సాక్షి, విజయవాడ: సెప్టెంబర్ 1 నుంచి భవానీ ద్వీపాన్ని తిరిగి ప్రారంభిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్. మంగళవారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వరద కారణంగా భవానీ ద్వీపం పాక్షికంగా దెబ్బతిన్నదన్నారు. లోతట్టు ప్రాంతం కాబట్టే ఈ ఇబ్బంది ఏర్పడిందన్నారు. సుమారు రూ. 2 కోట్ల నష్టం ఏర్పడిందన్నారు. సేఫ్టీ వాల్ పాడవ్వడమే కాక వాటర్ ప్లాంట్ కూడా బాగా దెబ్బతిన్నదన్నారు. అందువల్లే ప్రస్తుతం సందర్శకుల రాకను నిలిపివేశమన్నారు. ఎకో ఫ్రెండ్లీగా భవానీ ద్విపాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఇరిగేషన్ శాఖతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటమన్నారు. భారీ వరదలు రావటం వల్ల ఈ సారి కృష్ణ పరివాహక ప్రాంతం అంతా నీట మునిగిందని తెలిపారు. పరివాహక ప్రాంతాల్లో తాత్కాలిక నిర్మాణాలు చేయాలి కానీ శాశ్వత కట్టడాలు చేపట్టరాదని తాము ముందే సూచించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment