godavri
-
భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
భద్రాచలం/బూర్గంపాడు: భద్రాచలం వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తోంది. శనివారం ఉదయం 8 గంటలకు 43.10 అడుగుల నీటిమట్టం నమోదు కాగా, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత క్రమేపీ పెరుగుతూ రాత్రి 11.00 గంటల సమయంలో 48.50 అడు గులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. దీంతో దేవస్థానం వైపు కరకట్ట దిగువ భాగాన ఉన్న స్నానఘాట్లు పూర్తిగా మునిగిపోగా, కల్యాణ కట్టపైకి వరద చేరింది. కరకట్టల వద్ద స్లూయిస్‌లను మూసివేయటంతో భద్రాచలంలో వరద నీరు ఆగిపోయింది. ఆలయం పడమర మెట్ల వద్దకు చేరిన వరద నీరు దీంతో రామాలయ నిత్యాన్నదాన సత్రం వద్దకు వరద నీరు చేరుకుంది. భద్రాచలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు లోతట్టు కాలనీల ప్రజలను తరలించారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు వద్ద మధ్యాహ్నం 12 గేట్ల ద్వారా 13,888 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. చర్ల, వెంకటాపురం మండలాల నడుమ ప్రధాన రహదారిపై నీరు చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పర్ణశాలకు పూర్తిగా వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ భద్రాచలంలో బస చేసి అధికారులను అప్రమత్తం చేస్తూ, పునరావాస చర్యలను సమీక్షిస్తున్నారు. వరద ఉధృతితో కల్యాణ కట్టలోకి చేరిన నీరు -
పాపికొండల విహారయాత్ర ప్రారంభం..
సాక్షి, తూర్పుగోదావరి : గత 21 నెలలు గా నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర తిరిగి ప్రారంభమైంది. గోదావరి నదికి హారతి ఇచ్చి పాపికొండల విహారయాత్ర ను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. పాపికొండల విహారయాత్రకు వెళ్లే టూరిజం బోట్ల ట్రయిల్ రన్లో మంత్రి అవంతి పాల్గొన్నారు. కచ్చులూరు దుర్ఘటన, కొవిడ్ పరిస్థితుల కారణంగా పాపికొండల టూరిజం 21 నెలలుగా నిలిపి వేసినట్లు మంత్రి తెలిపారు. రేపటి నుంచి పాపికొండల బోటింగ్‌కు బుకింగ్స్ ప్రారంభం అవుతాయని చెప్పారు. ఈ సందర్భంగా గండిపోచమ్మ అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు. చదవండి: పులిచింతల ప్రాజెక్ట్ వద్ద మరో వివాదం -
కావల్సిన వారికే... కాపులోన్లు
- పార్టీ కార్యాలయంలో లబ్ధిదారుల ఎంపిక - - ఉత్సవ విగ్రహాలుగా అధికారులు - అన్ని లోన్లు పార్టీ కార్యకర్తలకే - అర్హులకు మొండిచేయి - ప్రధాన అర్హతగా దేశం సభ్యత్వం! - పిఠాపురంలో కాపులోన్ల మాయాజాలం పిఠాపురం: కాపులకు రుణాలు ... ఇందుకు కాపు కులంలో పుట్టిన నిరుపేదలందరూ అర్హులే అనుకుంటే పొరపాటే. పిఠాపురం మున్సిపాల్టీలో మాత్రం కాపు కులానికి చెందిన వారైతే చాలదు. తెలుగు దేశం పార్టీ నాయకుడో, కార్యకర్తో, లేక ఎమ్మెల్యే అనుచరుడో అయి ఉంటేనే కాపు లోను తన కాళ్ల దగ్గరకు పరుగులు తీస్తూ వచ్చేస్తుంది. అధికారులకు దరఖాస్తు చేసుకున్నా ఆ దరఖాస్తులు కాపు కార్పొరేషన్‌కు ఆన్లైన్లో పంపించేది ... ఎంపిక చేసేది మాత్రం ‘దేశం’ నేతలే అన్నది ఇక్కడ బహిరంగ రహస్యం. ఏదైనా ఒక ప్రభుత్వ పథకంలో లబ్థిదారుల ఎంపిక జరగాలంటే వివిధ స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణలు జరిపి ప్రభుత్వ కార్యాలయంలో అర్హుల జాబితా తయారు చేస్తుంటారు. కానీ పిఠాపురం మున్సిపాలిటీలో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఇలాగే అధికారులతో సంబంధం లేకుండా జన్మభూమి కమిటీలు దేశం నేతలు కలిపి భర్తలున్న వారికే వితంతు పింఛన్లు మంజూరు చేయించగా ‘సాక్షి’ దినపత్రిక ఆ గుట్టును బట్టబయలు చేయడంతో అధికారుల విచారణ అనంతరం వాటిని రద్దు చేశారు. అయినప్పటికీ ఇక్కడ పద్ధతిలో మాత్రం మార్పు రాలేదంటున్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేస్తున్న కాపు రుణాల మంజూరులో నిబంధనలను యథేచ్ఛగా తుంగలో తొక్కేస్తున్నారు. పచ్చచొక్కా వేసుకుంటేనే నిజమైన లబ్ధిదారుడిగాను, లేకుంటే ఎంత నిరుపేదవాడైనా సరే అనర్హుడిగా పరిగణిస్తున్నట్లు ప్రస్తుతం మంజూరైన లోన్ల నడత స్పష్టం చేస్తోంది. పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఈ ఏడాది కాపులోన్ల లక్ష్యం 105 కాగా ఇప్పటి వరకు సుమారు 500 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటి వరకు 27 మందికి రుణాలు మంజూరయ్యాయి. వీరిలో అధిక శాతం మంది తెలుగు దేశం పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. దేశం నేతలకే కాపులోన్లు... పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో 24వ వార్డులో 15 మంది అర్హులైన లబ్ధిదారులు బ్యాంకు అంగీకారంతో సహా కాపులోన్లకూ దరఖాస్తులు పెట్టుకున్నారు. కానీ వారందరినీ పక్కన పెట్టి కేవలం ఆ వార్డు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, పాదగయ ట్రస్టు బోర్డు సభ్యుడైన ఓగేటి మురళీధర్‌కు మాత్రమే కాపులోను మంజూరయింది. ఇలా అన్ని వార్డుల్లోను ఆయా వార్డుల పార్టీ అధ్యక్షులు, తెలుగు యువత నాయకులు ఎమ్మెల్యే అనుచరులకు మాత్రమే రుణాలు మంజూరు చేస్తున్నారన్న ఆరోపణలు వినినిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా అన్ని అర్హతలుండీ దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఒక్క రుణం కూడా మంజూరుకాకపోవడం విశేషం. పార్టీ కార్యాలయంలోనే ఎంపిక...! అర్హులైన లబ్ధిదారులు బ్యాంకు అనుమతితో మున్సిపల్ అధికారులు దరఖాస్తులు చేసుకుంటుండగా వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అలాగే మున్సిపాలిటీ పరిధిలో తెలుగు యువత నాయకుడు ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక పక్రియంతా స్థానిక తెలుగదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతున్నట్లు దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయంలో జరగాల్సిన ఎంపిక పక్రియ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుల కనుసన్నల్లో జరుగుతుండడంతో కేవలం పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే అనుచరులకు మాత్రమే రుణాలు మంజూరవుతున్నాయి. మా దరఖాస్తులు ఏమయ్యాయో తెలియడం లేదు నేను కూలిపని చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నా. దుకాణం పెట్టుకుని వ్యాపారం చేసుకుందామని కాపులోన్ కోసం దరఖాస్తు చేసుకున్నా. బ్యాంకు విల్లింగ్ సైతం ఇచ్చారు. అయినా