పోరాడుతున్న కేఎల్‌ రాహుల్‌ | Duleep Trophy 2024 IND A VS IND B: KL Rahul Scored Fifty | Sakshi
Sakshi News home page

పోరాడుతున్న కేఎల్‌ రాహుల్‌

Published Sun, Sep 8 2024 4:00 PM | Last Updated on Sun, Sep 8 2024 4:50 PM

Duleep Trophy 2024 IND A VS IND B: KL Rahul Scored Fifty

దులీప్‌ ట్రోఫీలో భాగంగా బెంగళూరు వేదికగా ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-ఏ టీమ్‌ ఎదురీదుతుంది. 275 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆ జట్టు 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కేఎల్‌ రాహుల్‌ (57).. కుల్దీప్‌ యాదవ్‌తో (8) కలిసి ఇండియా-ఏను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 

నాలుగో రోజు మూడో సెషన్‌ సమయానికి ఇండియా-ఏ టీమ్‌ 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. రాహుల్‌, కుల్దీప్‌ క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఇండియా-ఏ గెలవాలంటే మరో 134 పరుగులు చేయాల్సి ఉంది. ఇండియా-ఏ ఇన్నింగ్స్‌లో రాహుల్‌ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు. 

మయాంక్‌ అగర్వాల్‌ 3, శుభ్‌మన్‌ గిల్‌ 21, రియాన్‌ పరాగ్‌ 31, ధృవ్‌ జురెల్‌ 0, తనుశ్‌ కోటియన్‌ 0, శివమ్‌ దూబే 14 పరుగులు చేశారు. ఇండియా-బి బౌలర్లలో యశ్‌ దయాల్‌ 3 వికెట్లు పడగొట్టగా.. ముకేశ్‌ కుమార్‌, నవ్‌దీప్‌ సైనీ, నితీశ్‌ రెడ్డి తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అంతకుముందు ఇండియా-బి రెండో ఇన్నింగ్స్‌లో 184 పరుగులకు ఆలౌటైంది. ఆకాశ్‌దీప్‌ ఐదు వికెట్లు తీసి ఇండియా-బిని దెబ్బకొట్టాడు. ఖలీల్‌ అహ్మద్‌ 3, ఆవేశ్‌ ఖాన్‌, తనుశ్‌ కోటియన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఇండియా-బి ఇన్నింగ్స్‌లో రిషబ్‌ పంత్‌ (61), సర్ఫరాజ్‌ ఖాన్‌ (46) మాత్రమే రాణించారు.

ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌: 321 ఆలౌట్‌, ముషీర్‌ ఖాన్‌  181, నవ్‌దీప్‌ సైనీ 56, ఆకాశ్‌దీప్‌ 4/60

ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌: 231 ఆలౌట్‌, రాహుల్‌ 37, మయాంక్‌ అగర్వాల్‌ 36, నవ్‌దీప్‌ సైనీ 3/60

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement