టీమిండియా స్టార్ శుబ్‌మన్ గిల్‌ను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ(Basit Ali) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడిపై భారీ అంచనాలు పెట్టుకోవడం సరికాదని.. పాకిస్తాన్‌పై శతకం బాదినప్పుడు మాత్రమే గిల్ ప్రశంసలకు అర్హుడని పేర్కొన్నాడు. నిజానికి గిల్ కంటే.. యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ టెక్నిక్ బాగుంటుందన్నాడు.
అదే విధంగా.. భారత జట్టు భవిష్య కెప్టెన్(India Future Captain) ఎవరైతే బెటర్ అన్న అంశం గురించి కూడా బసిత్ అలీ ఈ సందర్భంగా కామెంట్ చేశాడు. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్ మొదలుకానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దుబాయ్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌తో రోహిత్ సేన ఫిబ్రవరి 20న తమ వేట మొదలుపెట్టనుంది.
ఈ క్రమంలో.. ఈ ఐసీసీ వన్డే ఫార్మాట్ ఈవెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ఈ టీమ్‌కు శుబ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
గిల్ కంటే జైస్వాల్ బెటర్
అంతేకాదు.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను తొలిసారిగా వన్డే జట్టులోకి తీసుకుంది. ఇక వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్‌తో పాటు రిషభ్ పంత్‌కు కూడా బీసీసీఐ చోటిచ్చింది. ఈ నేపథ్యంలో గిల్, జైస్వాల్, పంత్ పేర్లను ప్రస్తావిస్తూ.. చాంపియన్స్ ట్రోఫీలో తుదిజట్టు కూర్పు గురించి బసిత్ అలీ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
‘‘గిల్ కంటే జైస్వాల్ బిగ్ ప్లేయర్. గిల్ ఓవర్‌రేటెడ్. ఒకవేళ అతడు పాకిస్తాన్ మీద సెంచరీ కొడితే అప్పుడు అతడిని మనం ప్రశంసించవచ్చు. అయినా సరే.. నా దృష్టిలో గిల్ కంటే.. జైస్వాల్ మెరుగైన ఆటగాడు. అతడి టెక్నిక్ బాగుంటుంది. ప్రతి విషయంలోనూ జైస్వాలే బెటర్.
టీమిండియా భవిష్య కెప్టెన్‌గా అతడికే నా ఓటు
ఇక టీమిండియా భవిష్య కెప్టెన్‌గా నా ఆప్షన్ రిషభ్ పంత్(Rishabh Pant). అతడికే నా ఓటు. కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌కు అవకాశాలు ఉండవచ్చు. అయితే, రిషభ్ పంత్ నాణ్యమైన నైపుణ్యాలున్న ఆటగాడు. అతడిని కెప్టెన్‌ను చేస్తే వ్యక్తిగత ప్రదర్శనతో పాటు.. సారథిగానూ అదరగొట్టగలడు. టీమిండియాకు అతడికి అవసరం ఉంది’’ అని బసిత్ అలీ పేర్కొన్నాడు.
ఓపెనర్‌గా జైసూ, మిడిల్ ఆర్డర్‌లో పంత్
ఇక చాంపియన్స్ ట్రోఫీలో భారత తుదిజట్టు గురించి మాట్లాడుతూ.. ‘‘ఈసారి టీమిండియా ఇద్దరు ఎడమచేతి వాటం బ్యాటర్లతో బరిలోకి దిగితే మంచిది. ఒకరు ఓపెనర్(జైస్వాల్)గా.. మరొకరు మిడిలార్డర్(పంత్)లో రావాలి. ఏదేమైనా జైస్వాల్ లేకుండా ప్లేయింగ్ ఎలెవన్ ఉండదనే అనుకుంటున్నా.
అదే విధంగా.. రిషభ్ పంత్ కూడా తుదిజట్టులో ఉంటాడు. మైదానం నలుమూలలా షాట్లు బాదగల సత్తా అతడి సొంతం. కేఎల్ రాహుల్‌కు అలాంటి నైపుణ్యాలు లేవు’’ అని బసిత్ అలీ అభిప్రాయపడ్డాడు. కాగా టెస్టు, టీ20లో టీమిండియా తరఫున రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.
అతడి వన్డే గణాంకాలు మాత్రం అంతంత మాత్రమే
అయితే, వన్డేల్లో మాత్రం రోహిత్- గిల్ భారత జట్టు ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నారు. మరి.. చాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్-వైస్ కెప్టెన్ జోడీని విడదీసి.. జైస్వాల్‌ను ఓపెనర్‌గా పంపుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో బసిత్ అలీ మాత్రం గిల్‌ను కాదని.. ఇంత వరకు వన్డేల్లో అరంగేట్రం చేయని జైసూకు ఓటేయడం గమనార్హం.
ఇక వన్డేల్లో గిల్‌కు మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 47 మ్యాచ్‌లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 2328 పరుగులు చేశాడు. ఇందులో ఆరు శతకాలతో పాటు ఓ డబుల్ సెంచరీ ఉండటం విశేషం. మరోవైపు.. పంత్ వన్డే గణాంకాలు మాత్రం అంతంత మాత్రమే. 31 వన్డేల్లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 871 రన్స్ మాత్రమే చేశాడు.
చదవండి: CT 2025: భారత జట్టు ప్రకటన.. సిరాజ్‌కు దక్కని చోటు.. నితీశ్ రెడ్డికి ఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment