Vims hospital
-
విమ్స్ ను అభివృద్ధి బాటలో పట్టిన సీఎం వై ఎస్ జగన్ ప్రభుత్వం
-
విశాఖ విమ్స్ లో మెరుగైన వైద్య సేవలు
-
విశాఖ విమ్స్ ను సందర్శించిన మంత్రి ఆళ్ల నాని
-
‘కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ కొరత లేదు’
-
‘విమ్స్ ఎప్పటికీ ప్రభుత్వ అధీనంలోనే’
సాక్షి, విశాఖపట్నం : దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాంతరం విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్) ఆస్పత్రిని నిర్లక్ష్యం చేశారని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన విమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా మట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విమ్స్ ఆస్పత్రిలో పేషెంట్లకు అందుకున్న చికిత్స, వసతులపై సమీక్షించామన్నారు. మొదట్లో విమ్స్ పట్ల అనేక విమర్శలు వచ్చినప్పటికీ నేడు పాఠశాలలను ఎలా అభివృద్ధి చేశామో అదే నాడు-నేడు తరహాలో విమ్స్‌లో అభివృద్ధి కన్పిస్తుందన్నారు. ఆప్పత్రిలో 12 ఐసీయూ వార్డులు, 10 ఐసోలేషన వార్డులు ఉన్నాయని తెలిపారు. (ఏపీలో రెండోసారి కరోనా రాలేదు..) విమ్స్‌లో వైద్య సిబ్బంది కోరత ఉందని, సుమారు 320 పారమెడికల్ సిబ్బందితో పాటు, వైద్యుల భర్తీ త్వరలోనే చేపడతామన్నారు. కరోనా రోగులతో ఒక్కొక్కరిగా మాట్లాడామని, ఎవరికి ఆక్సిజన్ కొరత లేదన్నారు. ప్రతి ఒక్కరికి మంచి ఆహారం అందిస్తున్నారని రోగులు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. అయితే చంద్రబాబు విమ్స్‌ను ప్రైవేట్ పరం చేయాలని అనుకున్నారని, కానీ ఎప్పటికీ విమ్స్ ప్రభుత్వ అధీనంలోనే ఉంటుందన్నారు. విమ్స్‌లో రోగులను పరమర్శించేందుకు గంటపాటు పీపీఈ కిట్ ధరిస్తే తనకే ఆక్సిజన్ అందక ఊపిరాడలేదని, అలాంటిది 6 గంటలపాటు పీపీఈ కిట్లు ధరిస్తూ పనిచేస్తున్న వైద్యుల సేవ మరువలేనిదని కొనియాడారు. విమ్స్ డైరెక్టర్ వరప్రసాద్‌కు, సిబ్బందికి విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. (వైఎస్సార్ జిల్లాకు బయలుదేరిన సీఎం జగన్) -
ఎయిమ్స్ తరహాలో విమ్స్ అభివృద్ధి
సాక్షి, ఆరిలోవ(విశాఖతూర్పు): కొత్త ప్రభుత్వం ఆలోచన మేరకు ఎయిమ్స్ తరహాలో విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)ను త్వరితగతిన అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర వైద్య సంస్కరణల నిపుణుల కమిటీ చైర్పర్సన్ డాక్టర్ సుజాతారావు తెలిపారు. గురువారం సాయంత్రం ఆమె ఆధ్వర్యంలో విమ్స్‌ను కమిటీ సందర్శించింది. సభ్యులు డాక్టర్ భూమారెడ్డి చంద్రశేఖర్, డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు, డాక్టర్ బి.సాంబశివరెడ్డి, డాక్టర్ కాశిరెడ్డి సతీస్కుమార్రెడ్డి, డాక్టర్ దుత్త రామచంద్రరావు, చెంగపల్లి వెంకట్ సందర్శించారు. విమ్స్‌ను పరిశీలించిన అనంతరం ఇక్కడ డైరెక్టర్ డాక్టర్ కె.సత్యవరప్రసాద్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్, ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి సుధాకర్, జీవీఎంసీ డీఎంహెచ్‌వో తదితరులతో నిర్వహించిన కమిటీ సమావేశంలో ఎయిమ్స్ తరహాలో విమ్స్‌ను తీర్చిదిద్దడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం కేజీహెచ్, విమ్స్ వైద్య నిపుణులు, జీవీఎంసీ హెల్త్ విభాగం, హెల్త్ సిటీ ప్రతినిధులు, జిల్లాలో పలు స్వచ్ఛంద సేవా సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వైద్య నిపుణుల నుంచి ప్రజలకు మెరుగైన వైద్య వైద్య సేవలు అందించడానికి కావాల్సిన సలహాలు, సూచనలు సేకరించారు. వైద్యుల సూచనలు.. ► కేజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవల కోసం ప్రభుత్వం దృషిపెట్టాలి. ► ఆంధ్రా మెడికల్ కాలేజీలో విద్యార్థులకు సదుపాయాలు కల్పించి, కొరతగా ఉన్న ప్రొఫెసర్ల నియామాకం చేపట్టాలి. ► విమ్స్‌లో త్వరలో అన్ని సూపర్ స్పెషాలిటీలతో పేదలకు వైద్య సేవలు అందించడానికి సన్నాహాలు చేపట్టాలి. ► అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు లేక రోగులు కేజీహెచ్‌కు తరలివస్తున్నారు. అనకాపల్లిలో వెంటిలేటర్ల సదుపాయం ప్రభుత్వ ఆస్పత్రిలో లేదు. ఆ సౌకర్యం అక్కడ మెరుగుపడాలి. ► శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో నివసిస్తున్న ప్రజల్లో కిడ్నీ బాధితులు 40 శాతం మంది ఉన్నారు. వారికి మెరుగైన సదుపాయాలు ఇంతవరకు కల్పించ లేదు. అక్కడే డయాలసిస్ సెంటర్లు, పరీక్ష కేంద్రాలు, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేయాలి. ► 30 ఏళ్లుగా సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తున్న వైద్య నిపుణులకు పదోన్నతులు కల్పించ లేదు. ఇటీవల నియామకమైన జూనియర్ వైద్యులతో సమాన కేడర్‌తో పని చేయాల్సి వస్తుంది. పదోన్నతులు కల్పించి ఉత్సాహంగా పనిచేసే వాతావరణం వైద్యుల్లో కల్పించాలి. ► పేద రోగులకు అతి తక్కువ ఫీజులతో స్వచ్ఛంద సంఘాలు నిర్వహిస్తున్న ఆస్పత్రులకు ప్రభుత్వం నుంచి సహకారం అందించాలి. అలాంటి వాటిని గుర్తించి ఆరోగ్యశ్రీలో నిబంధనలు సడలించితే బాగుంటుంది. ► విశాఖలో డెంటల్ కేర్‌కు సంబధించి ప్రభుత్వ వైద్య విభాగాన్ని అందుబాటులోకి తేవాలి. ► నగరంలో అందిస్తున్న ఐఎంఏకు ప్రత్యేకంగా శాశ్వత భవనం లేదు. దానికోసం విమ్స్‌లో ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించగలిగితే మేలు జరుగుతుంది. వినతులు.. విమ్స్‌లో శాశ్వత వైద్యులను నియమించాలని, వారి పదోన్నతులు తదితర వాటిపై ఇక్కడ వైద్యులు వైద్య సంస్కరణల నిపుణుల కమిటీకి వినతిపత్రం అందించారు. దీనికి స్పందించిన కమిటీ చైర్పర్సన్ డాక్టర్ సుజాతారావు ఈ విషయం కమిటీ పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానన్నారు. విమ్స్‌లో పనిచేస్తున్న శానిటరీ వర్కర్లు ఆమెకు వినతిపత్రం ఇచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న 75 మంది వర్కర్లు ఆమెతో మాట్లాడి కాంట్రాక్టర్ నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వలేదని, అవి కూడా చాలీచాలని వేతనాలే చెల్లిస్తున్నారని గోడు వెల్లబుచ్చారు. దీనిపై స్పందించిన చైర్పర్సన్ విమ్స్ డైరెక్టర్‌ను విషయం అడిగి తెలుసుకొన్నారు. వారి సమస్య వెంటనే పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో పాల్గొన్న వివిధ విభాగాల వైద్యులు ఆరోగ్య సంస్కరణలపై సీఎం దృష్టి.. వైద్యుల సమావేశంలో డాక్టర్ సుజాతారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ఆరోగ్య సంస్కరణలపై దృష్టి చారించారని తెలిపారు. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఉన్నారన్నారు. వైద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తేడానికి వైద్య సంస్కరణల నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ మార్పుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య నిపుణులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు సహకరించాలని ఆమె కోరారు. వారంతా ఇచ్చిన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని నివేదిక తయారు చేస్తామన్నారు. దానిని ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా విశాఖలో సమావేశం నిర్వహించినట్లు ఆమె వెల్లడించారు. -
విమ్స్ సేవలు పూర్తిగా ఉచితం
సాక్షి, విశాఖపట్నం : విమ్స్ సేవలు పూర్తిగా ఉచితమని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పూనం మాల కొండయ్య చెప్పారు. ఎవరి వద్ద పైసా కూడా వసూలు చేయబోమన్నారు. సాక్షిలో గురువారం కథనం ప్రచురితమైన నేపథ్యంలో ఆమె స్పందిస్తూ విమ్స్‌ను బలోపేతం చేస్తామే తప్ప ప్రైవేటుపరం చేయబోమని భరోసా ఇచ్చారు. విమ్స్‌లో ఖాళీగా ఉన్న వైద్యులు, ఇతర పోస్టులను పర్మినెంట్ రిక్రూట్మెంట్ పద్ధతిలోనే భర్తీ చేస్తామన్నారు. దీనిపై వచ్చే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ట్రామా సర్వీసెస్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ ప్రభుత్వపరంగా చేస్తున్నామన్నారు. కేజీహెచ్‌లో కూడా అందుబాటులో లేని సూపర్ స్పెషాలిటీ సేవలను విమ్స్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. కార్డియాలజీతో సహా ఆరు విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ బ్లాకులను అందుబాటులోకి తీసుకొస్తున్నారన్నారు. ఇక్కడ ఎన్ని సౌకర్యాలు కల్పించినా పూర్తిగా ఉచితమే తప్ప ఏ అధునాతన సేవకు పైసా వసూలు చేసే ప్రసక్తే లేదన్నారు. విమ్స్‌లో టాటా క్యాన్సర్ సెంటర్ వస్తోందని, వాళ్లకు అవసరమైన సపోర్టు ఇస్తున్నామన్నారు. క్యాన్సర్‌లో స్టేజ్ స్టెమ్‌సెల్స్ రీసెర్చ్ ద్వారా మాత్రమే నివారించగలమని, ఈ అవకాశం రాష్ట్రంలో ఏ కార్పొరేట్ ఆస్పత్రిలోనూ లేదన్నారు. దీన్ని త్వరలో విమ్స్‌లో తీసుకొస్తున్నామన్నారు. ఈ సర్వీసులన్నీ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఏర్పాటు చేయడం లేదని, పూర్తిగా ప్రైవేటు పార్టనర్ షిప్‌తో ఏర్పాటు చేస్తున్నామన్నారు. చేసిన సేవలకుగాను వాళ్లకు పర్సంటేజ్ ఇస్తామే తప్ప రోగుల నుంచి ఆయా సంస్థలు పైసా కూడా వసూలు చేయనీయమన్నారు. ఇందుకయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్య రక్ష పరిధిలోకి రాని వ్యాధులకు కూడా విమ్స్‌లో ఉచితంగా సేవలందుతాయన్నారు. -
ఎమ్మెల్యే వెలగపూడిపై వంశీకృష్ణ ఫైర్
విశాఖ: విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పై వైఎస్ఆర్సీపీ నాయకుడు వంశీకృష్ణ ఫైర్ అయ్యారు. నేర చరిత్ర గలిగి.. సారా వ్యాపారంతో అడ్డ దారిలో కోట్ల రూపాయలు సంపాదించిన నీవు మా నాయకుడిపై విమర్శిస్తావా'' అంటూ మండిపడ్డారు. భూదందాలు చేస్తూ... దొంగ ఓట్లేయించుకుని... మోసాలకు పాల్పడడమే కాకుండా తిరిగి ఎదురు దాడిగి దిగుతున్నావా' అంటూ ఎమ్మెల్యే వెలగపూడిని ప్రశ్నించారు. దివంగత నేత వైఎస్ ఉత్తరాంధ్ర ప్రజల వైద్యం కోసం విమ్స్ ను ఏర్పాటు చేస్తే... ఇప్పటి వరకు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి కూడా నోచుకోకుండా అడ్డంకులు సృష్టిస్తుంది మీరు కాదా అని వైఎస్ఆర్సీపీ నాయకుడు వంశీకృష్ణ ప్రశ్నించారు. -
విమ్స్‌కు కొత్త డెరెక్టర్ రాక ?
ఇన్చార్జ్ డెరైక్టర్ పదవికి స్వసి ్తపలకనున్న ప్రభుత్వం..? బళ్లారి (తోరణగల్లు): వైద్యసేవల్లో ఆధునిక వసతులు కలిగిన ఆసుపత్రిగా రాష్ట్రంలోనే ద్వితీయ సా ్థనాన్ని పొందిన విమ్స్ ఆసుపత్రికి గత నాలుగేళ్లుగా పర్మనెంట్ డెరైక్టర్‌ను నియమించకుండా ఇన్‌చార్జ్‌ల నియామకాలతో ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోంది. ఇన్చార్జ్ డెరైక్టర్లు తమ పదవి ఎప్పుడు ఊడుతుందోనని ఆ పదవిని కాపాడుకోవడానికే పాకులాడుతూ విమ్స్ అభివృద్ధిని విస్మరించారు. దీంతో ఆసుపత్రి లో సమస్యలు కుప్పలు తెప్పలుగా పేరుకు పోయా యి. మరో పక్క రోగులకు కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. తాగునీరు, పలు విభాగాల్లో చికిత్సకు అవసరమైన యంత్రాలు మూలపడినా పట్టించుకున్న పా పాన పోలేదు. రోగులకు వైద్యసేవలు అందక కు య్యో మొర్రో అంటున్నా వినిపించుకొనే నాధుడు క రువయ్యాడు. నానాటికి దిగజారుతున్న విమ్స్ అభివృద్ధి పట్ల జిల్లాలోని పలుసంఘాలు, ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ దిశలో రాష్ట్ర వైద్య విద్యా శాఖ విమ్స్‌కు పర్మనెంట్ డెరైక్టర్ నియామకంపై దృష్టి సారించింది. దీనికి తోడు కోర్టులో ఉన్న విమ్స్ డెరైక్టర్ పోస్టు వివాదం ముగిసింది. డెరైక్టర్ నియామక చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి కోర్టు సూచించడం మార్గం సుగమమైంది. అయితే పర్మనెంట్ డెరైక్టర్ పోస్టు కోసం ఏడుగురు సీనియర్ వైద్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. డెరైక్టర్ పదవిని దక్కించుకోవడానికి రాజకీయ నాయకులతో పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో పని చేసిన ఇద్దరు ఇన్చార్జ్ డెరైక్టర్లు, ఇతర జిల్లాలో వైద్య కళాశాలకు డెరైక్టర్‌గా పని చేస్తున్న మరో వైద్యుడి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో గతంలో ఇన్చార్జ్ డెరైక్టర్‌గా పని చేసిన ఓ వైద్యుడు పర్మనెంట్ డెరైక్టర్‌గా వారం రోజుల్లో నియామక ఉత్తర్వులు తీసుకోనున్నారని విశ్వనీయ సమాచారం. -
ఏ ప్రభుత్వం పట్టించుకోని వైనం
-
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం
సాక్షి, బళ్లారి : రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం పాలైన దుర్ఘటన గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సింధనూరుకు చెందిన పూర్ణయ్య (63) కోటేశ్వరమ్మ (55) దంపతులు మరో ముగ్గురితో కలిసి బళ్లారికి మారుతీ స్విఫ్ట్ కారులో వస్తుండగా బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకా సింధిగేరి గ్రామ సమీపంలో ఉదయం 7 గంటల సమయంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టుకు ఢీకొనడంతో పూర్ణయ్య, కోటేశ్వరమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్‌తోపాటు కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ స్పృహ కోల్పోయాడు. అయితే క్షతగాత్రులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే బళ్లారి రూరల్ డీఎస్పీ రుద్రమని, కురుగోడు సీఐ లక్ష్మికాంతయ్య, ఎస్ఐ సోమశేఖర్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కురుగోడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.