పనికెర క్రాంతికుమార్ మరో రికార్డు
ఒకేసారి నాలుగు గిన్నిస్ సర్టిఫికెట్లు సాధన
సూర్యాపేట: ఒళ్లు గగుర్పొడిచే సాహసాలకు కేరాఫ్ అడ్రస్ అయిన పనికెర క్రాంతికుమార్ మరో రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ వేదికపై అరుదైన సాహసాలు ప్రదర్శించి ఒకేసారి 4 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్లు అందుకొన్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన క్రాంతికుమార్ 2024 ఫిబ్రవరిలో ఇటలీలోని మిలాన్ నగరంలో జరిగిన కార్యక్రమంలో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు.
ఆయన చేసిన సాహసాలు ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ చేయకపోవడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థ ఆయనకు తన బుక్‌లో చోటిచ్చింది. ఇటీవల ఆ సంస్థ నిర్వాహకులు క్రాంతికుమార్‌కు అవార్డులు ప్రదానం చేశారు. ఈ విషయాన్ని క్రాంతికుమార్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.
రికార్డులు సాధించింది ఈ విభాగాల్లోనే..
» 60 సెకన్లలో 72 టేబుల్ ఫ్యాన్లను నాలుకతో ఆపగా, అందులో 57 ఫ్యాన్లు ఆగినట్లు రికార్డు నమోదైంది.
» గొంతులో రెండు అడుగుల పొడవైన 37 కత్తులు దింపుకుని 16 సెకన్లలో 1,944 కిలోల బరువు (కారు, దానిపై ఎనిమిది మంది)ని లాగాడు.
» 60 సెకన్లలో నాలుగు ఇంచుల పొడవైన 22 మేకులను ముక్కులో దించుకుని రక్తపు చుక్క రాకుండా కొత్త రికార్డు నమోదు చేశాడు.
» 60 సెకన్లలో మరుగుతున్న నూనె నుంచి 17 చికెన్ ముక్కలను బయటకు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment