T20 World Cup 2021: Prize Money won by each participating team in the tournament: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించి తొలిసారిగా ట్రోఫీని ముద్దాడింది. ప్రపంచ క్రికెట్‌ను శాసించిన జట్టుగా నీరాజనాలు అందుకున్నా.. తీరని లోటుగా ఉన్న పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుని కలను నిజం చేసుకుంది.
ఇక న్యూజిలాండ్‌ను మరోసారి దురదృష్టం వెంటాడింది. ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో ఓడిపోవడం న్యూజిలాండ్ జట్టుకిది మూడోసారి. కివీస్ 2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ... 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్-2021 ముగిసిన నేపథ్యంలో విజేత, రన్నరప్ సహా ఈ టోర్నీలో పాల్గొన్న జట్లకు ఎంత మేర ప్రైజ్ మనీ దక్కిందన్న అంశాన్ని పరిశీలిద్దాం.
ఆసీస్‌కు ఎంతంటే...
►ఈ మెగా ఈవెంట్‌లో మొత్తం ప్రైజ్‌మనీ- 5.6 మిలియన్ డాలర్లు(42 కోట్ల రూపాయలు).
►ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు 16 లక్షల డాలర్లు (రూ. 11 కోట్ల 91 లక్షలు).
►ఇక సూపర్ 12 దశలో భాగంగా లీగ్ మ్యాచ్‌లలో ఐదింటికి నాలుగు గెలిచిన ఆరోన్ ఫించ్ బృందానికి చాంపియప్‌గా అందుకున్న ఈ మొత్తంతో పాటు రూ. 1.2 కోట్ల మేర అదనంగా ముట్టింది. మొత్తంగా ఆసీస్‌కు దక్కిన ప్రైజ్ మనీ 13.1 కోట్ల రూపాయలు.
►రన్నరప్ న్యూజిలాండ్ జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ. 5 కోట్ల 95 లక్షలు). సూపర్ 12 రౌండ్‌లో నాలుగు మ్యాచ్‌లు గెలిచిన కివీస్‌కు కూడా 1.2 కోట్ల రూపాయలు ఇందుకు అదనంగా లభించాయి.
సెమీస్ చేరిన జట్లకు ఎంత ముట్టిందంటే..
►గ్రూపు-1 నుంచి ఇంగ్లండ్, గ్రూపు-2 నుంచి పాకిస్తాన్ సెమీ ఫైనలిస్టులుగా అందుకున్న మొత్తం చెరో 3 కోట్ల రూపాయలు.
►ఇక సూపర్ 12లో ఐదింటికి ఐదు మ్యాచ్‌లు గెలిచిన పాకిస్తాన్‌కు అదనంగా దక్కిన మొత్తం 4.5 కోట్ల రూపాయలు.
►అదే విధంగా నాలుగు మ్యాచ్‌లు గెలిచిన ఇంగ్లండ్‌కు దక్కిన మొత్తం... 4.2 కోట్ల రూపాయలు.
సూపర్ 12 దశకు అర్హత సాధించిన జట్లకు..
►టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా తొలిసారిగా నిర్వహించిన సూపర్ 12 రౌండ్‌కు అర్హత సాధించిన జట్లకు 52 లక్షల రూపాయాలతో పాటు విజయాల ఆధారంగా అదనంగా ఒక్కో మ్యాచ్‌కు 30 లక్షల మేర అందింది.
►ఉదాహరణకు.. టీమిండియాకు ఈ మెగా ఈవెంట్‌లో దక్కిన మొత్తం... 1.42 కోట్ల రూపాయలు.
సూపర్ 12 చేరినందుకు రూ. 52 లక్షలు.. అదే విధంగా మూడు మ్యాచ్‌లు గెలిచినందుకు ఒక్కో మ్యాచ్‌కు 30 లక్షల చొప్పున 90 లక్షల రూపాయలు దక్కుతాయి.
ఇక టీ20 ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించిన జట్లకు ఇలా..
►పపువా న్యూగినియా, నమీబియా తొలిసారి ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించాయి. అయితే, సూపర్ 12 అర్హత సాధించే క్రమంలో శ్రీలంక, బంగ్లాదేశ్, నమీబియా, స్కాట్లాండ్ ముందుకు వెళ్లగా... ఒమన్, పపువా న్యూగినియా, ఐర్లాండ్, నెదర్లాండ్స్.. ఆ ఘనత సాధించలేకపోయాయి.
►ఈ క్రమంలో ఈ నాలుగింటిలో ఒక్కో జట్టుకు... అర్హత సాధించినందుకు రూ. 30 లక్షలు.. ఒక్కో విజయానికి 30 లక్షల చొప్పున అందాయి.
►ఉదాహరణకు.. శ్రీలంక క్వాలిఫైయర్స్ ఆడి.. సూపర్ 12 రౌండ్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో దసున షనక బృందానికి మొత్తంగా 2.02 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది. ఎలాగంటే.. సూపర్ 12 దశకు క్వాలిఫై అయినందుకు 52 లక్షలు, అందులో రెండు విజయాలకు 60 లక్షలు.. ఇక క్వాలిఫైయర్స్‌లో మూడింట గెలిచినందుకు 90 లక్షల రూపాయలు.. మొత్తంగా రూ. 2.02 కోట్లు.
చదవండి: T20 WC 2021- Aaron Finch: తన పని అయిపోయిందన్నారు.. కానీ వార్నర్ మాత్రం.. చాలా గర్వంగా ఉంది..
Comments
Please login to add a commentAdd a comment