మహిళా ప్రజెంటర్‌తో క్రిస్ గేల్‌ అసభ్య ప్రవర్తన! | Chris Gayles `indecent proposal' draws flak | Sakshi
Sakshi News home page

మహిళా ప్రజెంటర్‌తో క్రిస్ గేల్‌ అసభ్య ప్రవర్తన!

Published Mon, Jan 4 2016 9:46 PM | Last Updated on Sun, Sep 3 2017 3:05 PM

మహిళా ప్రజెంటర్‌తో క్రిస్ గేల్‌ అసభ్య ప్రవర్తన!

మహిళా ప్రజెంటర్‌తో క్రిస్ గేల్‌ అసభ్య ప్రవర్తన!

మెల్‌బోర్న్: వెస్టిండిస్ క్రికెటర్ క్రిస్ గేల్‌ మైదానంలో మెరుపుషాట్లతో హోరెత్తించడమే కాదు మైదానం బయట విచిత్ర ప్రవర్తనతో వివాదాలు సృష్టించడంలోనూ దిట్టనే. తాజాగా ఆయన ఓ మహిళా క్రికెట్ ప్రజెంటర్‌తో అసభ్యంగా వ్యవహరించడం వివాదం సృష్టించింది. లైవ్ ప్రసారంలో బాహాటంగా ప్రజెంటర్‌కు క్రిస్ గేల్‌ 'డేటింగ్‌ ఆఫర్‌' ఇవ్వడం విమర్శలకు కారణమైంది.

బిగ్‌ బాష్‌ లీగ్‌లో భాగంగా హోబార్ట్‌ హరికేన్స్‌-మెల్‌బోర్న్ రెనగేడ్స్‌ మ్యాచ్‌లో క్రిస్‌ గేల్‌ 15 బంతుల్లో 41 పరుగులు చేశాడు. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహించి మెల్‌బోర్న్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం టెన్‌ స్పోర్ట్స్ ప్రజెంటర్‌ మెలానీ మెక్‌లాఫిలిన్‌ ఆయనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. గేల్ ఇన్నింగ్స్‌ గురించి కొన్ని ప్రశ్నలు అడిగింది. గేల్ స్పందిస్తూ 'నువ్వు చేసే ఈ ఇంటర్వ్యూ కోసమే నేను చాలా బాగా బ్యాటింగ్ చేశాను' అని పేర్కొన్నాడు. 'నీ కళ్లు చాలా అందంగా ఉన్నాయి. మ్యాచ్ గెలిచిన తర్వాత మనం కలిసి డ్రింక్స్‌కి వెళ్తామని ఆశిస్తున్నా. మరీ సిగ్గుతో పొంగిపోకు బేబి' అని అన్నాడు. గేల్‌ వ్యాఖ్యలతో ప్రజెంటర్ చాలా ఇబ్బందిపడుతున్నట్టు కనిపించింది. 'నేనేమీ సిగ్గుపడటం లేదు' అని ఆమె సమాధానమిచ్చింది. గేల్ వ్యాఖ్యలను బిగ్‌  బాష్ లీగ్ ఆర్గనైజేషన్ తప్పబట్టింది. అవి అవమానకర వ్యాఖ్యలని పేర్కొంది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాపఫ్ కూడా గేల్‌ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement