సచివాలయంలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి వీరంగం | tdp mla velagapudi ramakrishna babu misbihaves with burocrat at secrtariat | Sakshi
Sakshi News home page

సచివాలయంలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి వీరంగం

Published Mon, Oct 5 2015 7:38 PM | Last Updated on Sun, Sep 3 2017 10:29 AM

సచివాలయంలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి వీరంగం

సచివాలయంలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి వీరంగం

హైదరాబాద్: ఉన్నతాధికారి పట్ల అధికార టీడీపీ ఎమ్మెల్యే ఒకరు ఆధిపత్యాన్ని ప్రదర్శించడమేకాక అనుచితంగా ప్రవర్తించిన ఉదంతం సోమవారం సచివాలయంలో చోటుచేసుకుంది. సాయింత్రం నాలుగు గంటల ప్రాంతంలో సచివాలయంలోని మున్సిపల్ శాఖ కార్యదర్శి కరికాల వలవన్ కార్యాలయానికి వచ్చిన విశాఖపట్టణం నగరం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు.. అక్కడ వీరంగం సృష్టించారు.

కరికాల వలవన్ ఛాంబర్ లో విదేశీ ప్రతినిధులతో సమావేశమై ఉండగా.. వెలగపూడి ఆకస్మాత్తుగా ప్రవేశించి తనకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదంటూ ఆయనపై నిప్పులు చెరిగారు. అంతటితో ఆగక... పేషీ సిబ్బందిపై ఫైళ్లను విసిరికొట్టారు. నీళ్ల గ్లాసును నేలకేసి బద్దలు కొట్టారు. ఎమ్మెల్యే తీరుతో కార్యాలయ సిబ్బందికేకాక విదేశీయులను సైతం ఆశ్యర్యానికి గురయ్యారు. అనంతరం వెలగపూడి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement