రేపట్నుంచి విశాఖలో జగన్ సమైక్య శంఖారావం
విశాఖపట్నం: సమైక్యశంఖారావం యాత్రలో భాగంగా ఈ నెల 8 వతేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నాం పన్నెండున్నర గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకొనే జగన్ అక్కడినుంచి నేరుగా చోడవరం వెళ్లి మధ్యాహ్నాం 3 గంటలకు జరిగే సభలో ప్రసంగిస్తారని ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు.
చోడవరం నుంచి సాయంత్రం ఐదు గంటలకు గాజువాక చేరుకొని అక్కడ జరిగే సభలో జగన్ ప్రసంగిస్తారు. ఆనందపురం మండలం పెద్దిపాలెం వద్ద ఉన్న కింగ్స్ గార్డెన్స్ రాత్రి జరిగే మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మనుమడి వివాహానికి హాజరౌతారు.