krantikumar
-
గగుర్పొడిచే సాహసాలకు గిన్నిస్ గుర్తింపు
సూర్యాపేట: ఒళ్లు గగుర్పొడిచే సాహసాలకు కేరాఫ్ అడ్రస్ అయిన పనికెర క్రాంతికుమార్ మరో రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ వేదికపై అరుదైన సాహసాలు ప్రదర్శించి ఒకేసారి 4 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్లు అందుకొన్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన క్రాంతికుమార్ 2024 ఫిబ్రవరిలో ఇటలీలోని మిలాన్ నగరంలో జరిగిన కార్యక్రమంలో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు.ఆయన చేసిన సాహసాలు ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ చేయకపోవడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థ ఆయనకు తన బుక్‌లో చోటిచ్చింది. ఇటీవల ఆ సంస్థ నిర్వాహకులు క్రాంతికుమార్‌కు అవార్డులు ప్రదానం చేశారు. ఈ విషయాన్ని క్రాంతికుమార్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. రికార్డులు సాధించింది ఈ విభాగాల్లోనే.. » 60 సెకన్లలో 72 టేబుల్ ఫ్యాన్లను నాలుకతో ఆపగా, అందులో 57 ఫ్యాన్లు ఆగినట్లు రికార్డు నమోదైంది. » గొంతులో రెండు అడుగుల పొడవైన 37 కత్తులు దింపుకుని 16 సెకన్లలో 1,944 కిలోల బరువు (కారు, దానిపై ఎనిమిది మంది)ని లాగాడు. » 60 సెకన్లలో నాలుగు ఇంచుల పొడవైన 22 మేకులను ముక్కులో దించుకుని రక్తపు చుక్క రాకుండా కొత్త రికార్డు నమోదు చేశాడు. » 60 సెకన్లలో మరుగుతున్న నూనె నుంచి 17 చికెన్ ముక్కలను బయటకు తీశాడు. -
రిమ్స్ వైద్య విద్యార్థులపై దాడి
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ రిమ్స్ వైద్య విద్యార్థులపై బుధవారం అర్ధరాత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతికుమార్ బయటి వ్యక్తులతో కలిసి దాడికి పాల్పడిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఘటనలో ఇద్దరు వైద్య విద్యార్థులు గాయాలపాలయ్యారు. డైరెక్టర్ చాంబర్ ముందు నుంచి బుధవారం సాయంత్రం కవిరాజ్, మరో ముగ్గురు విద్యార్థులు అతి వేగంగా కారులో వెళ్లారు. దీంతో డైరెక్టర్ జైసింగ్ వారిని మందలించగా, విద్యార్థులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. అనంతరం జైసింగ్ అభిమానులమంటూ కొందరు సదరు విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. దీంతో దాడికి పాల్పడిన వారిని శిక్షించాలంటూ గురువారం మెడికోలు తరగతులకు వెళ్లకుండా, ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. దీంతో కలెక్టర్ రాహుల్‌రాజ్ ఘటనపై విచారణకు ఆదేశించారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఘటనకు బాధ్యుడైన రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతికుమార్‌ను టర్మినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మెడికోలకు మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న మద్దతు తెలిపారు. వైద్య విద్యార్థులపై దాడికి దిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతికుమార్‌తోపాటు బయట వ్యక్తులైన వసీమ్, శివ, వెంకటేశ్, శ్రీకాంత్‌పై కేసు నమోదుచేసి, రిమాండ్‌కు తరలించనున్నట్లు ఆదిలాబాద్ టూటౌన్ సీఐ అశోక్ తెలిపారు. విద్యార్థుల ఫిర్యాదుతో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌పై కూడా కేసు నమోదైంది. -
ఓ యువతి పోరాటం
సమాజంలో జరుగుతున్న అఘాయిత్యా లపై ఓ సామాన్య యువతి ఎలాంటి పోరు చేసిందనే కథాంశంతో రూపొం దిన చిత్రం ‘అనగ నగా ఒక దుర్గ’. ప్రకాశ్ పురిజాల దర్శకత్వంలో రాంబాబు నాయక్, అంజి యాదవ్ నిర్మించిన ఈ చిత్రంలో క్రాంతికుమార్, ప్రియాంకా నాయుడు నటిం చారు. సమకాలీన అంశానికి వాణిజ్యపంథా జోడించి చిత్రం తీసినట్లు దర్శకుడు చెప్పారు.