వుమెన్స్‌ బిగ్‌బాష్‌ లీగ్‌లో హర్మన్‌ప్రీత్‌ సిక్సర్ల వర్షం | Harmanpreet Kaur Plays Sensational 73 Run Knock WBBL Match | Sakshi
Sakshi News home page

Harmanpreet Kaur: వుమెన్స్‌ బిగ్‌బాష్‌ లీగ్‌లో హర్మన్‌ప్రీత్‌ సిక్సర్ల వర్షం

Published Mon, Nov 1 2021 8:02 PM | Last Updated on Mon, Nov 1 2021 8:04 PM

Harmanpreet Kaur Plays Sensational 73 Run Knock WBBL Match - Sakshi

Harmanpreet Kaur Sensational Innings WBBL: వుమెన్స్‌ బిగ్‌బాష్‌ లీగ్‌ 2021లో మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌ బ్యాటర్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిసింది. 46 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 73 పరుగులు చేసిన హర్మన్‌ ప్రీత్‌.. అంతకముందు బౌలింగ్‌లోనూ రెండు వికెట్లతో మెరిసింది. ఓవరాల్‌గా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న హర్మన్‌ జట్టు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించింది. ఈ సందర్భంగా జేమిమా రోడ్రిగ్స్‌ సంచలన ఇన్నింగ్స్‌ ఆడిన హర్మన్‌ను ''అకా హర్మన్‌ప్రీత్‌ థోర్‌'' అంటూ ట్విటర్‌లో కామెంట్‌ చేసింది.

చదవండి: క్యాచ్‌ పట్టేస్తారని మధ్యలో దూరింది; ఔట్‌ కాదా.. ఇదెక్కడి రూల్‌

మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ బ్యాటింగ్‌లో వాన్‌ నికెర్క్‌ 62 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. వోల్వార్డట్‌ 47 పరుగులతో రాణించింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌ హర్మన్‌ ఇన్నింగ్స్‌తో 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ బౌలింగ్‌లో మేఘన్‌ స్కట్‌ రెండు, తమలియా మెక్‌గ్రాత్‌, సారా కోట్‌ చెరో వికెట్‌ తీశారు.

చదవండి: Virender Sehwag: నమీబియాకు, టీమిండియాకు తేడా తెలియలేదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement