తొడగొట్టి చెబుతున్నా... | Shikhar Dhawan retires from international and domestic cricket | Sakshi
Sakshi News home page

తొడగొట్టి చెబుతున్నా...

Published Sun, Aug 25 2024 12:37 PM | Last Updated on Sun, Aug 25 2024 12:37 PM

Shikhar Dhawan retires from international and domestic cricket

ఓపెనర్‌గా శిఖర్‌ ధావన్‌ భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఈ క్రమంలో పలు రికార్డులు అతని ఖాతాలో చేరాయి. ధావన్‌ కెరీర్‌లో కొన్ని ఆసక్తికర గణాంకాలను చూస్తే...

‘నా క్రికెట్‌ ప్రయాణాన్ని ముగిస్తున్నాను. లెక్కలేనన్ని మధుర జ్ఞాపకాలు, అభిమానం మూటగట్టుకున్నాను. జీవితంలో ముందుకు వెళ్లాలంటే పేజీలకు తిప్పక తప్పదు. అందుకే అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌ నుంచి నేను రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నాను. ఎన్నో ఏళ్లు భారత్‌ తరఫున ఆడగలిగినందుకు నా హృదయంలో ప్రశాంతత ఉంది. వెనక్కి తిరిగి చూస్తే అన్నీ గుర్తుంచుకునే క్షణాలే. ఆటను దాటి బయటకు చూస్తే అంతా కొత్త ప్రపంచమే. నా జీవితంలో భారత్‌కు ఆడాలనే ఒకే ఒక లక్ష్యం ఉండేది. అది సాధించగలిగాను. భారత్‌కు ఇకపై ఆడబోవడం లేదని బాధపడవద్దు. ఇన్నేళ్లు ఆడగలిగానని సంతోంచు అనేది నా మాట. దాని పట్ల గర్వంగా ఉన్నా. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. జై హింద్‌’  –శిఖర్‌ ధావన్‌  

187  తన తొలి టెస్టులో ధావన్‌ చేసిన పరుగులు. అరంగేట్ర టెస్టులో భారత్‌ తరఫున ఇదే అత్యధిక స్కోరు కాగా...85 బంతుల్లో సాధించిన శతకం భారత ఆటగాళ్లందరిలో వేగవంతమైంది.  

65.15  ఐసీసీ టోరీ్నల్లో (వన్డే వరల్డ్‌ కప్, చాంపియన్స్‌ ట్రోఫీ కలిపి) ధావన్‌ సగటు అందరికంటే అత్యధికం.  20 ఇన్నింగ్స్‌లలో అతను 6 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలతో 1238 పరుగులు చేశాడు.

18  రోహిత్‌తో కలిసి నెలకొల్పిన సెంచరీ భాగస్వామ్యాల సంఖ్య. సచిన్‌–గంగూలీ (21) తర్వాత ఇది రెండో స్థానం.

109 తన 100వ వన్డేలో సెంచరీ సాధించిన ధావన్, ఈ ఫీట్‌ నమోదు చేసిన పది మంది ఆటగాళ్ళలో ఒకడు.

12 విదేశాల్లో ధావన్‌ సెంచరీల సంఖ్య. భారత్‌లో 5 శతకాలు మాత్రమే అతను 
సాధించాడు.  

6769  ఐపీఎల్‌లో ధావన్‌ పరుగులు. ఓవరాల్‌గా కోహ్లి (8004) తర్వాత రెండో స్థానం.  

5 ఐపీఎల్‌లో ఐదు సీజన్లలో ధావన్‌ 500కంటే ఎక్కువ 
పరుగులు సాధించాడు.  

వన్డేల్లో కనీసం 40కు పైగా సగటు, 90కి పైగా స్ట్రయిక్‌ రేట్‌తో 5 వేలకు పైగా పరుగులను సాధించిన ఎనిమిది మంది బ్యాటర్లలో ధావన్‌ ఒకడు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement