అంతా మంచే జరుగుతుంది : క్రికెటర్
ఓపెనర్ శిఖర్ ధావన్ ఆస్ట్రేలియాతో జరిగే మొదటి మూడు వన్డేల్లో బరిలోకి దిగడం లేదు. సెప్టెంబరు 17న(ఆదివారం) నుంచి మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. ‘అతడి భార్య అనారోగ్యంతో ఉండటమే ఇందుకు కారణం’ అని బీసీసీఐ పేర్కొంది. ధావన్ ఇద్దరు ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఇక్కడ నా భార్యతో నేను సంతోషంగా ఉన్నాను. ఈ సమయంలో ఆమె బాగానే ఉంది. రాబోయే రోజుల్లో సర్జరీ మంచిగానే జరుగుతుందనే ఆశాభావాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వ్యక్తం చేశాడు. ధావన్ అయేషా ముఖర్జీ అక్టోబరు 30 2012 న వివాహం చేసుకున్నాడు.
ధావన్‌కు అభిమానులు అండగా నిలిచారు. చాంప్ చింతించకండి. ఆమెకు ఏమి అవ్వదు. ఆమెతోనే ఉండండి.. క్రికెట్ స్టేడియంలోకి గబ్బర్ స్టైల్‌తో తిరిగి రావాలని ఒక అభిమాని ట్విట్ చేశాడు.సార్ ఆమెకు సర్జరీ మంచిగా జరగాలని మేము దేవుని ప్రార్థిస్తున్నామని మరో అభిమాని ట్విట్ చేశాడు. ఆమె త్వరగా కోలుకోవాలని దేవుని కోరుకుంటున్నామని అభిమానులు వారి ప్రేమను ట్విట్టర్ ద్వారా తెలిపారు.
తన తల్లికి ఆరోగ్యం సరిగాలేనందుకు ధావన్ శ్రీలంక టూర్ నుంచి చివరి వన్డే, ఒక టి- 20 మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. టీం ఇండియా రథసారథి విరాట్ కోహ్లీ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ధావన్ స్థానాన్ని అజింక రహానే భర్తీ చేయనున్నాడని తెలిపాడు. అజింక రహానే, రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడని చెప్పారు. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో టీం ఇండియా 2013లో ఆస్ట్రేలియాపై 3-2 తో వన్డే సిరిస్ను సొంతం చేసుకుంది.