వారం రోజుల్లో కొత్త టూరిజం పాలసీ: మంత్రి అవంతి | Permission Given to Boating Except at Papikondalu Says Avanti Srinivas | Sakshi

ఆ ఒక్క చోట తప్ప బోటింగ్‌కు ప్రభుత్వం అనుమతి!

Nov 4 2020 4:03 PM | Updated on Oct 17 2021 1:49 PM

Permission Given to Boating Except at Papikondalu Says Avanti Srinivas - Sakshi

సాక్షి, విజయవాడ: భవాని ఐల్యాండ్‌ను ఈ నెల 10వ తేదీన తిరిగి ప్రారంభిస్తామని టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వారం రోజుల్లో కొత్త టూరిజం పాలసీని తీసుకువస్తున్నట్లు చెప్పారు. బోటింగ్‌కు ఇప్పటికే అనుమతినిచ్చామని, ప్రకాశం బ్యారేజీ గేట్లు మూసివేసిన తరువాత ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి అనుమతి వస్తుందన్నారు.  పాపికొండలకు తప్ప అన్ని చోట్లకు బోటింగ్‌కు అనుమతినిచ్చామని చెప్పారు. బోటింగ్‌ జరిగే చోట కమాండ్‌ కంట్రోల్‌ రూం పని చేస్తుందని, గతంలో జరిగిన ఘటనలు దృష్టిలో ఉంచుకొని అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. రాబోయే రోజుల్లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అవంతి చెప్పారు.  చదవండి: నాడు భయమేసింది.. నేడు సంతోషంగా ఉంది: పెద్దిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement