T20 World Cup 2021:Semi Final Equation for India Ahead of the New Zealand vs Afghanistan Game - Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌ను అఫ్గానిస్థాన్ ఓడించగలదు.. కానీ?

Published Sun, Nov 7 2021 12:16 PM | Last Updated on Sun, Nov 7 2021 12:42 PM

T20 World Cup 2021: The Semifinal Equation For India Ahead Of The New Zealand vs Afghanistan Game - Sakshi

The Semifinal Equation For India Ahead Of The New Zealand vs Afghanistan Game: టీ20 ప్రపంచకప్‌-2021లో ప్రస్తుతం భారత్‌ సెమిస్‌ ఆశలు అఫ్గానిస్తాన్‌పై ఆధారపడి ఉన్నాయి. అఫ్గానిస్తాన్ , న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఆదివారం(నవంబర్‌7) మధ్యాహ్నం జరిగే గ్రూప్‌–2 లీగ్‌ మ్యాచ్‌ ఈ రెండు జట్లతోపాటు భారత్‌కూ కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో కివీస్ ఓడితేనే..? భారత్ జట్టు సెమీస్ రేసులో నిలవనుంది. ఒకవేళ న్యూజిలాండ్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా టీమిండియా‌తో పాటు అఫ్గానిస్తాన్‌ కూడా సెమీస్ రేసునుంచి నిష్క్రమించనున్నాయి. అయితే ఈ మెగా టోర్నీలో అంచనాలకు మించి రాణిస్తున్న అఫ్గానిస్తాన్‌పై భారత్‌ భారీ ఆశలు పెట్టుకుంది. ఎందకుకంటే స్పిన్‌ విభాగం ఆ జట్టుకు ప్రాధాన బలం . ఆ జట్టులో రషీద్‌ ఖాన్‌, నబీ, ముజుబ్‌ రెహ్మన్‌, వంటి అద్బతమైన స్పిన్నర్‌లు ఉన్నారు.

మరోవైపు స్పిన్ ఆడటంలో న్యూజిలాండ్ ప్రాధాన బలహీనత . ఈ బలహీనతను అవకాశంగా తీసుకొని చెలరేగాలని  అఫ్గానిస్తాన్‌ భావిస్తోంది. ఆదే విధంగా న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ను ఎంత వేగంగా పెవిలియన్‌కు పంపగల్గితే అఫ్గానిస్తాన్‌కు అంత మంచింది. ఇక అఫ్గానిస్తాన్‌ బ్యాటింగ్‌ విషయానికి వస్తే.. మంచి పవర్‌ హిట్టర్లు ఈ జట్టులో ఉ‍న్నారు. అయితే బ్యాటింగ్‌లో నిలకడ లేమి అఫ్గాన్‌ ప్రధాన సమస్య. కానీ.. అన్నింటికీ మించి న్యూజిలాండ్‌ పేస్‌ బౌలింగ్ ముందు అఫ్గానిస్తాన్‌ ఏమేరకు నిలుస్తుందో వేచి చూడాలి. అంతర్జాతీయ టి20ల్లో న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్‌ ముఖాముఖిగా తొలిసారి తలపడనున్నాయి. అయితే ఇప్పటికే ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌ను ఓటమి అంచులు దాకా తీసుకెళ్లిన అఫ్గానిస్తాన్‌..  న్యూజిలాండ్‌ని ఎంత వరకు అడ్డుకోగలదో  వేచి చూడాలి.

చదవండి: T20 World Cup 2021: ఆ జట్ల మధ్య ఇదే తొలి ముఖాముఖి పోరు.. టీమిండియా పరిస్థితి ఏంటో!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement