దులీప్ ట్రోఫీలో భాగంగా అనంతపురం వేదికగా ఇండియా-డితో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-సి టీమ్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-డి.. అక్షర్ పటేల్ (86) ఆదుకోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో 164 చేసింది. ఇండియా-సి బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్ 3, అన్షుల్ కంబోజ్, హిమాన్షు చౌహాన్ తలో 2, మానవ్ సుతార్, హృతిక్ షోకీన్ చెరో వికెట్ పడగొట్టారు.
THUMPING WIN FOR INDIA C...!!!!
- Well lead by Ruturaj Gaikwad & important score in the run chase in 4th innings. ✅ pic.twitter.com/08Lr2r8pb3— Johns. (@CricCrazyJohns) September 7, 2024
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-సి.. బాబా ఇంద్రజిత్ (72) మినహా ఎవరూ రాణించకడంతో 168 పరుగులు చేయగలిగింది. హర్షిత్ రాణా (4/33), అక్షర్ పటేల్ (2/46), సరాన్ష్ జైన్ (2/16), అర్ష్‌దీప్ సింగ్ (1/29), ఆదిత్య థాకరే (1/33) ఇండియా-సిని దెబ్బకొట్టారు.
దీని తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా-డి.. శ్రేయస్ అయ్యర్ (54), దేవ్‌దత్ పడిక్కల్ (56), రికీ భుయ్ (44) రాణించడంతో 236 పరుగులకు ఆలౌటైంది. మానవ్ సుతార్ 7 వికెట్లు తీసి ఇండియా-డిని దారుణంగా దెబ్బతీశాడు. విజయ్‌కుమార్ వైశాఖ్ 2, అన్షుల్ కంబోజ్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం 233 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా-సి.. రుతురాజ్ గైక్వాడ్ (46), సాయి సుదర్శన్ (22), ఆర్యన్ జుయెల్ (47), రజత్ పాటిదార్ (44), అభిషేక్ పోరెల్ (35 నాటౌట్) తలో చేయి వేయడంతో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. సరాన్ష్ జైన్ 4, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఇండియా-సికి రుతురాజ్.. ఇండియా-డికి శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment