సాక్షి అమరావతి: విశాఖపట్నం మధురవాడలో రామానాయుడు స్టూడియో కోసం కేటాయించిన భూమిలో రెసిడెన్షియల్ లేఅవుట్ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ విశాఖ మునిసిపల్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌ను) గురువారం హైకోర్టు కొట్టేసింది.
బాధ్యతాయుత ఎమ్మెల్యే పదవిలో ఉంటూ ఇలాంటి పిల్ వేయడం ఏమిటని హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. వివాదం ప్రైవేటు వ్యక్తుల మధ్య ఉంటే దానిపై పిల్ దాఖలు చేయడం ఏమిటని ప్రశ్నించింది. అది ఫిల్మ్ స్టూడియోకి ఇచ్చిన భూమి అని, ప్రైవేట్ భూ వివాదంలో ప్రభుత్వానికి ఏం సంబంధం ఉందని అడిగింది. ఇది ధనికుల మధ్య వివాదమని, ఇందులో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.
చదవండి: తీవ్ర తుపానుగా ‘మోచా’
ప్రతి దాంట్లో ఉల్లంఘన ఉందంటూ పిల్ దాఖలు చేయడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యంలో ప్రజాప్రయోజనాలు ఎంతమాత్రం లేవని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment