అచ్చంపేట : ఆదివారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆగడాలు తారాస్థాయికి చేరాయని.. త్వరలోనే టీఆర్‌ఎస్ ఖంగు తినే ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు.