రిషబ్‌ పంత్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ | Duleep Trophy 2024 IND A VS IND B: Rishabh Pant Slams Blasting Fifty In Second Innings | Sakshi
Sakshi News home page

రిషబ్‌ పంత్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ

Published Sat, Sep 7 2024 4:41 PM | Last Updated on Sat, Sep 7 2024 8:04 PM

Duleep Trophy 2024 IND A VS IND B: Rishabh Pant Slams Blasting Fifty In Second Innings

దులీప్‌ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఏ టీమ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-బి టీమ్‌ భారీ లీడ్‌ దిశగా సాగుతుంది. మూడో రోజు మూడో సెషన్‌ సమయానికి ఇండియా-బి సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఓవరాల్‌గా ఆ జట్టు 227 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. రిషబ్‌ పంత్‌ 59, నితీశ్‌ రెడ్డి 14 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇండియా-బి ఇన్నింగ్స్‌లో టాప్‌-3 ప్లేయర్లు విఫలమయ్యారు. 

యశస్వి జైస్వాల్‌ 9, అభిమన్యు ఈశ్వరన్‌ 4, తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో ముషీర్‌ ఖాన్‌ 0 పరుగులకు ఔటయ్యారు. నాలుగో స్థానంలో వచ్చిన సర్ఫరాజ్‌ ఖాన్‌ వేగంగా 46 పరుగులు చేశాడు. ఇండియా-ఏ బౌలర్లలో ఆకాశ్‌దీప్‌ 2, ఖలీల్‌ అహ్మద్‌, ఆవేశ్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఇండియా-బి ఇన్నింగ్స్‌లో నాలుగుకు నాలుగు క్యాచ్‌లు వికెట్‌కీపర్‌ దృవ్‌ జురెలే పట్టుకోవడం విశేషం.

పంత్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ
ఇండియా-బి సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో రిషబ్‌ పంత్‌ మెరుపు హాఫ్‌ సెంచరీతో విరుచుకుపడ్డాడు. పంత్‌ కేవలం 34 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు.

231 పరుగులకు ఆలౌటైన ఇండియా-ఏ
ఇండియా-ఏ టీమ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు ఆలౌటైంది. మయాంక్‌ అగర్వాల్‌ (36), శుభ్‌మన్‌ గిల్‌ (25), రియాన్‌ పరాగ్‌ (30), కేఎల్‌ రాహుల్‌ (37), తనుశ్‌ కోటియన్‌కు (32) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఇండియా-బి బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ (3/62), నవ్‌దీప్‌ సైనీ (3/60), సాయికిషోర్‌ (2/10), యశ్‌ దయాల్‌ (1/39), వాషింగ్టన్‌ సుందర్‌ (1/15) సత్తా చాటారు.

ముషీర్‌ భారీ శతకం..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా-బి.. ముషీర్‌ ఖాన్‌ (181) భారీ శతకంతో కదం తొక్కడంతో 321 పరుగులు చేసింది. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఇండియా-బిను దశలో ముషీర్‌, సైనీ (56) ఆదుకున్నారు. ఇండియా-ఏ బౌలర్లలో ఆకాశ్‌దీప్‌ 4, ఖలీల్‌ అహ్మద్‌, ఆవేశ్‌ ఖాన్‌ తలో 2, కుల్దీప్‌ యాదవ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement