BBL 2021: Ben Cutting Hilariously Celebrates Catch Off Free Hit, Video Viral - Sakshi
Sakshi News home page

BBL 2021: ఫ్రీ హిట్‌ అన్న సంగతి మరిచిపోయాడు.. ఇంకేముంది

Published Sun, Dec 26 2021 10:10 PM | Last Updated on Mon, Dec 27 2021 11:28 AM

BBL 2021: Ben Cutting Hilariously Celebrates Catch But It Was Free Hit - Sakshi

బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌ 2021)లో సిడ్నీ సిక్సర్స్‌, సిడ్నీ థండర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సిడ్నీ థండర్స్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ కటింగ్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిశాడు. అయితే అది ఫ్రీ హిట్‌ అన్న విషయం మరిచిపోయిన బెన్‌ కటింగ్‌ సెలబ్రేషన్‌లో మునిగిపోయాడు. అయితే వెంటనే తేరుకున్నప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సిడ్నీ సిక్సర్స్‌ ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ నాలుగో బంతిని డేనియల్‌ క్రిస్టియన్‌ కవర్స్‌ దిశగా షాట్‌ ఆడాడు. అక్కడే ఉన్న బెన్‌ కటింగ్‌ డైవ్‌ చేస్తూ అద్బుతంగా క్యాచ్‌ తీసుకున్నాడు. అయితే ఫ్రీహిట్‌ అని తెలియడంతో త్రో విసిరాడు. కానీ అప్పటికే ప్రత్యర్థి జట్టు రెండు పరుగులు తీసేసింది. దీంతో బెన్‌ కటింగ్‌ ముఖం మాడ్చుకోవడం వీడియోలో కనిపించింది. 

చదవండి: IND VS SA : లడ్డూలాంటి క్యాచ్‌ వదిలేశారు.. ఫలితం అనుభవించండి

ఇక మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించారు. ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ సిక్సర్స్‌ 16 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. డేనియల్‌ హ్యూజెస్‌ 50, జేమ్స్‌విన్స్‌ 31 పరుగులు చేయగా.. చివర్లో డేనియల్‌ క్రిస్టియన్‌ 17 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ థండర్స్‌ 15.1 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటైంది. జాస్‌ సంగా 47 పరుగులతో టాప్‌  స్కోరర్‌గా నిలవగా.. డేనియల్‌ సామ్స్‌ 28 పరుగులు చేశాడు. 

చదవండి: Cheteshwar Pujara:'డమ్మీ ద్రవిడ్‌' గోల్డెన్‌ డక్‌ అయ్యాడు.. ఏకిపారేసిన ఫ్యాన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement