విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పై వైఎస్ఆర్‌సీపీ నాయకుడు వంశీకృష్ణ ఫైర్ అయ్యారు.
విశాఖ: విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పై వైఎస్ఆర్‌సీపీ నాయకుడు వంశీకృష్ణ ఫైర్ అయ్యారు. నేర చరిత్ర గలిగి.. సారా వ్యాపారంతో అడ్డ దారిలో కోట్ల రూపాయలు సంపాదించిన నీవు మా నాయకుడిపై విమర్శిస్తావా'' అంటూ మండిపడ్డారు. భూదందాలు చేస్తూ... దొంగ ఓట్లేయించుకుని... మోసాలకు పాల్పడడమే కాకుండా తిరిగి ఎదురు దాడిగి దిగుతున్నావా' అంటూ ఎమ్మెల్యే వెలగపూడిని ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ ఉత్తరాంధ్ర ప్రజల వైద్యం కోసం విమ్స్ ను ఏర్పాటు చేస్తే... ఇప్పటి వరకు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి కూడా నోచుకోకుండా అడ్డంకులు సృష్టిస్తుంది మీరు కాదా అని వైఎస్ఆర్‌సీపీ నాయకుడు వంశీకృష్ణ ప్రశ్నించారు.