సమైక్య శంఖారావం రేపు
- వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ జిల్లా పర్యటన
- మధ్యాహ్నం 3 గంటలకు చోడవరంలో..
- సాయంత్రం 5కు గాజువాకలో సభలు
- విజయవంతం చేయాలని పార్టీ జిల్లా, నగర అధ్యక్షుల పిలుపు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 8వ తేదీన విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన చోడవరంలో జరిగే సభలో ప్రసంగిస్తారని పార్టీ జిల్లా, నగర అధ్యక్షులు చొక్కాకుల వెంకట్రావు, వంశీకృష్ణ శ్రీనివాస్‌లు తెలిపారు. అక్కడి నుంచి సాయంత్రం ఐదు గంటలకు గాజువాక చేరుకొని అక్కడ జరిగే సభలో ఆయన ప్రసంగిస్తారని చెప్పారు. శనివారం రాత్రి విశాఖలోనే బస చేస్తారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జిల్లాలో నిర్వహిస్తున్న ఈ సభలను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని వారు కోరారు.