ఏడాదవుతున్నా లోన్ రాలేదు. నాకంటే వెనుక పెట్టుకున్న తెలుగుదేశం వారికి మాత్రం లోన్లు ఇచ్చేస్తున్నారు. - కె. అచ్చియ్య, లబ్దిదారుడు, పిఠాపురం అధికారులు పట్టించుకోవడం లేదు పొట్టపోసుకోడానికి ప్రభుత్వం ఇచ్చే రుణం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాం. అధికారలెవరూ పట్టించుకోవడం లేదు. అసలు వారి ప్రమేయం ఏమీ లేనట్టు మాట్లుడుతున్నారు. మా దరఖాస్తులు ఏమయ్యాయో కూడా తెలియడం లేదు. ఆకుల దొరబాబు, లబ్ధిదారుడు, పిఠాపురం అర్హులైన కాపులకు అందడం లేదు నిరుపేదలైన కాపులకు అన్యాయం జరుగుతోంది. ఏ ఆధారం లేకుండా అణగారిపోతున్న కాపుల కోసం కాపు నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేసి నిరుపేదలకు అండగా నిలుస్తుంటే క్షేత్రస్థాయిలో తెలుగుదేశం నేతల అక్రమాలు ఎక్కువయిపోతున్నాయి. పిఠాపురంలో కేవలం తెలుగుదేశం నేతలకే రుణాలు మంజూరవుతున్నాయి. అర్హులందరూ రుణాలు రాక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. బాలిపల్లి రాంబాబు, కాపుఐక్య వేదిక నాయకుడు. పిఠాపురం -
సంప్రదాయ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలి
- సకాలంలో నీరిచ్చి ఆదుకున్న ప్రభుత్వం మాదే - ఏరువాకలో ఉప ముఖ్య మంత్రి చిన రాజప్ప పొలమూరు (అనపర్తి): సంప్రదాయ వ్యవసాయానికి రైతులు ప్రాధాన్యతనివ్వాలని, దీనికి అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా రైతులు ముందుకు సాగాలని రాష్ట్ర హోంశాఖా మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని పొలమూరులో జిల్లాస్థాయి శుక్రవారం ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని చినరాజప్ప మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సకాలంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి చేసి సాగునీటికి అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ రెండో పంటకు నీరందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని అన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ రసాయన ఎరువుల విపరీతంగా వాడటం వల్ల భూసారం తగ్గి తద్వారా పంట దిగుబడులు తగ్గుతాయన్నారు. జిల్లా కలక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ రైతులు వ్యవసాయంతోపాటు ప్రత్యామ్మాయ మార్గాల వైపు దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షతవహించిన స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జేష్ట పౌర్ణమి రోజున రైతులు తొలి అరక దున్ని సాగును ప్రారంభించటం ఆనవాయితీకి అనుగుణంగా ప్రభుత్వం ఏరువాక పౌర్ణమిని నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ కేఎస్వీ ప్రసాద్, పశు సంవర్థక శాఖ జేడీ వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. అంతకుముందు ఏరువాకలో భాగంగా ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప పొలమూరులోని వ్యవసాయ క్షేత్రంలో భూమితల్లికి, నాగలికి పూజలు నిర్వహించి కాడెద్దులతో దుక్కిదున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ, అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను తిలకించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, జెడ్పీటీసీ కర్రి ధర్మారెడ్డి, ఎంపీపీ తేతలి ఉమామహేశ్వరి, నియోజకవర్గ ప్రత్యేక అధికారిణి సీతామహాలక్ష్మి, ఫిషరీస్ జెడీ కోటేశ్వరరావు, పట్టు పరిశ్రమ శాఖ డీడీ బిఎంవి రామరాజు ఏపీ సీడ్స్ మేనేజర్ భాస్కరరావు, ఏరువాక శాస్త్రవేత్త ప్రవీణ, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
సస్యశ్యామలంపై ... స్వార్ధపు చీడ
- పెద్దల నిర్మాణ బాగోతం - సాగు నీటికి బ్రేకులు - సాగును ప్రశ్నార్థకంలో పడేసిన నేతల స్వార్థం - రైతులకు నీటి కష్టాలు - గుక్కెడు నీటి కోసం జనం కటకట సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రజలు ఎలాపోతే మాకేంటి ... మా జేబులు నిండితే చాలన్నట్టుంది అధికార పార్టీ నేతల తీరు. వారి స్వార్థం వేల ఎకరాల సాగును ప్రశ్నార్థకం చేస్తోంది. అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా పంట కాలువ వెంబడి పనుల కాంట్రాక్ట్‌లో పడి తమ స్వప్రయోజనాల కోసం అటు కోనసీమలోను, ఇటు సామర్లకోటల్లో పంట కాలువలకు సాగునీరు సరఫరా కాకుండా నిలిపివేశారు. కేవలం రెండున్నర కోట్ల వ్యయంతో సామర్లకోట పంట కాలువపై నిర్మిస్తున్న వంతెన కోసం వేలాది మంది రైతుల కంట కన్నీరు పెట్టేలా చేస్తున్నారు. అమలాపురంలో రూ.9.10 కోట్ల వ్యయంతో నల్లవంతెన–ఎర్రవంతెన మ«ధ్య పంట కాలువ పక్కన లాంగ్ రిటైనింగ్ వాల్ నిర్మాణంతో అమలాపురం–చల్లపల్లి పంటకాలువ, మురమళ్ల–ఎదుర్లంక మధ్య, గాడిలంక–కర్రివానిరేవు మధ్య పంట కాలువల్లో రిటైనింగ్ వాల్స్ నిర్మాణం కోసం పంట కాలువలకు అడ్డగోలుగా సాగు నీరు నిలిపివేశారు. దాదాపు ఈ పనులన్నీ ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన బంధువులు, బినామీలే చేస్తున్నారు. ఈ కారణంగా వారి స్వార్థం కోసం పంట కాలువలకు సాగునీరు సరఫరా చేయకుండా నిలిపివేయడంపై రైతులు మండిపడుతున్నారు. సామర్లకోట కాలువపై వంతెన నిర్మాణంలో ఒక మంత్రి తనయుడు బినామీగా పనులు చేపడుతుండంతోనే వేలాది మందికి సాగు, తాగునీరు ఇబ్బంది కలుగుతున్నా ఇరిగేషన్ అధికారులు చూసీచూడనట్టు పోతున్నారు. వారి నిర్వాకం ఫలితంగా జిల్లా కేంద్రం కాకినాడ నగరం, పెద్దాపురం, సామర్లకోట పట్టణాలు తాగునీటికి కటకటలాడుతున్నాయి. ప్రతి ఏటా కంటే ఈ ఖరీఫ్ సీజన్లో పంట కాలువలకు ముందుగానే నీరు విడుదల చేశారని సంబరపడ్డ రైతులకు అమాత్యుని నిర్వాకంతో శాపమైంది. ఇదంతా ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో ప్రజలు, రైతులు అల్లాడిపోతున్నారు. ధవళేశ్వరం గోదావరి నుంచి సామర్లకోట గోదావరి కాలువకు విడుదలచేసిన నీటిని కడియం కొత్త లాకులను మూసేసి సరఫరా కాకుండా బంధించేశారు. నీటి విడుదల ఆనందం ఆవిరి... ఈ నెల ఒకటో తేదీన ధవళేశ్వరం వద్ద ఈస్ట్రన్, సెంట్రల్ డెల్టాలకు ప్రభుత్వం అధికారికంగా సాగునీరు విడుదల చేసింది. ధవళేశ్వరంలో నీరు విడుదల చేసిన 48 గంటల్లోపు జిల్లాలో ఏ పంట కాలువలోనైనా చివరి వరకు నీరు పారాల్సిందే. అధికారికంగా సాగునీరు విడుదల చేసి మంగళవారం నాటికి ఆరు రోజులయింది. ఇంతవరకు సామర్లకోట గోదావరి కెనాల్‌కు చుక్కనీరు సరఫరా కాలేదు. ఇందుకు కారణమేమిటని ఆరా తీస్తే నేతల స్వార్థం కోసం సాగునీటి సరఫరా నిలిపివేసిన బాగోతం బయటపడింది. కారణమిదీ... సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే గోదావరి కాలువపై కొత్త వంతెన నిర్మాణానికి గతేడాది జూన్ 3న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప శంకుస్థాపన చేశారు. రూ.1.99 కోట్లు అంచనా వ్యయం నిర్మాణం ఆలస్యం కావడంతో అంచనా రూ.2.70 కోట్లకు పెరిగిపోయింది. ఏడాది తరువాత 18 రోజులు క్రితమే వంతెన పనులు మొదలుపెట్టడం గమనార్హం. వంతెన పనులు తెరవెనుక చక్కబెడుతున్న మంత్రి కుటుంబ సభ్యులు సామర్లకోట కెనాల్ నీటి సరఫరా నిలిపివేయించారని రైతులు మండిపడుతున్నారు. ఈ నీరే సాగుకు ఆధారం... ఈ కెనాల్ నుంచి సరఫరా అయ్యే నీరు సాగు, తాగుకు చాలా కీలకం. ఈ సాగు నీరుతో సామర్లకోట, కాకినాడ రూరల్ మండలాల్లోని చాలా గ్రామాల ఆయకట్టుకు జీవం పోస్తుంది. ఈ కాలువకు నీరు వస్తే ఖరీఫ్ దమ్ములు చేసుకుందామని ఆయకట్టు రైతులు ఎదురు చూస్తున్నారు. సామర్లకోట మండల పరిధిలో సుమారు 30 వేల ఎకరాలు, కాకినాడ రూరల్ రామేశ్వరం, గంగనాపల్లి, అచ్యుతాపురం గ్రామాలకు మరో 15వేల ఎకరాలకు సాగు నీరు సరఫరాకు బ్రేక్ పడింది. పిఠాపురం బ్రాంచి కెనాల్ పరిధిలోని ఆయకట్టుకు కూడా ఈ కాలువ నీరే ఆధారం. పిఠాపురం నుంచి గొల్లప్రోలు, తుని వరకు సుమారు 47 వేలు ఎకరాలకు సాగునీరు పిఠాపురం బ్రాంచి కెనాలే ఆధారం. లక్ష మందికి గొంతు తడిపే కాలువ ఇదే... సాగునీరే కాకుండా వేలాది మంది దాహార్తిని కూడా ఈ కాలువ తీరుస్తుంటుంది. చినరాజప్ప ప్రాతినిధ్యంవహిస్తున్న నియోజకవర్గంలోని సామర్లకోట, పెద్దాపురం మున్సిపాలిటీల పరిధిలోని లక్షన్నర మంది గొంతు తడిపే కాలువ కూడా ఇదే. సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలో 70 వేలు, పెద్దాపురం మున్సిపాలిటీలో 55 వేల జనాభాకు తాగునీరు మున్సిపాలిటీలు సరఫరా చేయాలి. ఇందు కోసం సామర్లకోటలో రెండు రిజర్వాయర్లున్నాయి. సామర్లకోట–కాకినాడ రోడ్డులో సాంబమూర్తి రిజర్వాయరు, ఉండూరు రైల్వే గేటు వద్ద నాగార్జున చెరువును ఏర్పాటు చేశారు. గోదావరి కాలువ నీటితోనే ఈ రెండు మున్సిపాలిటీలకు నీరు రిజర్వు చేశారు. సాంబమూర్తి రిజర్వాయరు పెద్దాపురం మున్సిపాలిటీ, నాగార్జున చెరువు సామర్లకోట మున్సిపాలిటీతో పాటు కాకినాడలోని నాగార్జున ఎరువుల కర్మాగారానికి, కాకినాడ సీపోర్టుకు కూడా ఈ కాలువ నీరే ఆధారం. వేసవి తాపంతో రెండు చెరువులలో నీరు అడుగంటింది. దాంతో ఫిల్టరు ప్లాంటులకు నీరు అందని పరిస్థితి ఉంది. ఉన్న నీరు కూడా పసరు రంగుకు మారిపోయి నీరు చెడువాసన వస్తోందని పట్టణ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఓ మంత్రి ఆదేశాలతోనే... గోదావరి కాలువలో వంతెన పనుల్లో భాగంగా రెండుగట్ల వైపు కాంక్రీట్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. అవి పై ఎత్తుకు వచ్చే వరకు ఈ కాలువ నీటిని విడుదల చేయవద్దని ఒక ఆమాత్యుని హుకుం. ఆయన చెప్పిందే తడవు ఇరిగేషన్ అధికారులు ‘జీ హుజూర్’ అంటూ నీటిని కడియం లాకుల్లో నిలిపివేశారు. ప్రస్తుతం ఒక దిమ్మ నీటి మట్టం ఎత్తుకు రాగా, మరో దిమ్మ పునాదికే పరిమితమైంది. మరో వారం రోజుల వరకు ఈ పనులు పూర్తి అయ్యే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇదే కాలువ నీరు సామర్లకోట నుంచి వీకే రాయపురం, మాధవపట్నం మీదుగా కాకినాడ వరకు వెళుతుంది. ఈ కాలువలో వంతెన నిర్మాణ కాంట్రాక్ట్ కోసం నీరువిడుదల అపేస్తే వీకె రాయపురం, మాధవపట్నం వద్ద గోదావరి కాలువలకు అడ్డు కట్టలు వేసి మరీ కాలువ అవతలివైపు కొందరు నేతలు, రియల్టర్లు పంట పొలాలను లేఆవుట్ చేసుకోడానికి గ్రావెల్ రవాణా చేస్తున్నారు. ఇందుకోసం ఎక్కడిపడితే అక్కడ ముడుపులు మెక్కేసి గోదావరి కాలువలో అడ్డుకట్టలు వేసిన నీటిపారుదల శాఖాధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగునీటికీ కటకటే... కాకినాడ నగరంలో కూడా గోదావరి నీరు సరఫరా లేకపోవడంతో ఉన్న నీరు దుర్వాసన వస్తోందని నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అరట్లకట్ట వేసవి జలాశయంలో నీటి నిల్వలు అడుగంటిపోవడంతో ప్రజలకు నీటి కష్టాలు తప్పడంలేదు. ప్రజలకు రెండుపూటలా నీరు అందించలేని పరిస్థితిని నగరపాలక సంస్థ ఎదుర్కొంటోంది. వేసవి జలాశయంలో 45 రోజులుకు సరిపడేంతగా నీటిని నిల్వ చేసుకున్నా ముందస్తు ప్రణాళిక లేక గడచిన వారం రోజులుగా నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. కుళాయిలు ద్వారా మురికినీరు సరఫరా అవుతుండటంతో నగరంలో సుమారు నాలుగు లక్షల మంది తాగునీటికి కటకటలాడుతున్నారు. గాంధీనగర్, రామారావుపేట, పాతబస్టాండ్, అశోక్‌నగర్ తదితర ప్రాంతాల్లో నాలుగు రోజులుగా మంచినీరు సరఫరా సక్రమంగా జరగడం లేదు. గోదావరి కాలువలు తెరచినప్పటికీ ఈ పరిస్థితి అధిగమించడానికి మరో నాలుగైదు రోజులుపైనే పడుతుందని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. ‘గుక్కెడు నీరు రంగు మారి పొయింది’ గడచిన రెండు రోజులుగా తాగునీరు రంగు మారిపోయింది. నీరు చెడు వాసన వస్తుంది. గోదావరి కాలువకు నీరు వచ్చినా సామర్లకోటకు చేరకపోవడంతో తాగునీటి చెరువులు నింపుకునే అవకాశం లేకుండాపోయింది. అధికారుల నిర్వాకంతో సాగునీరు, తాగునీటికి ఇబ్బంది పడుతున్నాం. తుంపాల శ్రీనివాసు, సీఐటీయు మండల అధ్యక్షుడు, సామర్లకోట. బోరు నీరే శరణ్యం.... పెద్దాపురం మున్సిపాలిటీ ప్రజలకు బోరు నీరే శరణ్యంగా మారింది. గోదావరి జలాలు విడుదల చేసినా బోరు నీరు తప్పడం లేదు. సాంబమూర్తి రిజర్వాయరులో నీరు చాలా రుచిగా ఉంటాయి. బోరునీరు చాలా చప్పగా ఉంటున్నాయి.పట్టణ ప్రజలందరికి గోదావరి జలాలు అందించాలి. 20 రోజులుగా తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. షేక్ బేబీ, రామారావుపేట, పెద్దాపురం. ‘వర్షాలు లేవు...సాగునీరు లేదు’ గోదావరి కాలువలో నీరు వస్తే పంట భూముల్లో దమ్ములు చేసుకొవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత వేసవి కాలంలోని ఎండలకు భూములు బీటలు వారాయి. సామర్లకోట–వీకే రాయపురం మధ్యలో గోదావరి కాలువకు అడ్డుగా తాత్కలికం మార్గం ఏర్పాటు చేసుకొని లేవుట్లు వేస్తున్నారు. దాంతో గోదావరి కాలువ నీరు పంట కాలువలకు రావడానికి మరింత జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. వెలమర్తి శ్రీనివాసు, రైతు సంఘ నాయకుడు, వికె రాయపురం. ‘ఐదు రోజుల్లో విడుదల చేస్తాం’ సామర్లకోట గోదావరి కాలువపై జరుగుతున్న వంతెన పనులతో గోదావరి జలాలు విడుదలకు అంతరాయం కలిగింది. కడియంలో నీటిని నిలుపుదల చేశాం. ఐదు రోజుల్లో వంతెన స్తంభాలు పూర్తవుతాయి. వెంటనే గోదావరి కాలువలో మట్టిని తొలగించి గోదావరి కాలువకు నీరు అందించే ఏర్పాట్లు చేస్తాం. విజయకుమార్, ఇరిగేషన్ డీఈ, కాకినాడ -
బీభత్సం
ముంచెత్తిన అకాల వర్షం తోడైన పెనుగాలులు, భారీ ఉరుములు, పిడుగులు నేలనంటిన వరి చేలు 2 వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంట కూలిన హోర్డింగ్‌లు ∙ భీతిల్లిన ప్రజలు గొల్లప్రోలు (పిఠాపురం) : పెనుగాలులు.. కళ్లు మిరుమిట్లు గొలిపే మెరుపులు.. ఫెళఫెళారావాలతో చెవులు చిల్లులు పడేలా ఉరుములు, పిడుగులతో కురిసిన అకాల వర్షంతో ప్రజలు భీతిల్లారు. రాజమహేంద్రవరం, కాకినాడతోపాటు, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి, శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. భారీ ఉరుములు, పిడుగులు, మెరుపులకు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలుల వేగానికి పలు ప్రాంతాల్లో హోర్డింగులు, చెట్లు విరిగిపడ్డాయి. వివిధ శుభకార్యాలకు వేసిన టెంట్లు, కొన్ని ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. పెళ్లిళ్లు చేసుకునేవారు ఇబ్బందులకు గురయ్యారు. గొల్లప్రోలులో 216 జాతీయ రహదారి విస్తరణ పనులు చేపడుతున్న కార్మికులు ఏర్పాటు చేసిన గుడారాలు దెబ్బ తిన్నాయి. పెద్దాపురం, సామర్లకోట తదితర ప్రాంతాల్లో శనివారం ఉదయం కూడా భారీవర్షం కురిసింది. ఈ అకాల వర్షం అన్నదాతకు తీరని చేటును కలిగించింది. గొల్లప్రోలు రైల్వేస్టేషన్ ఆవల ఉన్న బాడవ, సీతానగరం, చింతరేవళ్లు తదితర ప్రాంతాల్లో ఈనిక, పొట్టదశలో ఉన్న వరి చేలు నేలనంటాయి. ముందుగా ఊడ్చిన చేలు అధికంగా వెన్ను వంచే దశలో ఉండడంతో గాలులకు ఒరిగిపోయాయి. కొన్నిచోట్ల సుడిగాలుల మాదిరిగా వీయడంతో చెల్లాచెదురుగా చేలు పడిపోయాయి. నేలనంటిన చేనులో అధిక శాతం రీసెర్చ్ వెరైటీకి చెందినవి ఉన్నాయి. గింజ పాలు పోసుకునే దశలో వరిచేలు నేలనంటడంతో దిగుబడిపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు 10 బస్తాల వరకూ దిగుబడి తగ్గుతుందని చెబుతున్నారు. మరో వారం పది రోజుల్లో పంట చేతికందుతుందనుకుంటున్న దశలో కురిసిన అకాల వర్షం తమకు తీరని నష్టం మిగిల్చిందని వారు ఆవేదన చెందుతున్నారు. చెట్టు పడి ముగ్గురికి గాయాలు పిఠాపురం టౌన్ : భారీ వర్షానికి గోర్స రైల్వే గేటు సమీపాన మోహన్‌నగర్ వద్ద చెట్టు కూలి పడింది. దీంతో అక్కడ ఉన్న రెండు దుకాణాలు ధ్వంసమయ్యాయి. దుకాణంలో నిద్రిస్తున్న భార్యాభర్తలు కానూరి వేణు, కమల తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలయ్యారు. అదే ప్రాంతంలోని మరో దుకాణంలో ఉన్న వనుము నాగేశ్వరరావు కూడా గాయపడ్డాడు. రథాలపేట సెంటర్లో హోర్డింగ్ విరిగి పడిపోయింది. పాతబస్టాండ్ వద్ద ఉన్న ఎగ్జిబిషన్లో వస్తువులు చెల్లాచెదురయ్యాయి. పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. వర్షపు నీటికి మురుగు కాలువల్లోని నీరు తోడై పలు ప్రాంతాలు బురదమయంగా తయారయ్యాయి. వర్ష బీభత్సానికి పట్టణంలోని పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.