Sydney Thunders
-
హెలికాప్టర్లో నేరుగా గ్రౌండ్లో ల్యాండ్ అయిన వార్నర్..!
బిగ్‌బాష్ లీగ్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రైవేట్ హెలికాప్టర్లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ల్యాండ్ అయ్యాడు. సొదరుడి వివాహానికి హాజరైన వార్నర్.. అక్కడి నుంచి నేరుగా తాను ఆడబోయే మ్యాచ్‌కు వేదిక అయిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌కు హెలికాప్టర్లో చేరుకున్నాడు. Full journey of David Warner in Helicopter to SCG for Big Bash match. 🔥 - What an entry.....!!!!pic.twitter.com/TwTsQe9954 — Johns. (@CricCrazyJohns) January 12, 2024 సాధారణంగా ఏ క్రికెటర్‌కు కూడా ఇలాంటి అవకాశం లభించదు. వార్నర్ కోసం బిగ్‌బాష్ లీగ్ యాజమాన్యం ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చేసింది. టెస్ట్, వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక వార్నర్ ఆడనున్న తొలి మ్యాచ్ కావడంతో అతడి గౌరవార్దం ఈ ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు సిడ్నీ థండర్స్ చీఫ్ ప్రకటించాడు. గత బీబీఎల్ సీజన్ సందర్భంగా వార్నర్ సిడ్నీ థండర్స్‌తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగానే అతను ఇవాళ (జనవరి 12) సిడ్నీ సిక్సర్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో ఆడనున్నాడు. David Warner has arrived at SCG in Helicopter for the Big Bash match. - The entertainer is here....!!!!pic.twitter.com/7knZ9BUX58 — Johns. (@CricCrazyJohns) January 12, 2024 కాగా, వార్నర్ కొద్ది రోజుల కిందట ఇదే సిడ్నీ మైదానంలోనే తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. చివరి టెస్ట్ ప్రారంభానికి ముందు వార్నర్ వన్డేల నుంచి కూడా వైదొలుగుతన్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం వార్నర్ ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు టీ20 ఫార్మాట్లో మాత్రమే అందుబాటులో ఉంటాడు. బిగ్‌బాష్ లీగ్ అనంతరం వార్నర్ యూఏఈలో జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్ ఆడతాడు. ఈ లీగ్ అతను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ ఏడాది జూన్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్ దృష్ట్యా వార్నర్ అంతర్జాతీయ టీ20ల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. త్వరలో విండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు సైతం అందుబాటులో ఉంటానని వార్నర్ ప్రకటించాడు. వార్నర్ బిగ్‌బాష్ లీగ్‌లో ఇప్పటివరకు కేవలం 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇందులో అతను ఓ సెంచరీ (102) సాయంతో 201 పరుగులు చేశాడు. -
3 రోజుల గ్యాప్‌లో మరో విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన స్టీవ్ స్మిత్
Steve Smith: బిగ్ బాష్ లీగ్ 2022-23 సీజన్లో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నాడు. టెస్ట్ ప్లేయర్‌గా ముద్రపడిన స్మిత్ వరుస సెంచరీలతో విరుచుకుపడుతూ, తన జట్టు (సిడ్నీ సిక్సర్స్) విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. జనవరి 17 అడిలైడ్ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేసిన స్మిత్.. ఇవాళ (జనవరి 21) సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో ఏకంగా 125 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 19 ఓవర్లలో సిడ్నీ సిక్సర్స్ 2 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేయగా.. స్టీవ్ ఒక్కడే అందులో 80 శాతానికి పైగా పరుగులు సాధించాడు. అతడికి కెప్టెన్ హెన్రిక్స్ (36 బంతుల్లో 45 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) మరో ఎండ్‌లో సహకరించాడు. స్మిత్ ఊచకోత ధాటికి థండర్స్ బౌలర్లు విలవిలలాడిపోయారు. గురిందర్ సంధు ఒక్కడే 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన థండర్స్.. సిక్సర్స్ బౌలర్లు స్టీవ్ ఒకీఫ్ (4/10), సీన్ అబాట్ (3/11), బెన్ వార్షుయిస్ (2/14), టాడ్ మర్ఫీ (1/18) థాటికి 14.4 ఓవర్లలో 62 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా సిక్సర్స్ 125 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. థండర్స్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ (16), జోయల్ డేవిస్ (10) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. పేస్ బౌలర్లకు స్వర్గధామమైన సిడ్నీ పిచ్‌పై స్టీవ్ స్మిత్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 3 రోజుల గ్యాప్‌లో రెండు సెంచరీలు బాదిన స్మిత్‌ను ఆకాశానికెత్తుతున్నారు. బీబీఎల్‌లో సిక్సర్స్ తరఫున నమోదైన రెండు సెంచరీలు స్మితే చేయడం విశేషం. 12 ఏళ్ల బీబీఎల్ కెరీర్లో ఒక్క సెంచరీ కూడా చేయని స్మిత్ కేవలం 3 రోజుల గ్యాప్‌లో రెండు సెంచరీలు చేయడంతో ఆసీస్ అభిమానులు కొనియాడుతున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో ఒక్క సెంచరీ కూడా చేయని స్మిత్.. ఐపీఎల్‌లోనూ సెంచరీ చేయడం విశేషం. -
పంజాబ్ కింగ్స్ బౌలర్ హ్యాట్రిక్.. ముంబై ఇండియన్స్ బ్యాటర్ విధ్వంసం
బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో భాగంగా సిడ్నీ థండర్స్‌తో ఇవాళ (జనవరి 15) జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ ఆటగాళ్లు నాథన్ ఇల్లీస్ (ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ బౌలర్), టిమ్ డేవిడ్ (ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్) రెచ్చిపోయారు. ఇల్లీస్ హ్యాట్రిక్ వికెట్లతో (4/27) నిప్పులు చెరగగా.. టిమ్ డేవిడ్ (41 బంతుల్లో 76 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న హోబర్ట్ టీమ్ 5 వికెట్ల తేడాతో సిడ్నీ థండర్స్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్.. ఇల్లీస్, ప్యాట్రిక్ డూలీ (3/22), రిలే మెరిడిత్ (2/14), ఫహీమ్ అష్రాఫ్ (1/28) ధాటికి నిర్ణీత ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. చాలాకాలం తర్వాత బీబీఎల్‌లో అడుగుపెట్టిన డేవిడ్ వార్నర్ డకౌట్ కాగా, ఒలివర్ డేవిస్ (45), బెన్ కట్టింగ్ (20), కెప్టెన్ క్రిస్ గ్రీన్ (21) ఓ మోస్తరుగా రాణించారు. సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హోబర్ట్ హరికేన్స్.. టిమ్ డేవిడ్, కెప్టెన్ మాథ్యూ వేడ్ (22 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్) రాణించడంతో 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సిడ్నీ బౌలర్లలో డేనియల్ సామ్స్ ఒక్కడే 4 వికెట్లు పడగొట్టి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లతో రెచ్చిపోయిన ఇల్లీస్.. బీబీఎల్‌లో ఈ ఘనత సాధించిన 9వ బౌలర్‌గా, సిడ్నీ తరఫున హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్‌గా, ప్రస్తుత సీజన్లో మైఖేల్ నెసెర్ (బ్రిస్బేన్ హీట్) తర్వాత హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2012-13 సీజన్లో జేవియర్ డోహర్తీ సిడ్నీ తరఫున తొలిసారి హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టగా.. బీబీఎల్‌లో ఇప్పటివరకు ఆండ్రూ టై (రెండు సార్లు), జోష్ లాలర్, రషీద్ ఖాన్, హరీస్ రౌఫ్, జేవియర్ డోహర్తీ, గురిందర్ సంధు, కెమరూన్ బాయ్స్ ఈ ఘనత సాధించిన వారిలో ఉన్నారు. -
అందుకే అత్యుత్సాహం పనికి రాదంటారు..
మనకు రానిది ప్రయత్నించి కొన్నిసార్లు చేతులు కాల్చుకున్న సందర్బాలున్నాయి. తాజాగా ఒక అభిమాని క్యాచ్ అందుకోవడం సాధ్యం కాదని తెలిసినా అత్యుత్సాహం ప్రదర్శించి అనవసరంగా ముక్కు పచ్చడి చేసుకున్నాడు. ఇదంతా బిగ్‌బాష్ లీగ్ సీజన్-12లో చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే.. ఇక మంగళవారం బ్రిస్బేన్ హీట్, సిడ్నీ థండర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. సిడ్నీ థండర్స్ ఇన్నింగ్స్ సమయంలో జట్టు ఓపెనర్ మాథ్యూ గిల్క్స్ దూకుడుగా ఆడుతున్నాడు. 56 పరుగుల వద్ద ఉన్నప్పుడు మిచెల్ స్వీప్సన్ బౌలింగ్‌లో లాంగాన్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. అయితే బంతి నేరుగా స్టాండ్స్‌వైపు దూసుకొచ్చింది. అయితే స్టాండ్స్‌లో నిలబడిన ఒక అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. తనవైపు వస్తున్న క్యాచ్‌ను అందుకోవాలని ప్రయత్నించాడు. కానీ పాపం క్యాచ్ పట్టడంలో విఫలం కావడంతో బంతి నేరుగా అతన్ని ముక్కు మీద గట్టిగా తాకి పక్కకు పడింది. అయినా కూడా తనకేం కాలేదన్నట్లుగా అంతా ఒకే అని సింబల్ చూపించాడు. అయితే కాసేపటికే సదరు అభిమాని ముక్కు నుంచి రక్తం దారలా కారసాగింది. ఇది గమనించిన బ్యాటర్ మాథ్యూ గిల్క్స్ అతని వైపు చూడగా.. ముక్కుకు కర్చీఫ్ అడ్డుపెట్టుకున్న అభిమాని పర్లేదులే అన్నట్లుగా సైగ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. కొలిన్ మున్రో 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. పియర్సన్ 27, గ్జేవియర్ బార్లెట్ 28 నాటౌట్ రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండానే కేవలం 11.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. అలెక్స్ హేల్స్ 59 నాటౌట్, మాథ్యూ గిల్క్స్ 56 నాటౌట్ జట్టును గెలిపించారు. Anyone know this guy who can let us know if his nose is all good?! 🫣@KFC #BucketMoment #BBL12 pic.twitter.com/YVjvgg6a9v — KFC Big Bash League (@BBL) December 27, 2022 చదవండి: Ashwin-Shreyas Iyer: మొన్న గెలిపించారు.. ఇవాళ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపారు దెబ్బ అదుర్స్.. ఒక్క ఇన్నింగ్స్‌తో అన్నింటికి చెక్ -
బిగ్‌బాష్ లీగ్‌లో సంచలనం..15 పరుగులకే ఆలౌట్
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో పెను సంచలనం నమోదైంది. అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ 15 పరుగులకే ఆలౌటై టోర్నీ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేసింది. అడిలైడ్ స్ట్రైకర్స్ బౌలర్ హెన్రీ థోర్టన్ కెరీర్ బెస్ట్ స్పెల్(2.5-1-3-5) నమోదు చేశాడు. అంతేకాదు పవర్ ప్లే(తొలి ఆరు ఓవర్లు) ముగియకుండానే ఆలౌట్ అయిన సిడ్నీ థండర్స్.. టి20 చరిత్రలోనే తొలి జట్టుగా మరో చెత్త రికార్డు మూటగట్టుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. క్రిస్ లిన్ 36 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. కొలిన్ డీ గ్రాండ్‌హోమ్ 33 పరుగులు చేశాడు. సిడ్నీ థండర్స్ బౌలింగ్‌లో ఫజల్లా ఫరుఖీ మూడు వికెట్లు తీయగా.. గురీందర్ సందు, డేనియల్ సామ్స్, బ్రెండన్ డోగ్గెట్‌లు తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ కేవలం 5.5 ఓవర్లు మాత్రమే ఆడి 15 పరుగులకే కుప్పకూలింది. అలెక్స్ హేల్స్, రిలీ రొసౌ, డేనియల్ సామ్స్ జాసన్ సంగా లాంటి టి20 స్టార్స్ ఉన్న జట్టు ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. హెన్రీ థోర్టన్, వెస్ అగర్లు ఒకరితో ఒకరు పోటీ పడుతూ వికెట్లు తీయడంతో సిడ్నీ థండర్స్ కోలుకోలేకపోయింది. సిడ్నీ ఇన్నింగ్స్‌లో ఐదుగురు డకౌట్‌గా వెనుదిరగ్గా.. మిగతా ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. టి20 క్రికెట్ చరిత్రలో సీనియర్ విభాగంలో సిడ్నీ థండర్స్దే అత్యల్ప స్కోరుగా ఉంది. అంతకముందు చెక్ రిపబ్లిక్‌తో మ్యాచ్‌లో టర్కీ 21 పరుగులకే ఆలౌటైంది. ఇప్పటివరకు ఇదే అత్యల్ప స్కోరు కాగా.. తాజాగా సిడ్నీ థండర్స్ ఆ రికార్డును బద్దలు కొట్టిన అత్యంత చెత్త టీమ్‌గా చరిత్ర సృష్టించింది. 🚨 Score Update: 9/14.... Wow... 🤯#BBL12 pic.twitter.com/WldWluV6Tz — 7Cricket (@7Cricket) December 16, 2022 చదవండి: రోహిత్ కోసం సెంచరీ చేసినోడిని పక్కనబెడతారా? FIFA: అర్జెంటీనాదే వరల్డ్‌కప్.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే! -
కిందా మీదా పడ్డాడు.. నీ కష్టం ఊరికే పోలేదు!
బిగ్‌బాష్ లీగ్ 12వ సీజన్ ప్రారంభమయిన సంగతి తెలిసిందే. మెల్బోర్న్ స్టార్స్, సిడ్నీ థండర్స్ మధ్య తొలి మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. ఫలితం సంగతి ఎలా ఉన్నా మ్యాచ్‌లో మాత్రం ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మెల్బోర్న్ స్టార్స్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ బ్రాడీ కౌచ్ అందుకున్న క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిడ్నీ థండర్స్ ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్లోనే ఇదంతా చోటుచేసుకుంది. బౌల్ట్ వేసిన తొలి ఓవర్ రెండో బంతిని మాథ్యూ గైక్స్ మిడాన్ దిశగా ఆడాడు. అక్కడే నిల్చున్నబ్రాడీ కౌచ్ లో-లెవెల్లో వచ్చిన క్యాచ్‌ను తీసుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతి చేజారింది. ఆ తర్వాత బంతి అతని కాళ్లకు తాకి పైకి లేవగా అందుకునే ప్రయత్నం చేసినప్పటికి మరోసారి మిస్ అయింది. చివరకు ఎలాగోలా బంతి సురక్షితంగా తీసుకోవడం జరిగింది. మొత్తానికి సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా వచ్చిన బ్రాడీ కౌచ్ స్టన్నింగ్ క్యాచ్‌తో అదరగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. నిక్ లార్కిన్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. బర్న్స్ 18 పరుగులు చేశాడు. సిడ్నీ థండర్స్ బౌలింగ్‌లో గురీందర్ సందు, ఫజల్హక్ ఫరుఖీ, డేనియల్ సామ్స్‌లు తలా రెండు వికెట్లు తీయగా.. బ్రెండన్ డొగ్గెట్, క్రిస్ గ్రీన్ చెరొక వికెట్ పడగొట్టారు. Absolutely INSANE from Brody Couch 🤯🤯🤯 #BBL12 pic.twitter.com/GFKsXCM3GS — KFC Big Bash League (@BBL) December 13, 2022 చదవండి: కోహ్లి, పంత్ 125 పరుగులు చేస్తారు! వారిద్దరూ 10 వికెట్లు తీస్తారు.. -
క్యాచ్ పట్టలేదని తిట్టిపోశారు.. కట్‌చేస్తే
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా సిడ్నీ థండర్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మ్యాచ్‌లో డేనియల్ సామ్స్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. అయితే అంతకముందు ఓవర్లో సింపుల్ క్యాచ్ జారవిడిచాడని డేనియల్ సామ్స్‌ను బౌలర్ తిట్టినంత పని చేశాడు. ఇది మనుసులో పెట్టుకున్నాడో లేక యాదృశ్చికంగా జరిగిందో తెలియదు కానీ.. మరుసటి ఓవర్లోనే దిమ్మతిరిగే క్యాచ్ అందుకున్నాడు. ఇన్నింగ్స్ 5వ ఓవర్లో తన్వీర్ సంగా వేసిన మూడో బంతిని అలెక్స్ క్యారీ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. అక్కడే కాచుకొని ఉన్న డేనియల్ సామ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ రెండు చేతులతో సూపర్ క్యాచ్ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: "పుష్ప" పాటకు చిందేసిన టీమిండియా మాజీ క్రికెటర్.. తగ్గేదేలే అంటూ..! ఇక మ్యాచ్ విషయానికి వస్తే అడిలైడ్ స్ట్రైకర్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఇయాన్ కాక్బెన్ 65 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి విజయానికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది. Don't let his subdued reaction fool you. Daniel Sams makes up for his earlier drop with a hanger in the deep! A BKT Golden Moment | #BBL11 pic.twitter.com/7hCV5VxxK0 — cricket.com.au (@cricketcomau) January 23, 2022 -
డబుల్ హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన బౌలర్
బిగ్‌బాష్ లీగ్‌లో(బీబీఎల్) అద్భుత ఘటన చోటుచేసుకుంది. మెల్బోర్న్ రెనెగేడ్స్ లెగ్ స్పిన్నర్ కామెరాన్ బోయ్స్ డబుల్ హ్యాట్రిక్‌తో మెరిశాడు. బీబీఎల్‌లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించిన బోయ్స్.. ఓవరాల్‌గా టి20 క్రికెట్లో డబుల్ హ్యాట్రిక్ సాధించిన 10వ క్రికెటర్‌గా నిలిచాడు. సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఏడో ఓవర్ ఆఖరి బంతికి అలెక్స్ హేల్స్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ వేసిన బోయ్స్ వరుస మూడు బంతుల్లో జాసన్ సంఘా, అలెక్స్ రాస్, డేనియల్ సామ్స్‌లను వెనక్కి పంపాడు. చదవండి: వికెట్ తీసి వింత సెలబ్రేషన్‌తో మెరిసిన బౌలర్ అలా నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసి రికార్డు అందుకున్నాడు. అయితే అలెక్స్ రోస్‌ను ఔట్ చేయడం ద్వారా హ్యాట్రిక్ సాధించిన బోయ్స్.. బీబీఎల్ ఈ ఘనత సాధించిన ఎనిమిదో బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత బంతికే మరో వికెట్ తీసి డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. ఇక తాను వేసిన మూడో ఓవర్లో మరో వికెట్ తీసిన బోయ్స్.. ఓవరాల్‌గా నాలుగు ఓవర్లలో 21 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డబుల్ హ్యాట్రిక్ అంటే.. సాధారణంగా హ్యాట్రిక్ అంటే మూడు వరుస బంతుల్లో మూడు వికెట్లు తీయడం అని అందరికి తెలుసు. ఇక డబుల్ హ్యాట్రిక్ అంటే వరుసగా ఆరు వికెట్లు తీయడమని క్రికెట్ భాషలో అర్థం. కానీ ఆస్ట్రేలియా క్రికెట్లో మాత్రం.. నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీయడాన్ని డబుల్ హ్యాట్రిక్ పేరుతో పిలుస్తున్నారు. ఒక ఓవర్ చివరి బంతికి వికెట్.. తర్వాతి ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు.. ఓవరాల్‌గా 1,2,3.. లేదా 2,3,4 వికెట్లను డబుల్ హ్యాట్రిక్‌గా కౌంట్ చేయడం అక్కడ ఆనవాయితీ. ఇక ఐదు వరుస బంతుల్లో ఐదు వికెట్లు తీస్తే దానిని ట్రిపుల్ హ్యాట్రిక్ అని పేర్కొంటారు. చదవండి: విండీస్ ప్లేయర్ "సూపర్ మ్యాన్ క్యాచ్"కు సలాం కొడుతున్న నెటిజన్లు We still can't believe this happened!! A double hattie from Cameron Boyce!! #BBL11 pic.twitter.com/fQWsFakSnx — KFC Big Bash League (@BBL) January 19, 2022 -
'గట్టిగానే తగిలినట్టుంది.. ఏం కాలేదని కవర్ చేశాడు'
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 2021)లో భాగంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ బెన్ కటింగ్ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే..అడిలైడ్ ఓవల్ వేదికగా అడిలైడ్ స్ట్రైకర్స్, సిడ్నీ థండర్స్ మధ్య జరిగింది. అడిలైడ్ స్ట్రైకర్స్ పేస్ బౌలర్ డానియెల్ వొర్రాల్ షార్ట్‌పిచ్ బంతి విసిరాడు. క్రీజులో ఉన్న బెన్ కటింగ్ దానిని కింద కొట్టాలని చూశాడు. కానీ బంతి మిస్ అయి హెల్మెట్‌కు బలంగా తగిలింది. డేనియల్ ఏమైనా అయిందా అన్నట్లు అడగ్గా.. దానికి కటింగ్ ఏం కాలేదంటూ చేతితో 'థంప్స్ అప్(ఓకే)' సింబల్ చూపించాడు. చదవండి: Brett Lee: కొడుకనే కనికరం లేకుండా క్లీన్‌బౌల్డ్ అయితే కొద్ది సెకన్ల వ్యవధిలోనే బెన్ కటింగ్ తన హెల్మెట్ తీసి గాయమైందా అన్నట్లు పరిశీలించుకోవడం కెమెరాలకు చిక్కింది. కానీ పెద్దగా తగలకపోవడంతో కటింగ్ బ్యాటింగ్‌ను కొనసాగించాడు. అయితే బెన్ కటింగ్ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు వినూత్నరీతిలో స్పందించారు.'' దెబ్బ గట్టిగానే తగిలినట్టుంది.. కానీ భలే కవర్ చేశాడు..'' అంటూ కామెంట్స్ పెట్టారు. కాగా బెన్ కటింగ్ 32 బంతుల్లో 37 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ 22 పరుగుల తేడాతో విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది. జేసన్ సంగా 55 బంతుల్లోనే 91 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. చదవండి: Team India New Year Celebrations: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌తో అదరగొట్టిన టీమిండియా Yikes! A quick thumbs up from Cutting after that nasty blow to the helmet #BBL11 pic.twitter.com/d7viKgsf74 — cricket.com.au (@cricketcomau) December 31, 2021 -
ఆండ్రూ టైకి ఊహించని షాక్ ఇచ్చిన అంపైర్లు
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 2021)లో పెర్త్ స్కార్చర్స్ బౌలర్ ఆండ్రూ టైకి ఊహించని షాక్ తగిలింది. సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆండ్రూ టై బౌలింగ్ చేసే సమయంలో రెండు బంతులను బ్యాట్స్‌మన్ నడుముపైకి విసిరాడు. క్రికెట్ నిబంధనల ప్రకారం బంతులు బ్యాట్స్‌మన్ పైకి విసిరితే బీమర్ అని పిలుస్తారు. అయితే బీమర్ అనేది క్రికెట్లో ప్రమాదకరంగా ఉండడంతో దానిని నిషేధించారు. దీంతో ఒక బౌలర్ ఒక ఓవర్లో రెండు కంటే ఎక్కువ బీమర్లు వేస్తే అతన్ని బౌలింగ్ చేయకుండా నిషేధించొచ్చు. ఆండ్రూ టై అదే తప్పు చేశాడు. దీంతో కీలక మ్యాచ్‌లో బౌలింగ్ చేసే అవకాశం కోల్పోయాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ఓవర్ నాలుగో బంతిని బ్యాట్స్‌మన్ అలెక్స్ రాస్ నడుముపైకి బీమర్ వేశాడు. మరుసటి బంతిని వైడ్ వేయగా.. ఆ తర్వాత బంతిని మరోసారి బీమర్ వేయడంతో అంపైర్లు టైను అడ్డుకొని బౌలింగ్ వేయకుండా నివారించారు. ప్రస్తుతం ఆండ్రూ టై బౌలింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ జట్టు 20 ఓవర్లలో 200 పరుగుల భారీ స్కోరు చేసింది. సామ్ బిల్లింగ్స్ 35 బంతుల్లో 67 పరుగులు, జాసన్ సాంగా 46 బంతుల్లో 56 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి 34 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కొలిన్ మున్రో 64 పరుగులు నాటౌట్‌తో రాణించినప్పటికి మిగిలినవారు విఫలమయ్యారు. Two dangerous no-balls, and he's out. Here's why AJ Tye finished the innings with 1.3 completed overs to his name...@KFCAustralia | #BBL11 pic.twitter.com/nuTs6XF3LI — KFC Big Bash League (@BBL) December 28, 2021 -
ఫ్రీ హిట్ అన్న సంగతి మరిచిపోయాడు.. ఇంకేముంది
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 2021)లో సిడ్నీ సిక్సర్స్, సిడ్నీ థండర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సిడ్నీ థండర్స్ ఆల్‌రౌండర్ బెన్ కటింగ్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. అయితే అది ఫ్రీ హిట్ అన్న విషయం మరిచిపోయిన బెన్ కటింగ్ సెలబ్రేషన్లో మునిగిపోయాడు. అయితే వెంటనే తేరుకున్నప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సిడ్నీ సిక్సర్స్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ నాలుగో బంతిని డేనియల్ క్రిస్టియన్ కవర్స్ దిశగా షాట్ ఆడాడు. అక్కడే ఉన్న బెన్ కటింగ్ డైవ్ చేస్తూ అద్బుతంగా క్యాచ్ తీసుకున్నాడు. అయితే ఫ్రీహిట్ అని తెలియడంతో త్రో విసిరాడు. కానీ అప్పటికే ప్రత్యర్థి జట్టు రెండు పరుగులు తీసేసింది. దీంతో బెన్ కటింగ్ ముఖం మాడ్చుకోవడం వీడియోలో కనిపించింది. చదవండి: IND VS SA : లడ్డూలాంటి క్యాచ్ వదిలేశారు.. ఫలితం అనుభవించండి ఇక మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ 16 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. డేనియల్ హ్యూజెస్ 50, జేమ్స్విన్స్ 31 పరుగులు చేయగా.. చివర్లో డేనియల్ క్రిస్టియన్ 17 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ 15.1 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటైంది. జాస్ సంగా 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. డేనియల్ సామ్స్ 28 పరుగులు చేశాడు. చదవండి: Cheteshwar Pujara:'డమ్మీ ద్రవిడ్' గోల్డెన్ డక్ అయ్యాడు.. ఏకిపారేసిన ఫ్యాన్స్ Uh oh 😆 A little brain-fade here Ben Cutting would probably like to forget! @KFCAustralia | #BBL11 pic.twitter.com/pkpOtZtAtD — KFC Big Bash League (@BBL) December 26, 2021 -
గిల్‌క్రిస్ట్‌తో మహిళా కామెంటేటర్ మజాక్.. వీడియో వైరల్
క్రికెట్ మ్యాచ్ సందర్భంగా కామెంటేటర్స్ మధ్య జరిగే సంభాషణలు ఒక్కోసారి ఆసక్తి కలిగిస్తాయి. మ్యాచ్ గురించి ప్రస్తావన తెస్తూనే తమదైన శైలిలో జోక్‌లు.. పంచ్‌లు పేల్చుకుంటూ సరదాగా ఉంటారు. తాజాగా బిగ్‌బాష్ లీగ్ 2021లో భాగంగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. డిసెంబర్ 12న మెల్బోర్న్ స్టార్స్, సిడ్నీ థండర్స్ మధ్య సీరియస్‌గా మ్యాచ్ జరుగుతుంది. చదవండి: BBL 2021: కొలిన్ మున్రో విధ్వంసం..బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో 27వ సెంచరీ ఈ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా మాజీ విధ్వంసకర ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో పాటు మరో ఇద్దరు కామెంటేటర్స్‌గా వ్యవహరించారు. వీరిలో ఇసా గుహా అనే మహిళ కూడా ఉంది. మ్యాచ్ సందర్భంగా కామెంటరీ ప్యానెల్ మధ్య స్పిన్ బౌలింగ్‌లో ఉండే టెక్నిక్స్ అంశం చర్చకు వచ్చింది. క్యారమ్ బాల్ ప్రస్తావన రాగానే తోటి కామెంటేటర్.. '' క్యారమ్ బాల్ వేయాలంటే .. ఒక బౌలర్ మధ్య వేలును ఎక్కువగా ఉపయోగించడం చూస్తుంటాం'' అని చెప్పాడు. ఇది విన్న వెంటనే ఇసా గుహా.. ''మరి మీది ఎంత పెద్దదిగా ఉంది'' అని డబుల్ మీనింగ్ డైలాగ్ వచ్చేలా మాట్లాడడంతో గిల్‌క్రిస్ట్ ఒక్కసారిగా నవ్వేశాడు. ఇది చూసిన మిగతా టెక్నిషియన్స్ కూడా మొదట ఆశ్చర్యపోయినా నవ్వడం షురూ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. '' ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తోనే మజాకా''.. ''డబుల్ మీనింగ్ మరీ ఎక్కువైంది'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Ashes 2021: క్రేజీ బౌన్సర్.. తృటిలో తప్పించుకున్న రూట్ ఇక మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ 17.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. A reasonable question from @isaguha 👀😂😂😂😂😂😂 pic.twitter.com/Tzu5F2emUg — Alexandra Hartley (@AlexHartley93) December 12, 2021 -
సూపర్ క్యాచ్ పట్టాననే సంతోషం లేకుండా చేశారు
BBL 2021 Melbourne Stars vs Sydney Thunders.. సిడ్నీ థండర్స్ బౌలర్ మెక్ ఆండ్రూ మెల్బోర్న్ స్టార్స్ బ్యాటర్ నిక్ లార్కిన్‌కు ఫుల్‌టాస్ బంతి వేశాడు. దీంతో లార్కిన్ స్వేర్‌లెగ్ దిశగా భారీ షాట్ కొట్టాడు. అక్కడే ఉన్న డేనియల్ సామ్స్ వెనక్కు వెళ్లి రెండు చేతులతో బౌండరీలైన్ తాకుకుండా అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. సూపర్ క్యాచ్ పట్టాననే ఊహలో ఉన్న అతను సెలబ్రేషన్ షురూ చేశాడు. కానీ క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్ మాత్రం పరుగులు తీస్తూనే ఉన్నారు. చదవండి: ఈసారి కచ్చితంగా ఔటయ్యేవాడు! బతుకుజీవుడా అనుకున్న వార్నర్ డేనియల్ సామ్స్‌కు ఒక్కక్షణం ఏం అర్థం కాలేదు. అయితే అసలు విషయం తెలిసిన తర్వాత తనకు అదృష్టం లేదంటూ తెగ ఫీలయ్యాడు. మెక్ ఆండ్రూ వేసిన బంతిని ఫీల్డ్ అంపైర్ ఫ్రంట్‌ఫుట్ నోబాల్‌గా పరిగణించాడు. దీంతో బ్యాటర్ నాటౌట్ అని తేలడంతో ప్రత్యర్థి జట్టు ఈ గ్యాప్‌లో మూడు పరుగులు పూర్తి చేసింది. ప్రస్తుతం డేనియల్ సామ్స్ హావబావాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మెల్బోర్న్ స్టార్స్.. సిడ్నీ థండర్స్‌పై నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. నిక్ లారిన్ 52 నాటౌట్ టాప్ స్కోరర్ కాగా.. కార్ట్‌రైట్ 42 పరుగులు చేశాడు. ఇక సిడ్నీ థండర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. మాథ్యూ గ్లైక్స్ 56 పరుగులతో రాణించినప్పటికి ఆఖర్లో ఔట్ కావడంతో జట్టు ఓటమి పాలయింది. చదవండి: 74 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు.. ఆస్ట్రేలియా టార్గెట్ 20 Daniel Sams couldn't believe his luck! 😫 Absolutely robbed by the @KFCAustralia Bucket Ball free-hit #BBL11 pic.twitter.com/TRWcmPvVvr — KFC Big Bash League (@BBL) December 10, 2021 -
సూపర్ సెంచరీతో నాటౌట్ .. కానీ జట్టును గెలిపించలేకపోయింది
Smriti Mandhana Smash Maiden Century For Sydney Thunders But Lost Match.. వుమెన్స్ బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా బుధవారం సిడ్నీ థండర్స్, మెల్బోర్న్ రెనీగేడ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇద్దరు టీమిండియా వుమెన్ ప్లేయర్స్ దుమ్మురేపారు. స్మృతి మంధాన సూపర్ సెంచరీతో మెరవగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్‌లో మెరుపులు.. ఆ తర్వాత బౌలింగ్‌లో తన ప్రతిభను చూపించింది. అయితే స్మృతి మంధాన సూపర్ సెంచరీ సాధించినప్పటికి జట్టును ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయింది. సిడ్నీ థండర్స్‌కు చివరి ఓవర్లో 12 పరుగులు అవసరం కాగా.. మెల్బోర్న్ రెనీగేడ్స్ బౌలర్ హర్మన్‌ప్రీత్ మ్యాజిక్ బౌలింగ్ ప్రదర్శించడంతో నాలుగు పరుగులతో ఓటమి పాలైంది. చదవండి: Smriti Mandhana: మెరిసిన స్మృతి మంధాన .. సిడ్నీ థండర్స్ ఘన విజయం తొలుత బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ రెనిగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (55 బంతుల్లో 88 పరుగులు, 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. ఎవెలిన్ జోన్స్ 42, జెస్ డఫిన్ 33 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ వుమెన్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. స్మృతి మంధాన 64 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 114 పరుగులు నాటౌట్ ఊచకోత కోసినప్పటికి ఆఖరి ఓవర్లో ఒత్తిడి తట్టుకోలేక జట్టును గెలిపించలేకపోయింది. ప్రస్తుతం స్మృతి మంధాన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Wasim Jaffer: అస్సలు గ్యాప్ లేదుగా.. ఒకటి పోతే మరొకటి A beautiful innings! Congratulations, @mandhana_smriti 🤩 #WBBL07 pic.twitter.com/Jwo4E1fN3X — Weber Women's Big Bash League (@WBBL) November 17, 2021 Phoebe Litchfield gave it everything on the rope but it's another six for Harmanpreet Kaur! Watch LIVE: https://t.co/e5UVmQR3sL #WBBL07 pic.twitter.com/X3lZJjjf8t — Weber Women's Big Bash League (@WBBL) November 17, 2021 -
టైం లేదని గ్రౌండ్‌లోనే పని కానిచ్చాడు
కాన్బెర్రా: బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 10)లో భాగంగా ఆదివారం సిడ్నీ థండర్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సిడ్నీ థండర్స్ బ్యాటింగ్ సమయంలో ఆ జట్టు ఓపెనర్ ఉస్మాన్ ఖాజా చేసిన ఒక పని సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. అసలు విషయంలోకి వెళితే.. సిడ్నీ ఇన్నింగ్స్ సమయంలో 9వ ఓవర్ తర్వాత కొన్ని నిమిషాల పాటు బ్రేక్ లభించింది. ఇదే సమయంలో ఖాజా తన అండర్గార్మెంట్లో గార్డ్ సమస్యగా మారడంతో డ్రెస్సింగ్ రూమ్‌కు కాల్ ఇచ్చాడు. అయితే వారు వచ్చేలోపే ఖాజా తన ప్యాంటును విప్పి తన అండర్గార్డ్ను తొలగించి దానిని సరిచేసే పనిలో పడ్డాడు. అంతలో సిబ్బంది అతని వద్దకు వచ్చి కొత్త గార్డ్ అందించడంతో దాన్ని వేసుకొని మళ్లీ యధావిథిగా ఆటను ప్రారంభించాడు. అయితే ఖాజా చర్యతో మైదానంలోని ప్రత్యర్థి ఆటగాళ్లతో పాటు అంపైర్లు, ప్రేక్షకులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఖాజాకు సంబంధించిన వీడియోనూ సెవెన్ క్రికెట్ డాట్‌కామ్ తన ట్విటర్లో షేర్ చేసింది. క్రికెట్లో ఇలాంటి సీన్ మీరు ఎప్పుడు చూసి ఉండరు.. అందరూ చూస్తుండగానే ఖాజా గ్రౌండ్‌లోనే పని కానిచ్చేశాడు అంటూ లాఫింగ్ ఎమోజీతో క్యాప్షన్ జత చేసింది. ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌గా మారి నవ్వులు పూయిస్తుంది. చదవండి: థ్యాంక్స్ మోదీ జీ.. టీమిండియా ఎమోషనల్ ట్వీట్ ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బ్రిస్బేన్ హీట్.. సిడ్నీ థండర్స్‌పై 7 వికెట్లతో విజయాన్ని అందుకొని ఫైనల్ బెర్తుకు మరింత దగ్గరైంది. మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. కటింగ్ 34, బిల్లింగ్స్ 34 పరుగులతో రాణించారు. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిస్బేన్ హీట్ 3 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. సామ్ హీజ్లెట్ 74 నాటౌట్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. జిమ్మీ పియర్సన్ 43 పరుగులతో రాణించాడు.చదవండి: కళ్లు చెదిరే సిక్స్.. కొడితే అవతల పడింది Have ... have you ever seen this before 😂 Usman Khawaja had to change everything - on the field! 🙈#BBL10 pic.twitter.com/XOKsXkhLVS — 7Cricket (@7Cricket) January 31, 2021 -
కళ్లు చెదిరే సిక్స్.. కొడితే అవతల పడింది
కాన్బెర్రా: ఆసీస్ ఆల్‌రౌండర్ బెన్ కటింగ్ మీకందరికి గుర్తుండే ఉంటాడు. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కప్పు కొట్టడంలో బెన్ కటింగ్ పాత్ర మరువలేనిది. ఆర్సీబీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌లో 15 బంతుల్లోనే 4 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 39 పరుగులు సాధించాడు. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ కీలకమైన రెండు వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచి సన్‌రైజర్స్‌కు కప్పు అందించాడు. తాజాగా బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా ఆదివారం సిడ్నీ థండర్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య ప్లే ఆఫ్ మ్యాచ్ జరుగుతుంది. గెలిస్తే ఫైనల్ అవకాశాలు మరింత మెరుగయ్యే మ్యాచ్‌లో బెన్ కంటింగ్ జూలు విదిల్చాడు. 18 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 34 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే బెన్ కటింగ్ కొట్టిన నాలుగు సిక్సర్లలో .. ఒక సిక్సర్ స్టేడియం అవతల పడింది. మోర్నీ మోర్కెల్ వేసిన 18 ఓవర్ మూడో బంతిని కటింగ్ ప్రంట్ ఫుట్ వచ్చి డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టగా.. బంతి నేరుగా వెళ్లి స్టేడియం రూఫ్‌ను తాకుతూ బయటపడింది. మీటర్ రేంజ్లో కటింగ్ కొట్టిన సిక్స్ 101 మీటర్లుగా నమోదైంది. బెన్ కటింగ్ సిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: ఆండ్రూ టై కావాలనే అలా చేశాడా! ఈ సీజన్ బిగ్‌బాష్ లీగ్‌లో కటింగ్ కొట్టిన సిక్స్ అత్యంత ఎత్తులో వెళ్లిన సిక్స్‌గా రికార్డుకెక్కింది. కాగా మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కటింగ్ 34, సామ్ బిల్లింగ్స్ 34 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ ఆడుతున్న బ్రిస్బేన్ హీట్స్ ఇప్పటివరకు 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. హీట్స్ గెలవాలంటే 48 బంతుల్లో 89 పరుగులు చేయాల్సి ఉంది. చదవండి: దుమ్మురేపిన పుజారా.. కోహ్లి మాత్రం అక్కడే That is OUTTTAAAAA HERE!! Wow! #BBL10 #BBLFinals pic.twitter.com/lOTzhwDtyb — KFC Big Bash League (@BBL) January 31, 2021 -
కిందా మీదా పడ్డాడు.. చివరకు రనౌట్ చేశాడు
పెర్త్: ఆసీస్ వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 10) విజయవంతగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్‌లో ఇప్పటికే ఎన్నో ఫన్నీ వీడియోలు వైరల్‌గా మారి అభిమానుల మనుసులు గెలుచుకుంటున్నాయి. తాజాగా శనివారం పెర్త్ స్కార్చర్స్, సిడ్నీ థండర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ కీపర్ జోష్ ఇంగ్లిస్ సిడ్నీ బ్యాట్సమన్‌ను రనౌట్ చేసిన తీరు నవ్వు తెప్పిస్తుంది. విషయంలోకి వెళితే.. జాసన్ బెండార్ఫ్ వేసిన బంతిని సామ్ బిల్లింగ్స్ ఆఫ్‌సైడ్ పుష్ చేసి నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న అలెక్స్ రాస్‌ను పరుగుకు పిలిచాడు. అయితే బెండార్ప్ వేగంగా వెళ్లి బంతిని అందుకని ఇంగ్లిస్‌కు త్రో విసిరాడు. అయితే ఇంగ్లిస్ మాత్రం బంతిని అందుకునే క్రమంలో తడబడ్డాడు. దీంతో బంతి చేతిలో నుంచి జారి గాల్లోకి లేవడంతో తన చేతిని ఉపయోగించి బంతిని వికెట్ల వైపు విసిరాడు. అదృష్టం బాగుండి వికెట్లను గిరాటేయడంతో అలెక్స్ రాస్ రనౌట్ అయ్యాడు. అయితే ఇంగ్లిస్ చర్య ఇంగ్లండ్ ఆటగాడు జేసన్ రాయ్‌కు నవ్వు తెప్పించింది. ఇంగ్లిస్.. ఎలాగైతేనేమి కిందా మీద పడి రనౌట్ అయితే చేశావంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.(చదవండి: 'నన్ను తిడతావేంటి... ఆ నిర్ణయం థర్డ్ అంపైర్‌ది') ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కొలిన్ మున్రో 50, ఆస్టన్ టర్నర్ 31, జై రిచర్డసన్ 20* రాణించారు. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ థండర్స్ 20 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌట్ అయి 17 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సిడ్నీ థండర్స్ ఇన్నింగ్స్‌లో సామ్ బిల్లింగ్స్ 83 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.(చదవండి: సిడ్నీ టెస్ట్: బుమ్రా, సిరాజ్‌లపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు) You are KIDDING me!!! Jason Roy's reaction to this run out is golden! 😂😂@BKTtires | #BBL10 pic.twitter.com/JDhIJ8CjLW — cricket.com.au (@cricketcomau) January 9, 2021 -
స్టన్నింగ్ క్యాచ్.. షాక్‌లో బౌలర్, బ్యాట్స్‌మన్
కాన్బెర్రా : బిగ్‌బాష్ లీగ్ 2020లో మెల్బోర్న్ రెనెగేడ్స్, సిడ్నీ థండర్స్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో మెకేంజీ హార్వే అందుకున్న స్టన్నింగ్ క్యాచ్ హైలెట్‌గా నిలిచింది. హార్వే అందుకున్న క్యాచ్ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌నే కాదు బౌలర్‌ను కూడా షాక్‌కు గురిచేసింది. కష్టసాధ్యమైన క్యాచ్‌ను హార్వే సూపర్డైవ్ చేసి అందుకున్న తీరు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. హార్వే సాధించిన ఈ ఫీట్ సిడ్నీ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో జరిగింది. (చదవండి : వైరల్ : క్రికెటర్ల బిల్లు చెల్లించిన అభిమాని) మెల్బోర్న్ రెనేగేడ్స్ బౌలర్ మిచెల్ పెర్రీ వేసిన ఫుల్‌టాస్ బంతిని అలెక్స్ హేల్స్ పాయింట్ దిశగా షాట్ ఆడాడు. ఆ షాట్ తీరు చూస్తే ఎవరైనా ఫోర్ అనుకుంటారు. కానీ బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న హార్వే ముందుకు డైవ్ చేసి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. హార్వే క్యాచ్‌తో షాక్‌కు గురైన హేల్స్ నిరాశగా వెనుదిరగగా.. బౌలర్ పెర్రీ ఆశ్చర్యం వక్తం చేస్తూ కాసేపు అలాగే నిల్చుండిపోయాడు. ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్లో షేర్ చేసింది. అమేజింగ్ హార్వే.. ఇది క్యాచ్ ఆఫ్ ది టోర్న్‌మెంట్ అవుతుందా? హార్వేను బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది వరల్డ్ అనొచ్చా? దీనిపై మీ కామెంట్ ఏంటి అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా మ్యాచ్‌కు ముందు వర్షం అంతరాయం కలిగించడంతో 17 ఓవర్లకు ఆటను కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ రెనెగేడ్స్ నిర్ణీత 17 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. షాన్ మార్ష్ 87 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, నబీ 33 పరుగులతో రాణించాడు. (చదవండి: క్యారీ స్టన్నింగ్ క్యాచ్.. వహ్వా అనాల్సిందే) అనంతరం 20 ఓవర్లలో 173 పరుగుల సవరించిన లక్ష్యాన్ని సిడ్నీ థండర్స్ ముందు ఉంచారు. ఓపెనర్లు ఉస్మాన్ ఖాజా, అలెక్స్ హేల్స్ దాటిగా ఆడడంతో సిడ్నీ థండర్స్ వేగంగా పరుగులు సాధించింది. హేల్స్ వెనుదిరిగిన అనంతరం మ్యాచ్‌కు మరోసారి వర్షం అంతరాయం కలిగింది. అప్పటికి సిడ్నీ థండర్స్ 12 ఓవర్లలో 117 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. దీంతో డక్‌వర్త్ లుయీస్ పద్దతిలో సిడ్నీ థండర్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించినట్లు రిఫరీ ప్రకటించారు. The catch of the tournament!? The best fielder in the world!? What a grab...#BBL10 | @BKTtires pic.twitter.com/ByRq1ecBCL — cricket.com.au (@cricketcomau) January 1, 2021 -
వైరల్ : రనౌట్ తప్పించుకునేందుకే..
కాన్బెర్రా : బిగ్‌బాష్ లీగ్ 2020లో శనివారం మెల్బోర్న్ స్టార్స్, సిడ్నీ థండర్స్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మెల్బోర్న్ స్టార్స్ ఇన్నింగ్ ఆఖరి ఓవర్లో డేనియల్ సామ్స్ వేసిన బంతిని బ్యాట్స్‌మెన్ లార్కిన్ ఫ్లిక్ చేశాడు. అయితే పొరపాటున బంతి లార్కిన్ జెర్సీలోకి దూరిపోయింది. అయితే లార్కిన్ కొట్టిన బంతి ఎక్కడా కనిపించకపోవడంతో సిడ్నీ థండర్స్ ఆటగాళ్లు కన్య్ఫూజ్ అయ్యారు. ఈ విషయం గమనించని లార్కిన్ నాన్ స్ట్రైకర్ ఎండ్ పిలుపుతో లార్కిన్ సింగిల్ పూర్తి చేశాడు. అతను సింగిల్ పూర్తి చేసే క్రమంలో జెర్సీ నుంచి బంతి కిందకు జారింది. (చదవండి : ఆసీస్‌కు మరో దెబ్బ.. కీలక బౌలర్ ఔట్!) దీంతో అవాక్కైన ఫీల్డర్లు ఇది ఛీటింగ్.. రనౌట్ తప్పించుకోవాలనే అలా చేశాడని.. అతని సింగిల్ చెల్లదని అంపైర్‌కు ఫిర్యాదు చేశారు. ఫీల్డ్ అంపైర్లు పరిశీలించి లార్కిన్ తీసిన సింగిల్‌ను రద్దు చేసి అతన్ని మళ్లీ స్ట్రైకింగ్‌కు పంపించారు. ఈ సంఘటనతో మైదానంలో కాసేపు డ్రామా నెలకొంది. ఈ వీడియోనూ బిగ్‌బాష్ లీగ్ నిర్వాహకులు ట్విటర్ షేర్ చేశారు. ' రనౌట్ తప్పించుకునేందుకు బంతిని జెర్సీలో దాచి పరుగులు పెట్టాడు... ఎంతైనా లార్కిన్ ఇంటలిజెంట్ బ్యాట్స్‌మెన్' అని సరదాగా కామెంట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఆ తర్వాత బంతికే లార్కిన్ రన్ఔట్ అయ్యాడు.. ఈసారి మాత్రం అతన్ని అదృష్టం వరించలేదు. (చదవండి : క్యాచ్ వదిలేశాడని బౌలర్ బూతు పురాణం) Hide the ball and run! Bit cheeky here from Nick Larkin... 😝 A @KFCAustralia Bucket Moment | #BBL10 pic.twitter.com/M4T4h2l3g6 — KFC Big Bash League (@BBL) December 12, 2020 ఈ మ్యాచ్‌లో మెల్బోర్స్ స్టార్స్ 22 పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మెల్బోర్న్ స్టార్స్ జట్టులో స్టోయినిస్ 61, మ్యాక్స్‌వెల్ 39 పరుగులతో రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ థండర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. పెర్గూసన్ 54 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అలెక్స్ హేల్స్ 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. (చదవండి : నా తండ్రి వ్యాఖ్యలు నన్ను బాధించాయి) -
క్రికెట్లో కనీవినీ ఎరుగని రనౌట్
మెల్బోర్న్: క్రికెట్లో రనౌట్లు అనేవి సహజం. పరుగు తీసే క్రమంలో బ్యాట్స్‌మన్ క్రీజ్‌లోకి చేరుకోలేకపోతే రనౌట్‌గా నిష్క్రమిస్తూ ఉంటారు. చేజింగ్ సమయంలో అందులోనూ చివర ఓవర్లలో ప్రతీ పరుగు ముఖ్యమైనదే. ఈ సమయంలో రనౌట్లు ఎక్కువగా జరుగుతుంటాయి. రనౌట్ అయిన విధానం పట్ల బ్యాట్స్‌మెన్‌పై ఒక్కోసారి జాలి చూపిస్తే.. మరికొన్నిసార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తాం. ఆస్ట్రేలియాలో జరగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో జరిగిన సిల్లీ రనౌట్ అందిరిలోనూ నవ్వు తెప్పిస్తోంది. బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా సిడ్నీ ధండర్స్- మెల్బోర్న్ రెనిగేడ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ వినూత్న రనౌట్ చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా మెల్బోర్న్ రెనిగేడ్స్-సిడ్నీ థండర్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన మెల్బోర్న్, నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన సీడ్నీ లక్ష్య చేదనలో పూర్తిగా విఫలమైంది. దీంతో 19.1 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటై ఓటమి చవిచూసింది. అయితే సిడ్నీ ఇన్నింగ్స్ 18.3 ఓవర్లో జోనాథన్ కుక్, గురిందర్ సంధు ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్నారు. ఈక్రమంలో కుక్కు బౌలర్ వేసిన బంతిని ఆడి పరుగు తీసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న సంధును ఢీకొన్నాడు. దీంతో బౌలర్ హ్యారీ గుర్నే వారిద్దరి మధ్య నుంచి వెళ్లి రనౌట్ చేశాడు. దీంతో బ్యాట్స్‌మన్ కుక్ ఒక్క సారిగా షాక్‌కు గురై.. భారంతో మైదానాన్ని వీడాడు. -
క్రికెట్లో కనీవినీ ఎరుగని రనౌట్
-
ఔరా.. ఏం క్యాచ్ అది!
సిడ్నీ: అసలైన క్రికెట్ మజా కేవలం పురుషుల క్రికెట్లోనే ఉంటుందనుకుంటే పొరపాటు పడినట్టే. సంచలన ఇన్నింగ్స్‌లు నమోదు చేస్తూ.. పురుషుల క్రికెట్లోనూ సాధ్యంకాని కొత్త రికార్డులను మహిళా క్రికెటర్లు సృష్టిస్తున్నారు. తాజాగా గెలుపును డిసైడ్ చేసే బంతిని బౌండరీ వద్ద కళ్లు చెదిరే రీతిలో డైవ్ చేస్తూ ఒడిసిపట్టుకున్న విధానం చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఈ అపురూప దృశ్యం మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బెన్ హీట్, సిడ్నీ థండర్ జట్ల మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సిడ్నీ జట్టు నాలుగు పరుగుల తేడాతో బ్రిస్బేన్‌పై గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. క్యాచ్‌కు సంబంధించిన వీడియో ఐసీసీ తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట్లో తెగ హల్చల్ చేస్తోంది. ఇక హైదీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. అనంతరం 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ జట్టు ఆరంభం ఘనంగానే ప్రారంభించింది. అయితే బ్రిస్బేన్ పటిష్ట బౌలింగ్ మందు సిడ్నీ మిడిలార్డర్ బ్యాట్స్వువెన్ పరుగులు రాబట్టడానికి నానా తంటాలు పడ్డారు. దీంతో చివరి ఓవర్లో 13 పరుగుల చేస్తేనే సిడ్నీ జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. బంతి బంతికి సమీకరణాలు మారిపోతున్నాయి. ఇక సిడ్నీ గెలుపు సమీకరణాలు ఎలా ఉన్నాయంటే చివరి బంతికి ఫోర్ కొడితే డ్రా, ఐదు పరుగులు చేస్తే విజయం. ఈ సమయంలో జోనాసెన్ బౌలింగ్‌లో నికోలా కారే గాల్లోకి బంతిని బలంగా బాదింది.. అందరూ పక్కా సిక్సర్ అనుకున్న తరుణంలో మెరుపువేగంతో వచ్చిన హైదీ బిర్కెట్ కళ్లు చెదిరే రీతిలో డైవ్ చేస్తూ క్యాచ్ అందుకుంది. దీంతో గెలుపు సంబరం బ్రిస్బెన్ను వరించగా .. ఓటమి బాధ సిడ్నీ జట్టుకు దక్కింది. -
గెలుపును డిసైడ్ చేసే బంతి.. బౌండరీ వద్ద కళ్లు చెదిరే క్యాచ్..
-
సిడ్నీ థండర్‌తోనే హర్మన్‌ప్రీత్
భారత స్టార్ మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్ జట్టుతోనే కొనసాగనుంది. మరో రెండు సీజన్ల పాటు హర్మన్ తమ జట్టుకు ఆడే విధంగా శుక్రవారం థండర్ కొత్తగా ఒప్పందం పునరుద్ధరించుకుంది. విదేశీ లీగ్‌లో ఆడిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న హర్మన్...లీగ్‌లో సిడ్నీ జట్టు తరఫున ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా కూడా ఎంపికైంది. కొన్నాళ్ల క్రితం వన్డే వరల్డ్‌కప్ సెమీస్ మ్యాచ్‌లో ఆసీస్‌పై కౌర్ 171 పరుగులతో చెలరేగింది.