‘మూన్‌వాక్’లో రికార్డు బ్రేక్ చేస్తా..
ఇప్పటివరకూ మైకేల్‌జాక్సన్ పేరిట గిన్నిస్ బుక్ రికార్డు
రికార్‌డను తిరగరాస్తానంటున్న తాండూరు కుర్రోడు
స్వచ్ఛంద సంస్థ సాయం కోసం ఎదురుచూపులు
తాండూరు టౌన్: ‘మూన్‌వాక్ డ్యాన్స్’(సంగీతానికి లయబద్ధంగా కాళ్లు ఆడిస్తూ వెనక్కి వెళే ్లడ్యాన్స్)లో మైకేల్‌జాక్సన్ సృష్టించిన గిన్నిస్‌బుక్ వరల్డ్ రికార్‌డను బ్రేక్ చేస్తానంటున్నాడు తాండూరుకు చెందిన 20 ఏళ్ల కుర్రాడు విశ్వజ ్ఞవంశీకృష్ణ. తాండూరులోని వాల్మీకినగర్‌కు చెందిన విశ్వజ వంశీకృష్ణ పాలిటెక్నిక్ ఫైనల్‌ఇయర్ చదువుతూ పేదరికంతో మధ్యలోనే ఆపేశాడు. తండ్రి విజయభాస్కరాచారి వడ్రంగి పనిచేస్తుంటాడు. వంశీకృష్ణకు చిన్ననాటి నుంచిై మెకేల్‌జాక్సన్ డ్యాన్స్ అంటే ప్రాణం.
జాక్సన్ డ్యాన్స్ చూ స్తూ తనకు తానుగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండేవాడు. 2002 అక్టోబర్ 22న మ్యూజిక్ వింటూ మైకేల్‌జాక్సన్ అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో డెన్వర్‌స్ట్రీట్‌లో గంటలో 2.4కిలోమీటర్లు (1.5మైళ్లు) ఆగకుండా మూన్‌వాక్ చేసి గిన్నిస్‌రికార్‌డ సాధించాడు. వంశీకృష్ణ కూడా ఇంటర్‌నెట్‌లో సెర్చ్‌చేసి రెండు నెలలపాటు మూన్‌వాక్ ప్రాక్టీస్ చేశాడు. తాను కేవలం 48 నిమిషాల్లోనే 3.7 కిలోమీటర్ల దూరం మూన్‌వాక్ చేస్తానని గిన్నిస్‌బుక్ వారికి మెయిల్ పంపాడు.
అయితే మొదట ఏదైనా స్వచ్ఛంద సంస్థ ఎదుట రికార్‌డను ప్రదర్శించాలని, సదరు స్వచ్ఛంద సంస ్థవారు రికార్డును ధ్రువీకరిస్తూ తమకు సిఫార్సు లేఖ పంపితే వచ్చి రికార్డును పరిశీలిస్తామని గిన్నిస్‌బుక్ వారు తిరిగి మెయిల్ పంపించారు. ఈ రికార్డు బ్రేక్ కోసం ఏదైనా స్వచ్ఛందసంస్థ తనకు సహకరిస్తే వారి ఎదుట ప్రదర్శన ఇస్తానని వంశీకృష్ణ పేర్కొంటున్నాడు. తన గిన్నిస్‌రికార్డుకు సహకరించాలని వేడుకుంటున్నాడు.