Vamsi Krishna
-
6 బంతుల్లో 6 సిక్స్‌లు.. యువీని గుర్తు చేశాడుగా! వీడియో వైరల్
కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ జాతీయ అండర్ -23 క్రికెట్ టోర్నీలో ఆంధ్ర ఓపెనర్ మామిడి వంశీ కృష్ణ 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భాగంగా రైల్వేస్ జట్టుతో ఆదివారం ప్రారంభమైన మ్యాచ్‌లో వంశీ ఈ ఫీట్ నమోదు చేశాడు. రైల్వేస్ లెగ్ స్పిన్నర్ దమన్‌దీప్ సింగ్ వేసిన 10వ ఓవర్లో వరుసగా 6 సిక్స్‌లు బాది వంశీ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో 64 బంతులు ఎదుర్కొన్న వంశీ కృష్ణ 9 ఫోర్లు, 10 సిక్స్‌లతో 110 పరుగులు చేశాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా బీసీసీఐ ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మూడో బ్యాటర్‌గా.. కాగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్‌గా కృష్ణ నిలిచాడు. అతడి కంటే ముందు రవి శాస్త్రి, రుతురాజ్ గైక్వాడ్ భారత్ తరఫున ఈ ఫీట్ నమోదు చేశారు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం భారత తరపున దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఒక్కడే 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదాడు. టీ20 వరల్డ్‌కప్-2007లో ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ వరుసగా 6 సిక్స్‌లు బాదాడు. మ్యాచ్ డ్రా.. ఇక ఆంధ్ర-రైల్వేస్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. రైల్వేస్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించడంతో మ్యాచ్ డ్రా అయింది. మొదటి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రైల్వేస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 865 పరుగుల భారీ స్కోరు సాధించింది. యాన్ష్ యాదవ్ (268), రవి సింగ్ (258) డబుల్ సెంచరీలతో చెలరేగారు. రైల్వేస్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించడంతో మ్యాచ్ చివరిలో డ్రాగా ముగుస్తుంది. అన్ష్ యాదవ్ (268), రవి సింగ్ (258) డబుల్ సెంచరీలు, అంచిత్ యాదవ్ (133) సెంచరీలతో రైల్వేస్ తొలి ఇన్నింగ్స్‌లో 865 పరుగుల భారీ స్కోరు సాధించింది. 𝟔 𝐒𝐈𝐗𝐄𝐒 𝐢𝐧 𝐚𝐧 𝐨𝐯𝐞𝐫 𝐀𝐥𝐞𝐫𝐭! 🚨 Vamshhi Krrishna of Andhra hit 6 sixes in an over off Railways spinner Damandeep Singh on his way to a blistering 64-ball 110 in the Col C K Nayudu Trophy in Kadapa. Relive 📽️ those monstrous hits 🔽@IDFCFIRSTBank | #CKNayudu pic.twitter.com/MTlQWqUuKP — BCCI Domestic (@BCCIdomestic) February 21, 2024 -
ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టిన ఆంధ్ర బ్యాటర్..
కడప స్పోర్ట్స్: కల్నర్ సీకే నాయుడు ట్రోఫీ జాతీయ అండర్–23 క్రికెట్ టోర్నీలో భాగంగా రైల్వేస్ జట్టుతో ఆదివారం మొదలైన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఓపెనర్ మామిడి వంశీకృష్ణ (64 బంతుల్లో 110; 9 ఫోర్లు, 10 సిక్స్‌లు) అద్భుతం చేశాడు. గుంటూరు జిల్లాకు చెందిన 22 ఏళ్ల వంశీకృష్ణ ఒకే ఓవర్లోని వరుస 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టి సంచలనం సృష్టించాడు. వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో జరుగుతున్న ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 372 పరుగులు చేసింది. రైల్వేస్ లెగ్ స్పిన్నర్ దమన్‌దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో వంశీకృష్ణ 6 బంతుల్లో 6 సిక్స్‌లు సంధించాడు. అనంతరం ఈ జోరు కొనసాగిస్తూ వంశీకృష్ణ 48 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సీకే నాయుడు ట్రోఫీ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆంధ్ర బ్యాటర్‌గా వంశీకృష్ణ రికార్డు నెలకొల్పాడు. మామిడి వంశీకృష్ణతోపాటు వన్‌డౌన్ బ్యాటర్, కెపె్టన్ వంశీకృష్ణ (55; 6 ఫోర్లు, 1 సిక్స్), ధరణి కుమార్ (81; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), వెంకట్ రాహుల్ (61 బ్యాటింగ్; 6 ఫోర్లు) కూడా రాణించారు. ఇంతకుముందు అంతర్జాతీయ వన్డేల్లో హెర్షల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా), జస్కరణ్ మల్హోత్రా (అమెరికా)... అంతర్జాతీయ టి20ల్లో యువరాజ్ సింగ్ (భారత్), కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్)... ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో (మూడు/నాలుగు రోజులపాటు జరిగే మ్యాచ్‌లు) గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్), రవిశాస్త్రి (భారత్), లీ జెర్మన్ (న్యూజిలాండ్)... దేశవాళీ వన్డేల్లో తిసారా పెరీరా (శ్రీలంక), రుతురాజ్ గైక్వాడ్ (భారత్)... దేశవాళీ టి20ల్లో రోజ్ వైట్లీ (ఇంగ్లండ్), లియో కార్టర్ (న్యూజిలాండ్), హజ్రతుల్లా జజాయ్ (అఫ్గానిస్తాన్) ఒకే ఓవర్లో వరుస 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టారు. -
రంగాను చంపిన వ్యక్తి వెలగపూడి: ఎంపీ ఎంవీవీ
-
రవితేజ మాట థ్రిల్లింగ్‌గా అనిపించింది: వంశీ కృష్ణ
‘టైగర్ నాగేశ్వరరావు’ కథని రవితేజగారు మొదట సగం విని, ‘షూటింగ్ ఉంది.. మిగతాది రేపు వింటాను’ అన్నారు. కథ ఆయనకు నచ్చలేదేమో? నాకు ఫోన్ రాదేమో? అనుకున్నాను. మరుసటి రోజు ఆయన ఫోన్ చేయడంతో వెళ్లి మిగిలిన సగం కథ చెప్పాను. క్లయిమాక్స్ చెబుతున్నప్పుడే... ‘జుట్టు పెద్దగా పెంచితే బాగుంటుందా? కళ్లకి లెన్స్‌పెట్టుకోనా?’ అని ఆయన అన్నారు. నాకు అదొక భావోద్వేగమైన సందర్భం’’ అన్నారు డైరెక్టర్ వంశీ కృష్ణ. రవితేజ హీరోగా, తెరకెక్కిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వంశీ కృష్ణ మాట్లాడుతూ– ‘‘టైగర్ నాగేశ్వరరావు ఒక దొంగ అని అందరికీ తెలుసు. మరో కోణంలో మంచి మనసున్న మనిషి. ఈ రెండు కోణాలను సినిమాలో చూపించాను. 1980 నేపథ్యంలో నడిచే కథ ఇది. నా కెరీర్లో బడ్జెట్, స్టార్స్ పరంగా ఇది చాలా భారీ సినిమా. ఈ సినిమాలో గోదావరి బ్రిడ్జ్‌ని రీ క్రియేట్ చేసి, ట్రైన్ సీక్వెన్స్ చేయడం సవాల్‌గా అనిపించింది. ఇక షారుక్ ఖాన్’’ అన్నారు. -
స్పీడ్ పెంచిన మాస్ మహారాజా.. మరో యంగ్ డైరెక్టర్‌కి చాన్స్
కథ నచ్చాలే కానీ.. కొత్త దర్శకులకు చాన్స్‌లు ఇవ్వడంలో ఎప్పుడు ముందుంటాడు మాస్ మహారాజా రవితేజ. ఇప్పటికే ఆయన చాలా మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఇటీవల క్రాక్ సినిమా విజయం తర్వాత రవితేజ స్పీడ్ పెంచాడు. వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఖిలాడి’ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు రవితేజ. అలాగే శరత్ మండవ దర్శకత్వంలోనూ మరో సినిమా చేయనున్నాడు. వీటితో పాటు డైరెక్టర్ మారుతితోనూ మరో చిత్రానికి చర్చలు జరిగాయనే వార్తలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రవితేజ మరో యంగ్ డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్‌నగర్ టాక్ వినిపిస్తుంది. అడివి శేష్-మంచు లక్ష్మీ కాంబినేషన్లో వచ్చిన ‘దొంగాట’ సినిమాకు దర్శకత్వం వహించిన వంశీకృష్ణ.. ఇటీవల రవితేజకు ఓ కథ వినిపించాడట. స్టోరీ నచ్చడంతో రవితేజ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో రవితేజ సరికొత్త లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు తాను కమిట్ అయిన సినిమాకు పూర్తయ్యాక ఈ మూవీ షూటింగ్ ప్రారంభిస్తారట. రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పూర్తి స్క్రిప్ట్‌ని సిద్దం చేసే పనిలో ఉన్నాడట వంశీకృష్ణ. చదవండి: ఆ రోజు రాత్రి ఐశ్వర్య ఇంటికి వెళ్లిన సల్మాన్.. దూకి చస్తానని బెదిరించి.. -
ఐదు రోజుల్లో తెలిసిపోతుంది..!
వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ఎ.గురురాజ్ నిర్మించిన చిత్రం ‘రక్షక భటుడు’. రిచా పనయ్, బ్రహ్మనందం, ‘బాహుబలి’ ప్రభాకర్, సుప్రీత్, బ్రహ్మాజీ ముఖ్య తారాగణం. ఈ నెల 12న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో గురురాజ్ మాట్లాడుతూ– ‘‘మా చిత్రంలో ఆంజనేయస్వామి పాత్రలో ఎవరు నటించారనే విషయం మరో ఐదు రోజుల్లో తెలిసిపోతుంది. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి’’ అన్నారు. ‘‘దిల్’ రాజు, శిరీష్, ఎమ్మెస్ రాజుగారు ఎంతగానో ప్రొత్సహించారు. నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన రామ్‌గోపాల్ వర్మగారిని మర్చిపోలేను’’ అన్నారు వంశీకృష్ణ ఆకెళ్ళ. -
ఉరవకొండ ఎస్ఐ సస్పెన్షన్
అనంతపురం అర్బన్ : ఉరవకొండ ఎస్ఐ వంశీకృష్ణను సస్పెండ్ చేస్తూ డీఐజీ ప్రభాకర్రావుగురువారం ఉత్తర్వులు జారీ చేశారు. చోరీ కేసుకు సంబంధించి ఒక మహిళ ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా జాప్యం చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన డీఐజీ ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. -
మూడు సినిమాలు ఒప్పేసుకున్నాడు
ఉయ్యాల జంపాల, కుమారి 21ఎఫ్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న రాజ్ తరుణ్. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మధ్యలో కెరీర్ కాస్త తడబడినట్టు కనిపించినా.. ఆడోరకం ఈడో రకం సినిమాతో తిరిగి ట్రాక్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం మీడియం బడ్జెట్‌తో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్లకు రాజ్ తరుణ్ బెస్ట్ ఛాయిస్‌గా మారాడు. కామెడీ టైమింగ్‌తో పాటు డిఫరెంట్ డైలాగ్ డెలివరీ రాజ్ తరుణ్‌కు ప్లస్ అయ్యంది. అదే బాటలో ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వరుసగా మూడు సినిమాలకు అంగకీరించాడు రాజ్ తరుణ్. ప్రస్తుతం ఇదే బ్యానర్లో దొంగాట ఫేం వంశీ కృష్ణ దర్శకత్వంలో రాజుగాడు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు సంజనా రెడ్డి దర్శకత్వంలో మరో సినిమాకు సంబందించిన కథా చర్చల్లో పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు వెలిగొండ శ్రీనివాస్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న కామెడీ ఎంటర్టైనర్లోనూ రాజ్ తరుణ్ హీరోగా నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూడు సినిమాలను మూడు, నాలుగు నెలల గ్యాప్‌తో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. -
ఆ సినిమా ఆగిపోలేదట..!
ఆడో రకం.. ఇడో రకం తరువాత యంగ్ హీరో రాజ్ తరుణ్‌పై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడని, స్క్రిప్ట్, దర్శకత్వం లాంటి వాటిల్లో ఇబ్బంది పెడుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే పెద్ద నిర్మాణ సంస్థల నుంచి వచ్చిన ఆఫర్స్ కూడా ఈ యంగ్ హీరోకు దూరమయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. రాజ్ తరుణ్ ప్రస్తుతం ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సినిమా చేస్తున్నాడు. రక్ష సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వంశీకృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. అయితే కొద్దిరోజులుగా ఈ సినిమా కూడా ఆగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. రాజ్ తరుణ్ ప్రవర్తన వల్లే దర్శకుడు ఈ సినిమా నుంచి తప్పుకొన్నాడని భావించారు. అయితే అలాంటిదేమీ లేదని చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యిందని, త్వరలోనే సెకండ్ షెడ్యూల్ మొదలవుతుందని ప్రకటించారు. అంతేకాదు రాజ్ తరుణ్ హీరోగా మరో సినిమాను కూడా త్వరలోనే ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించారు ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు. ఈ సినిమాతో సంజనారెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత ప్రముఖ రచయిత వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా ఏకె ఎంటర్టైన్మెంట్స్ మూడో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతోంది. -
ఎవరూ టచ్ చేయని కథతో...
కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని, హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నారు సునీల్. ఆయన హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘జక్కన్న’. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఆర్.పి.ఎ. క్రియేషన్స్ పతాకంపై ఆర్. సుదర్శన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీపార్ట్ పూర్తయ్యింది. పాటల చిత్రీకరణ కోసం త్వరలో విదేశాలు వెళ్లనున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని కథతో వంశీకృష్ణ చాలా ఆసక్తికరంగా రూపొందించారు. అందరినీ అలరించే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. మా సంస్థ నుంచి వచ్చిన మొదటి సినిమా ‘ప్రేమకథా చిత్రమ్’లో ఎన్ని ట్విస్టులు ఉంటాయో ఈ చిత్రంలో అన్ని ఉంటాయి. ఈ నెలాఖరులో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. జూన్ మూడో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దినేష్, కెమెరా: రాం ప్రసాద్, సహ నిర్మాతలు: ఆముష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి. -
జీవితంపై విరక్తితో ఆత్మహత్య
నెల్లూరు: జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరు పడారుపల్లి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వంశీకృష్ణ (35) వివాహితుడు కాగా, భార్యతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. జీవితంపై విరక్తి చెందడంతో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా... బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. -
ఎమ్మెల్యే వెలగపూడిపై వంశీకృష్ణ ఫైర్
విశాఖ: విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పై వైఎస్ఆర్సీపీ నాయకుడు వంశీకృష్ణ ఫైర్ అయ్యారు. నేర చరిత్ర గలిగి.. సారా వ్యాపారంతో అడ్డ దారిలో కోట్ల రూపాయలు సంపాదించిన నీవు మా నాయకుడిపై విమర్శిస్తావా'' అంటూ మండిపడ్డారు. భూదందాలు చేస్తూ... దొంగ ఓట్లేయించుకుని... మోసాలకు పాల్పడడమే కాకుండా తిరిగి ఎదురు దాడిగి దిగుతున్నావా' అంటూ ఎమ్మెల్యే వెలగపూడిని ప్రశ్నించారు. దివంగత నేత వైఎస్ ఉత్తరాంధ్ర ప్రజల వైద్యం కోసం విమ్స్ ను ఏర్పాటు చేస్తే... ఇప్పటి వరకు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి కూడా నోచుకోకుండా అడ్డంకులు సృష్టిస్తుంది మీరు కాదా అని వైఎస్ఆర్సీపీ నాయకుడు వంశీకృష్ణ ప్రశ్నించారు. -
ఫామ్ హౌస్ పార్టీలో విషాదం
మేడిపల్లి: రంగారెడ్డి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వేకువజామున ఒక యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మేడిపల్లి శివారులోని చెంగిచెర్ల మ్యారీగోల్డ్ ఫామ్‌హౌస్‌లో సోమవారం రాత్రి జరిగిన ఓ బర్త్ డే పార్టీలో పాల్గొన్న వంశీకృష్ణ అనే యువకుడు స్విమ్మింగ్‌పూల్‌లో శవమై తేలాడు. వంశీకృష్ణ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు మంగళవారం ఉదయం పామ్హౌస్ను పరిశీలించి 17 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వంశీకృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశారు. ఫామ్ హౌస్ లో అనుమతి లేకుండా పార్టీ చేసుకున్నట్టు తెలుస్తోంది. -
మైఖేల్జాక్సన్ రికార్డును బ్రేక్ చేసిన తెలంగాణ విద్యార్థి
-
క్రికెట్లో బాల్ తగిలి బాలుడి మృతి
హైదరాబాద్‌లో ఘటన.. కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు హైదరాబాద్: క్రికెట్ ఆడుతున్న బాలుడికి ప్రమాదవశాత్తు హార్డ్ టెన్నిస్ బాల్ తగలడంతో మృతి చెందాడు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... ఒంగోలుకు చెందిన గోవిందరాజులు, అనిత మన్సూరాబాద్ సహారా స్టేట్స్‌కాలనీలో నివసిస్తున్నారు. అతనికి ముగ్గురు పిల్లలు. పెద్దబ్బాయి వంశీకృష్ణ (6) స్థానిక నాగార్జున పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. గురువారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వంశీకృష్ణ మిత్రులు భవదీప్, సాయిచంద్ర, కార్తీక్, ప్రణయ్, విజయ్‌లతో కలసి గంగాధార్ బ్లాక్ పార్కింగ్ స్థలంలో క్రికెట్ ఆడుతున్నారు.విజయ్ కొట్టిన బాల్ వంశీకృష్ణ ఛాతీకి తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న వంశీకృష్ణ తల్లిదండ్రులు బాలుడుని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు బాలుడు మృతి చెందాడని తెలిపారు. అది విన్న బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వంశీకృష్ణ చదువులోనే కాకుండా అన్ని పనులను తెలివిగా, చురుకుగా చేస్తుంటాడని, ఇలా జరగడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా వంశీకృష్ణ మృతి వార్త తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం శుక్రవారం పాఠశాలకు సెలవు ప్రకటించింది. వసస్థలిపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గొంతు సవరించుకున్నదోచ్!
నటి మంచు లక్ష్మీ ప్రసన్న మరోసారి వార్తల్లోకి వచ్చారు. టీవీలో, సినిమాలో నటన, చిత్ర నిర్మాణం తరువాత ఇప్పుడు ఆమె గాయని అవతారం ఎత్తారు. త్వరలో విడుదల కానున్న ‘దొంగాట’లో ఆమె ఒక పాట పాడారు. వంశీకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆ చిత్రంలో రఘు కుంచె సంగీతం అందించగా, వరికుప్పల యాదగిరి రాసిన పాటకు లక్ష్మీ ప్రసన్న గళమిచ్చారు. ‘‘ఆ పాట నేనే పాడాలని మా చిత్ర యూనిట్ అంతా అన్నారు. సంగీత దర్శకుడు రఘు కూడా నేనే పాడాలని పట్టుబట్టారు. నేను పాడగలనని బలంగా నమ్మారాయన’’ అని లక్ష్మీ ప్రసన్న ఆనందంగా చెప్పారు. నిజానికి, మూడేళ్ళ క్రితం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోని ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలోనే ఈ బహుముఖ నటి పాడాల్సి ఉంది. ఆ చిత్రంలోని ‘డిస్ట్రబ్ చేస్తున్నాడే దేవుడు...’ పాట పాడించాలని రఘు ప్రయత్నించారట. కానీ, కుదరలేదు. కాగా, ఇప్పుడు ‘తీన్మార్’ తరహాలో సాగే ఈ పాటను నాలుగే నాలుగు గంటల్లో రికార్డింగ్ పూర్తి చేశారు లక్ష్మీ ప్రసన్న. అలా తొలిసారిగా సినిమాల కోసం గొంతు సవరించుకున్నారు. ‘‘నేను సినీ నేపథ్యగాయనిని అయితే చూడాలని మా నాన్న కోరిక. ఎన్నో ఏళ్ళ తరువాత ఇప్పుడాయన కోరిక నెరవేరింది’’ అని ఆమె చెప్పారు. నిజజీవితంలో కర్ణాటక సంగీతం నేర్చుకున్న లక్ష్మీ ప్రసన్న తాజా సినీ గానం విని ఆమె కుటుంబమంతా సంగీత దర్శకుడికి ఫోన్ చేసి మరీ, ప్రత్యేకంగా అభినందిస్తున్నారట! -
టీఆర్ఎస్ ఆగడాలు శృతి మించాయి
అచ్చంపేట : ఆదివారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆగడాలు తారాస్థాయికి చేరాయని.. త్వరలోనే టీఆర్ఎస్ ఖంగు తినే ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. -
‘మూన్‌వాక్’లో రికార్డు బ్రేక్ చేస్తా..
ఇప్పటివరకూ మైకేల్‌జాక్సన్ పేరిట గిన్నిస్ బుక్ రికార్డు రికార్డను తిరగరాస్తానంటున్న తాండూరు కుర్రోడు స్వచ్ఛంద సంస్థ సాయం కోసం ఎదురుచూపులు తాండూరు టౌన్: ‘మూన్‌వాక్ డ్యాన్స్’(సంగీతానికి లయబద్ధంగా కాళ్లు ఆడిస్తూ వెనక్కి వెళే ్లడ్యాన్స్)లో మైకేల్‌జాక్సన్ సృష్టించిన గిన్నిస్‌బుక్ వరల్డ్ రికార్డను బ్రేక్ చేస్తానంటున్నాడు తాండూరుకు చెందిన 20 ఏళ్ల కుర్రాడు విశ్వజ ్ఞవంశీకృష్ణ. తాండూరులోని వాల్మీకినగర్‌కు చెందిన విశ్వజ వంశీకృష్ణ పాలిటెక్నిక్ ఫైనల్ఇయర్ చదువుతూ పేదరికంతో మధ్యలోనే ఆపేశాడు. తండ్రి విజయభాస్కరాచారి వడ్రంగి పనిచేస్తుంటాడు. వంశీకృష్ణకు చిన్ననాటి నుంచిై మెకేల్జాక్సన్ డ్యాన్స్ అంటే ప్రాణం. జాక్సన్ డ్యాన్స్ చూ స్తూ తనకు తానుగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండేవాడు. 2002 అక్టోబర్ 22న మ్యూజిక్ వింటూ మైకేల్‌జాక్సన్ అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో డెన్వర్స్ట్రీట్లో గంటలో 2.4కిలోమీటర్లు (1.5మైళ్లు) ఆగకుండా మూన్‌వాక్ చేసి గిన్నిస్రికార్డ సాధించాడు. వంశీకృష్ణ కూడా ఇంటర్నెట్లో సెర్చ్‌చేసి రెండు నెలలపాటు మూన్‌వాక్ ప్రాక్టీస్ చేశాడు. తాను కేవలం 48 నిమిషాల్లోనే 3.7 కిలోమీటర్ల దూరం మూన్‌వాక్ చేస్తానని గిన్నిస్‌బుక్ వారికి మెయిల్ పంపాడు. అయితే మొదట ఏదైనా స్వచ్ఛంద సంస్థ ఎదుట రికార్డను ప్రదర్శించాలని, సదరు స్వచ్ఛంద సంస ్థవారు రికార్డును ధ్రువీకరిస్తూ తమకు సిఫార్సు లేఖ పంపితే వచ్చి రికార్డును పరిశీలిస్తామని గిన్నిస్‌బుక్ వారు తిరిగి మెయిల్ పంపించారు. ఈ రికార్డు బ్రేక్ కోసం ఏదైనా స్వచ్ఛందసంస్థ తనకు సహకరిస్తే వారి ఎదుట ప్రదర్శన ఇస్తానని వంశీకృష్ణ పేర్కొంటున్నాడు. తన గిన్నిస్రికార్డుకు సహకరించాలని వేడుకుంటున్నాడు. -
జమ్మూకాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్
ఎల్లారెడ్డిపేట : విహారయాత్రకు వెళ్లిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ జమ్మూకాశ్మీర్ వరదల్లో చిక్కుకున్నాడు. వారందరినీ అధికారులు శ్రీనగర్‌లోని రాజ్‌భవన్‌కు తరలించారు. వరద ఉధృతితో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉత్కంఠ రేపుతోంది. ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటకు చెందిన సురభి వనజ, రామారావు దంపతుల కొడుకు వంశీకృష్ణ మూడేళ్లుగా హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 4న తన ముగ్గురు మిత్రులు బాలకృష్ణ, గోపి, మరొకరితో కలిసి విహారయాత్రకు వెళ్లారు. యాత్రలో భాగంగా జమ్మూకాశ్మీర్‌లో పర్యటిస్తుండగా భారీ వర్షాలతో వరదలొచ్చాయి. దీంతో అక్కడున్న వారితోపాటు వంశీకృష్ణ, అతని మిత్రులను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు వంశీకృష్ణ ఫోన్లో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే శ్రీనగర్‌లోని రాజ్‌భవన్‌లో తలదాచుకున్న వారికి నిత్యం భోజన వసతి లేక ఆకలితో అలమటిస్తున్నారని తమ కొడుకు చెప్పినట్లు తల్లి వనజ కన్నీళ్ల పర్యంతమయ్యారు. కొడుకు క్షేమంగా తిరిగిరావాలని దేవుడికి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. -
రేపట్నుంచి విశాఖలో జగన్ సమైక్య శంఖారావం
విశాఖపట్నం: సమైక్యశంఖారావం యాత్రలో భాగంగా ఈ నెల 8 వతేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నాం పన్నెండున్నర గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకొనే జగన్ అక్కడినుంచి నేరుగా చోడవరం వెళ్లి మధ్యాహ్నాం 3 గంటలకు జరిగే సభలో ప్రసంగిస్తారని ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు. చోడవరం నుంచి సాయంత్రం ఐదు గంటలకు గాజువాక చేరుకొని అక్కడ జరిగే సభలో జగన్ ప్రసంగిస్తారు. ఆనందపురం మండలం పెద్దిపాలెం వద్ద ఉన్న కింగ్స్ గార్డెన్స్ రాత్రి జరిగే మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మనుమడి వివాహానికి హాజరౌతారు. -
సమైక్య శంఖారావం రేపు
వైఎస్సార్సీపీ అధినేత జగన్ జిల్లా పర్యటన మధ్యాహ్నం 3 గంటలకు చోడవరంలో.. సాయంత్రం 5కు గాజువాకలో సభలు విజయవంతం చేయాలని పార్టీ జిల్లా, నగర అధ్యక్షుల పిలుపు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఈ నెల 8వ తేదీన విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన చోడవరంలో జరిగే సభలో ప్రసంగిస్తారని పార్టీ జిల్లా, నగర అధ్యక్షులు చొక్కాకుల వెంకట్రావు, వంశీకృష్ణ శ్రీనివాస్‌లు తెలిపారు. అక్కడి నుంచి సాయంత్రం ఐదు గంటలకు గాజువాక చేరుకొని అక్కడ జరిగే సభలో ఆయన ప్రసంగిస్తారని చెప్పారు. శనివారం రాత్రి విశాఖలోనే బస చేస్తారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జిల్లాలో నిర్వహిస్తున్న ఈ సభలను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని వారు కోరారు. -
'నువ్వేనా అది నీవేనా' మూవీ స్టిల్స్
-
చీటర్ వంశీకృష్ణ అరెస్టు
సాక్షి, విజయవాడ : కోట్లాది రూపాయల మేర జనాన్ని మోసం చేసిన చీటర్ నార్ల వంశీకృష్ణ చివరికి కటకటాలపాలయ్యాడు. ఆయన్ని ఐదురోజులుగా తమ అదుపులో ఉంచుకుని విచారణ చేసిన విజయవాడ పోలీసులు శనివారం అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. వంశీకృష్ణ చేసిన అక్రమాలను విజయవాడ డీసీపీ రవిప్రకాష్ విలేకరులకు వివరించారు. క్రైం విలేకరిగా జీవితం ప్రారంభం... పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నార్ల వంశీకృష్ణ కుటుంబం విజయవాడకు వచ్చి స్థిరపడింది. ఇక్కడే చదివి ఎంబీయే పూర్తిచేసిన అతను 1995-2000 కాలంలో ఒక పత్రికలో క్రైమ్ విలేకరిగా పనిచేశాడు. దీంతో పోలీసులు, ఇతర అధికారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అదే సందర్భంలో వీనస్ ఏజెన్సీ అనే పేరుతో బ్యాంక్ రుణాల రికవరీ సంస్థను ఏర్పాటు చేశాడు. దీనిద్వారా బ్యాంకులతో సంబంధాలు ఏర్పరచుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. విజయవాడ నగరంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే కొందరికి ఆశ చూపాడు. వారి నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఆ మేరకు భూమి కొనుగోలు చేసి.. డెవలప్మెంటు పేరుతో ఇంకా కొందరిని భాగస్వాములను చేసుకున్నాడు. బ్యాంకులకు సంబంధిత భూమిని గ్యారెంటీగా చూపి రూ.1.5 కోట్ల రుణాలు తీసుకున్నాడు. అందుకోసం కొందరి సంతకాలను ఫోర్జరీ చేశాడు. విజయవాడలో రియల్టర్‌గా నిడుమానూరులో వీనస్ ఎన్క్లేవ్, భవానీపురంలో తులసీరాం ఎన్క్లేవ్, తాడేపల్లిలో వైశ్రాయ్ హైట్స్లను నిర్మించాడు. కొన్నిచోట్ల భూమి సొంతదారుడికి ఇవ్వాల్సిన ఫ్లాట్లను ఇతనే బుక్ చేసుకున్నాడు. కొన్ని సందర్భాల్లో ఒకే అపార్టుమెంటును ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమందికి రిజిస్ట్రేషన్ చేసి మోసం చేశాడు. అపార్టుమెంటులో ఫ్లాట్ కోసం అడ్వాన్స్ ఇచ్చిన వారికి నిర్మించి అప్పగించకుండా ఆ డబ్బును సొంత అవసరాలకు, విలాసాలకు ఉపయోగించుకున్నాడు. బినామీ పేర్లతో ఆస్తులను బదిలీ చేశాడు. డబ్బు చెల్లించిన బాధితులు ఇతని మోసం తెలుసుకుని డబ్బు కోసం ఒత్తిడి తెచ్చారు. చనిపోయినట్లు నాటకం... బాధితుల ఒత్తిడి భరించలేని వంశీకృష్ణ గట్టి ప్లాన్ వేశాడు. 2011 జనవరి 3న తన తల్లితో కలిసి విజయవాడ నుంచి తెనాలి వెళ్తుండగా తాను డ్రైవ్ చేస్తున్న కారు దుగ్గిరాల వద్ద ప్రమాదానికి గురైనట్లు నాటకం ఆడి ఆచూకీ లేకుండా పరారయ్యాడు. అదే నెల 11 తర్వాత చెన్నై, కోయంబత్తూరు వెళ్లాడు. కొన్నాళ్ల తర్వాత బెంగళూరు వెళ్లి ఆన్లైన్ ట్రేడింగ్ చేశాడు. తర్వాత హైదరాబాద్, అహ్మదాబాద్‌లలో ఉన్నాడు. తర్వాత వైజాగ్‌లో స్థిరపడ్డాడు. ఊరు, పేరు మార్చుకున్నాడు. అప్పటికే మొదటి భార్య ైశె లజకు విడాకులు ఇచ్చిన వంశీకృష్ణ తర్వాత డాక్టర్ పసుపులేటి ప్రవీణను ద్వారకాతిరుమలలో దండలు మార్చుకొని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రవీణతో విశాఖలో టచ్ ఆస్పత్రిని ప్రారంభించి విలాసాల్లో మునిగిపోయాడు. ఇప్పటివరకు బాధితులు ఇచ్చిన వివరాల ప్రకారం రూ.8 కోట్లు మోసం చేశాడు. కృష్ణలంక పోలీస్‌స్టేషన్ కేసులో అతన్ని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపుతున్నట్లు డీసీపీ వెల్లడించారు. తల్లిని, రెండో భార్యనూ విచారిస్తాం... వంశీకృష్ణపై వేర్వేరు స్టేషన్లలో 10 కేసులు నమోదయ్యాయని డీసీపీ వెల్లడించారు. వీటిపై విచారణ చేపట్టినట్లు చెప్పారు. వంశీకృష్ణ తల్లి క్షేమంగానే ఉన్నారని, ఆమె పరారీలో ఉన్నారని తెలిపారు. ఆమెను, డాక్టర్ ప్రవీణను కూడా తీసుకొచ్చి విచారిస్తామన్నారు. అతని ఆస్తులకు సంబంధించి నలుగురైదుగురు బినామీలు ఉన్నారని చెప్పారు. వారి వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు. మొదటి భార్య శైలజతో మాట్లాడామని, అతని వేధింపులు భరించలేక విడాకులు తీసుకున్నట్టు చెప్పారని వివరించారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ నాగేశ్వరరావు, సీఐ టీఎస్ఆర్కే ప్రసాద్, ఎస్సై సత్యనారాయణ పాల్గొన్నారు. చనిపోవాలనుకున్నా... : నార్ల వంశీకృష్ణ వంశీకృష్ణతో విలేకరులతో మాట్లాడుతూ చనిపోవాలని నిర్ణయించుకున్నాననీ... కానీ పథకం రచించలేదనీ... చివరకు మనసు మార్చుకున్నానని చెప్పాడు. మూడు, నాలుగు కోట్లకు మించి లావాదేవీలు జరగలేదన్నాడు. తాను ఎవరినీ మోసం చేయలేదన్నాడు. తానే 95 శాతం నష్టపోయానన్నాడు. ఐదు శాతం బాధితులు నష్టపోయి ఉండొచ్చన్నాడు. తన వెనుక రాజకీయ నాయకులు ఎవరూ లేరన్నాడు. వడ్డీల భారం ఎక్కువై ఆర్థిక భారం పెరిగి ఇలా అయిందన్నాడు. తనవల్లే అందరూ లాభపడ్డారన్నాడు. -
ఆత్మహత్య చేసుకుందామనే వెళ్లాను : వంశీకృష్ణ
విజయవాడ: అనేక మందిని మోసం చేసి, చివరకు తాను చనిపోయినట్లు కూడా నమ్మించిన మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ నార్ల వంశీ కృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి ఈరోజు మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకుందామనే వెళ్లానని చెప్పాడు. కానీ చివరి నిమిషంలో విరమించుకున్నట్లు తెలిపాడు. తన కేసులో రాజకీయ నేతల హస్తంలేదని చెప్పాడు. అందరూ తన వల్ల లబ్దిపొందినట్లు తెలిపాడు. 4 కోట్ల రూపాయలకు మించి బాకీలు లేవన్నాడు. వంశీ కృష్ణ గతంలో ఓ పత్రికలో క్రైమ్ రిపోర్టర్‌గా కూడా పనిచేశాడు. అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. ఓ తెలుగుదేశం పార్టీ నేత, ఓ సిఐ అండదండలతోనే వంశీ కృష్ణ అనేక మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. నకిలీ డాక్యుమెంట్లు, ఒకే ఫ్లాట్‌ను ఇద్దరు ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేయడం, బ్యాంకులను మోసం చేసి రుణాలు పొందడం.... వంటి అనేక కేసులు అతనిపై ఉన్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలలో అతనిపై పది కేసులు నమోదయ్యాయి. వంశీ కృష్ణను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలియడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. వంశీ కృష్ణ చేతిలో మోసపోయినవారు ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయాలని డిసిపి రవిప్రకాష్ కోరారు. అతనికి పోలీసు శాఖలో ఎవరైనా సహకరించినా వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. -
చీటర్ వంశీకృష్ణతో ‘దేశం’ నేత దోస్తీ !
*వ్యూహాత్మకంగానే పోలీసులకు లొంగుబాటు *ఆస్తులపై నోరు మెదపని వంశీకృష్ణ *అరెస్టుకు రంగం సిద్ధం సాక్షి, విజయవాడ : పోలీసులకు మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ నార్ల వంశీకృష్ణ ప్రజలను మో సం చేయడం వెనుక సెం ట్రల్ నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు పూర్తి సహాయ సహకారాలు అందించినట్లు తెలిసింది. బిల్డర్‌గా ఎంతో గుర్తింపు ఉన్న ఈ నేత సల హాలు, సూచనలతోనే వంశీకృష్ణ బిల్డర్‌గా మారి, తాడేపల్లి, నిడమానూరు తదితర ప్రాంతాల్లో అపార్టుమెంట్లు కట్టేం దుకు సిద్ధమైనట్లు తెలిసింది. పైగా సీఐ స్థాయి పోలీసు అధికారి అండదండలు అతడికి పుష్కలంగా ఉన్నాయి. దీంతో తాను నగరంలోని ఒక పారిశ్రామికవేత్త మేనల్లుడుగా అందరికీ పరిచయం చేసుకుంటూ మోసాలకు తెగబడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నగరంలోని డాక్టర్‌తోనూ నార్ల వంశీకృష్ణకు పరిచయాలు పుష్కలంగా ఉన్నాయి. తన మాయమాటలతో ఎదుటివార్ని ఇట్టే బుట్టలో వేయడంతో వంశీకృష్ణ దిట్ట. దీనికి తోడు బిల్డర్, పోలీసు, డాక్టర్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకుంటూ పోలీసు అధికారులు, పారిశ్రామికవేత్తల వద్దనే లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. ఒకే ఫ్లాట్‌ను ఇద్దరు ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేసి లక్షలు వెనకేసుకున్నాడని బాధితులు చెబుతున్నారు. బ్యాంకులో కలెక్షన్ ఏజెంటుగా పనిచేసిన అనుభవం ఉండటంతో బ్యాంకర్లను కూడా నమ్మించి, ఇళ్లకు సంబంధించి నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి తనఖాలు పెట్టి లక్షలు రుణాలుగా కూడా పొందాడని ఆరోపిస్తున్నారు. డబ్బంతా టీడీపీ నేత వద్దనేనా!? తెలుగుదేశం పార్టీ నేత వేసిన ప్రణాళిక ప్రకారమే వంశీకృష్ణ నడుచుకుని 2011 జనవరి నాలుగోతేదీన దుగ్గిరాల వద్ద కారు కాలువలో పడినట్లు హైడ్రామా నడిపాడని తెలుస్తోంది. కారును కూడా వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసి, దాన్ని కాలవలోకి తోసివేసి వంశీ మాయమయ్యాడు. ఆ తరువాత నగరంలో జరుగుతున్న పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు టీడీపీ నేత ద్వారానే తెలుసుకుంటున్నట్లు తెలి సిం ది. ఇదంతా జరిగి రెండేళ్లు దాటిపోవడంతో తనకు బకాయి లు ఇచ్చిన వారి ఆవేశం కూడా తగ్గుతుందని నిర్ధారించుకుని వ్యూహ్యాత్మంగా పోలీసులకు లొంగిపోయి హైడ్రామా సృష్టిస్తున్నాడు. ప్రజల్ని మోసం చేసిన వంశీకృష్ణ సంపాదించిన వందల కోట్ల ఆస్తులను కూడా టీడీపీ నేత బంధువులను బినామీలుగా మార్చి బదిలీ చేసినట్లు చెబుతున్నారు. నోరు విప్పని వంశీకృష్ణ కాగా గత మూడు రోజులుగా పోలీసులు విచారిస్తున్నా.. వంశీకృష్ణ వాస్తవాలు వెల్లడించడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతానికి తన వద్ద చిల్లిగవ్వ కూడా లేదని వారి వద్ద బు కాయిస్తున్నాడు. వంశీకృష్ణకు లక్షలు అప్పుగా ఇచ్చిన పోలీ సు అధికారులు కూడా ఉండటంతో తొలుత తమ సొ మ్మును రాబట్టుకోవాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతడు అనేక మోసాలు చేయడానికి సహకరించిన సీఐ తాను పెట్టుబడి పెట్టిన రూ. 2 కోట్లు తిరిగి వసూలు చేసుకున్న తరువాతనే వంశీకృష్ణ లొంగుబాబు వ్యూహాన్ని అమ లు చేశాడని చెబుతున్నారు. ఇప్పుడు కూడా వంశీకృష్ణ వద్ద ఉన్న సొమ్ముతో పోలీసు అధికారులకు ఉన్న బకాయిలు తీర్చాలని కోరుతున్నారు. పోలీసులకు బకాయి తీరిస్తే తమ గతి ఏమిటని ఇప్పటికే వంశీకృష్ణకు లక్షలు అప్పులు ఇచ్చిన పేద, మధ్య తరగతి ప్రజలు లోబోదిబోమంటున్నారు. ఒక వైపు పోలీసులు, మరొక వైపు రాజకీయ నాయకులే కొమ్ముకాసి వంశీకృష్ణ లాంటి చీటర్‌ను కాపాడి తమ కడు పు కొడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. నేడు అరెస్టు!? వ్యూహాత్మకంగా పోలీసులకు చిక్కిన వంశీకృష్ణను శనివా రం అరెస్టు చూపించే అవకాశం ఉంది. గతంలో అతనితో ఉన్న పరిచయాల దృష్ట్యా నేరస్తులను ఇంటరాగేషన్ చేసే స్థాయిలో చేయకుండా కేవలం అతడు చెప్పిన సమాచారం, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే అరెస్టు చేయాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. తరువాత మరొకసారి కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. వంశీకి సహకరించిన వారు పేర్లు బయట పెట్టండి : బొండా ఉమా డిమాండ్ వంశీకృష్ణకు తెలుగుదేశం సెంట్రల్ నియోజకవర్గ నాయకుడు సహకరించారని ప్రచారం జోరుగా సాగటంతో అతని పేరు బయట పెట్టాలని పోలీసులను ఆ పార్టీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జి బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తాను వారికి అండగా ఉండి పోరాడతానని ఉమా పేర్కొన్నారు.