చిరు 150లో సునీల్ | Sunil Confirms His Role In Chiru 150th | Sakshi
Sakshi News home page

చిరు 150లో సునీల్

Published Sun, Jul 31 2016 9:05 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

చిరు 150లో సునీల్

చిరు 150లో సునీల్

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమాలో చిన్న రోల్ ఇచ్చినా చేయడానికి చాలా మంది నటీనటులు ఎదురుచూస్తున్నారు. మెగా హీరోలయితే ఒక్కసారి కనిపించే పాత్ర ఇచ్చినా చాలని ప్రకటించేస్తున్నారు. ఇక మెగా హీరోలతో సమానంగా చిరుతో సన్నిహితంగా ఉండే సునీల్ కూడా మెగా మూవీలో చేసేందుకు సిద్దమని ఎప్పుడో చెప్పేశాడు.

అయితే ఆ అవకాశం వచ్చినా.. ఉపయోగించుకోలేకపోయానని చాలా రోజులుగా బాధపడుతున్నాడు సునీల్. వీడు గోల్డెహే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సునీల్ చిరంజీవి 150వ సినిమాలో క్యారెక్టర్ ఇచ్చినా చేయలేకపోయాడు. దీంతో వేరే ఆర్టిస్ట్తో ఆ సీన్స్ తీసేశారన్న టాక్ వినిపించింది. జక్కన్న రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సునీల్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.

మిస్ అయ్యిందనుకున్న అవకాశం మరోసారి సునీల్ తలుపుతట్టిందని తెలిపాడు. తాను చేయలేకపోయానని బాధపడుతున్న చిరు సినిమాలోని పాత్ర తన కోసమే ఎదురుచూస్తుందట. వచ్చేనెలలో షూటింగ్లో పాల్గొంటానని, మెగాస్టార్ సినిమాలో నటించటం ఎంతో ఆనందంగా ఉందంటూ ప్రకటించాడు. జక్కన్న సినిమాతో కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్ సాధించిన సునీల్, హీరోగా మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement