టీ20 వరల్డ్‌కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును యూఎస్ఏ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. ఈ జట్టుకు మోనాంక్ పటేల్ నాయకత్వం వహించనున్నాడు. ఈ జట్టులో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ కోరీ అండర్సన్‌కు చోటు దక్కింది.
2014, 2016 టీ20 వరల్డ్‌కప్‌లో కివీస్‌కు ప్రాతినిథ్యం వహించిన అండర్సన్.. గతేడాది న్యూజిలాండ్ క్రికెట్ నుంచి ఎన్‌వోసీ తీసుకుని అమెరికాకు మకాం మార్చాడు. ఇప్పుడు అతడికి ఏకంగా సెలక్టర్లు వరల్డ్‌కప్ జట్టులో ఛాన్స్ ఇచ్చారు.
అదేవిధంగా ఈ జట్టులో భారత సంతతికి చెందిన ఐదుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. కెప్టెన్ మోనాంక్ పటేల్, సౌరభ్ నేత్రవల్కర్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, నితీష్ కుమార్ భారత మూలాలు కలిగి ఉన్నారు.
ఈ జట్టులో భారత మాజీ అండర్-19 కెప్టెన్ ఉన్ముక్త్ చంద్‌కు చోటు దక్కలేదు. ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తం ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అమెరికా తమ తొలి మ్యాచ్‌లో జూన్ 1న డల్లాస్ వేదికగా కెనడాతో తలపడనుంది.
అమెరికా వరల్డ్‌కప్ జట్టు..
మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్ (వైస్ కెప్టెన్), ఆండ్రీస్ గౌస్, కోరీ ఆండర్సన్, అలీ ఖాన్, హర్మీత్ సింగ్, జెస్సీ సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, నితీష్ కుమార్, నోష్టుష్ కెంజిగే, సౌరభ్ నేత్రవల్కర్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, స్టీవెన్ టేలర్, షయాన్ జహంగీర్.
Comments
Please login to add a commentAdd a comment