పటాన్‌చెరు: కొన్నేళ్ల వ్యవధిలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 గిన్నిస్ రికార్డులను నెలకొల్పి హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం అసాధారణ ఘనతను సొంతం చేసుకుంది. 17 గిన్నిస్ రికార్డులను తమ పేరిట లిఖించుకున్న గీతం డీమ్డ్ వర్సిటీ పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రి శ్రీవాస్తవ, ఆమె తల్లిదండ్రులు కవిత, అనిల్ తాజాగా 18, 19, 20 వ గిన్నిస్ రికార్డులు సాధించి చరిత్ర సృష్టించారు.
3,400 ఒరిగామి నెమళ్లు, 4,400 ఒరిగామి చొక్కాలు, 3,200 ఒరిగామి పందుల బొమ్మ లను ఒకేచోట ఏర్పాటు చేసి అతిపెద్ద ప్రదర్శన నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆ కుటుంబం గిన్నిస్ సంస్థకు పంపగా వాటిని ఆ సంస్థ రికార్డులుగా అధికారికంగా నిర్ధారించింది. ఈ మేరకు గీతం యాజమాన్యం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
గతంలో శివాలి కుటుంబం చేతితో తయారు చేసిన కాగితపు బొమ్మలు, క్విల్డ్ పూలు, ఒరిగామి వేల్స్, పెంగ్విన్‌లు, సిట్రస్ పండ్లు మరికొన్నింటితో సహా వివిధ ప్రదర్శనలతో 17 గిన్నిస్ రికార్డులను సాధించింది. మొత్తం 20 గిన్నిస్ రికార్డులను సాధించిన శివాలి, ఆమె తల్లిదండ్రులను గీతం హైదరాబాద్ అదనపు వీసీ ప్రొఫెసర్ డి.ఎస్.రావు, విభాగాధిపతులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment