గొంతు సవరించుకున్నదోచ్! | Lakshmi Manchu sings her first song in 4 hours flat! | Sakshi
Sakshi News home page

గొంతు సవరించుకున్నదోచ్!

Published Wed, Apr 1 2015 10:15 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

గొంతు సవరించుకున్నదోచ్! - Sakshi

గొంతు సవరించుకున్నదోచ్!

 నటి మంచు లక్ష్మీ ప్రసన్న మరోసారి వార్తల్లోకి వచ్చారు. టీవీలో, సినిమాలో నటన, చిత్ర నిర్మాణం తరువాత ఇప్పుడు ఆమె గాయని అవతారం ఎత్తారు. త్వరలో విడుదల కానున్న ‘దొంగాట’లో ఆమె ఒక పాట పాడారు. వంశీకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆ చిత్రంలో రఘు కుంచె సంగీతం అందించగా, వరికుప్పల యాదగిరి రాసిన పాటకు లక్ష్మీ ప్రసన్న గళమిచ్చారు. ‘‘ఆ పాట నేనే పాడాలని మా చిత్ర యూనిట్ అంతా అన్నారు. సంగీత దర్శకుడు రఘు కూడా నేనే పాడాలని పట్టుబట్టారు. నేను పాడగలనని బలంగా నమ్మారాయన’’ అని లక్ష్మీ ప్రసన్న ఆనందంగా చెప్పారు. నిజానికి, మూడేళ్ళ క్రితం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోని ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలోనే ఈ బహుముఖ నటి పాడాల్సి ఉంది.
 
  ఆ చిత్రంలోని ‘డిస్ట్రబ్ చేస్తున్నాడే దేవుడు...’ పాట పాడించాలని రఘు ప్రయత్నించారట. కానీ, కుదరలేదు. కాగా, ఇప్పుడు ‘తీన్‌మార్’ తరహాలో సాగే ఈ పాటను నాలుగే నాలుగు గంటల్లో రికార్డింగ్ పూర్తి చేశారు లక్ష్మీ ప్రసన్న. అలా తొలిసారిగా సినిమాల కోసం గొంతు సవరించుకున్నారు. ‘‘నేను సినీ నేపథ్యగాయనిని అయితే చూడాలని మా నాన్న కోరిక. ఎన్నో ఏళ్ళ తరువాత ఇప్పుడాయన కోరిక నెరవేరింది’’ అని ఆమె చెప్పారు. నిజజీవితంలో కర్ణాటక సంగీతం నేర్చుకున్న లక్ష్మీ ప్రసన్న తాజా సినీ గానం విని ఆమె కుటుంబమంతా సంగీత దర్శకుడికి ఫోన్ చేసి మరీ, ప్రత్యేకంగా అభినందిస్తున్నారట!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement