
ఫైల్ ఫోటో
సాక్షి, తూర్పుగోదావరి : గత 21 నెలలు గా నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర తిరిగి ప్రారంభమైంది. గోదావరి నదికి హారతి ఇచ్చి పాపికొండల విహారయాత్ర ను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. పాపికొండల విహారయాత్రకు వెళ్లే టూరిజం బోట్ల ట్రయిల్ రన్‌లో మంత్రి అవంతి పాల్గొన్నారు. కచ్చులూరు దుర్ఘటన, కొవిడ్ పరిస్థితుల కారణంగా పాపికొండల టూరిజం 21 నెలలుగా నిలిపి వేసినట్లు మంత్రి తెలిపారు. రేపటి నుంచి పాపికొండల బోటింగ్‌కు బుకింగ్స్ ప్రారంభం అవుతాయని చెప్పారు. ఈ సందర్భంగా గండిపోచమ్మ అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు.
చదవండి: పులిచింతల ప్రాజెక్ట్ వద్ద మరో వివాదం
Comments
Please login to add a commentAdd a comment