సన్‌రైజర్స్ కోచ్‌గా దూరం.. ఆ ‘టీమ్’లో స్పీడ్‌గన్! (PC: SRH/IPL)
ఐపీఎల్ తాజా సీజన్ ఆరంభానికి తరుణం ఆసన్నమైంది. చెపాక్ వేదికగా మార్చి 22న క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్‌కు తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆరంభ మ్యాచ్ జరుగనుంది.
దేశంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి దశలో 21 మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే విడుదలైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో ఓవైపు క్రికెటర్లు ఆటతో అలరిస్తుంటే.. వారి ఆటను విశ్లేషిస్తూ మాటల గారడితో అభిమానులను ఆకట్టుకునేందుకు సిద్ధమైన కామెంటేటర్లు సిద్ధమవుతున్నారు.
ఇందులో టీమిండియా మాజీ హెడ్‌కోచ్, ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి, దిగ్గజం సునిల్ గావస్కర్ సహా భారత్ నుంచి తరలివెళ్లి అమెరికాకు ఆడుతున్న ఉన్ముక్త్ చాంద్ వరకు లిస్టు పెద్దదిగానే ఉంది. ఇక వ్యక్తిగత కారణాల దృష్ట్యా సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా తప్పుకొన్న సౌతాఫ్రికా స్పీడ్‌గన్ డేల్ స్టెయిన్ కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం.
ఇంటర్నేషనల్: స్టీవ్ స్మిత్, స్టువర్ట్ బ్రాడ్, డేల్ స్టెయిన్, జాక్వెస్ కలిస్, టామ్ మూడీ, పాల్ కాలింగ్‌వుడ్.
ఇంగ్లిష్ కామెంట్రీ:
సునిల్ గావస్కర్, రవి శాస్త్రి, బ్రియన్ లారా, మాథ్యూ హెడెన్, కెవిన్ పీటర్సన్, మైఖేల్ క్లార్క్, సంజయ్ మంజ్రేకర్, ఆరోన్ ఫించ్, ఇయాన్ బిషప్, నిక్ నైట్, సైమన్ కటిచ్, డ్యారీ మోరిసన్, క్రిస్ మోరిస్, క్యాటీ మార్టిన్, సామ్యూల్ బద్రి, గ్రేమ్ స్వాన్, దీప్‌దాస్ గుప్తా, హర్షా భోగ్లే, పుమెలెలో ముబాంగ్వా, అంజుమ్ చోప్రా, మురళి కార్తిక్, డబ్ల్యూవీ రామన్, నటాలీ జెర్మనోస్, డారెన్ గంగ, మార్క్ హొవార్డ్, రోహన్ గావస్కర్.
తెలుగు:
మిథాలీ రాజ్, ఎమ్మెస్కే ప్రసాద్, వేణుగోపాల్ రావు, టి. సుమన్, కళ్యాణ్ కృష్ణ, జ్ఞానేశ్వర్‌రావు, రాకేశ్ దేవా రెడ్డి, డానియల్ మనోహర్, రవి రాక్లే, శశికాంత్ ఆవులపల్లి, ఎం ఆనంత్ శ్రీక్రిష్ణ, వింధ్య మేడపాటి, గీతా భగత్, అంబటి రాయుడు.
హిందీ:
హర్భజన్ సింగ్
ఇర్ఫాన్ పఠాన్
అంబటి రాయుడు
రవిశాస్త్రి
సునీల్ గవాస్కర్
వరుణ్ ఆరోన్
మిథాలీ రాజ్
మహ్మద్ కైఫ్
సంజయ్ మంజ్రేకర్
ఇమ్రాన్ తాహిర్
వసీం జాఫర్
గురుకీరత్ మన్
ఉన్ముక్త్ చంద్
వివేక్ రజ్దాన్
రజత్ భాటియా
దీప్ దాస్‌గుప్తా
రామన్ భానోట్
పదమ్జెట్ సెహ్రావత్
జతిన్ సప్రు.
Comments
Please login to add a commentAdd a comment