స్టన్నింగ్‌ క్యాచ్‌.. ప్రేక్షకులకు దిమ్మతిరిగింది | BBL 2021: Audience Shock Fraser-Mcgurk Stunning Catch Boundary Line | Sakshi
Sakshi News home page

Big Bash League 2021: స్టన్నింగ్‌ క్యాచ్‌.. ప్రేక్షకులకు దిమ్మతిరిగింది

Published Wed, Dec 8 2021 9:08 AM | Last Updated on Wed, Dec 8 2021 9:13 AM

BBL 2021: Audience Shock Fraser-Mcgurk Stunning Catch Boundary Line - Sakshi

Fielder Stunning Catch Shock Audience BBL 2021.. బిగ్‌బాష్‌ లీగ్‌ 2021లో భాగంగా మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్ ఆటగాడు ఫ్రేజర్-మెక్‌గుర్క్ సూపర్‌ విన్యాసంతో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. అడిలైడ్‌ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌ను జహీర్‌ ఖాన్‌ వేశాడు. ఓవర్‌ రెండో బంతిని స్టంప్స్‌ మీదకు వేయగా.. అడిలైడ్‌ ఓపెనర్‌ జేక్‌ వెదర్లాండ్‌ మిడ్‌ వికెట్‌ దిశగా స్వీప్‌ షాట్‌ ఆడాడు. భారీ సిక్స్‌ ఖాయమనుకున్న వేళ 19 ఏళ్ల ఫ్రేజర్‌-మెక్‌గుర్క్ అద్భుతం చేశాడు. అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్‌ అందుకొని రివర్స్‌లో జిమ్నాస్ట్‌ చేస్తూ సేఫ్‌గా ల్యాండ్‌ అయ్యాడు. అతని దెబ్బకు మ్యాచ్‌ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు. ప్రేజ్‌ అద్భుత విన్యాసానికి మంత్ర ముగ్దులయ్యారు. కాగా స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్న ఫ్రేజర్‌ను చూసి జేక్‌ వెదర్లాండ్‌ ఆశ్చర్యపోయి పెవిలియన్‌ బాట పట్టాడు.

చదవండి: వార్నీ ఎంత సింపుల్‌గా పట్టేశాడు..

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ 2 పరుగుల తేడాతో విజాయన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన మెల్‌బోర్న్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. మెకెంజీ హార్వే 56 పరుగులతో టాప్‌ స్కోర్‌ర్‌గా నిలవగా.. సామ్‌ హార్పర్‌ 33 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ 20 ఓవర్లలో  వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసి 2 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. హారీ నీల్సన్‌ 30, మాథ్యూ షార్ట్‌ 29 పరుగులు చేశారు. మెల్‌బోర్న్‌ బౌలర్లలో జహీర్‌ ఖాన్‌ 3 వికెట్లతో మెరిశాడు.

చదవండి: Mitchell Santner: మ్యాచ్‌ ఆడలేదు.. హీరో అయ్యాడు; అవార్డు గెలిచాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement