భారత్-ఎ టీమ్ కెప్టెన్ శిఖర్...!
బంగ్లాదేశ్-ఎ తో జరిగే సిరీస్‌కు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ నెల 16 నుంచి బెంగళూరు వేదికగా ప్రాంరభం కానున్న సిరీస్ లో బంగ్లా ‘ఎ’ జట్లు మూడు వన్డేలతో పాటు.. ఒక మూడు రోజుల మ్యాచ్ ఆడనుంది. ఇటీవల శ్రీలకం గాలే మ్యాచ్ లో చేతి గాయంతో సిరీస్ కు దూరమైన శిఖర్ పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది.
వన్డే టీమ్ కు కెప్టెన్ గా ఉన్ముఖ్ చంద్ వ్యవహరించ నున్నాడు. టీమిండియా బ్యాట్స్ మెన్ సురేశ్ రైనా కూడా వన్డే ఏ జట్టులోకి తీసుకున్నారు. జూన్ బంగ్లా దేశ్ సిరీస్ తర్వాత వన్డే క్రికెట్ ఆడని రైనాకు.. సౌతాఫ్రికా సిరీస్ ముందు ప్రాక్టీస్ మ్యాచ్ గా ఉపయోగ పడుతుందని సెలక్షన్ కమిటీ అభిప్రాయపడింది. సెప్టెంబర్ 16,18, 20 తేదీల్లో వన్డే మ్యాచ్ లు, 27 నుంచి 29 వరకూ మూడు రోజుల మ్యాచ్ జరగ నున్నాయి.
మరో వైపు.. రానున్న దక్షిణాఫ్రికా సిరీస్ ను దృష్టి లో ఉంచుకుని ప్రాక్టీస్ కోసం ధోనీ ని కూడా వన్డే జట్టుకు ఎంపిక చేయనున్నారని మొదట వార్తలు వినిపించినా.. ఇండియా ఏ జట్టులో ధోనీని ఎంపిక చేయలేదు.. కాగా ఈనెల 17న ఇంగ్లండ్‌లో ధోనీ ఓ చారిటీ మ్యాచ్ లో ఆడనున్నాడు. భారత్‌తో సిరీస్ తర్వాత ఈనెల 22-24 వరకు మైసూర్‌లో రంజీ చాంప్ కర్ణాటకతో బంగ్లాదేశ్-ఎ మూడు రోజుల మ్యాచ్ ఆడనుంది.