
బెంగళూరు వేదికగా జరిగిన దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియా-బి వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. నవ్‌దీప్ బౌలింగ్‌లో పంత్ లెగ్ సైడ్ దిశగా వెళ్తున్న బంతిని పక్షిలా గాల్లో ఎగిరి సూపర్ క్యాచ్‌గా మలిచాడు. పంత్ స్టన్నింగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. పంత్ పట్టుకున్న క్యాచ్ ఇండియా-ఏ బ్యాటర్ ఆవేశ్ ఖాన్‌ది.
Flying Rishabh Pant with a terrific catch. 🙇♂️pic.twitter.com/kmwmextgKx
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 8, 2024
ఈ మ్యాచ్‌లో పంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఇండియా-బి.. ఇండియా-ఏపై 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకం చేసి ఇండియా-బి విజయానికి పునాది వేసిన ముషీర్ ఖాన్‌కు (181) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగులకు ఆలౌటైంది. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జట్టును ముషీర్ ఖాన్, నవ్‌దీప్ సైనీ (56) ఆదుకున్నారు. ఇండియా-ఏ బౌలర్లలో ఆకాశ్‌దీప్ 4, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ తలో 2, కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టారు.
ఇండియా-బి బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు ఆలౌటైంది. ముకేశ్ కుమార్, నవ్‌దీప్ సైనీ తలో 3, సాయికిషోర్ 2, యశ్ దయాల్, సుందర్ చెరో వికెట్ పడగొట్టారు. ఇండియా-ఏ ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇండియా-ఏ బౌలర్ ఆకాశ్‌దీప్ ఐదు వికెట్లతో రాణించడంతో ఇండియా-బి రెండో ఇన్నింగ్స్‌లో 184 పరుగులకు ఆలౌటైంది. ఖలీల్ అహ్మద్ 3, ఆవేశ్ ఖాన్, తనుశ్ కోటియన్ తలో వికెట్ పడగొట్టారు. ఇండియా-బి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ (61), సర్ఫరాజ్ ఖాన్ (46) మాత్రమే రాణించారు. వికెట్‌కీపర్ ధృవ్ జురెల్ ఏడు క్యాచ్‌లు పట్టుకున్నాడు.
275 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా-ఏ.. 198 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (57) ఇండియా-ఏను ఆదుకునేందుకు విఫలయత్నం చేశాడు. ఆఖర్లో ఆకాశ్‌దీప్ (43) వేగంగా పరుగులు సాధించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇండియా-బి బౌలర్లలో యశ్ దయాల్ 3, ముకేశ్ కుమార్, నవ్‌దీప్ సైనీ తలో 2, సుందర్, నితీశ్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment