బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా ఎంపిక జరిగిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ కోసం భారత ఆటగా శిక్షణా శిబిరం సెప్టెంబర్ 12న నుంచి ప్రారంభం కానుంది. భారత జట్టుకు ఎంపికైన మెజార్టీ శాతం ఆటగాళ్లు ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో పాల్గొంటున్నారు. వీరి స్థానాలను బీసీసీఐ వేరే ఆటగాళ్లతో భర్తీ చేసింది.
శుభ్‌మన్, కుల్దీప్ ప్రత్యామ్నాయాలు వీరే..!
ఇండియా-ఏ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, ధృవ్ జురెల్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్‌దీప్ టీమిండియాకు ఎంపిక కాగా.. వీరి స్థానాలను ప్రథమ్ సింగ్, అక్షయ్ వాద్కర్, షేక్ రషీద్, షమ్స్ ములానీ భరీ చేయనున్నారు. సీమర్ విధ్వత్ కావేరప్ప ఇండియా-ఏ నుంచి ఇండియా-డికి బదిలీ కానున్నాడు. గిల్ స్థానంలో ఇండియా-ఏ కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్ వ్యవహరించనున్నాడు.
పంత్, జైస్వాల్ స్థానాలను భర్తీ చేసేది వీరే..!
ఇండియా-బి విషయానికొస్తే.. యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, యశ్ దయాల్ టీమిండియాకు ఎంపికయ్యారు. వీరి స్థానాల్లో సుయాశ్ ప్రభుదేశాయ్, హిమాన్షు మంత్రి, రింకూ సింగ్ ఇండియా-బిలో చేరతారు. ఇండియా-బి నుంచి సర్ఫరాజ్ ఖాన్ టీమిండియాకు ఎంపికైనప్పటికీ.. అతను దులీప్ ట్రోఫీ రెండో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు. దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్ బంగ్లాతో తొలి టెస్ట్‌కు మూడు రోజుల ముందు ముగుస్తుంది.
ఇండియా-సి విషయానికొస్తే.. ఈ జట్టు నుంచి ఎవరూ టీమిండియాకు ఎంపిక కాలేదు. కాబట్టి ఈ జట్టులో ఎలాంటి మార్పులు ఉండవు.
ఇండియా-డి నుంచి అక్షర్ పటేల్ టీమిండియాకు ఎంపిక కాగా.. అతని స్థానాన్ని విధ్వత్ కావేరప్ప భర్తీ చేయనున్నాడు. ఇండియా-డి ఆటగాడు తుషార్ దేశ్‌పాండే గాయపడగా.. అతని స్థానంలో నిషాంత్ సంధు జట్టులోకి వచ్చాడు.
కాగా, దులీప్ ట్రోఫీ సెకెండ్ రౌండ్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 12 నుంచి 15 వరకు జరుగనుండగా.. టీమిండియా, బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ సెప్టెంబర్ 18 నుంచి మొదలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment