ఎవరూ టచ్ చేయని కథతో...
కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని, హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నారు సునీల్. ఆయన హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘జక్కన్న’. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఆర్.పి.ఎ. క్రియేషన్స్ పతాకంపై ఆర్. సుదర్శన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీపార్ట్ పూర్తయ్యింది. పాటల చిత్రీకరణ కోసం త్వరలో విదేశాలు వెళ్లనున్నారు.
నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని కథతో వంశీకృష్ణ చాలా ఆసక్తికరంగా రూపొందించారు. అందరినీ అలరించే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. మా సంస్థ నుంచి వచ్చిన మొదటి సినిమా ‘ప్రేమకథా చిత్రమ్’లో ఎన్ని ట్విస్టులు ఉంటాయో ఈ చిత్రంలో అన్ని ఉంటాయి. ఈ నెలాఖరులో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. జూన్ మూడో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దినేష్, కెమెరా: రాం ప్రసాద్, సహ నిర్మాతలు: ఆముష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి.