క్వారంటైన్‌ పూర్తయిన ఆనందంలో గేల్‌ ఏం చేశాడో తెలుసా.. | IPL 2021: Chris Gayle Performs Michael Jackson Moonwalk Dance As Quarantine Ends | Sakshi
Sakshi News home page

క్వారంటైన్‌ పూర్తయిన ఆనందంలో గేల్‌ ఏం చేశాడో తెలుసా..

Published Wed, Apr 7 2021 8:47 PM | Last Updated on Wed, Apr 7 2021 9:11 PM

IPL 2021: Chris Gayle Performs Michael Jackson Moonwalk Dance As Quarantine Ends - Sakshi

ముంబై: విండీస్‌ విధ్వంసకర యోధుడు, పంజాబ్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌ గేల్‌.. ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్న సందర్భంగా అదిరిపోయిన స్టెప్పులతో అలరించాడు. క్వారంటైన్‌ పూర్తైన ఆనందంలో అతను మైఖేల్‌ జాక్సన్‌ సూపర్‌ హిట్‌ 'మూన్‌ వాక్‌' సాంగ్‌కు డ్యాన్స్‌ చేశాడు. యూనివర్సల్‌ బాస్‌ చిందేస్తుండగా తీసిన వీడియోను పంజాబ్‌ కింగ్స్‌ ట్విటర్లో షేర్‌ చేయగా, కొద్ది నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. కాగా, గేల్‌.. క్వారంటైన్‌ సమయంలో కూడా పలు పంజాబీ పాటలకు స్టెప్పులేస్తూ కాలక్షేపం చేశాడు.

అతను క్వారంటైన్‌ సమయంలో ఎక్కువ శాతం డ్యాన్స్‌లేస్తూ, జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ గడిపాడు. గతేడాది ఐపీఎల్‌లో లేట్‌గా బరిలోకి దిగినా సూపర్‌ ఫామ్‌ను కనబర్చిన గేల్‌.. 7 మ్యాచ్‌ల్లో 137.14 స్ట్రయిక్‌ రేట్‌తో 288 పరుగులు సాధించాడు. ఇందులో 3 హాఫ్‌ సెంచరీలు కూడా ఉన్నాయి. ఏప్రిల్‌ 9 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌లో అతను పంజాబ్‌ కింగ్స్‌ తరఫున మూడో స్థానంలో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఏప్రిల్‌ 12న ముంబై వేదికగా జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ను ఢీకొంటుంది.
చదవండి: వివో బ్రాండ్‌ అంబాసిడర్‌గా టీమిండియా కెప్టెన్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement