
టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రాజీనామా
విశాఖపట్నం: రాష్ట్ర విభనను నిరసిస్తూ శాసనసభ సభ్యత్యానికి టిడిపికి చెందిన విశాఖఫట్నం తూర్పు నియోజవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రాజీనామా చేశారు. వెలగపూడి మొదటి నుంచి సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను లోక్సభ ఆమోదించడంతో అందుకు నిరసనగా ఎంపిలు, ఎమ్మెల్యేల రాజీనామాల పరంపరం కొనసాగుతూ ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ రోజు వెలగపూడి రాజీనామా చేశారు.