ్ అని విమర్శించారు. కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి ఎక్కువగా ఉందని, అందుకనే ఇసుక కొరత ఉందని ప్రజలందరికీ తెలుస న్నారు. సొంత బావ హరికృష్ణ శవం సాక్షిగా శవరాజకీయాలు చేసిన చరిత్ర చంద్రబాబుదని చెప్పారు. సమావేశంలో మట్లాడుతున్న చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్యాకేజీ కోసం చంద్రబాబు డైరెక్షన్లో పవన్ నటిస్తున్నాడని ఎద్దేవాచేశారు. రైతులు పల్లెల్లో సంతోషంగా ఉన్నారన్నారు. ఐదేళ్లలో టీడీపీ నేతలు ఇసుక దోపిడీచేస్తే పవన్‌కల్యాణ్ లాంగ్‌మార్చ్ కాదు కదా..షార్ట్ మార్చ్ కూడా చేయలేదని విమర్శించారు. మా ప్రభుత్వంలో రూ.4.90కే రవాణా చేస్తామంటే వారికే అనుమతిస్తున్నామన్నారు. సుమారు 267 రీచ్‌లు ఉంటే వరద కారణంగా కేవలం 67 రీచ్‌లలో మాత్రమే ఇసుక లభ్యమవుతోందని చెప్పారు. వరద ఉధృతి తగ్గిన తరువాత అక్రమాలకు తావులేకుండా పూర్తి స్థాయిలో ఇసుక అందిస్తామన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు, అతని డ్రామా ట్రూప్ అంతా కుటిల రాజకీయాలు మాని ప్రజల క్షేమం కోసం పనిచేయాలని కోరారు. ప్రభుత్వానికి సలహాలివ్వండి, వాటిని స్వీకరించి ..ప్రజల క్షేమం కోసం పనిచేద్దామన్నారు. కాదని అభివృద్ధికి అడ్డుపడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, సీనియర్‌నేత కొయ్య ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగేంద్ర, ముఖ్యనాయకులు మంత్రి రాజశేఖర్, సతీష్‌వర్మ తదితరులు పాల్గొన్నారు. సాక్షి, విశాఖపట్నం: సినిమాల్లో అనేక బ్యానర్లు, ప్రొడక్షన్లలో పనిచేసిన పవన్‌కల్యాణ్ రాజకీయాల్లో నారావారి ప్రొడక్షన్లో ప్యాకేజీలకోసం పనిచేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. శనివారం మద్దిలపాలెం నగరపార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నదులు ఏ విధంగా పొంగిపొర్లుతున్నాయో ప్రజలందరికీ తెలుసని, ఒక్క సీటు గెలిచిన పిల్లసేన పార్టీ ..23 సీట్లు గెలిచిన ఇంకుడు గుంతల పార్టీ అయిన టీడీపీతో కలిసి లాంగ్‌మార్చ్ చేస్తామనడం హాస్యస్పదంగా ఉందన్నారు. పవన్‌కల్యాణ్ సినిమాల్లో నటించడం ఎందుకు మానేశారో మొదట్లో ఎవరికీ అర్థం కాలేదని, సినిమాల్లో కన్నా చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలే ఎక్కువని మానేశారని ప్రజలకు ఇప్పుడు అర్థమైందన్నారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా ఇసుక కొరత ఏర్పడిందని, వరద ఉధృతి తగ్గిన తర్వాత ఆ సమస్యను అధిగమిస్తామన్నారు. వైఎస్ జగన్ సీఎం అయితే పేరు మార్చుకుంటానని పవన్‌కల్యాణ్ గత ఎన్నికల్లో ప్రగల్బాలు పలికాడని, మరి ఇప్పుడు నారా పవన్‌కల్యాణ్ అని ఎందుకు మార్చుకోలేదని విమర్శించారు. గాజువాకలో ఓటమి తర్వాత అక్కడి వారిని కలవని పవన్ ఇప్పుడు బాబు డైరెక్షన్లో హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన వైఖరి నచ్చకే విశాఖలో మాజీ మంత్రి బాలరాజు రాజీనామా చేశారన్నారు. ఇసుక మాఫియా డాన్ ముఖ్య అతిథా ? గత ఐదేళ్లలో ఇసుక దోపిడీ చేసిన అచ్చెన్నాయుడు టీడీపీ నుంచి లాంగ్‌మార్చ్‌కి ముఖ్య అతిథిగా పాల్గొంటుండడంపై ఆయన తీవ్రంగా విమరించారు. డ్రగ్ మాఫియా డాన్ అయ్యన్నపాత్రుడు, లిక్కర్ మాఫియా డాన్ వెలగపూడి రామకృష్ణబాబులను పక్కనపెట్టుకుని లాంగ్‌మార్చ్ చేస్తారా అని విమర్శించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వందరోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి ఉద్దానం సమస్యను పరిష్కరించడమే మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, సీనియర్‌నేత కొయ్య ప్రసాదరెడ్డి, అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, పేర్ల విజయచంద్ర, ముఖ్యనాయకులు మంత్రి రాజశేఖర్, పరూఖి, జీవీ కృష్ణారావు పాల్గొన్నారు. -
వెలగపూడి ఇలాకాలోనే పవన్ కవాతు
పవన్ కల్యాణ్ పదేళ్ళ రాజకీయ ప్రస్థానం చూస్తే ’సాధింపులు’ ఎక్కువగా ఉంటాయి. ఔను... సాధింపులే.. ఓ రకంగా కొందరు అత్తలు.. కోడళ్ళను సాధించే బాపతన్నమాట. ఐదేళ్ళ కిందట పవన్ పెళ్లిళ్ల గురించి ప్రత్యర్థి పార్టీల నేతలు మాట్లాడితే.. ఇదిగో మీ అందరి తెర వెనుక భాగోతాలు బయటపెడతానంటూ హడావుడి చేశారు. కానీ.. ప్చ్.. ఒక్కరి గుట్టు విప్పితే ఒట్టు.! ఎప్పుడో ఎక్కడో ఎందుకు.. తాజా ఉదాహరణే చూద్దాం. సత్తెనపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఇటీవల రాజకీయపరంగా విమర్శలు చేస్తే.. ‘నేను మీ అమ్మాయి పెళ్ళికి వచ్చానంటూ’ పవన్ సంబంధం లేని మాటలు మాట్లాడారు.. ఇక సినీనటుడు ఆలీతో వివాదం తెలిసిందే. ఆలీకి ఎంతో చేస్తే తనను మోసం చేశాడని పవన్ ఎన్నికల సమయంలో అన్నారు. దానికి ఆలీ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. నేను యమలీలలో హీరోగా చేసిన సమయంలో మీరు హీరో కూడా కాదు.. నేను స్వతంత్రంగానే పరిశ్రమలో ఎదిగాను.. మీరు మెగాస్టార్ తమ్ముడిగా వచ్చి ఎదిగారు.. మీరు నాకు సినిమాలు ఇప్పించారా.. డబ్బు సాయం చేశారా.. ఇలా చాలా చాలా ప్రశ్నలు వేసి గట్టిగా రిటార్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకనుకుంటున్నారా.. పవన్ కల్యాణ్ భవన నిర్మాణ కార్మికుల పేరుతో విశాఖలో చేపట్టిన లాంగ్‌మార్చ్‌కు ఎవ్వరి మద్దతూ కూడగట్టలేకపోయారు. చివరికి ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన వామపక్షాలూ కలిసి రాలేదు. ఇక ఎవ్వరూ లేకున్నా.. 2014లో బహిరంగంగా.. 2019 లోపాయికారీగా మద్దతిచ్చిన టీడీపీ ఉంది కదా.. వాళ్ళు మాత్రం మద్దతిచ్చారు. ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు.. అందరూ అనుకున్నదే. ఇప్పుడు అసలు విషయమేమిటంటే.. పవన్‌కల్యాణ్ లాంగ్‌మార్చ్ మొదలుపెట్టే ప్రాంతం.. నడిచే ప్రాంతంలో ఎక్కువ భాగం.. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమే. అయితే ఏంటి? అనుకుంటున్నారా.. ఒక్కసారి లోపలికి రండి.. పూర్తి వివరాలు చూద్దాం. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు రాత్రి.. వెలగపూడి రామకృష్ణబాబు విజయోత్సవ ర్యాలీలో గెలుపు ఊపుతో ఏమేం మాట్లాడారో అందరికీ గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్కల్యాణ్నుద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పత్రికల్లో రాయలేని భాషలో పవన్‌ను తిట్టిపోశారు. ‘ఒక్క చోట కూడా గెలవలేని....... మళ్ళీ రెండు చోట్ల పోటీ చేశాడు.. ఆ ము.... రెండు చోట్లా ఓడిపోయాడు.. ’ అని దారుణంగా మాట్లాడారు. వాస్తవానికి రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలు ఒకరినొకరు తిట్టిపోసుకోవడం ఇప్పుడు సాధారణమైపోయింది. ఒకప్పుడు సిద్ధాంతపరమైన విమర్శలకు పరిమితమైన నేతలు ఇప్పుడు శృతిమించి వ్యక్తిగత దూషణలకూ వెళిపోతున్నారు. ఇవన్నీ ఇప్పుడు మూమూలేనని దాదాపు అందరూ సర్దుకుపోతున్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఆ టైపు కాదని అందరికీ తెలుసు. ఎప్పుడెప్పుడి విషయాలో తవ్వి మరీ విపక్ష నేతలపై విమర్శలు చేస్తుంటారు. ప్రజారాజ్యం నుంచి ఇతర పార్టీలకు వెళ్ళిన నేతలు మొదలు.. తన మద్దతుతోనే 2014లో టీడీపీ నేతలందరూ గెలిచారని భావిస్తూ.. ఆయా నేతలందరినీ ఆయన ఆడిపోసుకుంటుంటారు. మన జిల్లాలో గంటా శ్రీనివాసరావు మొదలు పీఆర్పీ నుంచి వచ్చిన నేతలందరినీ టార్గెట్ చేస్తుంటారు. ముఖ్యంగా గంటాపైన ఎన్నికల వేళ తీవ్ర విమర్శలు చేశారు. ఎప్పుడో తనను ఉద్దేశించి అన్న మాటలను మైండ్‌లో రికార్డ్ చేసుకుని మరీ గంటాను తిట్టిపోశారు. ఒక్క గంటానే కాదు.. తనను విమర్శించిన నేతలందరినీ గుర్తించుకుని మరీ తిట్టిపోయడం పవన్ రాజకీయాలు చూసిన వారెవరికైనా ఎరుకే. వెలగపూడి జోలికి వెళ్తారా? ఇప్పుడు తనను తిట్టిపోసిన వెలగపూడి ఇలాకాలోనే పవన్‌కల్యాణ్ లాంగ్‌మార్చ్ మొదలుపెట్టనున్నారు. మరి వెలగపూడిని టార్గెట్ చేస్తారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి తనను అవమానకరంగా దూషించిన వెలగపూడి కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ మద్దతుతోనే ఆయన లాంగ్‌మార్చ్ చేయాల్సి వస్తోంది. ఇసుక విషయమై తాను చేస్తున్న పోరాటానికి కలిసిరావాలని విపక్ష పార్టీలన్నంటినీ పవన్ అభ్యర్ధించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని సైతం ఆహ్వానించారు. అయితే బీజేపీ నేతలు పవన్ వినతిని చాలా లైట్‌గా తీసుకున్నారు. ఇక గడిచిన ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసిన వామపక్షాలు సైతం ఆయన ఆహ్వానాన్ని మన్నించలేదు. ఇప్పటికే తాము ఇసుక విషయమై ఉద్యమాలు చేసినందున జనసేన మార్చ్‌కు దూరంగా ఉంటామని తేల్చిచెప్పాయి. దీంతో పవన్ ఏకాకిగానే మార్చ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే టీడీపీ నేతలు మాత్రం పవన్ షోకి ముందుకొస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు పవన్ స్వయంగా ఫోన్ చేసి మద్దతు కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు టీడీపీ నేతలను ఆదివారం నాటి లాంగ్‌మార్చ్‌కు వెళ్ళాల్సిందిగా బాబు ఆదేశించినట్టు సమాచారం. టీడీపీ నేతలకు టీడీ జనార్ధన్ ఫోన్లు పవన్ కల్యాణ్ ఆదివారం చేపట్టిన లాంగ్‌మార్చ్‌కు వెళ్ళాలని పార్టీ అధినేత చంద్రబాబు చెప్పారంటూ ఆ పార్టీ ముఖ్య నాయకుడు టీడీ జనార్ధన్ జిల్లాకు చెందిన కొందరు నేతలకు ఫోన్ చేసినట్టు చెబుతున్నారు. మాజీ మంత్రులు గంటాశ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడులను కచ్చితంగా వెళ్ళాలని కోరినట్టు తెలుస్తోంది.. పొలిట్‌బ్యూరో సభ్యుడిగా అయ్యన్న వెళ్ళే అవకాశాలున్నప్పటికీ గంటా హాజరుపై మాత్రం అనుమానాలున్నాయి. వాస్తవానికి జనసేన నేతలు కూడా వ్యక్తిగతంగా గంటాను ఆహ్వానించినట్టు చెబుతున్నారు. కానీ టీడీపీ సమావేశాలకే డుమ్మా కొడుతున్న గంటా.. ఆ పార్టీ మద్దతిస్తున్న జనసేన షోకు వెళ్ళడం ప్రశ్నార్ధకంగానే ఉంది. పవన్ గాజువాక వెళ్తారా... పోటీ చేసి ఓడిపోయిన తర్వాత గాజువాక వైపు పవన్ కన్నెత్తి చూడలేదు. దాదాపు ఆరు నెలల తర్వాత విశాఖ వస్తున్న ఆయన ఇప్పుడైనా తనకు ఓట్లు వేసి కనీసం రెండోస్థానంలో నిలబెట్టిన గాజువాక వైపు తొంగిచూస్తారా లేదా అనేది జనసేన శ్రేణులు కూడా చెప్పలేని అయోమయ పరిస్థితే ఉంది. కొసమెరుపు రెండురోజుల కిందట రాజ్యసభ సభ్యుడు, ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి విజయసాయిరెడ్డి విశాఖలో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద ఇంకా పవన్‌కల్యాణ్ పొలిటికల్ కాల్షీట్లు ఉన్నాయని వ్యాఖ్యానించారు. పవన్ సినిమా కాల్షీట్లు ఎవరికైనా ఇస్తున్నారో లేదో గానీ పొలిటికల్ కాల్షీట్లు మాత్రం బాబు వద్దనే ఉన్నాయన్నారు. అందుకే బాబు చెప్పినట్టుగానే ఇప్పటికీ పవన్ యాక్ట్ చేస్తున్నాడని విమర్శించారు. ఆ రాజకీయ విమర్శలేమో గానీ సరిగ్గా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు నిజమనిపించేలానే ఎవ్వరూ రాకున్నా జనసేన, టీడీపీనే కలిసి నేడు షో చేయనున్నాయి. -
తాగుబోతులకు మద్దతుగా అయ్యన్న!
సాక్షి, విశాఖపట్నం: నర్సీపట్నంలో అర్ధరాత్రి తాగుబోతులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో బండిపై అధిక స్పీడుతో వెళ్తూ హల్చల్ చేశారు. మితిమీరిన వేగంతో బండిపై వెళ్తున్న వారిని ఎస్సై రమేష్ అపి, అధిక మొత్తంలో మద్యం సేవించినట్లు గుర్తించి సతీష్, రౌడీషీటర్ పప్పల నాయుడులపై కేసు నమోదు చేశారు. దీంతో కక్ష్య పెంచుకొన్న నిందితులు పోలీసు వాహనాన్ని వెంబడిస్తూ, రాళ్లతో దాడి చేస్తూ ఎస్సైపై హత్యా ప్రయత్నం చేయబోయారు. రాళ్ల దాడి నుంచి ఎస్సై రమేష్ తృటిలో తప్పించుకున్నారు. దీంతో నిందితులను విచారణ కోసం పోలీసులు స్టేషన్‌కు శుక్రవారం పిలిపించారు. సతీష్‌పై గతంలో కేసులున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా స్టేషన్ మేడ మీద నుంచి సతీష్ దూకాడు. దీంతో అతని కాలుకు గాయం కావడంతో విశాఖ కెజీహెచ్‌కు పోలీసులు తరలించారు. అర్ధరాత్రి సమయంలో నిందితుడు సతీష్‌ను మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పరామర్శించారు. మీడియా హైప్ కోసం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో కలసి మరోసారి కేజీహెచ్‌కు అయ్యన్న వెళ్లారు. పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, సోమవారంలోపు చర్యలు తీసుకోకుంటే నర్సీపట్నం పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేస్తామంటూ అయ్యన్న బెదిరింపులకు దిగారు. దీంతో తాగుబోతుల వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్న అయ్యన్న పాత్రుడుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చదవండి : పోలీసులపై అయ్యన్న పాత్రుడి చిందులు -
వెలగపూడి బ్యాచ్ ఓవర్ యాక్షన్
ఎప్పుడో హుద్ హుద్ బాధితులకు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణంలో.. లబ్ధిదారుల ఎంపికలో.. కాలనీ ప్రారంభోత్సవంలో ఐదేళ్లు సాచివేత ధోరణి అనుసరించిన తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి.. ఆయన అనుచరగణం పట్టాభిరామ్ తదితరులు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ప్రారంభోత్సవాన్ని కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఎంవీపీ కాలనీలో శుక్రవారం జరిగిన ఈ ప్రభుత్వ కార్యక్రమానికి ఎమ్మెల్యేగా వెలగపూడి ఫ్లెక్సీ పెట్టడం వరకు తప్పులేదు.. కానీ అక్కడి టీడీపీ బ్యాచ్ పార్టీ నాయకుడు పట్టాభిరామ్‌తోపాటు టీడీపీ ఫ్లెక్సీలు పెట్టి వివాదానికి తెర తీశారు. అభ్యంతరం చెప్పిన వైఎస్సార్సీపీ నేతల పట్ల దురుసుగా ప్రవర్తించారు. దుర్భాషలాడారు. పైగా ఎమ్మెల్యేను హౌసింగ్ బోర్డు అధికారులు ఆహ్వానిచినా.. పిలవలేదని తప్పుడు ఆరోపణలతో ప్రొటోకాల్ వివాదం రేపడానికి ప్రయత్నించారు. మంత్రి ముత్తంశెట్టి తదితరులు పాల్గొన్న ప్రారంభోత్సవాన్ని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ సందర్భంగా తోపులాట జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి టీడీపీ ఫ్లెక్సీలను తొలగించారు. సాక్షి, ఎంవీపీ కాలనీ(విశాఖ తూర్పు): ఎంతో ఆర్భాటంగా జరగాల్సిన హుద్‌హుద్ ఇళ్ల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గ్యాంగ్ రగడ చేసింది. గత ఐదేళ్లలో పట్టించుకోని వెలగపూడి.. ఇప్పుడు లబ్ధి పొందాలని హడావుడి చేశారు. హుద్‌హుద్ తుపాను బాధితులకు ఎంవీపీ కాలనీలో కట్టిన ఇళ్లను ప్రారంభించకుండా ఐదేళ్ల పాటు తాత్సారం చేశారు. ఈ కేటాయింపుల్లోనూ పక్షపాతంగా వ్యవహరించారనే ఆరోపణలు ఆది నుంచి ఉన్నాయి. అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు వీటిని త్వరితగతిన కేటాయించాలనే లక్ష్యంతో ముందుకు సాగింది. హౌసింగ్ బోర్డుపై ఒత్తిడి తెచ్చి ఎట్టకేలకు ఇళ్ల ప్రారంభోత్సవానికి మార్గం సుగమం చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఎంవీపీ కాలనీ సెక్టార్–7లో నిర్మించిన హుద్‌హుద్ ఇళ్లను ప్రారంభించేందుకు హాజరయ్యారు. అయితే ఎమ్మెల్యే వెలగపూడితో పాటు టీడీపీ నగర కార్యదర్శి పట్టాభిరామ్ తదితరులు వచ్చి దౌర్జన్యానికి దిగారు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలగపూడి త్రయం ఫ్లెక్సీల లొల్లి.. హుద్‌హుద్ ఇళ్లు ప్రారంభం సందర్భంగా మంత్రి అవంతితో పాటు స్థానిక వైఎస్సార్సీపీ నాయకుల ఫ్లెక్సీలు ఎంవీపీ కాలనీ సెక్టార్–7లో ప్రదర్శించారు. అక్కడికి వచ్చిన టీడీపీ నాయకులు ఎమ్మెల్యే వెలగపూడి ఫ్లెక్సీతో పాటు ఆ పార్టీ నగర కార్యదర్శి పట్టాభిరామ్ ఫొటోతో ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పట్టాభి ఫ్లెక్సీ ఎలా పెడతారని ప్రశ్నించారు. దీంతో అధికారులు పట్టాభిరామ్ ఫ్లెక్సీని తొలగించారు. అనంతరం మంత్రి ఇళ్లను ప్రారంభించేందుకు ప్రయత్నించగా మరోసారి పట్టాభిరామ్ వాగ్వాదానికి దిగారు. పక్కకు వెళ్లిపోవాలంటూ వైఎస్సార్సీపీ నాయకుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల భర్త వెంకటరావు కలుగజేసుకొని దురుసు ప్రవర్తన మానుకోవాలని పట్టాభికి సూచించినా ఆయన వినలేదు. వైఎస్సార్సీపీ శ్రేణులను మరింత రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ తోపులాట చోటుచేసుకుంది. గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను వారించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆహ్వానం అందలేదంటూ హల్చల్.. ఎమ్మెల్యే వెలగపూడికి ఆహ్వానం అందలేదంటూ టీడీపీ శ్రేణులు వెల్లడించడాన్ని వైఎస్సార్సీపీ నాయకులు తప్పుపట్టారు. గత ఐదేళ్లలో ఇళ్ల ప్రారంభోత్సవాన్ని పట్టించుకోని ఎమ్మెల్యే ఇప్పుడెందుకు హల్చల్ చేస్తున్నారని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు శ్రీనివాస్ వంశీకృష్ణ మండిపడ్డారు. టీడీపీ హయాంలో చేసిన దౌర్జన్యాలు, అరచకాలు తమ ప్రభుత్వంలో కొనసాగించాలని చూస్తూ తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. హుద్ హుద్ ఇళ్ల కేటాయింపుల్లో వెలగపూడి నిబంధనలకు పాతర వేశారని వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త విజయనిర్మల దుయ్యబట్టారు. ఆ అక్రమ కేటాయింపులను బయటకు తీస్తామని హెచ్చరించారు. అనంతరం మంత్రి అవంతి కార్యకర్తలు, అధికారుల సమక్షంలో హుద్‌హుద్ ఇళ్లును ప్రారంభించారు. ప్రొటోకాల్ పాటించాం.. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రొటోకాల్ పాటించాం. ముందుగానే హౌసింగ్ బోర్డు తరఫున ఎమ్మెల్యే వెలగపూడిని ఆహ్వానించాం. నేను స్వయంగా ఫోన్ చేసి కూడా ఆహ్వానించాను. ఆహ్వానించలేదని చెప్పడం అవాస్తవం. మంత్రి, ఎంపీల అనంతరం ఎమ్మెల్యే పేరు శిలాఫలకంపై వేయించాం. అయితే ఆయన సభాధ్యక్షుడిగా తన పేరు ముందుండాలని అన్నారు. అయితే అక్కడ ఎలాంటి సభ తాము నిర్వహించలేదు. ఎంవీపీలో మొత్తం 96 హుద్‌హుద్ ఇళ్లు నిర్మించాం. ఇందులో 75 కేటాయింపులు మాత్రమే ఇప్పటి వరకు జరిగాయి. మిగిలిన కేటాయింపులపై పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో నిలిపివేశాం. జిల్లా ఉన్నతాధికారుల సూచనల మేరకు మిగతా ఇళ్ల కేటాయింపులు చేపడతాం. – చిన్మయ్యాచారి, పీడీ, హౌసింగ్ బోర్డు -
అక్రమ అంతస్థులకు.. అంతిమ గీతం
సాక్షి, విశాఖపట్నం: నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం కృష్ణానది కరకట్టపై నిర్మించిన ప్రజావేదిక కూల్చివేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో జిల్లాలో ఉన్న అక్రమ భవనాల నిర్మాణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇన్నాళ్లూ పట్టణ ప్రణాళికా అధికారుల్ని ప్రసన్నం చేసుకుని అక్రమ నిర్మాణాలు చేసేవారు. కానీ ప్రభుత్వం ఈ తరహా నిర్మాణాల సంగతి తేలుస్తామని హెచ్చరించడంతో టౌన్ ప్లానింగ్ అధికారుల నోట్ల పచ్చి వెలక్కాయ పడ్డటైంది. గత ప్రభుత్వం జారీ చేసిన బీపీఎస్‌లో భవన నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం ఈ మధ్యనే వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్న తీరు చూస్తుంటే నిబంధనలను ఏమేర తుంగలో తొక్కుతున్నారో అర్థం చేసుకోవచ్చు. పట్టణాలు క్రమబద్ధంగా నిర్మితమైన ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత టౌన్ ప్లానింగ్ విభాగానిది. రహదారులు, కాలువలు తదతర నిర్మాణాలను పర్యవేక్షించాలి. క్షేత్రాస్థాయికి వస్తే ఈ నిబంధనలు అడ్డుపెట్టుకొని సిబ్బంది యథేచ్ఛగా ముడుపులు దండుకుంటున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను చూసీచూడనట్లు విడిచిపెట్టేశారు. దీంతో పలుకుబడి ఉన్న వ్యక్తులు రహదారులు, కాలువలు ఆక్రమించుకుని భవనాలు నిర్మించారు. మహా విశాఖ నగర పాలక సంస్థతో పాటు నర్సీపట్నం, యలమంచలి మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న విషయం ఎవరినడిగినా చెబుతారు. వీటిని నియంత్రించాల్సిన టౌన్‌ప్లానింగ్ విభాగం సిబ్బంది అందుకు విరుద్ధంగా అక్రమ కట్టడాల యజమానులతో అంతర్గతంగా కుమ్మకై భారీ ఎత్తున తాయిలాలు అందుకోవడం ద్వారా అక్రమ నిర్మాణాలకు పచ్చజెండా ఊపుతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అనుమతులు లేని నిర్మాణాలు కూడా పట్టణంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అనధికార లే అవుట్లు గతంలో పట్టణంలోని అనేక ప్రాంతాల్లో అనధికారిక లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. ముందుగా లేఅవుట్లు క్రమబద్ధీకరించిన తరువాత ప్లాన్‌కు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు పెద్ద మొత్తం అవుతుండడంతో ఎటువంటి ప్లాన్లు మున్సిపాలిటీకి సమర్పించకుండానే అన్ని చోట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇందుకు సూచనలు, సలహాలు సైతం టౌన్ ప్లానింగ్ విభాగం నుంచే అక్రమ నిర్మాణదారులకు అందుతుండడంతో మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున ఆదాయానికి గండి పడుతోంది. మరోవైపు ప్రభుత్వ స్థలాలు, పంట కాలువలు, రిజర్వ్ స్థలాలను సైతం దర్జాగా ఆక్రమించుకుని నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని అడ్డుకుని ప్రభుత్వ స్థలాలను సంరక్షించాల్సిన బాధ్యత ఈ విభాగానికి ఉన్నప్పటికీ మనదేమిపోయిందన్న రీతిలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. ఇబ్బడి ముబ్బడిగా.... ప్రతి వీధిలోనూ ఒకట్రెండు అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలియకుండా జరుగుతున్నాయంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఎందుకంటే చైన్మేన్లు ప్రతి వార్డును నిత్యం పర్యవేక్షించి ఎక్కడ అనుమతిలేకుండా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు, ఎక్కడ ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు సాగిస్తున్నారు. ఎక్కడ గెడ్డలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించారు.. ఇలాంటివన్నీ పరిశీలించి సంబంధిత జోన్‌కు చెందిన టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలియజేయాలి. వారు ఆ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి. కానీ తమకేమీ పట్టనట్లుగా, తామేమీ చూడనట్లుగా వ్యవహరిస్తూ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారు. పలు సందర్భాల్లో అక్రమార్కుల నుంచి లంచాలు తీసుకుంటూ జీవీఎంసీ బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, చైన్మెన్లు ఏసీబీ అధికారులకు పట్టుబడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. క్రమబద్ధీకరణకు వేలాది దరఖాస్తులు... ప్లాన్‌కు విరుద్ధంగా జరుగుతున్న అదనపు అంతస్తుల నిర్మాణాలు ఎంత ఎక్కువగా జరుగుతున్నాయో బీపీఎస్ కోసం వచ్చిన దరఖాస్తులే నిదర్శనం. ఒక సీసీపీ, ఇద్దరు సీపీలు, ఒక డీసీపీ, 8 మంది వర్కింగ్ సూపర్ వైజర్లు, 10 మంది టెంపరరీ బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, 32 మంది చైన్మేన్లు ఉన్న జీవీఎంసీలో వేలాది బీపీఎస్ దరఖాస్తులు వస్తున్నాయంటే.. వాటిని గుర్తించడంలో లోపమెవరిదన్న విషయం ప్రశ్నార్థకమే. 2007లో అక్రమ భవన నిర్మాణాల క్రమబద్ధీకరణ (బీపీఎస్)కు 23,101 దరఖాస్తులు వచ్చా యి. 2015లో 13,979 అక్రమ అదనపు అంతస్తు నిర్మాణదారుల నుంచి దరఖాస్తులొచ్చాయి. తాజాగా విడుదల చేసిన 2019 బీపీఎస్‌కు జూన్ 30 వరకూ గడువు ఉండగా...ఇప్పటివరకూ 4,233 దరఖాస్తులు వచ్చాయంటే అక్రమ నిర్మాణాలు ఏమేర జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలా జిల్లాలోని మిగిలిన మునిసిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తూర్పులో ‘పెట్రేగిన వెలగపూడి’ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి కనుసన్నల్లో గత పదేళ్లలో భూదందాలు పెట్రేగిపోయాయి. ఖాళీ జాగ కనిపిస్తే చాలు కబ్జా... అన్నీ అనుకూలిస్తే అక్రమ నిర్మాణం. ఈ తరహాల్లో గత పదేళ్లలో అక్రమ కట్టడాలకు, భూ కబ్జాలకు తూర్పును కేంద్రంగా వెలగపూడి భూ దందా సాగించారు. అక్కడితో ఆగకుండా ఆయా దందాల అవినీతి మరకలను జీవీఎంసీ, వుడా అధికారులకూ ఆయన అంటించారు. టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్, ఎక్సైజ్ విభాగాల్లోని కొందరి అధికారులను ఆయన దందాలకు కాపలాదారులుగా మార్చేశారు. ఇలా వెలగపూడికి దాసోహమై వ్యవస్థను భ్రష్టుపట్టించిన విభాగాల్లో జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఒకటి. జోన్–2 టౌన్ ప్లానింగ్ అధికారులైతో రెండు అడుగులు ముందుకేసి ఏకంగా వెలగపూడి అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణను భుజన వేసుకోవడం కొసమెరుపు. దీంతో నగరంలోని జరిగిన అక్రమ నిర్మాణాల్లో తూర్పు అగ్రభాగాన ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమ నిర్మాణ తొలగింపు ప్రకటన నేపథ్యంలో ప్రస్తుతం వెలగపూడి త్రయంలో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వందల సంఖ్యలో బినామీ భవనాలు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు బినామీల పేరిట వందకు పైగా భవనాలు నిర్మాణం జరిగినట్లు పలువురు వెల్లడిస్తున్నారు. వీటిలో అధికశాతం తూర్పు నియోజకవర్గంలో ఉండగా 2018 డిసెంబర్ నుంచి 2019 మార్చి మధ్యలో నిర్మాణ పనులు జరిగినవే అధికంగా ఉన్నట్లు అంచనా. ఆరిలోవ, ఎంవీపీ కాలనీ సెక్టార్–2, సెక్టార్–9, సెక్టార్–10, వాల్తేర్, లాసెన్స్ బే, అప్పుఘర్, వెంకోజిపాలెం, ఆదర్శనగర్ ప్రాంతాల్లో ఎక్కువగా వెలగపూడి తన బినామీలు, అనుచరులతో భవన నిర్మాణాలు చేయించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అనుచరులు, ఆయా ప్రాంతాల్లోని టీడీపీ వార్డు అధ్యక్షులు ప్రాంతాల వారిగా పంచుకొని మరీ అక్రమ కట్టడాలకు పూనుకున్నారు. ఆరిలోవ, ఎంవీపీకాలనీ టీడీపీ నాయకులు పట్టాభిరామ్, సత్తిబాబు, కాళ్ల శంకర్ కనుసన్నల్లో సెక్టార్–2, సెక్టార–6, (ఆదర్శనగర్) సెక్టార్–10 లలో పెద్ద ఎత్తున వెలగపూడి బినామీలు, అనుచరులు అడ్డగోలు నిర్మాణాలు చే«శారు. (అప్పుఘర్) సెక్టార్–9లో 7వ వార్డు టీడీపీ అధ్యక్షుడు పోలారావు, పేర్ల మషేన్ కనుసన్నల్లో పదుల సంఖ్యలో అడ్డగోలు నిర్మాణాలు జరిగాయి. దీంతో పాటు 17వ వార్డు పరిధిలోని పెదవాల్తేర్, చినవాల్తేర్ టీడీపీ నాయకుడు పొతన్న రెడ్డి, మూర్తి, అమరేంద్రల పర్యవేక్షణలో అడ్డగోలు నిర్మాణ దందాలు జరిగినట్లు సమాచారం. విశాలాక్షినగర్, లాసెన్స్‌బే ప్రాంతాల్లో సైతం వెలగపూడి బీనామీలు పెద్ద ఎత్తున అడ్డగోలు నిర్మాలు చేసినట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న అనుచరుల ద్వారా ల్యాండ్ కబ్జాలు, అక్రమ కట్టడాలు చేసినట్లు సమాచారం. సీఆర్‌జడ్ నిబంధనలు పట్టవిక్కడ...! చారిత్రాత్మక నేపథ్యం కలిగిన భీమిలిలో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించి భవనాలు నిర్మించుకున్న సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో టీడీపీ నాయకుల అండదండలంతో నిర్మించుకున్నవే ఎక్కువ. 2014లో భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి అయిన గంటా శ్రీనివాసరావు సీఆర్‌జడ్ నిబంధనలు ఉల్లంఘించి 159 ఏళ్ల చరిత్ర కలిగిన భీమిలి మున్సిపాల్టీ కార్యాలయాన్ని ఆనుకుని సుమారు అర ఎకరం స్థలంలో క్యాంప్ కార్యాలయాన్ని నిర్మించుకున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించి అనుమతుల గురించి టౌన్ ప్లానింగ్, జీవీఎంసీ అధికారులను అడిగితే నవ్వేసి ఊరుకుంటారు. వీటితో పాటు బీచ్‌రోడ్‌లోని నిడిగట్టు, చేపలుప్పాడ, కె.నగరపాలెం పంచాయతీలలో అయితే తీరాన్ని ఆనుకుని లెక్కలేనన్ని హేచరీలు, హోటళ్లు సీఆర్‌జడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు. భీమిలి జోన్ 1 పరిధిలోకి వస్తుంది.. చారిత్రాత్మక కట్టడాలు, నదీ ముఖద్వారాలు ఉన్న ప్రాంతాలను సీఆర్‌జడ్ నిబంధనల ప్రకారం జోన్ 1గా పరిగణిస్తారు. ఈ కోవలోనే భీమిలి ప్రాంతాన్ని కూడా జోన్ 1లోకే వస్తుంది. ఇలాంటి ప్రాంతాలలో తీరం నుంచి 200 మీటర్ల వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకూడదని డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ విభాగం నిర్థారించింది. ఒకవేళ ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలన్నా షోర్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(సాడా)తో పాటు కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. మున్సిపాల్టీ, జీవీఎంసీలకు అనుమతులు ఇచ్చే అధికారం లేదు. దీని ఆధారంగా భీమిలి పట్టణంలో గంటా శ్రీనివాసరావు క్యాంప్ కార్యాలయం నుంచి నిడిగట్టు పంచాయతీలో నేరెళ్లవలస, కె.నగరపాలెంలో మంగమారిపేట, తిమ్మాపురం ప్రాంతాలలో లెక్కలేనన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి. ఇందులో పలువురు పోలీసు,రెవెన్యూ అధికారులు ఉన్నారు. మరీ ఇంత దారుణమా? జీవీఎంసీ జోన్ 2 పరిధిలో 12వ వార్డులో అక్రమ నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి. శంకరమఠం రోడ్డులో రామలింగేశ్వరాలయం వెనుక ఉన్న ఐదు అడుగుల రోడ్డులో అనుమతి లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి. ద్విచక్రవాహనం కూడా వెళ్లే వీలులేని ఐదు అడుగుల రహదారిలో జీప్లస్3, జీప్లస్4 తరహాలో బహుళ అంతస్తులు నిర్మిస్తున్నా అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఐదు అడుగుల రోడ్డులో గ్రౌండ్, మొదటి అంతస్తుకు మాత్రమే అనుమతులు లభిస్తాయి. ఇక్కడ మాత్రం గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మూడు, నాలుగు అంతస్తులు నిర్మించారు. ఇదే రోడ్డులో మరో వ్యక్తి జీప్లస్4 తరహాలో అనుమతి లేకుండా బహుళ అంతస్తు నిర్మించారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఫైరింజన్ కానీ, అంబులెన్స్ గానీ వెళ్లే మార్గమే లేదు. ఇటువంటి ఇరుకు సందుల్లో బహుళ అంతస్తులు నిర్మిస్తున్నా చర్యలు ఎందుకు చేపట్టడం లేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టౌన్‌ప్లానింగ్ అధికారులను మేనేజ్ చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్టు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. లలితానగర్‌లో అక్రమ నిర్మాణం రామకృష్ణానగర్ సాయిబాబా ఆలయం ఎదురుగా ఉన్న లలితానగర్ రోడ్డులో మారుతి క్లినిక్ పక్కన ఓ వ్యక్తి పాత బిల్డింగ్‌పై అనుమతి లేకుండా అదనపు అంతస్తు నిర్మిస్తున్నారు. గ్రౌండ్ మొదటి అంతస్తు ఉన్న పాత బిల్డింగ్‌పై రెండో అంతస్తు నిర్మాణానికి మాత్రమే అనుమతి తీసుకుని..అదనంగా మరో అంతస్తును నిర్మిస్తున్నారు. అలాగే అనుమతి లేకుండా లిఫ్ట్ నిర్మాణం చేపడుతున్నట్టు స్థానికులు నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. గాజువాకలో అడ్డూ అదుపూ లేకుండా... గాజువాక ప్రాంతంలో అనధికార నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. వాటిని అరికట్టేందుకు జీవీఎంసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా నిర్మాణదారులు తమకున్న పలుకుబడిని ఉపయోగించుకొని సిఫార్సులు చేసుకోవడంద్వారా తమ జోలికి రాకుండా చేసుకోగలుగుతున్నారు. కింది అంతస్తులకు అనుమతులు తీసుకొని అదనపు అంతస్తులను నిర్మిస్తున్న పరిస్థితులు అధికంగా చోటుచేసుకొంటున్నాయి. గాజువాక పట్ణణ ప్రాంతంలో ఏకంగా కమర్షియల్ భవనాలను సైతం నిర్మిస్తుండటం గమనార్హం. మొన్నటివరకు అధికారంలో ఉన్న టీడీపీ హయాంలో ఇలాంటి నిర్మాణాలకు అడ్డూ, అయిపూ లేకుండా పోయింది. ► పెదగంట్యాడలోని శీరవానిపాలెం మసీదు పక్కన గెడ్డను ఆనుకొని ఉన్న వెయ్యి గజాల స్టీల్‌ప్లాంట్ స్థలాన్ని కొద్దికొద్దిగా ఆక్రమించి నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. దీనిపై స్టీల్‌ప్లాంట్ భూసేకరణ అధికారులనుంచి ఒత్తిడి లేకపోవడం, అక్కడ ఓ మాజీ కార్పొరేటర్ సిఫార్సులు చేస్తుండటంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు చర్యలు చేపట్టలేకపోతున్నారు. ► గాజువాక సర్వే నంబర్ 87లోని కొత్తగాజువాక జంక్షన్లో మెయిన్ రోడ్డుకు, హైస్కూల్ రోడ్డుకు కార్నర్లో ఉన్న వెయ్యి గజాల స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కుటుంబం ఆక్రమించింది. 20 ఏళ్ల క్రితంనుంచి వివాదం కొనసాగుతున్న ఈ స్థలాన్ని పల్లా కుటుంబం అధికారం చేతిలోకి రాగానే ఆక్రమించి తాత్కాలిక దుకాణాలను నిర్మించింది. వివాదం తలెత్తినప్పట్నుంచీ ఈ స్థలాన్ని కాపాడుతూ వచ్చిన రెవెన్యూ అధికారులు పల్లా ఒత్తిడితో పట్టించుకోవడం మానేశారు. రూ.20 కోట్ల విలువైన ఈ స్థలానికి అధికారులు పట్టాలను కూడా జారీ చేసేశారు. ► గాజువాక కణితి రోడ్డులో ఓ వ్యక్తి ఏకంగా ఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా కింది అంతస్తుల నిర్మాణాన్ని పూర్తి చేసిన సదరు వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా ఏకంగా నాలుగో అంతస్తు నిర్మాణాన్ని కూడా పూర్తి చేశాడు. దీనిపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ వివిధ రకాల ఒత్తిళ్ల కారణంగా అధికారులు అటువైపు చూడటం మానేశారు. పంతులుగారి మేడవద్ద విద్యుత్ తీగల కింద ఒక వ్యక్తి భారీ భవన నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాడు. రాజకీయ ఒత్తిళ్లవల్ల అధికారులు చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అక్కడక్కడా అనధికార అంతస్తులను తొలగిస్తున్నప్పటికీ తరువాత కాలంలో పూర్తయిపోతున్నాయి. ► ప్రభుత్వ నిర్మాణం ముసుగులో టీడీపీ కార్యకర్త ప్రాథమిక పాఠశాల స్థలాన్ని కబ్జా చేశాడు. అంగన్వాడీ భవనం పేరుతో ఏకంగా ఇంటి నిర్మాణాన్ని చేపట్టాడు. శంకుస్థాపన చేసిన స్థలంలో అంగన్వాడీ కేంద్రానికి భవనాన్ని నిర్మిస్తున్నట్టు అందరిన్నీ నమ్మించి స్థలం కబ్జాకు ప్రయత్నం చేశాడు. స్థానికులు అడ్డుకోవడంతో ఆ ప్రయత్నం ఆగింది. మిగిలిన నిర్మాణాన్ని అధికారులు పూర్తి చేసి అంగన్వాడీ కేంద్రానికి అప్పగించాలని వారు కోరుతున్నారు. సర్కారు నిర్ణయంతో ఉలికిపాటు గత ప్రభుత్వం కృష్ణానది కరకట్టపై అనుమతులు లేకుండా నిర్మించిన ప్రజా వేదికను కూల్చేయ్యాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అంతేకాకుండా రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలకూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ముడుపులకు అలవాటు పడిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఉలిక్కిపడుతున్నారు. ఆయా పట్టణాలు, నగరాల్లో ప్రస్తుతం అక్రమంగా నిర్మాణాలు సాగిస్తున్న బిల్డర్లు, యజమానుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే చాలామంది తమ తమ నిర్మాణాల్ని అర్థాతరంగా నిలిపేశారు. మరోవైపు బీపీఎస్‌కు ఈనెల 30 వరకూ గడువు ఉండడంతో చకచకా నిర్మాణాలు సాగించి దరఖాస్తు చేసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. నిబంధనలు మీరితే సహించం అక్రమ నిర్మాణాలు, ప్లాన్‌కు విరుద్ధంగా జరుగుతున్న అదనపు అంతస్తుల నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశించింది. జీవీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరిగితే సహించే ప్రసక్తే లేదు. ఎక్కడ నిబంధనలు అతిక్రమించినా వెంటనే నివేదిక ఇవ్వాలని జోనల్ సిబ్బందిని ఆదేశించాం. ప్రతి వార్డులోనూ నిశిత పరిశీలన చేసి చర్యలు తీసుకుంటాం. – ఆర్జే విద్యుల్లత, జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ -
ఓర్నీ యాసాలో.. మళ్లీ మొదలెట్టేశార్రో..!
చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా.. ఎన్నో అనుమానాలు, సందేహాల మధ్య.. జీవీఎంసీలో కొందరు అధికారుల ‘పచ్చ’పాత కుట్రలతో ఎన్నికల్లో గట్టెక్కామనిపించుకున్న టీడీపీ నగర ఎమ్మెల్యేలు తమ పాత శైలినే అందిపుచ్చుకుంటున్నారు. తమ ట్రేడ్‌మార్క్ వెర్రివేషాలు, విన్యాసాలు మళ్లీ మొదలెట్టేశారు. అందులోనూ వెలగపూడి, వాసుపల్లిల ఓవర్ యాక్షన్ ఏపాటిదో నగర ప్రజలకు తెలియంది కాదు. ఒళ్లు తెలియకుండా నోటికొచ్చినట్టు బండబూతులు మాట్లాడే వెలగపూడి..చీప్ ట్రిక్కులు, చిల్లర వేషాలతో వాసుపల్లి చేసే విన్యాసాలు నగర ప్రజలకు కొత్తకాదు. అధికార మదంతో ఇప్పటివరకు విర్రవీగిన వీరిద్దరినీ ప్రజలు ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టారు. ఇక నుంచైనా ప్రజాసమస్యలపై దృష్టిసారిస్తారని, ప్రజలతో మమేకమవుతారని అందరూ ఆశించారు. కానీ తమ నైజం మారలేదని వారిద్దరు శనివారం నిరూపించారు. ఎన్నికల తర్వాత ఇంతవరకు ప్రజాక్షేత్రంలోకి రాని.. వారి సమస్యలు పట్టని వీరు.. తమ అధినేతను ఎక్కడో ఎయిర్‌పోర్టులో తనిఖీ చేసి అవమానించారంటూ గగ్గోలు పెడుతూ.. వీరావేశంతో చొక్కాలిప్పి గంతులేశారు. సాక్షి, విశాఖపట్నం : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని శుక్రవారం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. అయితే అదేదో మహాఅపరాధంలా టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నాయి. దీనిపై విమానాశ్రయాల భద్రత పర్యవేక్షించే సీఐఎస్ఎఫ్(సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్)తోపాటు డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు వెంటనే వివరణ కూడా ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రతిపక్ష నేతలకు తనిఖీల నుంచి మినహాయింపు ఉండని స్పష్టం చేశారు. పౌర విమానయాన శాఖ గైడ్‌లైన్స్ ప్రకారం విమానాశ్రయాల్లో చెక్ ఇన్ వద్ద తనిఖీల నుంచి మినహాయింపు ఇచ్చే ప్రముఖుల జాబితా కూడా బయటకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాల్లో ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. అయినా సరే టీడీపీ నేతలు సోషల్ మీడియాలో చంద్రబాబుకు అన్యాయం, అవమానం జరిగిందంటూ ఊదరగొడుతూ వచ్చాయి. ఇక విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి, వాసుపల్లిలైతే శనివారం ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఎయిర్పోర్ట్ నిబంధనలు తెలియని పార్టీ శ్రేణులకు సర్దిచెప్పాల్సిన ఎమ్మెల్యేలే చొక్కాలిప్పేసి, గొంతుచించుకుని గగ్గోలు పెట్టారు.జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడం చూసి టీడీపీ ఎమ్మెల్యేలు మళ్లీ చీప్ ట్రిక్స్ మొదలెట్టేశారన్న వ్యాఖ్యలు వినిపించాయి. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబును నిబంధనల మేరకు తనిఖీ చేసి అవమానించారని గొంతు చించుకుంటున్న టీడీపీ నేతలు.. నిన్న మొన్నటి వరకు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్జగన్మోహన్రెడ్డి ఈ నిబంధనలను గౌరవించి.. విమానాశ్రయాల్లో తనను తనిఖీ చేసేందుకు సహకరించిన విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటూ.. టీడీపీ ఎమ్మెల్యేల వెకిలి వేషాలను ఏవగించుకుంటున్నారు. -
వెలగపూడి.. అదే వంకరబుద్ధి!
అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వెళ్లినా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తీరు మారలేదు. తన సహజ పద్ధతిలో మళ్లీ అడ్డగోలు దందాలకు తెరలేపారు. తన బినామీకి చెందిన భవనంపై అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా మరో అంతస్తు నిర్మిస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిన జోన్–2, టౌన్ ప్లానింగ్ అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నట్లు తెలిసింది. ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): టీడీపీ అధికారంలో ఉండగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకష్ణబాబు అనేక విలువైన స్థలాలు అక్రమించడంతో పాటు పదుల సంఖ్యలో అక్రమ కట్టడాలు నిర్మించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన ప్రస్తుతం మరోసారి అక్రమాలకు తెర తీసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంవీపీకాలనీలోని వెంకోజిపాలెం బస్టాప్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ నిర్మాణమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. దాదాపు 5 ఏళ్ల క్రితం జీ ప్లస్ 3గా ఇక్కడ ఒక భవన నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనం కింది భాగంలో సెల్లార్ ఉండగా మొదటి ఫ్లోర్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్నారు. ప్రధాన జంక్షన్లో ఈ భవనం ఉండటంతో నిబంధనలకు విరుద్ధంగా మరో ప్లోర్ నిర్మించి సొమ్ముచేసుకోవాలని వెలగపూడి బినామీగా వ్యవహరించే చౌదరి అనే వ్యక్తి ప్రయత్నిస్తున్నట్లు అక్కడి వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆయన తూర్పు నియోజకవర్గంతో పాటు నగర వ్యాప్తంగా పలు అక్రమ నిర్మాణాలకు పాల్పడినట్లు సమాచారం. పేద వారు చిన్న షెడ్డు వేసుకుంటే ఆగమేఘాలపై స్పందించే అధికారులు ప్రస్తుతం ఎందుకు స్పందించడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిసెంబర్‌కు ముందు చూపించుకోడానికే.. డిసెంబర్ 2018 తరువాత ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరిగినా వాటిని తక్షణమే రద్దు చేయాలంటూ ఇటీవల ప్రభుత్వ జీవో విడుదల చేసింది. దీంతో డిసెంబర్ తరువాత సాగిన నిర్మాణాలు క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు లేకుండా పోయింది. ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన సమాచారం మేరకు ప్రభుత్వం డిసెంబర్ తరువాత నిర్మాణాలను రద్దు చేసినట్లు తెలిసింది. ఈ నేపధ్యంలో అంతకుముందే ఇక్కడ నిర్మాణం జరిగినట్లు చూపించి లబ్ధిపొందాలని ఎమ్మెల్యే బినామీ చూస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే రెండు రోజుల నుంచి 50 మందికి పైగా కూలీలతో ఆగమేఘాలపై ఈ పనులు చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో పనులు పూర్తిచేసి డిసెంబర్‌కు ముందే ఈ పనులు పూర్తయినట్లు రికార్డుల్లో నమోదు చేయించాలన్నది వారి ఆలోచన. దీంతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వెలగపూడి అనుచరులు ఇదే పంథా అనుసరిస్తున్నట్లు తెలిసింది. ఈ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిన జోన్–2 ఉన్నతాధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు పరోక్షంగా ఎమ్మెల్యేకు సహకరిస్తున్నట్లు పెద్దఎత్తున విమర్శలు వినిపిస్తున్నారు. దీనిపై జీవీఎంసీ జోన్–2 కమిషనర్ ఎస్.శ్రీనివాసరావు వివరణ కోరేందుకు ఫోన్లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
‘వెలగపూడి భూ ఆక్రమణలపై విచారణ జరిపించాలి’
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ భూ ఆక్రమణలపై విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో విశాఖలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒలంపిక్స్‌లో అబద్ధాల పోటీ పెడితే.. మాజీ సీఎం చంద్రబాబుకే అన్ని పతకాలు దక్కుతాయన్నారు. జీవీఎంసీ, వుడా కేంద్రంగా టీడీపీ నేతలు జరిపిన అక్రమాల్లో త్వరలోనే అసలు సూత్రధారులను బయటకు తీయడం జరుగుతుందన్నారు. పార్టీలకతీతంగా గ్రామ వాలంటీర్ల నియామకారలు జరుగుతాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధింస్తుందని సుధాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు -
‘ఎక్సయిజ్’లో వెలగపూడి హవా!
సాక్షి, విశాఖపట్నం: మద్యం వ్యాపారంలో ఆక్టోపస్‌లా అల్లుకుపోయిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఎక్సయిజ్ శాఖలో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. దాదాపు దశాబ్దకాలంగా ఆయన ఇటు ఎక్సయిజ్ అధికారులను, అటు సిండికేట్లను తన గుప్పెట్లో పెట్టుకుని చక్రం తిప్పుతున్నారు. లిక్కర్ సామ్రాజ్యంలో తాను ఆడిందే ఆట, పాడిందే పాటలా వ్యహరిస్తున్నారు. మద్యం షాపులకు టెండర్లు పిలిచినప్పుడు కూడా బెదిరింపులకు పాల్పడుతూ ఇతరులెవ్వరూ తన ఇలాకాలోకి అడుగుపెట్టనీయరు. తన అనుచరగణం ద్వారానే లిక్కర్ షాపులకు టెండర్లు వేయించి వాటిని వ్యూహాత్మకంగా దక్కించుకుంటారని మద్యం వ్యాపారులు చెబుతుంటారు. ఏళ్ల తరబడి ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా ఇదే అక్కడ ఆనవాయితీగా వస్తోంది. తూర్పు నియోజకవర్గం పరిధిలోని ఎంవీపీ కాలనీ, హనుమంతవాక తదితర ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపులు ఈయన బినామీలవేనని చెబుతారు. అంతేకాదు.. తూర్పు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఎక్సైజ్ స్టేషన్లలోనూ తన చెప్పు చేతల్లో పనిచేసే ఎక్సయిజ్ అధికారులకు ఏరికోరి పోస్టింగులు వేయించుకుంటారు. వీరు వెలగపూడి అండ్ కో మద్యం దుకాణాల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలు, అధిక ధరలకు విక్రయాలు జరిపినా వారు పట్టించుకోరు. పైగా ఉన్నతస్థానంలో ఉన్న ఒకరిద్దరు ఎక్సయిజ్ అధికారులతోను సత్సంబంధాలు కలిగి ఉండడంతో వీరి జోలికి టాస్క్‌ఫోర్స్/ఎన్ఫోర్స్మెంట్/ స్క్వాడ్ అధికారులు వెలగపూడి వారి మద్యం షాపుల వైపు తొంగిచూడరు. ఇదో ఉదాహరణ.. గతంలో తన సిండికేట్‌లోని తన అనుచరుడికి చెందిన రూ.50 లక్షల విలువ చేసే మద్యాన్ని అనకాపల్లి ఎక్సయిజ్ స్టేషన్ పరిధిలో పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి కమిషనర్‌కు పంపే సమయంలో వెంటనే వెలగపూడి రంగప్రవేశం చేశారు. అప్పటి జిల్లా స్థాయి అధికారి (అసిస్టెంట్ కమిషనర్)పై ఒత్తిడి తెచ్చారు. కేసును నీరుగార్చి కేవలం రూ.5 వేల జరిమానాతో సరిపెట్టేశారు. ఇంతలా ఎక్సయిజ్‌లో పట్టు సంపాదించిన వెలగపూడి అంటే జిల్లాలో పనిచేసే ఆ శాఖ అధికారులు ఆయన షాపుల జోలికి వెళ్లరు. అందుకే జిల్లాలోనూ, ఎక్కడో సుదూరంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపులపై వీరు దాడులు చేస్తుంటారు తప్ప వెలగపూడి సామ్రాజ్యంలోని దుకాణాలపై కేసులు నమోదు చేయరు. అంతేకాదు.. ఎక్సయిజ్‌లో ఇతర జిల్లాల నుంచి విశాఖకు బదిలీ కావాలన్నా, ఏదైనా ఇబ్బందుల్లో పడ్డ వారిని గట్టెక్కించాలన్నా ఇన్నాళ్లూ వెలగపూడినే ఆశ్రయించే వారు. ఇన్నాళ్లూ ఆ శాఖలో తనకున్న పట్టు, పలుకుబడితో వారికి అనుకూలంగా చేస్తూ వచ్చారు. తెలుగుదేశం అధికారం కోల్పోవడంతో ఇక వెలగపూడి హవాకు చెక్ పడుతుందని సాటి మద్యం వ్యాపారులతో పాటు ఎక్సయిజ్ అధికారులూ ఇప్పుడు చర్చించుకుంటున్నారు. -
‘వెలగపూడి వీధి రౌడీలా ప్రవర్తించారు’
సాక్షి, విశాఖపట్నం : తాను ఎమ్మెల్యే కావడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీర్వాదం, ప్రజల దీవెనలే కారణమని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ జిల్లాను టీడీపీ పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. అనకాపల్లి ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రౌడీల ప్రవర్తించారని ఆరోపించారు. అనుమతి లేకుండా ర్యాలీ చేయడమే కాకుండా అసభ్యకరంగా ఆయన మాట్లాడిన తీరు దారుణమని మండిపడ్డారు. దీనికి తగు చర్యలు తప్పక ఉంటాయని అన్నారు. వెలగపూడికి దమ్ముంటే జీవీఎంసీ ఎన్నికల్లో తన చేతలు చూపించాలని అన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడిస్తామని అన్నారు. అనకాపల్లి నియోజకవర్గ ప్రజలను టీడీపీ మోసం చేసిందని తెలిపారు. ప్యాకేజీ లీడర్లకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి అవుతున్న వ్యక్తిపై పరుష పదజాలం వాడటం అతని సంస్కారానికి నిదర్శనమన్నారు. వెలగపూడికి రాజకీయంగా సమాధానం ఇస్తామని పేర్కొన్నారు. విశాఖ భూముల కుంభకోణం సంగతి తెలుస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరాటం చేస్తుందని.. కేంద్రంలోని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. కాగా, ఎన్నికల కోడ్ ఉల్లంఘించి విజయోత్సవ ర్యాలీ నిర్వహించినందుకు వెలగపూడి రామకృష్ణబాబుపై ఎంవీపీ జోన్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. -
లిక్కర్ సామ్రాజ్యంలో వసూల్‌రాజా
సాక్షి, విశాఖపట్నం : ‘మళ్లీ టీడీపీ ప్రభుత్వమే వస్తుంది.. మద్యం లైసెన్సుల గడువు పెంచే బాధ్యత నాదే. ఎన్నికల ఖర్చు మీదే’.. అంటూ విశాఖ తూర్పు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన వెలగపూడి రామకృష్ణబాబు జిల్లాలోని మద్యం వ్యాపారులను వేధించిన తీరు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. గత నెలలో జరిగిన ఎన్నికల్లో మద్యం వ్యాపారుల నుంచి ఆయన భారీఎత్తున వసూళ్లకు పాల్పడడంపై ఇప్పుడు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణంతోనే ఆయన ఎన్నికల్లో గట్టెక్కినట్లు సమాచారం. వాస్తవానికి వెలగపూడి ఆది నుంచి వివాదాస్పదుడే. విజయవాడలో వంగవీటి రంగా హత్య కేసులో ముద్దాయిగా ఉన్న ఆయన అక్కడ నుంచి తప్పించుకుని విశాఖ వచ్చారు. ఇక్కడ రహస్యంగా కొన్నాళ్లు గడిపాక తొలుత మద్యం వ్యాపారంలో పాతుకుపోయారు. ఆ తర్వాత 2009లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో మరోసారి అదే నియోజకవర్గం నుంచి గెలిచారు. అధికార బలంతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. విశాఖలో తమ సిండికేట్ల మద్యం షాపులపై దాడులు జరగకుండా చూసుకుంటూ వచ్చారు. ఇలా విశాఖ మద్యం సిండికేట్లలో వెలగపూడి చక్రం తిప్పుతున్నారు. అయితే, ఈసారి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రజల్లో సానుకూలత అధికంగా ఉండడంతో తన గెలుపు కష్టమని తేలడంతో ముందుగానే వ్యూహం రచించారు. విశాఖలో తనకు అండగా నిలిచే మద్యం సిండికేట్లకు తన గెలుపు బాధ్యతను అప్పగించారు. ఈ ఎన్నికల్లో వెలగపూడి ఓట్ల కొనుగోలు, ఇతర ఖర్చులకు రూ.2 కోట్లు సిండికేట్లు సమకూర్చినట్టు తెలిసింది. ఈ సొమ్మును దశల వారీగా జిల్లాలోని మద్యం దుకాణాలు, బార్ల నుంచి వసూలుచేయాలని హుకుం జారీచేశారు. అందులో భాగంగా ఒక్కో షాపు/బార్ రూ.50 వేలు టార్గెట్ విధించారు. తొలివిడతగా రూ.16వేలు చెల్లించాలన్నారు. విశాఖ జిల్లాలో 402 మద్యం షాపులు, 131 బార్లు ఉన్నాయి. వీటిలో కొంతమంది వ్యాపారులు నిరాకరించినప్పటికీ 75 శాతం మంది ఆ సొమ్ము చెల్లించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఎన్నికలకు ముందుగానే ఎమ్మెల్యే వెలగపూడి స్కెచ్ వేశారు. మద్యం వ్యాపారులను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి వీలుగా ఒక్కో లిక్కర్ బాటిల్‌కు ఎమ్మార్పీ ధరకంటే రూ.5 అదనంగా అమ్ముకోవడానికి ఉన్నతాధికారుల నుంచి అనధికార అనుమతులు తెచ్చారు. ఎక్సైజ్ ఉన్నతాధికారి అండ.. ఎక్సైజ్ శాఖలోని ఓ ఉన్నతాధికారితో తనకున్న పలుకుబడితో కిందిస్థాయి అధికారులను వెలగపూడి బెదిరిస్తూ ఉంటారు. ఈ ఉన్నతాధికారి అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు సమీప బంధువు. ఆయనతో సాన్నిహిత్యం పెంచుకుని విశాఖ నగరంలో వెలగపూడి అండ్ కో సిండికేట్ నడుపుతున్న మద్యం షాపులపై దాడులు జరగకుండా చూశారు. ఈ ఎన్నికల్లో మద్యం దుకాణాలపై దాడులకు రాజధాని కేంద్రంగా ఉన్న స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలు నగరంలో షాపుల వైపు చూడకుండా కట్టడి చేయగలిగారు. -
జనం తరిమి కొడతారు జాగ్రత్త
విశాఖ ఉత్తర: ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న తమ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విజయవాడలో వంగవీటి రంగా హత్య కేసులో ముద్దాయివన్న సంగతి వెలగపూడి మరిచిపోవద్దని సూచించారు. భూకబ్జాలు, తోపుడు బళ్లు నడుపుతున్న వారి వద్ద కలెక్షన్లు చేసిన ఘనుడవని ధ్వజమెత్తారు. వెలగపూడి లాంటి రౌడీషీటర్లకు చంద్రబాబు టిక్కెట్లు ఇచ్చి రాజకీయాలను భ్రష్టుపట్టించారని ఆరోపించరాఉ. దేవినేని ఉమా, బుద్ధా వెంకన్న, బుచ్చయ్య చైదరి, చింతమనేని ప్రభాకర్ లాంటి వ్యక్తిత్వంలేని వారు ఉండడం వల్ల టీడీపీ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైందన్నారు. ఒక పార్టీలో పోటీ చేసి, వేరే పార్టీతో లాలూచీ పడి దొడ్డి దారిన గెలిచిన దొంగవు నీవు అంటూ ప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత విశాఖ నగరానికి కోడి పందేలు, డ్రగ్స్, జూదంతో అపఖ్యాతి మూటగట్టావని ఆరోపించారు. వందల కోట్ల రూపాయలు సంపాదించిన అహంకారంతో వెలగపూడి మాట్లాడుతున్నాడని.. విశాఖలో పుట్టి సంస్కారం ఉన్న వాళ్లం కాబట్టి గౌరవంగా ఉన్నామని చెప్పారు. రాబోయే రోజులో టీడీపీ దుకాణం బంద్ చేయడం ఖాయమన్నారు. దేశ చరిత్రలో ఓ యువనేతకు ప్రజలు పట్టాభిషేకం చేయడం పట్ల ఓర్వలేక జగన్‌పై మాట్లాడడం బాధాకరమన్నారు. వెలగపూడి లాంటి చీడపురుగులు వల్ల టీడీపీ పతనం ఖాయమని కొయ్య ప్రసాద్‌రెడ్డి అన్నారు. ఇప్పటికైనా దిగుజారుడు మాటలు మాని విశాఖ ప్రతిష్టని మంటగలపు వద్దని హితవు పలికారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. -
వెలగపూడికి ఎదురుగాలి!
విశాఖపట్నం... ప్రకృతి గీసిన అందమైన నగరం. అయితే కొన్నేళ్లుగా విశాఖలో నేరసంస్కృతి విజృంభిస్తోంది.. గొడవలు, ఘర్షణలు నిత్యకృత్యమైపోయాయి. పాతికేళ్ల క్రితమే ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఈ సంస్కృతికి బీజం వేశారు. ఎమ్మెల్యేగా అభివృద్ధి పనులు చేయకపోగా అవినీతి, అక్రమాలను ప్రోత్సహించారు. దీంతో ఆయనకు ప్రస్తుతం ఎదురుగాలి వీస్తోంది. మరోవైపు వైఎస్సార్సీపీ అభ్యర్థి అక్కరమాని విజయనిర్మల నిత్యం ప్రజలమధ్య ఉంటూ వారికి అండగా నిలుస్తున్నారు. ఇదీ వెలగపూడి చరిత్ర విజయవాడలోని ఏలూరు రోడ్డులో మూడు దశాబ్దాల క్రితం రాగమాలిక ఆడియో షాపులో క్యాసెట్లు అద్దెకిచ్చే పని వెలగపూడిది. రాత్రిపూట అదే షాపును అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా చేసుకున్నారు. దేవినేని నెహ్రూ అనుచరగణంలో ఉంటూ 1986 డిసెంబర్ 26న ఎమ్మెల్యే వంగవీటి మోహన్‌రంగా హత్య కేసులో నిందితుడయ్యారు. రంగా హత్య దరిమిలా కోస్తా జిల్లాల్లో చెలరేగిన ‘వర్గ’ కక్షల నేపథ్యంలో పారిపోయి విశాఖకు వలసొచ్చారు. తొలుత ఎంవీపీ కాలనీ సెక్టార్–6లోని బిల్డింగ్‌లో టెలెక్స్ పేపర్లు తయారుచేసే ఓ వ్యాపారి వద్ద తలదాచుకుని, అనంతరం కిరణ్ యాడ్స్‌లో చిన్న గుమాస్తాగా చేశారు. షిర్డీ సాయి స్కీం ఫైనాన్స్ కంపెనీ పెట్టి జనాలను నిలువునా ముంచారు. ఈ క్రమంలోనే మద్యం సిండికేట్ వైపు దృష్టిసారించి..జనప్రియ సిండికేట్ వ్యాపారులను టెండర్లు వేయొద్దని బెదిరించారు. దీంతో అప్పట్లో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ తెరవాలని చూడగా అప్పటి పోలీసు ఉన్నతాధికారిని బతిమాలుకోవడంతో రౌడీషీట్ తెరవలేదని చెపుతారు. రౌడీ రాజకీయం తెలియని విశాఖ నగరానికి రౌడీలు, గూండాల్ని అతిథులుగా తీసుకొచ్చి కబడ్డీ పోటీలు, కోడిపందేలు నిర్వహించేవారు. ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని ఆక్రమణలు 2009లో విశాఖ తూర్పు నుంచి అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు సీనియర్ నేతలెవరూ ముందుకు రాకపోవడంతో వెలగపూడికి ఆ అవకాశం వచ్చింది. పీఆర్పీతో ముక్కోణపు పోటీ వల్ల అతి తక్కువ ఓట్లతో బయటపడ్డారు. అక్కడినుంచి అతని అరాచకాలకు అడ్డూ..అదుపు లేకుండా పోయింది. టీడీపీలోనే ఉంటూ అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఉడా భూములు కాజేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సెక్టార్–2లో ఓ బహుళ అంతస్తుల భవనం కోసం రజకుల్ని ఖాళీ చేయించడం, ఆ భవన యజమాని అడిగినంత డబ్బు ఇవ్వలేదని తిరిగి వారిపైనే దౌర్జన్యం చేయడం.. రుషికొండలో భూ ఆక్రమణ, రోడ్డు విస్తరణలో స్థలం పోయిందని ఉడా అధికారులను బెదిరించి రుషికొండ లేఔట్లో రెండు ప్లాట్లను అప్పనంగా కొట్టేయడం వంటి అక్రమాలకు పాల్పడ్డారు. ఆంధ్రవిశ్వవిద్యాలయ భూముల ఆక్రమణ, వర్సిటీలో వర్గ రాజకీయాలు జొప్పించి కలుషితం చేయడం, ఆరిలోవ ప్రాంతంలో వెలగపూడి యువసేన పేరిట దందాలు ఇలా చెప్పుకుంటూ పోతే వెలగపూడి నేరచరిత్ర చాంతాడంత ఉంది. లిక్కర్ మాఫియాతో చెలరేగిన వెలగపూడి ఎడ్యుకేషన్ సిటీగా వెలిగిన విశాఖ నగరాన్ని అడిక్షన్ సిటీగా మార్చేశారు. లిక్కర్ మాఫియాతో విశాఖలో మద్యం సిండికేట్‌ను శాసించే స్థాయికి చేరుకున్నారు. నగరంలో 50 నుంచి 60 షాపుల్లో ఆయన భాగస్వామ్యం ఉంది. బినామీల పేరిట సొంతంగా 6 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. పేదలను కేవలం ఓటర్లుగానే చూస్తూ పండుగలకు, పబ్బాలకు చిల్లర విరాళాలిచ్చి చీప్ లిక్కర్ మత్తులో వారి రక్తాన్ని పీల్చుతున్నారు. ఇదిలా ఉండగా తూర్పు నుంచి ఈమధ్యకాలంలో ఏకంగా 40వేల దొంగఓట్లను ఎన్నికల సంఘం గుర్తించి తొలగించిందంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు అందుబాటులో విజయనిర్మల వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న అక్కరమాని విజయనిర్మల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు. భీమిలి మున్సిపల్ కౌన్సిలర్‌గా, వైస్ చైర్మన్, చైర్ పర్సన్ హోదాల్లో పనిచేసి ప్రజామన్నన పొందారు. మహిళలకు ఏ ఇబ్బందులొచ్చినా నేనున్నానంటూ ముందుకొస్తారు. ఎన్నికల ప్రచారంలో జనం ఇబ్బందులు తెలుసుకుంటూ వారి మద్దతు కోరుతూ ముందుకుసాగుతున్నారు. ఈ సారి జరిగే ఎన్నికల్లో వెలగపూడిపై విజయనిర్మల గెలుపు తథ్యమని పరిశీలకులు భావిస్తున్నారు. నియోజకవర్గం : విశాఖపట్టణం తూర్పు మొత్తం ఓట్లు : 2,31,915 పురుషులు : 1,15,295 మహిళలు : 1,16,605 ఇతరులు : 15 - సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం -
అధికారం మార్పు వైపే మొగ్గు
సాక్షి, ఆరిలోవ: సార్వత్రిక ఎన్నికలకు తేదీ ప్రకటించడంతో తూర్పు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కుతోంది. ఈ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొననుంది. ఇక్కడ ఇప్పటి వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలతో పాటు జనసేన–వామపక్షాల కూటమి బరిలోకి దిగనున్నాయి. అయితే ఇందులో ప్రధాన పోటీ వైఎస్సార్సీపీ– టీడీపీల మధ్యే జరగనుందని భావిస్తున్నారు. ఇందులో అధికార బలంతో టీడీపీ బరిలోకి దిగనుండగా.. ప్రజాబలంతో వైఎస్సార్సీపీ పోటీకి నిలుస్తుంది. ఇక నియోజకవర్గంలో సుమారు 50 శాతం ఉన్న యాదవ, కాపు సామాజిక వర్గాల ప్రాధాన్యం ఎక్కువే. ఈ రెండు సామాజిక వర్గాల పైనే గెలుపు, ఓటములు ఆధారపడి ఉన్నాయి. రెండు ఎన్నికలతో పోలిస్తే .. సీన్ రివర్స్ ప్రస్తుతం ఇక్కడ టీడీపీకి చెందిన వెలగపూడి రామకృష్ణబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ప్రజా రాజ్యం తరపున, 2014లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన సీహెచ్.వంశీకృష్ణ శ్రీనివాస్‌పై విజయం సాధిం చారు. అయితే నియోజకవర్గంలో 2014లో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. సీన్ మారిపోయింది. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత రోజురోజుకూ పెరిగిపోతోంది. అదే తరుణంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ప్రజా సంక్షేమ ప«థకాలైన నవరత్నాల వైపు ఇక్కడి వారు మొగ్గు చూపుతున్నారు. అధికార పార్టీ బలం .. బలహీనతలు వెలగపూడి రామకృష్ణబాబుకు అధికారపార్టీ ఇప్పటికే టిక్కెట్ కేటాయించింది. అభివృద్ధి పనులు జరిగిన కొద్ది ప్రాంతాల్లో ప్రజల మద్దతుతో పాటు పార్టీ క్యాడర్ ఆ పార్టీకి కలసివచ్చే అంశం. జన్మభూమి కమిటీలకు పెత్తనం ఇవ్వడంతో కార్యకర్తలకు మేలు జరిగి, వారు ఈసారి కూడా వెలగపూడి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే జన్మభూమి కమిటీలపై ప్రజల్లో వ్యతిరేకత వారికి ప్రతికూల అంశం కానుంది. ఇంకా .. పార్టీలో కీలక నాయకుల మధ్య అంతర్గత కలహాలున్నాయి. 2009లో ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి భంగపడ్డ ఇద్దరు మాజీ కార్పొరేటర్లు.. ఎమ్మెల్యే ఇప్పటికీ ఎడముఖం, పెడముఖంగానే ఉన్నారు. వెలగపూడి దురుసు స్వభావంపై వ్యతిరేకత వెలగపూడి దురుసు స్వభావంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. రెండేళ్లుగా ఆయన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. వార్డుల్లో పర్యటించినప్పుడు సమస్యలు చెప్పడానికి వచ్చిన ప్రజలపై విరుచుకుపడతారనే భావన బాగా నాటుకుపోయింది. ఇందుకు ఇవే నిదర్శనాలు.. 2017 డిసెంబరులో ఒకటోవార్డు లక్ష్మీనగర్‌లో రోడ్ల శంకుస్థాపనకు వచ్చిన ఆయనకు సమస్యలు చెప్పుడుకోవడానికి వెళ్లిన ఓ స్థానికుడిని దుర్భాషలాడారు. - అదే ఏడాది కొండవాలులో తాగునీటి కోసం అడిగిన మహిళలపై కన్నెర్రజేశారు. గతేడాది మూడోవార్డు రవీంద్రనగర్‌లో సెల్ టవర్ ఏర్పాటు చేయొద్దంటూ అడిగిన ఓ మహిళపై చేతిలో ఉన్న మైక్ విసిరేసి విరుచుకుపడ్డారు. ఇదే మాదిరిగా జోడుగుళ్లపాలెం, పెదవాల్తేరు, మద్దిలపాలెం ప్రాంతాల్లో పలుచోట్ల ప్రజలపై ఆయన దురుసుగా ప్రవర్తించిన సంఘటనలున్నాయి. - ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు తన చాంబరులో గన్‌మన్‌పై చేయిచేసుకొన్న సంఘటన అప్పట్లో పెద్ద దుమారం రేపింది. వైఎస్సార్సీపీ బలాలివీ.. వైఎస్సార్సీపీ నాయకులు ప్రజలతో మమేకమవుతూ వారికి బాగా చేరువయ్యారు. తమ పార్టీ అధినేత వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలను పార్టీ సమన్వయకర్త సీహెచ్.వంశీకృష్ణ శ్రీనివాస్ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఎంవీవీ సత్యనారాయణ పార్టీలో చేరి సేవా కార్యక్రమాలు చేపట్టడం, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నియోజకవర్గమంతా తిరిగి ప్రజలతో మమేకం కావడంతో పార్టీకి నూతనోత్తేజం లభించింది. దీంతో పాటు వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రజలకు తాగునీరు సరఫరా చేయడం, పేదలకు ఆర్థిక సహకారం అందించడం వంటి కార్యక్రమాలను నిర్వహించడంతో ప్రజల్లో నమ్మకం కలిగింది. గత రెండుసార్లు ఓటమిపాలవడంతో స్థానికుల్లో వంశీకృష్ణపై సానుభూతి కూడా ఉంది. దీంతో పాటు ఇటీవల పలువురు ఇతర పార్టీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరడంతో ఈ సారి ఎన్నికల్లో వైఎస్సార్సీపీకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక యాదవ, కాపు సామాజికవర్గాల నుంచి అధిక శాతం మద్దతు వైఎస్సీర్‌సీపీకి ఉండటమూ ఆ పార్టీ విజయానికి కలసివచ్చే అంశాలు. -
కబ్జాలు.. దౌర్జన్యాలు.. కోడిపందాలు
మూడు దశాబ్దాల కిందట విజయవాడ ఎమ్మెల్యే వంగవీటి రంగా హత్యకేసులో మూడో నిందితుడు. బెజవాడలో ఉంటే తనకేమవుతుందోనన్న భయంతో విశాఖలో తలదాచుకోవడానికొచ్చారు. కొన్నాళ్లపాటు అజ్ఞాతంలో గడిపారు. ఆ తర్వాత బతుకుదెరువు కోసం అన్నట్టు ఏదో వ్యాపకమో, వ్యాపారమో చేసుకుంటూ కాలక్షేపం చేశారు. సినీ నటుడు బాలకృష్ణ అభిమానిగా ముద్ర వేయించుకుని విశాఖలో ఏవేవో కార్యక్రమాలు, కార్యకలాపాలు సాగించి ఆయనకు దగ్గరయ్యారు. కొన్నాళ్లకు కాలం కలిసొచ్చి బాలయ్య సహకారంతో 2009లో విశాఖ తూర్పు నియోజకవర్గానికి తెలుగుదేశం టికెట్టు సంపాదించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో మరోసారి గెలిచారు. ఎమ్మెల్యే కాకముందూ, అయ్యాక కూడా తన నేర స్వభావాన్ని మార్చుకోలేదు. పైగా మరింతగా దూకుడు పెంచారు. హత్యాయత్నం కేసుతో పాటు పలు క్రిమినల్ కేసులూ ఆయనపై నమోదై ఉన్నాయి. సాక్షి టాస్క్‌ఫోర్స్ :2014లో రెండో సారి ఎమ్మెల్యే అయ్యాక ఇంకా హద్దులు దాటారు. అధికారంలో ఉన్నామన్న అహంతో అనుచిత ప్రవర్తనలు పెంచారు. తన ఇలాకాలో చెప్పినట్టు నడుచుకునే అధికారులను నియమించుకుని ఇష్టారాజ్యంగా నియోజకవర్గాన్ని ఏలుతున్నారు.కోడిపందాలు, భూకబ్జాలు, ప్రత్యర్థులపై దౌర్జన్యాలు.. మద్యం వ్యాపారంలో ఆరితేరి సిండికేట్ సామ్రాజ్యానికి అధిపతిగా, బోగస్ ఓటర్లను చేర్పించడంలో దిట్టగా ఇలా బహు రూపాల్లో విశాఖలో నిర్భీతిగా చక్రం తిప్పుతున్న ఆ ఎమ్మెల్యేనే.. వెలగపూడి రామకృష్ణ బాబు. ఆయన అవినీతి, ఆగడాలు, అక్రమాలు, అరాచకాల చిట్టా చూద్దాం రండి. కోడిపందాల జోరు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కోడి పందాల సంస్కృతి ఎన్నడూ లేదు. ఎక్కడైనా ఒకటి రెండుచోట్ల పందాలు నడిచినా బరులు గీసి రూ.కోట్లలో పందాలు ఆడేంతటి పరిస్థితి మాత్రం కనిపించేది కాదు. కానీ వెలగపూడి రామకృష్ణబాబు ఎమ్మెల్యే అయ్యాక తన ఇలాకాలో విచ్చలవిడిగా కోడిపందాలు నిర్వహిస్తూ వస్తున్నారు. మూడేళ్లుగా ఆరిలోవ దరి ముడసర్లోవ ప్రాంతంలో (రామకృష్ణాపురం వెనుక) సుమారు పది ఎకరాల జీవీఎంసీ ఖాళీ స్థలంలో వీటిని నిర్వహిస్తున్నారు. గతేడాది స్వయంగా ఆయనే పందాలను ప్రారంభించారు. పందెంరాయుళ్లు రూ.కోట్లలో పందాలు కాశారు. వాటితో పాటు పేకాట, మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరిగాయి. ఎమ్మెల్యే వెలగపూడి ఆదేశాలతో జీవీఎంసీ అధికారులు దగ్గరుండి మరీ బరి కోసం నిర్దేశించిన స్థలాన్ని చదును చేయగా.. నీటి సరఫరా విభాగం అధికారులు ప్రతి రోజు నీళ్లు చల్లారు. ఓ వైపు హైకోర్టు ఆదేశాలిస్తున్నా.. వెలగపూడి బరులు సిద్ధం చేసి మరీ పందాలు నిర్వహించారు. అండగా ఉంటూఆక్రమణలకు ఊతం భీమునిపట్నం మండలం కాపులుప్పాడ పంచాయతీ పరిధిలోని సోమన్నపాలెంలో రైతులు మరుపిళ్ల అప్పలనాయుడు, సూరిబాబు, అప్పలస్వామి, పోతిన పాపాయమ్మ, మరుపిళ్ల రాంబాబు, మరుపిళ్ల అప్పల నరసయ్య, మరుపిళ్ల నరసయ్య, నరసాయమ్మ, మరుపిళ్ల తాతయ్యలకు 5.90 ఎకరాల భూమి ఉంది. పూర్వీకుల నుంచి పిత్రార్జితంగా వచ్చిన భూమి 624/1981గా సర్వే నంబర్ 268/3లో 1.36 సెంట్లు, 269/2లో 1.90 సెంట్లు, 269/10లో 1.96 సెంట్లు, 269/11లో 0.36 సెంట్లు, 269/13లో 0.02 సెంట్లు మొత్తం 5.90 సెంట్లుగా నమోదై ఉంది. 20 ఏళ్ల కిందట విశ్వ సౌజన్య రియల్ ఎస్టేట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న నిమ్మలకూడి వీర వెంకట(ఎన్వీవీ) సత్యనారాయణ ఆ రైతుల భూమి తీసుకుని లే అవుట్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. నమ్మిన రైతులు 73 సెంట్ల భూమి తమ వద్ద ఉంచుకుని.. 1996లో కొంత భూమి, 1998లో మరికొంత భూమి మొత్తంగా 5.17 సెంట్ల భూమిని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ(జీపీఏ)గా అతనికి రాసిచ్చి బతుకుదెరువు కోసం విజయవాడ పాతబస్తీకి వలస వెళ్లిపోయారు. కానీ ఆ రియల్టర్ మాత్రం ఆ భూమి ఇక్కడ అభివృద్ధి చేయకుండా కాలయాపన చేస్తూ వచ్చాడు. 2010లో విజయవాడ నుంచి తిరిగి సోమన్నపాలెం వచ్చేసిన ఆ రైతు కుటుంబాల సభ్యులు ఎన్వీవీ సత్యనారాయణను కలిశారు. ఆ భూమి తీసుకుని మాకేమీ ఇవ్వలేదు.. అలాగని ఆ భూమి కూడా అభివృద్ధి చేయలేదు.. అని ప్రశ్నిస్తే.. అసలు మీరెవరని ఎదురు తిరిగాడు. ఆ భూమే తనదేనని, కొనుగోలు చేసుకున్నట్టు పత్రాలు కూడా ఉన్నాయని, మీరేం చేసుకుంటారో చేసుకోండని ఎన్వీవీ అడ్డం తిరిగాడు. ఎమ్మెల్యే వెలగపూడి అండతోనే ఎన్వీవీ ఎదురు తిరిగాడనే ఆరోపణలు ఉన్నాయి. వెలగపూడి సిత్రాలివీ.. ⇔ ఎమ్మెల్యే పేరు చెప్పి ఆయన అనుచరులు దందాలు చేస్తారు. రుబాబు చేసి దౌర్జన్యాలకు పాల్పడతారు. ⇔ కోర్టుల్లో ఉన్న కేసులను సైతం బయట సెటిల్మెంట్లు చేస్తామని, ఆ కేసులను వదిలేయాలని కాళ్ల శంకర్ వంటి ఎమ్మెల్యే అనుచరులు న్యాయవాదులను బెదిరింపులకు దిగుతారు. ⇔ వెలగపూడి యువసేన అధ్యక్షుడు కంచర్ల సందీప్ పలు నేరాల్లో జైలుకెళ్లాడు. ఓ హత్య కేసులోనూ జైలుకెళ్లాడు. కొన్నాళ్లకు ఆ కేసు కొట్టేశారు. ⇔ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మద్యం షాపులతో పాటు బెల్టు షాపులను విచ్చలవిడిగా నడుపుతున్నారు. ⇔ ఆరిలోవ 1, 2 సెక్టార్లు, జాలరిపేట, విశాలాక్షినగర్, అడవివరం రోడ్డు, అప్పుఘర్, ఎంవీపీ కాలనీ, జోడుగుళ్లపాలెం ప్రాంతాల్లో బెల్టు షాపులు ఉన్నాయి. ⇔ ఎమ్మెల్యే ఏరికోరి తెచ్చుకున్న ఎక్సైజ్ అధికారులే ఇక్కడ విధులు నిర్వహిస్తుండడంతో వారెవరూ అటువైపు కన్నెత్తయినా చూడరు. ⇔ ఈ బాబు నేతృత్వంలో శ్రీనగర్, హార్బర్ అప్రోచ్‌రోడ్డు, ఆరిలోవ, టీఐసీ పాయింట్, ఎంవీపీ కాలనీ, దండుబజార్, రైల్వే న్యూకాలనీ, చినగదిలి బీఆర్టీఎస్, ఏవీఎన్ కాలేజీ డౌన్, జగదాంబ జంక్షన్ తదితర ప్రాంతాల్లో నడుస్తున్న మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు వేళాపాళలు ఉండవు. అర్ధరాత్రి దాటినా మూతపడవు. నేరాలచిట్టా ఇదీ.. ⇔ విజయవాడ ఎమ్మెల్యే వంగవీటి రంగా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వెలగపూడి రామకృష్ణబాబు బెజవాడలో రంగా అనుచరులకు భయపడి ప్రాణం అరచేతిలో పెట్టుకొని విశాఖపట్నం వచ్చారు. వైజాగ్‌కు వచ్చి టెలెక్స్ పేపర్స్ తయారు చేసే కంపెనీలో సిగ్నల్ లైట్స్ సత్యనారాయణ దగ్గర సెక్టార్–6లోని బిల్డింగ్‌లో వెలగపూడి తన అనుచరులతో కలిసి తలదాచుకున్నారు. ⇔ జనప్రియ సిండికేట్ వాళ్లను టెండర్లు వెయ్యొద్దంటూ బెదిరించి రౌడీలతో దౌర్జన్యం చేయించారు. ఈ వ్యవహారంలో త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై రౌడీషీట్ తెరిచారు. కానీ అప్పటి ఏసీపీ రంగారావు సాయంతో ఆ రౌడీషీట్‌ను ఎత్తివేయించుకున్నారు. ⇔ సెక్టార్– 2లో రజకులను ఖాళీ చేయించి హయగ్రీవ బిల్డర్స్ దగ్గర కోట్ల రూపాయలను వెలగపూడి, ఆయన ముఖ్య అనుచరుడు పట్టాభి తీసుకున్నారు. బిల్డర్స్‌కు అనుకూలంగా లేఖ ఇస్తున్న సమయంలో మీడియా ప్రతినిధులను కొట్టించారు. రెండోసారి హయగ్రీవ బిల్డర్స్‌ను ఒక ఫ్లోర్ మొత్తం కావాలని బ్లాక్మెయిల్ చేసి ఇవ్వకపోయే సరికి లేఖ వెనక్కి తీసుకొని వారిపై ఫిర్యాదు చేశారు. ⇔ రుషికొండ సర్వే నం.21/ఏ,బీల్లో 650 గజాల గెడ్డ పోరంబోకు ఆక్రమించారు. రోడ్డులో స్థలం పోయిందని వుడా దగ్గర రుషికొండ లేఅవుట్లో 2 స్థలాలను అప్పనంగా తీసుకున్నారు. ⇔ వెలగపూడి యువసేన పేరుతో ఆరిలోవ ప్రాంతంలో సందీప్ అనే అనుచరుడు దందాలు చేస్తూ ఒకరిని హత్య చేశాడు. ⇔ విశాఖ విమానాశ్రయంలో సిబ్బందిపై దాడి, దౌర్జన్యం కేసులోనూ వెలగపూడి నిందితుడిగా ఉన్నారు. ⇔ విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐపై దాడి చేసి గాయపరిచారు. ⇔ బిల్లులు లేకుండా కంపెనీల నుంచి దొంగతనంగా మద్యం తరలించి ప్రభుత్వానికి పన్ను ఎగవేత, అక్రమ మద్యం కేసులో ఏసీబీ నిందితుల జాబితాలోనూ వెలగపూడి ఉన్నారు. ⇔ ప్రభుత్వోద్యోగిని విధులకు ఆటంకం కలిగించిన కేసులున్నాయి. ⇔ అల్లర్లకు పాల్పడడం, మారణాయుధాలతో హత్యాయత్నం కేసు ఈయనపై నమోదై ఉంది. ⇔ ఉద్దేశపూర్వకంగా వ్యక్తిపై దాడి చేయడంపై కేసు నమోదైంది. వెలగపూడిపై నమోదైన కేసులు.. 1 : ఐపీసీ సెక్షన్లు 147, 148, 149, 332: క్రైం నంబర్ 348/2010 ఫస్ట్ ఏసీఎంఎం 2 : ఐపీసీ సెక్షన్లు 147, 148, 149, 353@ క్రైం నంబర్ 349/2010 4వ ఏడీజే కోర్టు 3 : ఐపీసీ సెక్షన్లు 147, 148, 149, 332@ క్రైం నంబర్ 350/2010 ఫస్ట్ ఏసీఎంఎం 4 : ఐపీసీ సెక్షన్లు 332, 34, క్రైం నంబర్ 351/2010, ఫస్ట్ ఏసీఎంఎం 5 : ఇండియన్ రైల్వే యాక్ట్ క్రైం నంబర్ సీ3సీ/3(01)/2010, రైల్వే కోర్టు 6 : ఇండియన్ రైల్వే యాక్ట్ క్రైం నంబర్ సీ4/48(12)/2009, రైల్వే కోర్టు నేరస్తులకు అండ విశాఖలో రౌడీషీటర్లు, నేరస్తులంతా కట్టకట్టుకుని ఎక్కడుంటారు? అని అడిగితే ఈ టీడీపీ ఎమ్మెల్యే పేరే చెబుతారు. ఎమ్మెల్యే అయ్యాక ‘పరిధి’పెంచి రౌడీషీటర్లకు సహకారం అందిస్తూ వస్తున్నారు. నగరంలో ఎక్కడ గలాటా జరిగినా నిందితులకు ఈయన ఇల్లు, కార్యాలయాలు అడ్డాగా మారిపోతాయన్న పేరుంది. గతంలో ఈయన ఓ సంచలన హత్య కేసులో నిందితుడు అయినప్పటికీ కోర్టు కొట్టివేసింది. ఆర్థిక వివాదాలు, భూ కబ్జా కేసులు మాత్రం ఇప్పటికీ ఉన్నాయి. కానీ హత్య కేసుల్లోని నిందితులకు, వివాదాస్పద వ్యక్తులకు ఈ ఎమ్మెల్యే ఆశ్రయం కల్పిస్తున్నాడన్న వాదనలు బలంగా ఉన్నాయి. -
ఆ కేసూ ‘మాఫీ’ యా!
కేసు దర్యాప్తు చేసిందీ లేదు.. మృతుడి పోస్టుమార్టం నివేదికా అందలేదు.. పోనీ ‘మద్యం తాగుతూ అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడంటున్న’ ప్రత్యక్ష సాక్షుల వాదనను అసలే పరిగణనలోకి తీసుకోలేదు.. కానీ గుండెపోటుతోనే అని ఏకపక్షంగా తేల్చేసి..సంఘటన జరిగిన 24 గంటల్లోపే కేసు క్లోజ్ చేసేశారు.. టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి ఆధ్వర్యంలోని లిక్కర్ మాఫియా పోలీసు, అబ్కారీ శాఖలపై ఎంతగా స్వారీ చేస్తోందో.. కేసులను ఎలా మేనేజ్ చేస్తోందో.. స్పష్టం చేస్తున్న సంఘటన ఇది. ఎంవీపీ కాలనీలోని వెలగపూడి సిండికేట్‌కు చెందిన శ్రీవిజయ వైన్ షాపునకు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూములో తిరుమలరావు అనే వ్యక్తి శుక్రవారం రాత్రి మద్యం సేవిస్తూ అక్కడే కుప్పకూలి మరణించగా.. అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడని పోలీసులు పేర్కొనడం చూస్తే.. సిండికేట్ నిర్వాహకులను కేసు నుంచి తప్పించే ఉద్దేశం స్పష్టమవుతోంది. కనీసం పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకైనా ఆగకుండా గుండెపోటు మరణమని తేల్చేసి.. కేసును మాఫీ చేసేయడం విస్మయానికి గురి చేస్తోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఊహించిందే జరిగింది. ఎమ్మెల్యే వెలగపూడి లిక్కర్ మాఫియా.. ఓ కళాకారుడి మృతి కేసును తారుమారు చేసేసింది. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు లిక్కర్ సిండికేట్‌కు చెందిన ఎంవీపీ కాలనీలోని శ్రీ విజయ వైన్స్‌లో మర్రిపాలెంకు చెందిన కీ బోర్డ్ కళాకారుడు ఎం.తిరుమలరావు(48) శుక్రవారం రాత్రి కుప్పకూలి మృతి చెందిన సంగతి తెలిసిందే. మద్యం సేవిస్తూ అక్కడికక్కడే మృతి చెందాడని శుక్రవారం రాత్రి ప్రత్యక్షసాక్షులు స్పష్టం చేయగా... శనివారం సాయంత్రానికి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఇందుకు విరుద్ధమైన ప్రకటన చేశారు. వైన్ షాపులో మద్యం కొని బాటిల్ మూత తీయకుండానే ఫిట్స్ వచ్చి పర్మిట్ రూమ్‌లో కుప్పకూలిన అతన్ని కేజీహెచ్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యలో మరణించాడని ప్రకటించారు. వాస్తవానికి తిరుమలరావు అక్కడికక్కడే చనిపోయాడని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ‘‘శ్రీ విజయ వైన్స్‌కు సమీపంలోని శ్రీ సాయిరామా శక్తి లింగేశ్వర ఆలయంలో కార్తీకమాసం ముగింపు దృష్ట్యా శుక్రవారం రాత్రి జాగారం జరుగుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు కీ బోర్డ్ ప్లే చేసేందుకు తిరుమలరావు వచ్చారు. అప్పటి వరకు గుడిలోనే ఉన్న ఆయన సాయంత్రం 6గంటల సమయంలో చిన్న పనుంది.. ఇప్పుడే వస్తానని బయటకు వెళ్లారు. అర్ధగంటయినా రాకపోవడంతో మేము ఆరా తీయగా.. పక్కనే ఉన్న వైన్ షాపులోకి వెళ్లి కుప్పకూలాడని తెలిసింది. మేము హుటాహుటిన వెళ్లేటప్పటికే అచేతనంగా పడి ఉన్నాడు.. కేజీహెచ్‌కు తీసుకెళ్లేందుకు వాహనం ఏర్పాటు చేయమన్నా... ముందు వైన్‌షాపు నిర్వాహకులు అంగీకరించలేదు. ఆటోలో తీసుకుపొమ్మని గదమయించారు. గట్టిగా అడిగిన మీదట ప్రైవేటు అంబులెన్స్‌ను పిలిపించారు.. అప్పటికే అతను మృతి చెంచాడని అంబులెన్స్ వైద్య సిబ్బంది తేల్చారు.’’ అని దేవాలయ కమిటీ అధ్యక్షుడు సింహాద్రిబాబు, స్థానికులు చెబుతున్నారు. కానీ శనివారం నాడు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు మాత్రం ఆస్పత్రికి తీసుకెళ్తుంటే మార్గమధ్యలో మృతి చెందినట్టు ప్రకటించారు. వైన్‌షాపు యాజమాన్యానికి కనీసంగా ఎటువంటి సంబంధం లేకుండా చేసేందుకే ఘటనా స్థలంలో కాకుండా మార్గమధ్యలో చనిపోయినట్టు పోలీసులు కొత్త కథ అల్లినట్టు అర్ధమవుతోంది. శనివారం ఉదయం కేజీహెచ్‌లో తిరుమలరావు మృతదేహానికి శవపంచనామా నిర్వహించగా.. ఇంకా నివేదిక మాత్రం ఇవ్వలేదు. కానీ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు మాత్రం అతను గుండెపోటుతోనే చనిపోయాడని నివేదికలో తేలినట్టు చెబుతున్నారు. మరో పక్క తిరుమలరావు కుటుంబసభ్యులు కూడా అయిందేదో అయిపోయింది.. ఇప్పుడు వివాదం చేసుకున్నా వచ్చేదేమీ లేదు.. ఆయన గుండెపోటుతో చనిపోయాడని అందరూ చెబుతున్నారు.. అదే నిజమని అనుకుంటున్నాం... అని చెప్పుకొస్తున్నారు. దీన్ని బట్టి చూస్తేనే వెలగపూడి లిక్కర్ మాఫియా వ్యవస్థలను, వ్యక్తులను ఎలా ప్రభావితం చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఆ బాటిళ్లు సీజ్ చేశాం: ఎక్సైజ్ సీఐ నాయుడు శ్రీ విజయ వైన్స్‌లో తిరుమలరావు కొనుగోలు చేసిన మాన్షన్ హౌస్ బ్రాందీ 180ఎంఎల్ బాటిల్‌ను రసాయన పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపించాం... షాపులోని ఆ బ్రాండ్‌కు చెందిన 249 బాటిళ్లను విక్రయించకుండా సీజ్ చేశాం.. అని ఎక్సైజ్ సీఐ పాపునాయుడు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ - వెలగపూడి రామకృష్ణబాబు
-
టీడీపీకి ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు
-
‘రంగా హత్యకేసులో వెలగపూడి నిందితుడు’
సాక్షి, విశాఖపట్నం: వంగవీటి రంగా హత్య కేసులో విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే, టీడీపీ నేత వెలగపూడి రామకృష్టబాబు మూడో నిందితుడిగా ఉన్నారని, ఇది తెలియక ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా ఎంపీ విజయసాయి రెడ్డి చేపట్టిన సంఘీభావయాత్ర బుధవారం ఎనిమిదవ రోజుకు చేరింది. విశాలాక్షినగర్ నుంచి బుధవారం పాదయాత్ర ప్రారంభమవ్వగా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన వెంట నడిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యేలు భూకబ్జాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ లాభాలకోసమే విమ్స్ ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విమ్స్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
విశాఖ ఎమ్మెల్యే వెలగపూడికి చేదు అనుభవం
-
హెచ్చరిక బోర్డులనూ వదట్లేదు.!
ఆరిలోవ: పైనాపిల్‌కాలనీ జేఎన్ఎన్యూఆర్ఎం నివాస సముదాయంలో టీడీపీ నాయకులు.. తమ ప్రచారానికి జీవీఎంసీ హెచ్చరిక బోర్డులనూ వదట్లేదు. ప్రభుత్వ స్థలాలను కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకున్న అనంతరం ‘ఈ స్థలం జీవీఎంసీది.. దీన్ని ఎవరు ఆక్రమించినా శిక్షార్హులవుతారు’ అని రాసిన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తారు. ఆ బోర్డులను స్థానిక టీడీపీ నాయకులు తీసుకొచ్చి జనం నడిచిన రోడ్డు పక్కన ఏర్పాటు చేశారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఫొటోతో ఫ్లెక్సీ కట్టారు. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం దీన్ని పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
ఎమ్మెల్యే వెలగపూడిపై కలెక్టర్‌కు ఫిర్యాదు
-
మహిళపై మైకు విసిరిన టీడీపీ ఎమ్మెల్యే
జనావాసాల మధ్య సెల్‌టవర్ వద్దనడమే ఆమె చేసిన పాపం ఇక్కడ్నుంచి పోతావా? పోవా? అంటూ ఎమ్మెల్యే వెలగపూడి ఆగ్రహం విశాఖ నగరంలో నిర్వహించిన జనచైతన్య యాత్రలో నిర్వాకం ఆరిలోవ(విశాఖ): జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన సెల్‌టవర్ వల్ల తమకు సమస్యలు ఎదురవుతున్నాయని తమ వద్దకు వచ్చిన అధికారపార్టీ ప్రజాప్రతినిధికి విన్నవించడమే ఆమె చేసిన పాపం. దీంతో నన్నే నిలదీస్తావా? అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన ఆ ప్రజాప్రతినిధి చేతిలో ఉన్న మైకును ఆమెపైకి విసిరేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామంటూ టీడీపీ నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రలో భాగంగా విశాఖ నగరంలోని మూడో వార్డులో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీకి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రవీంద్రనగర్ ఆఖరి బస్‌స్టాప్ వద్ద అక్కడి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రజల సమస్యలు పరిష్కరించటానికే వచ్చానని, టీడీపీ పాలనలో ప్రజాసమస్యలు తీరుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇంతలో అదే ప్రాంతానికి చెందిన మాకిన వరలక్ష్మి అనే మహిళతోపాటు స్థానికులు కొందరు ఇటీవల ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సెల్‌టవర్ గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సెల్‌టవర్ వల్ల సమస్యలెదురవుతాయని గతంలో ఇక్కడి మహిళలంతా ఉద్యమాలు చేసి ఎత్తివేయించామని, అయితే ఇక్కడ ఇటీవల కొత్తగా మరో సెల్ టవర్‌ను మీ అండతో ఏర్పాటు చేశారని చెప్పడంతో ఆ మహిళపై ఎమ్మెల్యే ఊగిపోయారు. ఆ సెల్‌టవర్ పెట్టింది వేరే పార్టీ కార్యకర్త.. నేనెందుకు మద్దతు పలుకుతాను.. నీవు ఇక్కడ నుంచి పోతావా పోవా.. అంటూ చేతిలో ఉన్న మైక్‌ను విసిరేశారు. అయినప్పటికీ ఆ మహిళ వెనుదిరగకుండా.. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మీరు ఇక్కడికొచ్చారు.. అందుకే సమస్యలు చెప్పుకొంటున్నాం. నేను మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తే పొమ్మని చెప్పండి.. మా వద్దకు వచ్చి మమ్మల్ని పొమ్మంటారా.. అంటూ ఎదురుతిరిగింది. దీంతో ఎమ్మెల్యే మరింత ఊగిపోయారు. ఆమెను తీసుకుపోండంటూ కార్యకర్తలను గద్దించారు. మధ్యలోనే యాత్రను ముగించేసి రుసరుసలాడుతూ వెళ్లిపోయారు. దీంతో టీడీపీ కార్యకర్తలు కొందరు ఎమ్మెల్యేనే నిలదీస్తావా? అంటూ వరలక్ష్మితో వాగ్వాదానికి దిగారు. -
టీ కొట్టునూ వదల్లేదు..బాబు
విశాఖపట్నం : తోపుడు బండిపై ఆధారపడి బతుకుతున్న ఓ టీకొట్టు వ్యాపారి బతుకు బండి నెట్టి, ఓ బాబుగారు డాబు వెలగ బెడుతున్నారు. త్రీటౌన్ పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ ప్రాంతంలో ప్రహరీ గోడ పక్కన.. మద్దిలపాలెం నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ రోడ్డుకు వెళ్లే మార్గం మలుపులో ఉన్న టీ కొట్టును ఎట్టకేలకు తొలగించారు. బండి తీయిస్తే బతుకు పోతుందని ఆ యజమాని బతిమిలాడినా పట్టించుకోలేదు. పంతం కోసం ఓ ‘పచ్చ’నాయకుడు పట్టుబట్టి మరీ బండి తొలగించేలా చేయించారు. తొలగించిన బండి స్థానంలో స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహం పెట్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా దాని చూట్టు ఉన్న పోలీస్ క్వార్టర్స్ ప్రహరీ గోడపై బారెడు సైజులో బాబుగారి బొమ్మలు పచ్చరంగులో గీసి మారి ఆర్భాటం చేస్తున్నారు. పచ్చనాయకులు చేస్తున్న ఆగడాలను చూస్తున్న స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. బాబు గారి ‘బొమ్మ’లు కనిపించేందుకేనా ఇంత ఆర్భాటమూ అంటున్నారు. -
దేశం నేతలకు 'వెలగ'పోటు..!
తమవారిని కాదని బీజేపీ నేతకు పదవి కార్పొరేటర్ సీటు కోసం చైర్మన్ పదవి ఎర తన స్వార్థం కోసం ఎమ్మెల్యే అండతో టీడీపీ నేత వ్యూహం పోలమాంబ ఆలయ ట్రస్ట్ బోర్డు సాక్షిగా బయటపడ్డ విభేదాలు విశాఖపట్నం : పదవి కోసం పచ్చ పార్టీ నేతలు ఎంతటి కుతంత్రాలకైనా ఒడిగడతారు... ఎలాంటి మోసాలకైనా సిద్ధపడతారు అనడానికి తాజా ఉదంతమే ఓ ఉదాహరణ. సొంత పార్టీలో ఎంతో కాలంగా ఆశలు పెంచుకున్న వారిని కాదని... స్వప్రయోజనాల కోసం బీజేపీ నేతకు పదవి కట్టబెట్టడం ఇప్పుడు టీడీపీలో చిచ్చురేపేతోంది. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ సీటుకు తనకెవరూ పోటీ ఉండకూడదనే స్వార్థంతో టీడీపీ 17వ వార్డు నేత బైరెడ్డి పోతన్నరెడ్డి స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును ప్రసన్నం చేసుకుని పోలమాంబ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని అదే వార్డుకు చెందిన బీజేపీ నేత మరడ వెంకటరెడ్డికి కట్టబెట్టారు. ఎంతో కాలంగా ఆ పదవి కోసం ఆశలు పెంచుకున్న టీడీపీ మహిళా నేత వాకా సత్యవతికి వెన్నుపోటు పొడిచారు. కార్పొరేటర్ సీటు కోసం స్కెచ్ పద్నాలుగు గ్రామాల కల్పవల్లిగా భాసిల్లుతున్న పెదవాల్తేరు పోలమాంబ అమ్మవారి ఆలయానికి ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డులో 14 గ్రామాలకు చెందిన వారు సభ్యులుగా ఉంటారు. అంటే ఎవరు చైర్మన్‌గా ఉంటే వారికి పద్నాలుగు గ్రామాలపై పట్టు ఉంటుంది. కనీసం ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా తన స్వార్థం కోసం పోతన్న రెడ్డి వ్యూహం రచించారు. దానికి ఎమ్మెల్యే వెలగపూడి కూడా మద్దతు పలకడంతో సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. జీవీఎంసీ ఎన్నికలలో టీడీపీ, బీజేపీలు పొత్తుపెట్టుకుని బరిలో దిగే అవకాశం ఉందనే వార్తలు రావడంతో బీజేపీ 17వ వార్డు అధ్యక్షుడు వెంకటరెడ్డి కార్పొరేటర్ సీటు కోసం భారీ ఆశలే పెట్టుకున్నారు. దీంతో అధికార పార్టీలో సీనియర్ నేతగా చలామణి అవుతున్న బైరెడ్డి పోతన్నరెడ్డి తన వార్డులో బీజేపీ పోటీలో లేకుండా చేయాలని భావించారు. అనుకున్నదే తడువుగా ఎమ్మెల్యే అండతో వ్యూహం రచించి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని వెంకటరెడ్డికి ఎరగా వేశారు. వార్డులో మిత్రపక్షం నుంచి తనకు పోటీ లేకుండా చేసుకున్నారు. భగ్గుమంటున్న టీడీపీ వర్గీయులు ఎన్నాళ్లుగానో పోలమాంబ అమ్మవారి ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా నియమాకం కావాలని ఆశించిన వాకా సత్యవతి సొంత పార్టీ నేత చేసిన కుట్రను, అందుకు ఎమ్మెల్యే వెగలపూడి మద్దతు తెలపడాన్ని భరించలేకపోతున్నారు. కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వకుండా బీజేపీకి చెర్మైన్ పదవిని ఇచ్చేశారంటూ టీడీపీ వర్గీయులే దుమ్మెత్తిపోస్తున్నారు. ఒక్క నేత లబ్ధి కోసం ఏకంగా 14గ్రామాలతో ముడిపడి ఉన్న పోలమాంబ అమ్మవారి ట్రస్టీ చైర్మన్ కట్టబెట్టడంపై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాలతో ఈ వార్డులో టీడీపీ రెండుగా చీలిపోయింది. ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలేయకూడదని, పెద్దల వద్దే తాడోపేడో తేల్చుకోవాలని మహిళా నేత భావిస్తున్నట్లు సమాచారం. జీవీఎంసీ ఎన్నికల ప్రకటన వెలువడక ముందే టీడీపీలో విభేదాలు ఈ స్థాయిలో ఉంటే భవిష్యత్‌లో ఇంకెన్ని పంచాయతీలు తెరపైకి వస్తాయోనని ఆ పార్టీ వారే కలవరపడుతున్నారు. -
ఎమ్మెల్యే వెలగపూడిపై వంశీకృష్ణ ఫైర్
విశాఖ: విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పై వైఎస్ఆర్సీపీ నాయకుడు వంశీకృష్ణ ఫైర్ అయ్యారు. నేర చరిత్ర గలిగి.. సారా వ్యాపారంతో అడ్డ దారిలో కోట్ల రూపాయలు సంపాదించిన నీవు మా నాయకుడిపై విమర్శిస్తావా'' అంటూ మండిపడ్డారు. భూదందాలు చేస్తూ... దొంగ ఓట్లేయించుకుని... మోసాలకు పాల్పడడమే కాకుండా తిరిగి ఎదురు దాడిగి దిగుతున్నావా' అంటూ ఎమ్మెల్యే వెలగపూడిని ప్రశ్నించారు. దివంగత నేత వైఎస్ ఉత్తరాంధ్ర ప్రజల వైద్యం కోసం విమ్స్ ను ఏర్పాటు చేస్తే... ఇప్పటి వరకు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి కూడా నోచుకోకుండా అడ్డంకులు సృష్టిస్తుంది మీరు కాదా అని వైఎస్ఆర్సీపీ నాయకుడు వంశీకృష్ణ ప్రశ్నించారు. -
సచివాలయంలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి వీరంగం
హైదరాబాద్: ఉన్నతాధికారి పట్ల అధికార టీడీపీ ఎమ్మెల్యే ఒకరు ఆధిపత్యాన్ని ప్రదర్శించడమేకాక అనుచితంగా ప్రవర్తించిన ఉదంతం సోమవారం సచివాలయంలో చోటుచేసుకుంది. సాయింత్రం నాలుగు గంటల ప్రాంతంలో సచివాలయంలోని మున్సిపల్ శాఖ కార్యదర్శి కరికాల వలవన్ కార్యాలయానికి వచ్చిన విశాఖపట్టణం నగరం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు.. అక్కడ వీరంగం సృష్టించారు. కరికాల వలవన్ ఛాంబర్ లో విదేశీ ప్రతినిధులతో సమావేశమై ఉండగా.. వెలగపూడి ఆకస్మాత్తుగా ప్రవేశించి తనకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదంటూ ఆయనపై నిప్పులు చెరిగారు. అంతటితో ఆగక... పేషీ సిబ్బందిపై ఫైళ్లను విసిరికొట్టారు. నీళ్ల గ్లాసును నేలకేసి బద్దలు కొట్టారు. ఎమ్మెల్యే తీరుతో కార్యాలయ సిబ్బందికేకాక విదేశీయులను సైతం ఆశ్యర్యానికి గురయ్యారు. అనంతరం వెలగపూడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
నిరసనలకు శ్రీకారం
పింఛన్లు..పరిహారం కోసం ఆగ్రహం ఎంపీ, ఎమ్మెల్యేలకు తప్పని నిరసన ప్రోటోకాల్ ఉల్లంఘించిన అరకు ఎంపీ జన్మభూమిలో గళమెత్తిన ప్రజలు సాక్షి, విశాఖపట్నం: జన్మభూమి-మావూరు పునఃప్రారంభించిన తొలిరోజే జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు సొం తనియోజకవర్గంలోనే చుక్కెదురైంది. 1వ వార్డు ఆరిలోవ ప్రాంతంలో జరిగిన గ్రామసభలో తుఫాన్ బాధితులు ఎమ్మెల్యేను నిలదీశారు. తుఫాన్ తర్వాత మీరు కానీ..మీ అధికారులు కానీ మావైపు కన్నెత్తయినా చూడలేదు. సాయం పంపిణీలో వివక్ష చూపారు. 2వ వార్డులో పంపిణిచేసేరే తప్ప ఆరిలోవలో ఒక్క కిలో బియ్యం ఇవ్వలేదంటూ మండిపడ్డారు. దీనిపై సమాధానం చెప్పలేక ఇబ్బందిపడిన ఎమ్మెల్యే మీరు చెప్పింది నిజమే..సాయం పంపిణీసరిగా జరగలేదు.. మీకు పరిహారం విషయంలో న్యాయంచేస్తానని హామీ ఇచ్చారు. నక్కపల్లిలో మంత్రి గంటా శ్రీనివాస రావు కాన్వాయ్‌ను గత 45 రోజులుగా ఆందోళన చేస్తున్న యానిమేటర్లు అడ్డుకుని బైటాయించారు. తమతో ప్రభుత్వం కనీసం చర్చలు కూడాజరపలేదని..ఆకలితో అలమటిస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేయగా ప్రభుత్వం దృష్టికితీసుకెళ్తాననంటూ వారికి సర్దిచెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. మంత్రి గంటా పాయక రావుపేటలో పింఛన్‌దారుల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొక తప్పలేదు. పింఛన్లలో కోత పెట్టారని.. తాము ఏ విధంగా అనర్హులమో చెప్పాలని మంత్రిని నిలదీయగా,న్యాయంచేస్తామని హామీ ఇచ్చారు. భీమిలి మండలం మాలకుద్దులో పింఛన్ల కోతపై బాధితులు ఎంపీపీ, జెడ్పీటీసీలను నిలదీశారు. తమకు వెంటనే పింఛన్లు పునరుద్దరించాలని వారిని చుట్టుముట్టి నినాదాలు చేసారు. ఇదే మండలంలోని తాటితూరులో తుపాన్ బాధితులు అధికారులపై విరుచుకుపడ్డారు. వీరికి మద్దతుగా వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ దుంపల నాగమణి, పార్టీ నాయకులు ఎస్వి రమణారెడ్డి, ఈశ్వరరావులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. ఈ దశలో టీడీపీ నాయకులు, వైఎస్సార్సీపీ నాయకుల మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులు సర్వేలో తప్పులు చేసారని చక్కదిద్దుతామని టీడీపీ నాయకులు ప్రజలకు సర్దిచెప్పి అక్కడ నుంచి వెళ్లాల్సి వచ్చింది. చోడవరం మండలం గోవాడ సభలో స్థానికులు గత జన్మభూమిలో ఇచ్చిన హామీలే అమలు చేయలేదు..మళ్లీ ఎందుకొచ్చారంటూ అధికారులపై మండిపడ్డారు. పారిశుద్ద్యంపై ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో చక్కదిద్దుతామనిచెప్పి నెలరోజులు గడుస్తున్నా పట్టించుకోలేదంటూ ఆరోపించారు. ఇదే మండలం నర్సాపురంలో పాస్పుస్తకాలజారీలో జరుగుతున్న జాప్యంపైరైతులు నిలదీయగా, జొన్నవరంలో పింఛన్ల కోతపై బాధితులు మండిపడ్డారు. పాడేరు మండలం పలుగు గ్రామసభలో అరకు ఎంపీ కొత్తపల్లి గీత ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. పింఛన్లను పంపిణీకి స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సిద్దపడగా గీత అడ్డుకుని ఇది మా ప్రభుత్వం మీరెవరూ పంపిణీ చేయడానికని ప్రశ్నించడంతో ఏ పార్టీలో ఉన్నావో తెలుసా అంటూ ఎమ్మెల్యే వర్గీయులు నిలదీశారు. దీంతో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో గందరగోళ పరిస్థితులు ఏర్పడి ఎవరేం మాట్లాడుతున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొనడంతో పోలీసులుజోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఇదే మండలం మొదపల్లి పంచాయితీలో జరిగిన సభకు హాజరైన ఎంపీ కొత్తపల్లి గీతను స్థానిక వైఎస్సార్సీపీ ఎంపీపీ ముత్యాలమ్మ నిలదీశారు. ఏపార్టీ తరపున ఇక్కడ పాల్గొంటున్నావో..ఏ విధంగా హామీలు అమలు చేస్తావో చెప్పాలని డిమాండ్ చేయడంతో ఎంపీ వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఇక్కడ కూడా పోలీసులు, అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. నక్కపల్లిమండలం రమణయ్య పేట, చినదొడ్డుగల్లు, సీహెచ్వి అగ్రహరంల్లో కూడా పింఛన్‌దారులు అధికారులకు ముచ్చెమటలు పోయించారు. ‘పచ్చ’పాతమే.. జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నాయకుల పెత్తనం ఎక్కువైపోతోందని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే, సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులను కాదని టీడీపీ నాయకుల చేత కార్యక్రమాలు నిర్వహించడం సరికాదన్నారు. చూస్తుంటే ఇది ప్రభుత్వ కార్యక్రమమా? లేదా ‘పచ్చ’పార్టీ కార్యక్రమమా అనే అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు. పాడేరు మండలం సలుగు, మోదాపల్లి గ్రామాల్లో శనివారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమన్నారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత, టీడీపీ నాయకుల వ్యవహార శైలి సక్రమంగా లేదన్నారు. తుఫాన్ సహాయక చర్యల్లోనూ తెలుగు తమ్ముళ్లదే హవా కనిపిస్తోందన్నారు. నిజమైన బాధితులకు పరిహారం దక్కడం లేదన్నారు. టీడీపీ అనుచరులకే సాయం అందుతోందన్నారు. మారుమూల గిరిజనులు ఇప్పటికీ నిత్యావసరాలకు నోచుకోలేదన్నారు. బాధితులకు పూర్తి సాయం కోసం వైఎస్సార్సీపీ పోరాటం సాగిస్తుందన్నారు. -గిడ్డి ఈశ్వరి, ఎమ్మెల్యే, పాడేరు -
వెలగపూడి ఓ క్రిమినల్: వంశీకృష్ణ
విశాఖపట్నం: టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు హత్యారాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంశీకృష్ణ యాదవ్ విమర్శించారు. వెలగపూడి ఒక క్రిమినల్ అని ధ్వజమెత్తారు. వంగవీటి రాధాకృష్ణ హత్య కేసులో వెలగపూడి ఏ-2 ముద్దాయిగా ఉన్నారని, ఆయన విశాఖలో హత్య రాజకీయాలు పెంచిపోషిస్తున్నారని ఆరోపించారు. ఓటమి భయంతోనే తనపై అనవసర ఫిర్యాదులు చేశారని అన్నారు. విశాఖ తూర్పు అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వంశీకృష్ణ యాదవ్ పోటీచేస్తున్నారు. ఆయన నామినేషన్‌ను అధికారులు మంగళవారం ఆమోదించారు. -
వెలగపూడిపై ఏసీబీ ఉచ్చు?
హైకోర్టు నిర్ణయంతో కదలనున్న మద్యం కేసు గతంలో విచారించి వదిలేసిన వైనం సిండికేట్ల జాబితాలో ఎంఎల్ఎకి చెందిన వైన్స్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీకి చెందిన తూర్పు నియోజక వర్గ శాసన సభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబుపై మద్యం కేసు ఉచ్చు బిగయనుంది. మద్యం కేసుల నుంచి ప్రజాప్రతినిధులను, ముఖ్యులను మినహాయించడాన్ని హైకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో గతం లో ఏసీబీ విచారణను ఎదుర్కొన్న రామకృష్ణబాబుపై కేసు నమోదు చేసే అవకాశాలున్నాయని తెలిసింది. ఎంఆర్ పీ ధరలను కాదని అధిక ధరలకు మద్యం విక్రయించుకునేందుకు ఉత్తరాంధ్రాలోని పలు మద్యం సిండికేట్లు అధికారులకు లక్షల్లో లంచాలు ఇచ్చాయి. సిండికేట్లపై ఏసీబీ అధికారులు జరిపిన దాడు ల్లో లంచాల చిట్టా బయటపడింది. వీటి ఆధారంగా ఏసీబీ అధికారులు అప్పట్లో మద్యం సిండికేట్ అధినేతలైన పుష్కర గణేష్, జనప్రియ ప్రసాద్‌లను అరెస్టు చేశారు. వీరు 92 రోజుల పాటు జైలులో కూడా ఉన్నారు. వీరి అరెస్టుకు కారణమై న లంచాల వ్యవహారాల్లో శాసనసభ్యుడు వెలగపూడి పేరుండడంతో ఏసీబీ అధికారులు ఆయన్ను విచారించారు. ఈయన ప్రజాప్రతినిధిగా ఉన్న కారణంగా విచారణతోనే వ్యవహారాన్ని ముగించారు. సిండికేట్ల జాబితాలో వెలగపూడికి చెందిన విజయ వైన్స్ సిండికేట్ పేరు బహిర్కతమైంది. విమానంలో హైదరాబాద్ వెళ్లేం దుకు సిండికేట్ డబ్బులతో టిక్కెట్లు కొనుగోలు చేసిఇచ్చినట్లు వెలగపూడి పేరు ము డుపుల జాబితాలో రాసి ఉన్నా ఆయన ప్రజాప్రతినిధి కావడంతో ఏమీ చేయకుండా వదిలేశారనే విమర్శలు గుప్పుమన్నాయి. ప్రజాప్రతినిధులను ప్రత్యేకంగా చూడాలంటూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వుండగా 1999లో ఇచ్చి న మెమోను బుధవారం హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో వెలగపూడిపై ఏసీబీ తిరిగి విచారణను ప్రారంభించే అవకాశాలున్నాయని అధికారులంటున్నారు. వుడా భూముల స్కాంలో చిక్కుకొన్న వెలగపూడి మున్సిపల్ మంత్రి మహీధర్ రెడ్డి ఆశీస్సులతో బయటపడ్డారు. ఏసీబీ విచారణ మాత్రం తప్పేలాలేదు. -
టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రాజీనామా
విశాఖపట్నం: రాష్ట్ర విభనను నిరసిస్తూ శాసనసభ సభ్యత్యానికి టిడిపికి చెందిన విశాఖఫట్నం తూర్పు నియోజవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రాజీనామా చేశారు. వెలగపూడి మొదటి నుంచి సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను లోక్‌సభ ఆమోదించడంతో అందుకు నిరసనగా ఎంపిలు, ఎమ్మెల్యేల రాజీనామాల పరంపరం కొనసాగుతూ ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ రోజు వెలగపూడి రాజీనామా చేశారు. -
చిరంజీవి రాజీనామా చేయాలి: ఏయూ విద్యార్ది జేఏసీ
రాష్ట విభజనను వ్యతిరేకిస్తూ, సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్రమంత్రి చిరంజీవి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఏయూ విద్యార్థి జేఏసి ఆదివారం విశాఖపట్నంలో డిమాండ్ చేసింది. చిరంజీవి ఫ్యామిలి నటించిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసుకోవచ్చు,కానీ రాష్టంలో విడుదల కాకుండా అడ్డుకుంటామని ఏయూ జేఏసీ విద్యార్థలు ఈ సందర్భంగా హెచ్చరించింది. విద్యార్థుల దీక్షా శిబిరాన్ని స్థానిక టీడీపీఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆదివారం సందర్శించారు. అనంతరం వారికి తన సంఘీభావాన్ని ప్రకటించారు. అలాగే విశాఖపట్నం తొలి పార్లమెంట్ సభ్యుడు కేఎస్ తిలక్ కూడా ఏయూ విద్యార్థి దీక్షా శిబిరాన్ని సందర్శించారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తొందరపడిందన్నారు. ఉద్యమాలతో అట్టుడుకుతున్న ఆంధ్రప్రదేశ్‌ను చూడలేకున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖ నగరంలో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. మద్దలెపాలెం వద్ద ఆందోళనకారులు ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఏయూ విద్యార్థి జేఏసీ చేస్తున్న నిరాహార దీక్ష ఆదివారం ఆరో రోజుకు చేరింది.