దులీప్ ట్రోఫీ-2024లో భాగంగా బెంగళూరు వేదికగా ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-ఏ ఆటగాడు శుభ్‌మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. లాంగ్ ఆఫ్ దిశగా ఇండియా-బి ఆటగాడు రిషబ్ పంత్ ఆడిన షాట్‌ను గిల్ పక్షిలా గాల్లోకి ఎగిరి ఒడిసిపట్టుకున్నాడు. గిల్ స్టన్నింగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ మ్యాచ్‌లో పంత్ కేవలం ఏడు పరుగులు చేసి ఆకాశ్‌దీప్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
SHUBMAN GILL - THE STAR. ⭐
- What a brilliant catch by Shubman Gill. 🔥pic.twitter.com/cKHuLPvG0k— Tanuj Singh (@ImTanujSingh) September 5, 2024
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇండియా-బి 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా ముషీర్ ఖాన్ (97), నవ్‌దీప్ సైనీ (21) ఆదుకున్నారు. మూడో సెషన్ సమయానికి ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ సెంచరీకి చేరువయ్యాడు. నవ్‌దీప్.. ముషీర్‌కు సరైన సహకారం అందిస్తున్నాడు. వీరిద్దరూ ఈ రోజంతా ఆడగలిగితే ఇండియా-బి గౌరవప్రదమైన స్కోర్ చేయగలుగుతుంది.
ఇండియా-బి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 30, అభిమన్యు ఈశ్వరన్ 13, సర్ఫరాజ్ ఖాన్ 9, రిషబ్ పంత్ 7, నితీశ్ రెడ్డి 0, వాషింగ్టన్ సుందర్ 0, సాయికిషోర్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఇండియా-ఏ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ఆకాశ్‌దీప్, ఆవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు తీశారు.
ఇవాళే మొదలైన మరో మ్యాచ్‌లో ఇండియా-సి, ఇండియా-డి జట్లు తలపడుతున్నాయి. ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌటైంది. అక్షర్ పటేల్ 86 పరుగులు చేసి ఇండియా-డిని ఆదుకున్నాడు. 76 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్.. అర్ష్‌దీప్ సింగ్‌తో (13) కలిసి తొమ్మిదో వికెట్‌కు 84 పరుగులు జోడించాడు.
అక్షర్ మినహా ఇండియా-డిలో ఎవ్వరూ రాణించలేదు. అథర్వ తైడే 4, యశ్ దూబే 10, శ్రేయస్ అయ్యర్ 9, దేవ్‌దత్ పడిక్కల్ 0, రికీ భుయ్ 4, శ్రీకర్ భరత్ 13,సరాన్ష్ జైన్ 13, హర్షిత్ రాణా 0, అర్ష్‌దీప్ సింగ్ 13 పరుగులు చేశారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్ 3, అన్షుల్ కంబోజ్, హిమాన్షు చౌహన్ చెరో 2, మానవ్ సుతార్, హృతిక్ షొకీన్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-సి 28 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (5), సాయి సుదర్శన్ (7), ఆర్యన్ జుయెల్ (12), రజత్ పాటిదార్ (13) ఔట్ కాగా.. బాబా ఇంద్రజిత్ (13), అభిషేక్ పోరెల్ (19) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment