
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా సిడ్నీ థండర్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మ్యాచ్‌లో డేనియల్ సామ్స్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. అయితే అంతకముందు ఓవర్‌లో సింపుల్ క్యాచ్ జారవిడిచాడని డేనియల్ సామ్స్‌ను బౌలర్ తిట్టినంత పని చేశాడు. ఇది మనుసులో పెట్టుకున్నాడో లేక యాదృశ్చికంగా జరిగిందో తెలియదు కానీ.. మరుసటి ఓవర్లోనే దిమ్మతిరిగే క్యాచ్ అందుకున్నాడు. ఇన్నింగ్స్ 5వ ఓవర్‌లో తన్వీర్ సంగా వేసిన మూడో బంతిని అలెక్స్ క్యారీ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. అక్కడే కాచుకొని ఉన్న డేనియల్ సామ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ రెండు చేతులతో సూపర్ క్యాచ్ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: "పుష్ప" పాటకు చిందేసిన టీమిండియా మాజీ క్రికెటర్.. తగ్గేదేలే అంటూ..!
ఇక మ్యాచ్ విషయానికి వస్తే అడిలైడ్ స్ట్రైకర్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఇయాన్ కాక్‌బెన్ 65 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి విజయానికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
Don't let his subdued reaction fool you. Daniel Sams makes up for his earlier drop with a hanger in the deep!
— cricket.com.au (@cricketcomau) January 23, 2022
A BKT Golden Moment | #BBL11 pic.twitter.com/7hCV5VxxK0