cokkakula Venkata Rao
-
రేపట్నుంచి విశాఖలో జగన్ సమైక్య శంఖారావం
విశాఖపట్నం: సమైక్యశంఖారావం యాత్రలో భాగంగా ఈ నెల 8 వతేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నాం పన్నెండున్నర గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకొనే జగన్ అక్కడినుంచి నేరుగా చోడవరం వెళ్లి మధ్యాహ్నాం 3 గంటలకు జరిగే సభలో ప్రసంగిస్తారని ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు. చోడవరం నుంచి సాయంత్రం ఐదు గంటలకు గాజువాక చేరుకొని అక్కడ జరిగే సభలో జగన్ ప్రసంగిస్తారు. ఆనందపురం మండలం పెద్దిపాలెం వద్ద ఉన్న కింగ్స్ గార్డెన్స్ రాత్రి జరిగే మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మనుమడి వివాహానికి హాజరౌతారు. -
సమైక్య శంఖారావం రేపు
వైఎస్సార్సీపీ అధినేత జగన్ జిల్లా పర్యటన మధ్యాహ్నం 3 గంటలకు చోడవరంలో.. సాయంత్రం 5కు గాజువాకలో సభలు విజయవంతం చేయాలని పార్టీ జిల్లా, నగర అధ్యక్షుల పిలుపు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఈ నెల 8వ తేదీన విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన చోడవరంలో జరిగే సభలో ప్రసంగిస్తారని పార్టీ జిల్లా, నగర అధ్యక్షులు చొక్కాకుల వెంకట్రావు, వంశీకృష్ణ శ్రీనివాస్‌లు తెలిపారు. అక్కడి నుంచి సాయంత్రం ఐదు గంటలకు గాజువాక చేరుకొని అక్కడ జరిగే సభలో ఆయన ప్రసంగిస్తారని చెప్పారు. శనివారం రాత్రి విశాఖలోనే బస చేస్తారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జిల్లాలో నిర్వహిస్తున్న ఈ సభలను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని వారు కోరారు. -
ఉద్యమం ఉధృతం
=పార్టీ అధినేత జగన్ స్ఫూర్తిని కొనసాగించాలి =వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల పిలుపు =అనకాపల్లి పార్లమెంటు పరిధి సమన్వయకర్తల సమావేశం చోడవరం, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి పార్టీ సమన్వయకర్తలు పూర్తిస్థాయిలో కృషి చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు పిలుపునిచ్చారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశం చోడవరంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమైక్యాంధ్ర కోసం అలుపులేని పోరాటం చేస్తున్నారని, దీనిని స్ఫూర్తిగా తీసుకొని పార్టీ సమన్వయకర్తలు రానున్న రోజుల్లో పోరాటాన్ని తీవ్రతరం చేయాలన్నారు. సమైక్య కాంక్ష రాష్ట్రపతికి అవగతమయ్యేలా.. పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి పిలుపుమేరకు ఉద్యమాన్ని చేపట్టాలన్నారు. ఈనెల 10వ తేదీన విద్యార్థులు, యువకులతో నియోజకవర్గాల వారీగా ర్యాలీలు, 11న ట్రాక్టర్లతో రైతుల ర్యాలీలు, 12న హైవే, రహదారుల దిగ్బంధం, వంటా వార్పు కార్యక్రమాలు, 14న నియోజకవర్గాల వారీగా ర్యాలీలు, భారీ బహిరంగ సభలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు పీవీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ విభజనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని పార్టీలను ఏకం చేయడానికి తమ నాయకుడు జగన్మోహనరెడ్డి చేస్తున్న కృషి ఇతర పార్టీల నేతలకు ఆదర్శప్రాయమన్నారు. సమావేశంలో చోడవరం నియోజకవర్గం సమన్వయకర్త బలిరెడ్డి సత్యారావు మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి యువకుడైనా ప్రజా సమస్యల విషయంలో ఎంతో పరిణతితో, అంకితభావంతో వ్యవహరిస్తున్నారన్నారు. సమావేశంలో సమన్వయకర్తలు పూడి మంగపతిరావు, బూడి ముత్యాలనాయుడు, ప్రగడ నాగేశ్వరరావు, పెట్ల ఉమాశంకర్ గణేష్, సీకరి సత్యవాణి, పార్టీ నాయకులు డాక్టర్ బండారు సత్యనారాయణ, నాగులాపల్లి రాంబాబు, నీలం శారద, తమరాన రామకోటి పాల్గొన్నారు. -
జాతీయ రహదారులపై వైఎస్సార్సీపీ శ్రేణుల ఆందోళన
=జాతీయ రహదారులపై వైఎస్సార్సీపీ శ్రేణుల ఆందోళన =గంటల తరబడి నిలిచిపోయిన వాహనాలు =పలువురు నాయకుల అరెస్టు, విడుదల =నేడూ కొనసాగింపు సాక్షి, విశాఖపట్నం: సమైక్యాంధ్ర నినాదాలతో జాతీయ రహదారులు హోరెత్తాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆందోళనతో రహదారు లు స్తంభించాయి. గంటలపాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గ్రామీణ, ఏజె న్సీ ప్రాంతాల్లో చాలా చోట్ల ఉదయం 5 గంట ల నుంచే ఆందోళనలు ప్రారంభమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపుమేర కు పార్టీ శ్రేణులు నియోజకవర్గాల వారీ జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని బుధవారం చేపట్టాయి. ఉదయం నుంచే పదులు.. వందల సంఖ్యలో పార్టీ నేతలు, శ్రేణులు జాతీయరహదారులపైకి చేరుకున్నాయి. జై సమైక్యాంధ్ర.. జైజై జగన్ అన్న నినా దాలతో మిన్నంటించాయి. పాడేరులో ఉద యం 5 గంటల నుంచే పార్టీ శ్రేణులు ఆందోళ నకు దిగడంతో వారపు సంతకు వెళ్లే వాహనా లు గంటలతరబడి నిలిచిపోయాయి. మాడు గుల నియోజకవర్గంలోని కె.కోటపాడులో రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లను నిలిపి వాహనాల రాకపోకల్ని అడ్డుకున్నారు. నర్సీపట్నంలో రోడ్డుకు అడ్డంగా చెట్లను నరికి రహదారుల్ని దిగ్బంధించారు. గురువారం కూడా రహదా రుల దిగ్బంధం కొనసాగనుంది. పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు, నియోజకవర్గ సమన్వయకర్త చెంగల వెంకటరావు ఆధ్వర్యంలో జాతీయ రహదారిని గంటన్నరకు పైగా దిగ్బంధిం చారు. పోలీసులు రంగం ప్రవేశం చేసి చెంగలను పక్కకు లాక్కెళ్లి ఆందోళనను భగ్నం చేశారు. అనకాపల్లి నియోజకవర్గంలో పార్టీ నేత కొణతాల లక్ష్మీనారాయణ (పెదబాబు) ఆధ్వర్యంలో కొణతాల క్యాంప్ కార్యాలయం నుంచి ద్విచక్ర వాహనాలతో పట్టణ మెయిన్‌రోడ్డు మీదుగా పూడిమడక బైపాస్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిని దిగ్బంధించారు. రహదారిపై బైఠాయించారు. చోడవరం నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త బలిరెడ్డి సత్యారావు ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. బలిరెడ్డి సత్యారావు, పి.వి.ఎస్.ఎన్.రాజుతోపాటు 26 మందిని పోలీసులు అరెస్టు చేసి, సాయంత్రం విడుదల చేశారు. యలమంచిలి నియోజకవర్గ పరిధిలో పార్టీ సమన్వయకర్తలు ప్రగడ నాగేశ్వరరావు కొక్కిరాపల్లి జంక్షన్ వద్ద, బొడ్డేడ ప్రసాద్ మునగపాకలో రిక్షాస్టాండ్ వద్ద ప్రధాన రహదారిని దిగ్బంధించారు. ఆటోలు, రిక్షాలతో ర్యాలీగా వచ్చి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్‌గణేష్ ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం జరిగింది. రోడ్డుకు అడ్డంగా చెట్లువేసి వాహనాల రాకపోకల్ని స్తంభింపజేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు కొనసాగుతోన్న రిలే దీక్షల శిబిరం వద్ద వం టావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు పాల్గొన్నారు. మాడుగుల నియోజకవర్గ పరిధిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు పూడి మంగపతిరావు, బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో రోడ్ల దిగ్బంధం జరిగింది. కె.కోట పాడులో ప్రధాన రోడ్లకు అడ్డంగా ట్రాక్టర్లను, ఆటోలను, వ్యాన్లను నిలిపి ఉదయం ఆరు గంటల నుంచే రాకపోకల్ని స్తంభింపజేశారు. సమన్వయకర్తలతోపాటు మరో నలుగురు కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేశారు. అరకు నియోజకవర్గ పరిధిలో పార్టీ సమన్వయకర్తలు కుంభా రవిబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్ జంక్షన్ వద్ద రహదారిని దిగ్బం ధించారు. పోలీసులు 15 మందిని అరెస్టు చేశారు. కిడారి సర్వేశ్వరరావు, దొన్ను దొర ఆధ్వర్యంలో అరకులోయ గ్రీన్ వ్యాలీ జంక్షన్‌ను దిగ్బంధించారు. అరకు-పాడేరు ప్రధాన రహదారిపై ఐదు గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి. పాడేరు నియోజకవర్గ పరిధిలో ముగ్గురు సమన్వయకర్తలు సత్యవాణి, కాంతమ్మ, ఈశ్వరి కలిసి చెక్‌పోస్టు వద్ద ప్రధాన రహదారిని దిగ్బంధించారు. చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండల నేతలు హనుమాన్ జంక్షన్, జీకే వీధి ప్రధాన రోడ్లను దిగ్బంధించారు.