భవానీ ఐలాండ్‌ను పునరుద్దరిస్తాం | Minister Avanti Srinivas Visits Bhavani Island | Sakshi
Sakshi News home page

భవానీ ఐలాండ్‌ను పునరుద్దరిస్తాం

Published Wed, Aug 28 2019 1:55 PM | Last Updated on Wed, Mar 20 2024 5:24 PM

ఇటీవల వచ్చిన వరదలతో భవానీ ద్వీపం ఐదడుగుల మేర నీట మునిగి, రూ.2 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని ఆంధ్రపదేశ్‌ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ వెల్లడించారు. బరంపార్కు, భవానీ ద్వీపంలో వరద వల్ల దెబ్బతిన్న ప్రాంతాన్ని మంత్రి మంగళవారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. వరదల వల్ల భవానీ ద్వీపంలోని రక్షణ గోడ, ల్యాండ్‌ స్కేపింగ్, టవర్, రెస్టారెంట్‌లు, మ్యూజికల్‌ ఫౌంటేన్‌కు తీవ్ర నష్టం జరిగిందన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement