BBL 2021: Daniel Sams Unbelievable Catch But Fails To Get Batter Out- Sakshi
Sakshi News home page

BBL 2021: సూపర్‌ క్యాచ్‌ పట్టాననే సంతోషం లేకుండా చేశారు

Published Sat, Dec 11 2021 8:39 AM | Last Updated on Sat, Dec 11 2021 9:18 AM

BBL 2021: Daniel Sams Unbelievable Catch But Fails To Get Batter Out - Sakshi

BBL 2021 Melbourne Stars vs Sydney Thunders..  సిడ్నీ థండర్స్‌ బౌలర్‌ మెక్‌ ఆండ్రూ మెల్‌బోర్న్‌ స్టార్స్‌ బ్యాటర్‌ నిక్‌ లార్కిన్‌కు ఫుల్‌టాస్‌ బంతి వేశాడు. దీంతో లార్కిన్‌ స్వేర్‌లెగ్‌ దిశగా భారీ షాట్‌ కొట్టాడు. అక్కడే ఉన్న డేనియల్‌ సామ్స్ వెనక్కు వెళ్లి రెండు చేతులతో బౌండరీలైన్‌ తాకుకుండా అద్భుతంగా క్యాచ్‌ తీసుకున్నాడు. సూపర్‌ క్యాచ్‌ పట్టాననే ఊహలో ఉన్న అతను సెలబ్రేషన్‌ షురూ చేశాడు. కానీ క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్‌ మాత్రం పరుగులు తీస్తూనే ఉన్నారు.

చదవండి: ఈసారి కచ్చితంగా ఔటయ్యేవాడు! బతుకుజీవుడా అనుకున్న వార్నర్‌

డేనియల్‌ సామ్స్‌కు  ఒక్కక్షణం ఏం అర్థం కాలేదు. అయితే అసలు విషయం తెలిసిన తర్వాత తనకు అదృష్టం లేదంటూ తెగ ఫీలయ్యాడు. మెక్‌ ఆండ్రూ వేసిన బంతిని ఫీల్డ్‌ అంపైర్‌ ఫ్రంట్‌ఫుట్‌ నోబాల్‌గా పరిగణించాడు. దీంతో బ్యాటర్‌ నాటౌట్‌ అని తేలడంతో ప్రత్యర్థి జట్టు ఈ గ్యాప్‌లో మూడు పరుగులు పూర్తి చేసింది. ప్రస్తుతం డేనియల్‌ సామ్స్‌ హావబావాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. మెల్‌బోర్న్‌ స్టార్స్‌.. సిడ్నీ థండర్స్‌పై నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. నిక్‌ లారిన్‌ 52 నాటౌట్‌ టాప్‌ స్కోరర్‌ కాగా.. కార్ట్‌రైట్‌ 42 పరుగులు చేశాడు. ఇక సిడ్నీ థండర్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. మాథ్యూ గ్లైక్స్‌ 56 పరుగులతో రాణించినప్పటికి ఆఖర్లో ఔట్‌ కావడంతో జట్టు ఓటమి పాలయింది. 

చదవండి: 74 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు.. ఆస్ట్రేలియా టార్గెట్‌ 20

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement