moon walk dance
-
ఔరా అనిపించిన అండర్ వాటర్ డ్యాన్సర్
మన దేశ ఫస్ట్ అండర్‌వాటర్ డ్యాన్సర్ జయదీప్ గోహిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మైకేల్ జాక్సన్ ఫేమస్ ‘మూన్‌వాక్’ స్టెప్పులు నీటి గర్భంలో వేసి తన పెర్ఫార్మెన్స్తో నెటిజనులు ‘ఔరా’ అనుకునేలా చేశాడు. ‘ది ఇన్వెంటర్’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో 3.6 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ‘వీఎఫ్ఎక్స్’ ఉపయోగించి సృష్టించిన వీడియో ఇది అని కొందరు యూజర్లు మొదట భ్రమ పడి, ఆ తరువాత నిజం తెలుసుకొని అబ్బురపడ్డారు. -
క్వారంటైన్ పూర్తయిన ఆనందంలో గేల్ ఏం చేశాడో తెలుసా..
ముంబై: విండీస్ విధ్వంసకర యోధుడు, పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్.. ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్న సందర్భంగా అదిరిపోయిన స్టెప్పులతో అలరించాడు. క్వారంటైన్ పూర్తైన ఆనందంలో అతను మైఖేల్ జాక్సన్ సూపర్ హిట్ 'మూన్ వాక్' సాంగ్‌కు డ్యాన్స్ చేశాడు. యూనివర్సల్ బాస్ చిందేస్తుండగా తీసిన వీడియోను పంజాబ్ కింగ్స్ ట్విటర్లో షేర్ చేయగా, కొద్ది నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. కాగా, గేల్.. క్వారంటైన్ సమయంలో కూడా పలు పంజాబీ పాటలకు స్టెప్పులేస్తూ కాలక్షేపం చేశాడు. Quarantine da khatam khel, bahar aa gaye tuhadde favourite - Chris Gayle 🕺🥰#IPL2021 #SaddaPunjab #PunjabKings @henrygayle pic.twitter.com/rrDHPZ3lvQ — Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2021 అతను క్వారంటైన్ సమయంలో ఎక్కువ శాతం డ్యాన్స్‌లేస్తూ, జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ గడిపాడు. గతేడాది ఐపీఎల్లో లేట్‌గా బరిలోకి దిగినా సూపర్ ఫామ్‌ను కనబర్చిన గేల్.. 7 మ్యాచ్‌ల్లో 137.14 స్ట్రయిక్ రేట్‌తో 288 పరుగులు సాధించాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 14వ సీజన్లో అతను పంజాబ్ కింగ్స్ తరఫున మూడో స్థానంలో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఏప్రిల్ 12న ముంబై వేదికగా జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొంటుంది. చదవండి: వివో బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా కెప్టెన్.. -
‘మూన్‌వాక్’లో రికార్డు బ్రేక్ చేస్తా..
ఇప్పటివరకూ మైకేల్‌జాక్సన్ పేరిట గిన్నిస్ బుక్ రికార్డు రికార్డను తిరగరాస్తానంటున్న తాండూరు కుర్రోడు స్వచ్ఛంద సంస్థ సాయం కోసం ఎదురుచూపులు తాండూరు టౌన్: ‘మూన్‌వాక్ డ్యాన్స్’(సంగీతానికి లయబద్ధంగా కాళ్లు ఆడిస్తూ వెనక్కి వెళే ్లడ్యాన్స్)లో మైకేల్‌జాక్సన్ సృష్టించిన గిన్నిస్‌బుక్ వరల్డ్ రికార్డను బ్రేక్ చేస్తానంటున్నాడు తాండూరుకు చెందిన 20 ఏళ్ల కుర్రాడు విశ్వజ ్ఞవంశీకృష్ణ. తాండూరులోని వాల్మీకినగర్‌కు చెందిన విశ్వజ వంశీకృష్ణ పాలిటెక్నిక్ ఫైనల్ఇయర్ చదువుతూ పేదరికంతో మధ్యలోనే ఆపేశాడు. తండ్రి విజయభాస్కరాచారి వడ్రంగి పనిచేస్తుంటాడు. వంశీకృష్ణకు చిన్ననాటి నుంచిై మెకేల్జాక్సన్ డ్యాన్స్ అంటే ప్రాణం. జాక్సన్ డ్యాన్స్ చూ స్తూ తనకు తానుగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండేవాడు. 2002 అక్టోబర్ 22న మ్యూజిక్ వింటూ మైకేల్‌జాక్సన్ అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో డెన్వర్స్ట్రీట్లో గంటలో 2.4కిలోమీటర్లు (1.5మైళ్లు) ఆగకుండా మూన్‌వాక్ చేసి గిన్నిస్రికార్డ సాధించాడు. వంశీకృష్ణ కూడా ఇంటర్నెట్లో సెర్చ్‌చేసి రెండు నెలలపాటు మూన్‌వాక్ ప్రాక్టీస్ చేశాడు. తాను కేవలం 48 నిమిషాల్లోనే 3.7 కిలోమీటర్ల దూరం మూన్‌వాక్ చేస్తానని గిన్నిస్‌బుక్ వారికి మెయిల్ పంపాడు. అయితే మొదట ఏదైనా స్వచ్ఛంద సంస్థ ఎదుట రికార్డను ప్రదర్శించాలని, సదరు స్వచ్ఛంద సంస ్థవారు రికార్డును ధ్రువీకరిస్తూ తమకు సిఫార్సు లేఖ పంపితే వచ్చి రికార్డును పరిశీలిస్తామని గిన్నిస్‌బుక్ వారు తిరిగి మెయిల్ పంపించారు. ఈ రికార్డు బ్రేక్ కోసం ఏదైనా స్వచ్ఛందసంస్థ తనకు సహకరిస్తే వారి ఎదుట ప్రదర్శన ఇస్తానని వంశీకృష్ణ పేర్కొంటున్నాడు. తన గిన్నిస్రికార్డుకు సహకరించాలని వేడుకుంటున్నాడు.