ఐదు రోజుల్లో తెలిసిపోతుంది..!
వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ఎ.గురురాజ్ నిర్మించిన చిత్రం ‘రక్షక భటుడు’. రిచా పనయ్, బ్రహ్మనందం, ‘బాహుబలి’ ప్రభాకర్, సుప్రీత్, బ్రహ్మాజీ ముఖ్య తారాగణం. ఈ నెల 12న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో గురురాజ్ మాట్లాడుతూ– ‘‘మా చిత్రంలో ఆంజనేయస్వామి పాత్రలో ఎవరు నటించారనే విషయం మరో ఐదు రోజుల్లో తెలిసిపోతుంది.
ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి’’ అన్నారు. ‘‘దిల్’ రాజు, శిరీష్, ఎమ్మెస్ రాజుగారు ఎంతగానో ప్రొత్సహించారు. నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన రామ్‌గోపాల్ వర్మగారిని మర్చిపోలేను’’ అన్నారు వంశీకృష్ణ ఆకెళ్ళ.