Autralia
-
ఆస్ట్రేలియాలో ఘనంగా వైఎస్ జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్
-
అతడు సముద్రాన్ని జయించాడు.. 60 రోజుల పాటు ఒక్కడే..
సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన ఓ నావికుడు రోజుల తరబడి సముద్రంలో ఒంటరిగా గడిపాడు. తన పడవ ప్రయాణం మధ్యలో చిక్కుకుపోవడంతో సముద్రంలో దిక్కుతోచని స్థితిలో గుండెధైర్యంతో కాలాన్ని నెట్టుకొచ్చాడు. పడవలో అతనికి తోడుగా అతని పెంపుడు కుక్క మాత్రమే ఉంది. రెండు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మెక్సికో ఓడ ఒకటి అటుగా రావడంతో వారు అతనిని గుర్తించి రక్షించారు. ఆస్ట్రేలియా నావికుడు టిమ్ షాడోక్ తన పెంపుడు కుక్క బెల్లాతో కలిసి మెక్సికో తీరంలోని లా పాజ్ నగరం నుండి 6000 కిలోమీటర్లు ప్రయాణించి ఫ్రెంచ్ పాలినీషియా చేరుకునేందుకు ప్రయాణమయ్యాడు. కానీ దురదృష్టకర పరిస్థితుల్లో పడవలో సాంకేతిక లోపం తలెత్తి టిమ్ పసిఫిక్ మహాసముద్రం మధ్యలో చిక్కుకుపోయాడు. చుట్టూ నీరు, అలల హోరు తప్ప మరొకటి కానరాక రెండు నెలలపాటు సాగరం మధ్యలో అలమటించాడు. సముద్రం అలల తాకిడికి పడవలోని ఎలక్ట్రానిక్ సామాగ్రి బాగా దెబ్బతింది. సరైన ఆహారం లేక ఆకలికి పచ్చి చేపలను తింటూ, దాహానికి వర్షపు నీళ్లను తాగుతూ ఎలాగోలా తనతో పాటు తన కుక్క ప్రాణాలను కూడా నిలబెట్టుకున్నాడు. మెక్సికోకు చెందిన ఒక పెద్ద ఓడ వారిని గుర్తించి రక్షించింది. అప్పటికే టిమ్ షాడోక్ బాగా గడ్డం పెరిగి, బక్కచిక్కి గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. సహాయక బృందాలు అతడిని రక్షించిన తర్వాత తన పెంపుడు కుక్కతో తిరిగి మెక్సికో చేరుకుని వైద్యపరీక్షలు చేయించుకుని సరైన ఆహారం తీసుకోవాలని అన్నాడు. ఇది కూడా చదవండి: లోదుస్తుల్లో పాములు.. ఎయిర్ పోర్టులో పట్టుబడిన మహిళ -
WTC లో భారత్ ఓటమికీ అసలు కారణాలు ఇవే
-
వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఒమిక్రాన్ కాటుకు బలి! మొదటిసారిగా..
First Omicron Death In Australia: ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో సోమవారం మొదటి ఒమిక్రాన్ మరణం సంభవించింది. అంతేకాకుండా నిన్న ఒక్కరోజే 6 వేలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యినట్టు ధృవీకరించింది. కాగా పశ్చిమ సిడ్నీలోని ఓ వృద్ధాప్య సంరక్షణ కేంద్రంలో ఒమిక్రాన్ సోకిన వ్యక్తి (80)గా గుర్తించారు. సదరు వ్యక్తి వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెల్పింది. దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన న్యూ సౌత్ వేల్స్లో సోమవారం ఒక్కరోజులోనే 6,324 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇంటెన్సివ్ కేర్‌లో 55 మంది ఉండగా, మొత్తం 524 మంది అక్కడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో సోమవారం నుంచి న్యూ సౌత్ వేల్స్లో కొత్త ఆంక్షలు అమల్లోకొచ్చాయి. బార్లు, రెస్టారెంట్లలో వ్యక్తుల మధ్య 2 చదరపు మీటర్ల దూరం పాటించవల్సిందిగా పేర్కొంది. సిబ్బంది కొరత కారణంగా కోవిడ్ -19కి గురైన తర్వాత ఆరోగ్య కార్యకర్తలు సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలనే నిబంధనను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆరోగ్య మంత్రి బ్రాడ్ హజార్డ్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే అమెరికా, యూకే, ఇజ్రాయెల్ దేశాల్లో ఒమిక్రాన్ మరణాలు సంభవించిన సంగతి తెలిసిందే! తాజాగా ఆస్ట్రేలియాలో కూడా మరో మరణం నమోదుకావడంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం నాలుగు దేశాల్లో ఒమిక్రాన్ మృతి కేసులు సంభవించినట్లు తెలస్తోంది. కాగా 108 దేశాల్లో కొత్త వేరియంట్ ఉధృతి కొనసాగుతోంది. చదవండి: మెదడుతో సహా శరీర అన్ని భాగాల్లో వైరస్ ఆనవాలు.. కారణం ఇదే! -
T20 WC 2021 Prize Money: విజేత, రన్నరప్.. ఇతర జట్ల ప్రైజ్ మనీ ఎంతంటే..
T20 World Cup 2021: Prize Money won by each participating team in the tournament: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించి తొలిసారిగా ట్రోఫీని ముద్దాడింది. ప్రపంచ క్రికెట్‌ను శాసించిన జట్టుగా నీరాజనాలు అందుకున్నా.. తీరని లోటుగా ఉన్న పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుని కలను నిజం చేసుకుంది. ఇక న్యూజిలాండ్‌ను మరోసారి దురదృష్టం వెంటాడింది. ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో ఓడిపోవడం న్యూజిలాండ్ జట్టుకిది మూడోసారి. కివీస్ 2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ... 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్-2021 ముగిసిన నేపథ్యంలో విజేత, రన్నరప్ సహా ఈ టోర్నీలో పాల్గొన్న జట్లకు ఎంత మేర ప్రైజ్ మనీ దక్కిందన్న అంశాన్ని పరిశీలిద్దాం. ఆసీస్‌కు ఎంతంటే... ►ఈ మెగా ఈవెంట్లో మొత్తం ప్రైజ్‌మనీ- 5.6 మిలియన్ డాలర్లు(42 కోట్ల రూపాయలు). ►ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు 16 లక్షల డాలర్లు (రూ. 11 కోట్ల 91 లక్షలు). ►ఇక సూపర్ 12 దశలో భాగంగా లీగ్ మ్యాచ్‌లలో ఐదింటికి నాలుగు గెలిచిన ఆరోన్ ఫించ్ బృందానికి చాంపియప్గా అందుకున్న ఈ మొత్తంతో పాటు రూ. 1.2 కోట్ల మేర అదనంగా ముట్టింది. మొత్తంగా ఆసీస్‌కు దక్కిన ప్రైజ్ మనీ 13.1 కోట్ల రూపాయలు. ►రన్నరప్ న్యూజిలాండ్ జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ. 5 కోట్ల 95 లక్షలు). సూపర్ 12 రౌండ్లో నాలుగు మ్యాచ్‌లు గెలిచిన కివీస్‌కు కూడా 1.2 కోట్ల రూపాయలు ఇందుకు అదనంగా లభించాయి. సెమీస్ చేరిన జట్లకు ఎంత ముట్టిందంటే.. ►గ్రూపు-1 నుంచి ఇంగ్లండ్, గ్రూపు-2 నుంచి పాకిస్తాన్ సెమీ ఫైనలిస్టులుగా అందుకున్న మొత్తం చెరో 3 కోట్ల రూపాయలు. ►ఇక సూపర్ 12లో ఐదింటికి ఐదు మ్యాచ్‌లు గెలిచిన పాకిస్తాన్‌కు అదనంగా దక్కిన మొత్తం 4.5 కోట్ల రూపాయలు. ►అదే విధంగా నాలుగు మ్యాచ్‌లు గెలిచిన ఇంగ్లండ్‌కు దక్కిన మొత్తం... 4.2 కోట్ల రూపాయలు. సూపర్ 12 దశకు అర్హత సాధించిన జట్లకు.. ►టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా తొలిసారిగా నిర్వహించిన సూపర్ 12 రౌండ్‌కు అర్హత సాధించిన జట్లకు 52 లక్షల రూపాయాలతో పాటు విజయాల ఆధారంగా అదనంగా ఒక్కో మ్యాచ్‌కు 30 లక్షల మేర అందింది. ►ఉదాహరణకు.. టీమిండియాకు ఈ మెగా ఈవెంట్లో దక్కిన మొత్తం... 1.42 కోట్ల రూపాయలు. సూపర్ 12 చేరినందుకు రూ. 52 లక్షలు.. అదే విధంగా మూడు మ్యాచ్‌లు గెలిచినందుకు ఒక్కో మ్యాచ్‌కు 30 లక్షల చొప్పున 90 లక్షల రూపాయలు దక్కుతాయి. ఇక టీ20 ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించిన జట్లకు ఇలా.. ►పపువా న్యూగినియా, నమీబియా తొలిసారి ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించాయి. అయితే, సూపర్ 12 అర్హత సాధించే క్రమంలో శ్రీలంక, బంగ్లాదేశ్, నమీబియా, స్కాట్లాండ్ ముందుకు వెళ్లగా... ఒమన్, పపువా న్యూగినియా, ఐర్లాండ్, నెదర్లాండ్స్.. ఆ ఘనత సాధించలేకపోయాయి. ►ఈ క్రమంలో ఈ నాలుగింటిలో ఒక్కో జట్టుకు... అర్హత సాధించినందుకు రూ. 30 లక్షలు.. ఒక్కో విజయానికి 30 లక్షల చొప్పున అందాయి. ►ఉదాహరణకు.. శ్రీలంక క్వాలిఫైయర్స్ ఆడి.. సూపర్ 12 రౌండ్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో దసున షనక బృందానికి మొత్తంగా 2.02 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది. ఎలాగంటే.. సూపర్ 12 దశకు క్వాలిఫై అయినందుకు 52 లక్షలు, అందులో రెండు విజయాలకు 60 లక్షలు.. ఇక క్వాలిఫైయర్స్‌లో మూడింట గెలిచినందుకు 90 లక్షల రూపాయలు.. మొత్తంగా రూ. 2.02 కోట్లు. చదవండి: T20 WC 2021- Aaron Finch: తన పని అయిపోయిందన్నారు.. కానీ వార్నర్ మాత్రం.. చాలా గర్వంగా ఉంది.. -
అంతా మంచే జరుగుతుంది : క్రికెటర్
ఓపెనర్ శిఖర్ ధావన్ ఆస్ట్రేలియాతో జరిగే మొదటి మూడు వన్డేల్లో బరిలోకి దిగడం లేదు. సెప్టెంబరు 17న(ఆదివారం) నుంచి మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. ‘అతడి భార్య అనారోగ్యంతో ఉండటమే ఇందుకు కారణం’ అని బీసీసీఐ పేర్కొంది. ధావన్ ఇద్దరు ఉన్న ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఇక్కడ నా భార్యతో నేను సంతోషంగా ఉన్నాను. ఈ సమయంలో ఆమె బాగానే ఉంది. రాబోయే రోజుల్లో సర్జరీ మంచిగానే జరుగుతుందనే ఆశాభావాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వ్యక్తం చేశాడు. ధావన్ అయేషా ముఖర్జీ అక్టోబరు 30 2012 న వివాహం చేసుకున్నాడు. ధావన్‌కు అభిమానులు అండగా నిలిచారు. చాంప్ చింతించకండి. ఆమెకు ఏమి అవ్వదు. ఆమెతోనే ఉండండి.. క్రికెట్ స్టేడియంలోకి గబ్బర్ స్టైల్‌తో తిరిగి రావాలని ఒక అభిమాని ట్విట్ చేశాడు.సార్ ఆమెకు సర్జరీ మంచిగా జరగాలని మేము దేవుని ప్రార్థిస్తున్నామని మరో అభిమాని ట్విట్ చేశాడు. ఆమె త్వరగా కోలుకోవాలని దేవుని కోరుకుంటున్నామని అభిమానులు వారి ప్రేమను ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన తల్లికి ఆరోగ్యం సరిగాలేనందుకు ధావన్ శ్రీలంక టూర్ నుంచి చివరి వన్డే, ఒక టి- 20 మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. టీం ఇండియా రథసారథి విరాట్ కోహ్లీ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ధావన్ స్థానాన్ని అజింక రహానే భర్తీ చేయనున్నాడని తెలిపాడు. అజింక రహానే, రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడని చెప్పారు. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో టీం ఇండియా 2013లో ఆస్ట్రేలియాపై 3-2 తో వన్డే సిరిస్‌ను సొంతం చేసుకుంది.