
చిరు చేతుల మీదుగా సునీల్ ఆడియో
రాజకీయాలతో చాలాకాలం పాటు సినిమాలకు దూరంగా ఉండిపోయిన చిరంజీవి ఇప్పుడు వరుసగా సినిమా ఫంక్షన్స్లో దర్శనమిస్తున్నాడు. అవార్డు వేడుకలు, ఆడియో రిలీజ్లతో తిరిగి సినిమా వాతావరణాన్ని అలవాటు చేసుకుంటున్నాడు. తన 150వ సినిమా షూటింగ్ మొదలవుతున్న సందర్భంగా అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు.
అందుకే తనతో నటించడానికి ఖాళీ లేదన్న నటుడి సినిమా వేడుకకు కూడా హాజరవుతున్నాడు మెగాస్టార్. చిరు 150వ సినిమాలో కీలకపాత్రకు కామెడీ హీరో సునీల్ను సంప్రదించారు చిత్రయూనిట్. అయితే వరుసగా హీరోగా సినిమాలు చేస్తున్న సునీల్, ఆ క్యారెక్టర్కు నో చెప్పటంతో వెన్నెల కిశోర్ను ఫైనల్ చేశారు.
దీంతో చిరు, సునీల్ మధ్య బంధం తెగిపోయినట్టే అని అంతా భావించారు. కానీ ఇండస్ట్రీ వర్గాలకు షాకిస్తూ చిరు మరోసారి అందరివాడుగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సునీల్ హీరోగా తెరకెక్కుతున్న జక్కన్న ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హజరయ్యేందుకు అంగీకరించాడు మెగాస్టార్. అన్నయ్య రాకతో తన సినిమాకు మరింత హైప్ క్రియేట్ అవుతుందన్న ఆనందంలో ఉన్నాడు సునీల్.